debit card charges
-
డెబిట్ కార్డు యూజర్లపై భారంమోపిన ప్రముఖ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డెబిట్ కార్డులపై నిర్వహణ ఛార్జీలను సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెబిట్ కార్డుల నిర్వహణ ఖర్చును పెంచనున్నట్లు తెలిపింది. ఈమేరకు నిబంధనలను సవరించింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ రుసుమును రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్‌ల నిర్వహణ ఛార్జీలను రూ.175 నుంచి రూ.250కి చేర్చింది. ప్లాటినం డెబిట్ కార్డుల విభాగంలోని ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రూ.250 నుంచి రూ.325కు పెంచింది. ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం.. ప్లాటినం బిజినెస్ కార్డు ఛార్జీలు రూ.350 నుంచి రూ.425కు పెరిగాయి. ఈ ఛార్జీలపై జీఎస్టీ అదనం. ఎస్బీఐ కార్డ్ అందిస్తున్న ఎస్బీఐ క్రెడిట్ కార్డులపైనా కొన్ని కొత్త నిబంధనలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించినప్పుడు ఇకపై రివార్డు పాయింట్లు లభించవు. -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది. -
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన చార్జీలు
ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) చార్జీల రూపంలో కస్టమర్లపై మరింత భారాన్ని మోపింది. బ్యాంక్ డెబిట్ కార్డ్ (Debit cards)లపై వార్షిక రుసుములను పెంచేసింది. ఆగస్టు 21 నుంచి పెరిగిన చార్జీలు అమలవుతాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త డెబిట్ కార్డ్‌లపై జాయినింగ్ ఫీజులను కూడా ఇదే విధంగా పెంచింది. ఇవి ఆగస్టు 1 అమలులోకి వచ్చాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ డెబిట్ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 100 పెరిగింది. ఇది ఇంతకు ముందు రూ. 499లుగా ఉండగా ఇక నుంచి రూ. 599లు గా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ లేదా బిజినెస్ ఎక్స్ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డ్‌పై కూడా యాన్యువల్ ఫీజు రూ. 100 పెరిగింది. రూ. 799 ఉన్నది రూ. 899లకు పెరిగింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్ప్రెషన్స్ సప్ఫిరో డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ. 4,999 ఉన్న వార్షిక రుసుములో మార్పు లేదు. బ్యాంక్ కోరల్/బిజినెస్ కోరల్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 599 నుంచి రూ. 699కి పెరిగింది. రూబిక్స్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుమైతే ఏకంగా రూ. 350 పెరిగింది. ప్రస్తుతం రూ. 749 ఉండగా ఇక నుంచి రూ. 1,099 చెల్లించాలి. సప్ఫిరో/బిజినెస్ సప్ఫిరో డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 500 పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ. 1,499 నుంచి రూ. 1,999 లకు చేరింది. కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ నెలవారీ రుసుము రూ. 249లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది సంవత్సరానికి రూ. 2,988 ఉంటుంది. కాగా ఏడాది పూర్తయిన ఆయా డెబిట్ కార్డులపై కస్టమర్లు వివిధ రకాల వోచర్లను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. వార్షిక రుసుము చెల్లించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ-మెయిల్ ద్వారా ఈ వోచర్లను పొందవచ్చు. ఇదీ చదవండి: కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు.. -
డెబిట్ కార్డు చార్జీల పెంపు!
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు చేదు వార్త చెప్పింది. డెబిట్ కార్డ్ వార్షిక చార్జీలను రూ.60 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది. ఇదీ చదవండి: అనుకోకుండా అన్నా.. ‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’ వ్యాఖ్యపై ఉదయ్ కోటక్ వివరణ రూ.60 బాదుడు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు డెబిట్ కార్డ్ వార్షిక చార్జీ కింద రూ.199 వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ చార్జీని ఇప్పుడు రూ.259 లకు పెంచింది. దీంతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అంటే రూ.60 మేర చార్జీ పెరుగుతుందన్న మాట. పెరిగిన చార్జీలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ చార్జీలు బ్యాంకులోని అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి. ఇక జూన్ 1 నుంచి సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు సంబంధించి అమలయ్యే ఛార్జీలు ఇలా ఉన్నాయి.. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇష్యూ చేసిన చెక్ ఏదైనా నాన్ ఫైనాన్షియల్ కారణంతో రిటర్న్ అయితే రూ. 50 ఛార్జీ పడుతుంది. అలాగే చెక్ డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ అయితే రూ.200 చార్జీ ఉంటుంది. ఇదీచదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...? -
డెబిట్ కార్డు ఛార్జీలు తగ్గబోతున్నాయ్!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీల ప్రోత్సహకానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి ఛార్జీలు గణనీయంగా తగ్గనున్నాయట. డెబిట్ కార్డు ఛార్జీలు తగ్గుతాయనే దానిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తంచేశారు. రూ.2 వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే డెబిట్ కార్డు లావాదేవీలకు మార్జినల్ డిస్కౌంట్ ఛార్జీలను(ఎండీఆర్) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని జైట్లీ తెలిపారు. ఆర్బీఐ నిర్ణయించిన వెంటనే, అవి అమల్లోకి వస్తాయన్నారు. ''డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయి, ఛార్జీలు తగ్గుతాయి'' అని జైట్లీ నేడు ప్రశ్నోత్తర సమయంలో రాజ్యసభ సభ్యులకు జైట్లీ చెప్పారు. కొత్త టెక్నాలజీస్‌తో డిజిటల్ లావాదేవీలు మరింత చౌకగా లభ్యమవుతాయని, ఎక్కువమంది ప్రజలు డిజిటల్ వైపు మరలుతారని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. డిజిటల్ మనీనే వాడాలని తమ అధికారులకు కూడా ప్రభుత్వం సూచించిందని జైట్లీ తెలిపారు. పెద్ద నోట్ల నిర్ణయంపై స్పందించిన జైట్లీ, కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేయడం ముందస్తుగానే ప్రారంభించిందని, కానీ ఏటీఎం మిషన్లలోకి అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందన్నారు.