MD & CEO
-
కోటక్ మహీంద్రా బ్యాంక్ తాత్కాలిక ఎండీ, సీఈవోగా దీపక్ గుప్తా
ఉదయ్ కోటక్ రాజీనామా తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా దీపక్ గుప్తా (Dipak Gupta) నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ బీఎస్ఈ (BSE) ఫైలింగ్‌లో తెలిపినట్లుగా 2023 సెప్టెంబర్ 2 నుంచి రెండు నెలల కాలానికి గుప్తా నియామకాన్ని ఆర్బీఐ (RBI) ఆమోదిస్తూ ఒక లేఖ విడుదల చేసింది. ఈ తాత్కాలిక పదవీకాలం ముగిసేలోపు బ్యాంకు పూర్తికాల ఎండీని ఆర్బీఐ నిర్ణయిస్తుందని భావిస్తున్నారు. ఉదయ్ కోటక్ తన పదవీ కాలానికి దాదాపు నాలుగు నెలల ముందే సెప్టెంబర్ 1న బ్యాంక్ ఎండీ, సీఈవో పదవి నుంచి వైదొలిగారు. మధ్యంతర ఏర్పాటుగా దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుప్తా.. ఆర్బీఐ పేర్కొన్న రెండు నెలల పాటు ఎండీ, సీఈవోగా విధులు నిర్వహిస్తారు. (Uday Kotak: బ్యాట్స్‌మన్ టు బిజినెస్‌మన్.. రిచెస్ట్ బ్యాంకర్ గురించిన ఆసక్తికర విషయాలు) ఎండీ పదవీకాలాన్ని 15 సంవత్సరాలకు పరిమితం చేసే రెగ్యులేటరీ ఆదేశం ప్రకారం.. బ్యాంక్ బోర్డు ఈ సంవత్సరం ప్రారంభంలో ఉదయ్ కోటక్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించింది. (వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు!) బ్యాంక్‌లో 26 శాతం హోల్డింగ్ ఉన్న ఉదయ్ కోటక్.. ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేసిన తర్వాత నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మారారు. ఆయన 2004లో బ్యాంక్ ప్రారంభమైనప్పటి నుంచి ఎండీగా ఉన్నారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన 64 ఏళ్ల ఉదయ్ కోటక్.. దేశంలోనే అత్యంత సంపన్న బ్యాంకర్. బ్యాంక్‌లో 26 శాతం వాటా కలిగి ఉన్నారు. సెప్టెంబరు 1 నాటికి ఆయన వాటా విలువ రూ. 3.5 లక్షల కోట్లు. -
‘లాయిడ్స్’ సీఈవోగా శిరీష ఓరుగంటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూకే సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవో, ఎండీగా శిరీష ఓరుగంటిని నియమించింది. స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షిస్తారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఆమె జేసీపెన్నీ ఎండీగా, కంపెనీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక విధులను నిర్వర్తించారు. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఫిన్‌టెక్ ఆవిష్కరణలలో విస్తృత అనుభవాన్ని తీసుకు వస్తారని లాయిడ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. -
హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
న్యూఢిల్లీ: దేశ హౌసింగ్ రంగం గడిచిన పదిహేనేళ్లుగా అతిపెద్ద బూమ్‌ను చూస్తోందని హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ ఎండీ, సీఈవో విపుల్ రూంగ్తా తెలిపారు. ఇళ్ల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక స్థోమత (అఫర్డబులిటీ), సొంతిల్లు ఉండాలన్న ఆకాంక్ష తదితర ఎన్నో అంశాలు బూమ్‌ను నడిపిస్తున్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన రియల్ ఎస్టేట్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రూంగ్తా మాట్లాడారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన ‘‘గత 15 ఏళ్లలో అతిపెద్ద బూమ్‌ను నేను వ్యక్తిగతంగా చూస్తున్నాను. నివాస విభాగంలో మధ్యాదాయ, అందుబాటు ధరల విభాగం అయినా, ప్రీమియం విభాగం అయినా ఇదే పరిస్థితి నెలకొంది’’అని రూంగ్తా అన్నారు. ఫిక్కీ రియల్ ఎస్టేట్ కమిటికీ కో చైర్మన్‌గానూ రూంగ్తా వ్యవహరిస్తున్నారు. రెరా కింద సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఉందని గుర్తు చేస్తూ, ఈ విషయంలో విఫలమైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ ఇళ్లకు డిమాండ్.. దేశంలో హౌసింగ్ డిమాండ్ ప్రధానంగా అందుబాటు ధరల, మధ్యాదాయ వర్గాల కేంద్రంగా ఉన్నట్టు విపుల్ రూంగ్తా చెప్పారు. కనుక ఈ విభాగాల్లో హౌసింగ్ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇదే సరైన తరుణమని సూచించారు. వడ్డీ రేట్లు గత ఏడాది కాలంలో పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్ ఉత్సాహంగానే ఉన్నట్టు చెప్పారు. అఫర్డబుల్ హౌసింగ్‌లో హెచ్డీఎఫ్సీ క్యాపిటల్ అడ్వైజర్స్ 3.2 బిలియన్ డాలర్ల ఫండ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ, గృహ ఆదాయంతో నివాస గృహాలకు అసాధారణ స్థాయిలో డిమాండ్ ఉన్నట్టు ఇదే సదస్సులో పాల్గొన్న ఫిక్కీ డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా ధరల వృద్ధి ఉన్న టాప్–10 హౌసింగ్ మార్కెట్లలో భారత్ ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 3.65 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. -
ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా?
ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో సందీప్ భక్షి దేశంలో అత్యధికంగా వేతనాలు పొందే బ్యాంకర్లలో ఒకరు. ఐసీఐసీఐ బ్యాంకును సంక్షోభాల నుంచి బయటకు తీసిన ఘనత ఆయనది. ఆయనకు ముందున్న చందా కొచ్చర్ ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో రాజీనామా చేయడం తెలిసిందే. 2018లో బ్యాంకు పగ్గాలు చేపట్టిన సందీప్ భక్షి.. ఐదేళ్లలోనే మళ్లీ వృద్ధి పథంలోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: ఆఫీస్‌కు రావద్దు.. ఇంట్లో హాయిగా నిద్రపోండి.. ఉద్యోగులకు బంపర్ ఆఫర్! సందీప్ భక్షి బాధ్యతలు స్వీకరించినప్పుడు బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు విలువ రూ. 313.35. అది మార్చి 16 నాడు రూ. 825 వద్ద ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు బ్యాంక్ మేనేజ్మెంట్పై విశ్వాసం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన హయాంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5.74 లక్షల కోట్లకు పెరిగింది. కంపెనీ పబ్లిక్‌గా ట్రేడ్ చేసిన అన్ని షేర్ల మొత్తం మార్కెట్ విలువను మార్కెట్ క్యాప్‌గా వర్ణిస్తారు. ఇంజినీర్ నుంచి బ్యాంకర్ సందీప్‌కు దాదాపు నాలుగు దశాబ్దాల కార్పొరేట్ అనుభవం ఉంది. చండీగఢ్ పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన జంషెడ్‌పూర్‌లోని ప్రతిష్టాత్మక జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. 1986లో ఐసీఐసీఐలో చేరిన సందీప్‌భక్షి 2018లో ఆ బ్యాంకుకు ఎండీ, సీఈవోగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన బ్యాంక్ హోల్‌టైమ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్లపాటు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌కు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పనిచేశారు. దానికి ముందు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు ఆయన టాప్ ఎగ్జిక్యూటివ్. సంవత్సర జీతాన్ని వదులుకున్నారు.. 2022 ఆర్థిక సంవత్సరంలో సందీప్ భక్షి వార్షిక వేతనం రూ. 7.98 కోట్లు. అంటే నెలకు దాదాపు రూ. 65 లక్షలు. అయితే సందీప్‌లోని మరో కోణం అందరినీ ఆకట్టుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆయన 2021 వార్షిక జీతాన్ని ఆయన వదులుకున్నారు. ఆర్భాటాలకు దూరంగా ఉండే ఆయన చాలా లోప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. -
యాంఫీ చైర్మన్‌గా బాలసుబ్రమణియన్ పునర్నియామకం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ చైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎడెల్వీస్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధిక గుప్తా వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ వెల్లడించింది. తదుపరి వార్షిక సమావేశం వరకూ ఇద్దరూ తమ తమ పదవుల్లో కొనసాగుతారు. బాలసుబ్రమణియన్ యాంఫీ ఫైనాన్షియల్ లిటరసీ కమిటీకి ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు. అటు ఆపరేషన్స్, రిస్క్‌ల కమిటీకి గుప్తా చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఇక ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) కమిటీ చైర్మన్‌గా నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ సందీప్ సిక్కా ఎన్నికయ్యారు. యాంఫీలో 43 ఏఎంసీలకు సభ్యత్వం ఉంది. -
గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ మోహిత్ మల్హోత్రా రాజీనామా
సాక్షి,ముంబై: గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ మోహిత్ మల్హోత్రా సీఎండీ రాజీనామా చేశారు. మల్హోత్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన పదవులకు రాజీనామా చేసినట్లు ఆగస్టు 2న స్టాక్ ఎక్స్ఛేంజ్కి సమాచారంలో కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం నార్త్ జోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గౌరవ్ పాండే బాధ్యతలు స్వీకరిస్తార కంపెనీ తెలిపింది అయితే రాజీనామా చేసిన మల్హోత్రా డిసెంబర్ 31 వరకు ఈయన పదవిలోఉంటారు. ఈనేపథ్యంలో 2023 జనవరి నుంచి గౌరవ్ పాండే కొంత్త సీఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. పాండేకు రియల్ ఎస్టేట్ రంగంలో 17 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉందని పేర్కొంది. కొత్త సీఎండీ గౌరవ్ పాండే నియామకంపై గోద్రెజ్ ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పిరోజ్షా గోద్రెజ్ సంతోషాన్ని వ్యక్తంచేశారు. భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో అవకాశాలు అపారంగా ఉన్నాయని, పరిశ్రమలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.ఈ విజయాన్ని కొనసాగించేలా మార్గనిర్దేశం చేస్తారని భావిస్తున్నామన్నారు. కాగా గోద్రెజ్‌లో చేరడానికి ముందు, పాండే రియల్ ఎస్టేట్ పరిశోధన సంస్థ, ప్రాప్ఈక్విటీకి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ & కన్సల్టింగ్ హెడ్‌గా కూడా పనిచేశారు. దీంతోపాటు దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, డెవలపర్లు, ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులకు సలహాలిచ్చేవారు. -
జీ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్(జీల్) పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. బోర్డు మార్గదర్శకత్వంలో కంపెనీ భవిష్యత్‌కు అనువైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల మౌనాన్ని వీడుతూ గోయెంకా.. గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో ప్రతిపాదించిన డీల్ అంశాన్ని ఇన్వెస్కో పబ్లిక్కు వెల్లడించకపోవడాన్ని ప్రశ్నించారు. జీలో అతిపెద్ద వాటాదారుగా నిలుస్తున్న ఇన్వెస్కో కొద్ది రోజులుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని(ఏజీఎం)కి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. తద్వారా పునీత్ గోయెంకాసహా బోర్డులో ఇతర నామినీలను తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పునీత్ గోయెంకా వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇంతక్రితం వేసిన ప్రణాళికలను పబ్లిక్కు ఎందుకు తెలియజేయలేదని ఇన్వెస్కోను వేలెత్తి చూపారు. కార్పొరేట్ సుపరిపాలన అనేది కార్పొరేట్లకు మాత్రమేకాదని, కంపెనీలో వాటా కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్లకూ వర్తిస్తుందని ఇన్వెస్కోనుద్ధేశించి పేర్కొన్నారు. జీల్లో.. ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. జీ భవిష్యత్‌ను ప్రభావితం చేసేందుకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా పెంచుకుంటూ వస్తున్న వాటాదారుల విలువకు దెబ్బతగలనీయబోమని వ్యాఖ్యానించారు. ఇన్వెస్కోతో వివాదం నేపథ్యంలో జీ మరిన్ని వృద్ధి అవకాశాలను అందుకుంటుందని, మరింత పటిష్టపడుతుందని తెలియజేశారు. తద్వారా మీడియా, వినోద రంగాలలో దిగ్గజ కంపెనీగా నిలవనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ భవిష్యత్ కోసం మాత్రమే పోరాడుతున్నానని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు కాదని గోయెంకా ఈ సందర్భంగా వివరణ ఇచ్చారు. రిలయన్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయతి్నంచిన ఇన్వెస్కో విఫలమైందని, ఈ విషయాన్ని దాచిపెట్టిందని వివరించారు. వాటాదారుల ప్రయోజనార్ధమే ఈ నిజాలను బోర్డు ముందుంచినట్లు పేర్కొన్నారు. -
గుడ్‌బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
-
గుడ్‌బై చెప్పిన మొదటి మహిళ అధినేత!
దేశీయంగా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్గా పేరున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కు మొదటి మహిళా మేనేజింగ్ డైరెక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న చిత్రా రామకృష్ణ ఆమె పదవికి గుడ్ బై చెప్పారు. చిత్రా రామకృష్ణ తన పదవి నుంచి దిగిపోయినట్టు బోర్డులోని సంబంధిత వర్గాలు చెప్పాయి. రోజువారీ కార్యకలాపాల కోసం తాత్కాలికంగా రామకృష్ణ స్థానంలో జే రవిచంద్రన్‌ను ఎన్ఎస్ఈ నియమించింది. ఆయన ప్రస్తుతం గ్రూప్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్రా రామకృష్ణ రాజీనామా విషయాన్ని ఎన్ఎస్ఈ త్వరలోనే స్టామ్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి వెల్లడించనుంది. ఆమె వ్యక్తిగత కారణాలతోనే తన పదవికి రాజీనామా చేసినట్టు తెలిసింది. ఎన్ఎస్ఈకి తొలి మహిళ అధినేతగానే కాక, ఇటీవలే వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్చేంజస్(డబ్యూఎఫ్ఈ)కి మొదటి మహిళా చైర్‌గా కూడా ఆమె ఎంపికయ్యారు. డబ్యూఎఫ్ఈ ప్రపంచవ్యాప్తంగా 45వేల లిస్టెడ్ కంపెనీలకు అసోసియేషన్ గా ఉంటోంది. ఎన్ఎస్ఈకి తొలి మహిళా అధినేతగా ఆమె ఆ పదవిలో 2013 ఏప్రిల్ నుంచి కొనసాగుతున్నారు. 2009 నుంచి 2013 వరకు ఎక్స్చేంజ్కు చిత్రా రామకృష్ణన్ జాయింట్ ఎండీగా పనిచేశారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా, లిస్టింగ్ హెడ్‌గా కూడా ఆమె సేవలందించారు. ఎన్ఎస్ఈ ఏర్పాటుచేసిన స్టార్టప్ టీమ్ లో రామకృష్ణన్ ఓ భాగంగా ఉన్నారు. అయితే ఆమె వైదొలగడం ఎన్ఎస్ఈ కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం చూపదని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ మెంబర్ దీపన్ మెహతా చెప్పారు.