
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ చైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎడెల్‌వీస్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధిక గుప్తా వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు.
సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ వెల్లడించింది. తదుపరి వార్షిక సమావేశం వరకూ ఇద్దరూ తమ తమ పదవుల్లో కొనసాగుతారు. బాలసుబ్రమణియన్ యాంఫీ ఫైనాన్షియల్ లిటరసీ కమిటీకి ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు.
అటు ఆపరేషన్స్, రిస్క్‌ల కమిటీకి గుప్తా చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఇక ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) కమిటీ చైర్మన్‌గా నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ చీఫ్ సందీప్ సిక్కా ఎన్నికయ్యారు. యాంఫీలో 43 ఏఎంసీలకు సభ్యత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment