ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) చార్జీల రూపంలో కస్టమర్లపై మరింత భారాన్ని మోపింది. బ్యాంక్ డెబిట్ కార్డ్ (Debit cards)లపై వార్షిక రుసుములను పెంచేసింది. ఆగస్టు 21 నుంచి పెరిగిన చార్జీలు అమలవుతాయని ప్రకటన విడుదల చేసింది. కొత్త డెబిట్ కార్డ్‌లపై జాయినింగ్ ఫీజులను కూడా ఇదే విధంగా పెంచింది. ఇవి ఆగస్టు 1 అమలులోకి వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ప్రెషన్స్ లేదా బిజినెస్ ఎక్స్‌ప్రెషన్స్ డెబిట్ కార్డ్‌పై వార్షిక రుసుము రూ. 100 పెరిగింది. ఇది ఇంతకు ముందు రూ. 499లుగా ఉండగా ఇక నుంచి రూ. 599లు గా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ప్రెషన్స్ కోరల్ లేదా బిజినెస్ ఎక్స్‌ప్రెషన్స్ కోరల్ డెబిట్ కార్డ్‌పై కూడా యాన్యువల్ ఫీజు రూ. 100 పెరిగింది. రూ. 799 ఉన్నది రూ. 899లకు పెరిగింది.
ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎక్స్‌ప్రెషన్స్ సప్ఫిరో డెబిట్ కార్డుకు ప్రస్తుతం రూ. 4,999 ఉన్న వార్షిక రుసుములో మార్పు లేదు. బ్యాంక్ కోరల్/బిజినెస్ కోరల్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 599 నుంచి రూ. 699కి పెరిగింది. రూబిక్స్ డెబిట్ కార్డ్ వార్షిక రుసుమైతే ఏకంగా రూ. 350 పెరిగింది. ప్రస్తుతం రూ. 749 ఉండగా ఇక నుంచి రూ. 1,099 చెల్లించాలి.
సప్ఫిరో/బిజినెస్ సప్ఫిరో డెబిట్ కార్డ్ వార్షిక రుసుము రూ. 500 పెరిగింది. ప్రస్తుతం ఉన్న రూ. 1,499 నుంచి రూ. 1,999 లకు చేరింది. కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ నెలవారీ రుసుము రూ. 249లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది సంవత్సరానికి రూ. 2,988 ఉంటుంది.
కాగా ఏడాది పూర్తయిన ఆయా డెబిట్ కార్డులపై కస్టమర్లు వివిధ రకాల వోచర్లను ఐసీఐసీఐ బ్యాంక్ అందిస్తుంది. వార్షిక రుసుము చెల్లించిన తర్వాత మూడు నెలల్లోపు ఈ-మెయిల్ ద్వారా ఈ వోచర్‌లను పొందవచ్చు.
ఇదీ చదవండి: కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు..
Comments
Please login to add a commentAdd a comment