
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఎస్‌బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి.
ఎస్‌బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment