
ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు చేదు వార్త చెప్పింది. డెబిట్ కార్డ్ వార్షిక చార్జీలను రూ.60 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసింది.
ఇదీ చదవండి: అనుకోకుండా అన్నా.. ‘డాలర్ ఫైనాన్సియల్ టెర్రరిస్ట్’ వ్యాఖ్యపై ఉదయ్ కోటక్ వివరణ
రూ.60 బాదుడు
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పటివరకు డెబిట్ కార్డ్ వార్షిక చార్జీ కింద రూ.199 వసూలు చేస్తోంది. దీనికి జీఎస్టీ అదనం. ఈ చార్జీని ఇప్పుడు రూ.259 లకు పెంచింది. దీంతో పాటు జీఎస్టీ అదనంగా ఉంటుంది. అంటే రూ.60 మేర చార్జీ పెరుగుతుందన్న మాట. పెరిగిన చార్జీలు మే 22 నుంచి అమలులోకి వస్తాయి. అలాగే ఈ చార్జీలు బ్యాంకులోని అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తాయి.
ఇక జూన్ 1 నుంచి సేవింగ్స్, శాలరీ అకౌంట్‌లకు సంబంధించి అమలయ్యే ఛార్జీలు ఇలా ఉన్నాయి.. అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్ లేకుంటే.. 6 శాతం లేదా గరిష్టంగా రూ. 600 వరకు ఛార్జీ వసూలు చేస్తుంది. ఇష్యూ చేసిన చెక్ ఏదైనా నాన్ ఫైనాన్షియల్ కారణంతో రిటర్న్ అయితే రూ. 50 ఛార్జీ పడుతుంది. అలాగే చెక్ డిపాజిట్ అయిన తర్వాత రిటర్న్ అయితే రూ.200 చార్జీ ఉంటుంది.
ఇదీచదవండి: International labour Day: 23 దేశాల్లో జీతాలు రూ.లక్షకుపైనే.. మరి భారత్‌లో...?