ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా దీపక్ గుప్తా (Dipak Gupta) నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ బీఎస్‌ఈ (BSE) ఫైలింగ్‌లో తెలిపినట్లుగా 2023 సెప్టెంబర్ 2 నుంచి రెండు నెలల కాలానికి గుప్తా నియామకాన్ని ఆర్బీఐ (RBI) ఆమోదిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ తాత్కాలిక పదవీకాలం ముగిసేలోపు బ్యాంకు పూర్తికాల ఎండీని ఆర్‌బీఐ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు.
ఉదయ్ కోటక్ తన పదవీ కాలానికి దాదాపు నాలుగు నెలల ముందే సెప్టెంబర్ 1న బ్యాంక్ ఎండీ, సీఈవో పదవి నుంచి వైదొలిగారు. మధ్యంతర ఏర్పాటుగా దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తా.. ఆర్బీఐ పేర్కొన్న రెండు నెలల పాటు ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తారు.
(Uday Kotak: బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్.. రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు)
ఎండీ పదవీకాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేసే రెగ్యులేటరీ ఆదేశం ప్రకారం.. బ్యాంక్ బోర్డు ఈ సంవత్సరం ప్రారంభంలో ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది.
(వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!)
బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న ఉదయ్ కోటక్.. ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఆయన 2004లో బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఎండీగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన 64 ఏళ్ల ఉదయ్ కోటక్.. దేశంలోనే అత్యంత సంపన్న బ్యాంకర్. బ్యాంక్‌లో 26 శాతం వాటా కలిగి ఉన్నారు. సెప్టెంబరు 1 నాటికి ఆయన వాటా విలువ రూ. 3.5 లక్షల కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment