amfi
-
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఐదు నెలల్లో రూ.14,000 కోట్లు - ఇన్వెస్టర్లలో పెరిగిన రిస్క్ ధోరణి
న్యూఢిల్లీ: అధిక రాబడుల కోసం థీమ్యాటిక్ (సెక్టోరల్ తదితర) మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. గడిచిన ఐదు నెలల కాలంలో ఈ పథకాలు నికరంగా రూ.14,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం దీన్నే సూచిస్తోంది. ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే ధోరణి పెరిగినట్టు కూడా అర్థమవుతోంది. ఈ ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా ఈ విభాగం నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉంది. అంతకుముందు చూస్తే, ఈ ఏడాది మే నెలలో థీమ్యాటిక్ ఫండ్స్ నుంచి రూ.169 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. థీమ్యాటిక్/సెక్టోరల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడులు మొత్తాన్ని ఇవి ఒకే రంగంలో, లేదా ఒకే తరహా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. వైవిధ్యానికి అవకాశం ఉండదు. రిస్క్ తీసుకునే ధోరణి పెరగడంతో ఇన్వస్టర్లు అధిక రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ లేదా సెక్టోరల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటున్నట్టు ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి అభిప్రాయపడ్డారు. స్మాల్‌క్యాప్ తర్వాత వీటికే ఆదరణ యాంఫి గణాంకాల ప్రకారం.. అక్టోబర్‌లో థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.3,896 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో అత్యధికంగా స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,495 కోట్లను ఆకర్షించగా, ఆ తర్వాత అధిక పెట్టుబడులు థీమ్యాటిక్ పథకాల్లోకే వెళ్లాయి. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.3,417 కోట్లు, ఆగస్ట్‌లో రూ.4,806 కోట్లు, జూలైలో రూ.1,429 కోట్లు, జూన్‌లో రూ.459 కోట్ల చొప్పున థీమ్యాటిక్ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. బ్యాంకింగ్ ఫండ్స్‌కు మొగ్గు ఇక థీమ్యాటిక్ ఫండ్స్‌లో బ్యాంకింగ్ ఫండ్స్ ఎక్కువ మంది ఇన్వెస్టర్ల ఎంపికగా ఉంటున్నాయి. ఇవి బ్యాంక్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి కనుక దేశ వృద్ధిలో పాలు పంచుకున్నట్టు అవుతుంది. గడిచిన పదేళ్లలో బీఎస్ఈ సెన్సెక్స్ 203 శాతం పెరిగితే, బీఎస్ఈ బ్యాంకెక్స్ (బ్యాంక్ స్టాక్స్‌తో కూడిన సూచీ) 282 శాతం పెరిగింది. ఇతర రంగాలతో పోలిస్తే గడిచిన కొన్ని త్రైమాసికాల్లో బ్యాంకులు లాభాల్లో ఎక్కువ వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. థీమ్యాటిక్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే వారికి ఎప్పుడు పెట్టుబడులు పెట్టాలి, ఎప్పుడు వైదొలగాలనే విషయం తప్పక తెలిసి ఉండాలని టాటా అస్సెట్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూషనల్ క్లయింట్స్ హెడ్ ఆనంద్ వరదరాజన్ సూచించారు. 11 ఈక్విటీ ఫండ్ విభాగాల్లో థీమ్యాటిక్ కూడా ఒకటి. ఈ విభాగంలోని పథకాల నిర్వహణలో రూ.2.18 లక్షల కోట్ల ఆస్తులు అక్టోబర్ చివరికి ఉన్నాయి. -
యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని నియమితులయ్యారు. వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్ఎస్ వెంకటేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐలో డిçప్యూటీ ఎండీగా వ్యవహరించడంతో పాటు ఆర్బీఐ, ఆర్థిక శాఖలు ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ సభ్యుడిగా సేవలు అందించారు. దేశీ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఇటు పరిశ్రమ, అటు నియంత్రణ సంస్థతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. -
పెట్టుబడుల వరద, స్మాల్‌క్యాప్ వైపు ఇన్వెస్టర్ల చూపు.. కారణం అదేనా?
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ పథకాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్మాల్‌క్యాప్ పథకాలు నికరంగా రూ.11,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. లార్జ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడుల విషయంలో ఫండ్ మేనేజర్లు సవాళ్లను ఎదుర్కొంటుండడంతో, ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇదే ధోరణి కొంత కాలం పాటు కొనసాగుతుందని అంచనా. లార్జ్‌క్యాప్ పథకాలు జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కేవలం రూ.3,360 కోట్లను ఆకర్షించడం గమనార్హం. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి నికరంగా రూ.6,932 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ‘‘గడిచిన కొన్ని నెలలుగా మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు బలమైన ర్యాలీ చేస్తున్నాయి. దీంతో లార్జ్‌క్యాప్ విభాగంలో ఆల్ఫా నమోదు చేయడం అన్నది చాలా కష్టమైన పనే అవుతుంది. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి భారీ పెట్టుబడులు రావడానికి ఇదే కారణం’’అని క్లయింట్ అసోసియేట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు కోహ్లీ తెలిపారు. అసాధారణం.. స్మాల్‌క్యాప్ పథకాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులు వస్తుండడంతో, ఫండ్ మేనేజర్లు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నిప్పన్ ఇండియా స్మాల్‌క్యాప్, టాటా స్మాల్‌క్యాప్ పథకాలు లంప్సమ్ (ఒకే విడత) పెట్టుబడుల స్వీకరణను నిలిపివేశాయి. కేవలం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులనే అనుమతిస్తున్నాయి. భారీ పెట్టుబడులను సర్దుబాటు చేసేంత లిక్విడిటీ స్మాల్‌క్యాప్ విభాగంలో ఉండదు. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఫండ్ మేనేజర్లు ఈ వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తోంది. ‘‘ఇటీవలి నెలల్లో స్మాల్‌క్యాప్ స్టాక్స్ పనితీరు ఎంతో అసాధారణంగా ఉంది. లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల మధ్య వ్యాల్యూషన్ పరంగా ఉన్న అంతరమే దీనికి కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల వ్యాల్యూషన్ ఖరీదుగా మారినప్పుడు ఇలాంటి ధోరణి కనిపించడం సహజమే. దీంతో ఫండ్ మేనేజర్లు పెట్టుబడులకు ఆకర్షణీయమైన స్టాక్స్ కోసం అన్వేషిస్తుంటారు’’అని ఏయూఎం క్యాపిటల్ మార్కెట్ వెల్త్ హెడ్ ముకేశ్ కొచ్చర్ తెలిపారు. మిడ్‌క్యాప్ స్థాయి రిస్క్‌తో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు మొగ్గు చూపిస్తున్నట్టు ఆనంద్ రాథి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫెరోజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. భారీ రాబడులు మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్‌క్యాప్ విభాగం భారీ రాబడులు ఇస్తుండడం కూడా ఈ విభాగం వైపు ఇన్వెస్టర్ల ఆకర్షణకు కారణంగా తెలుస్తోంది. ఏడాది కాలంలో ఇవి 30–37 శాతం, మూడేళ్ల కాలంలో 40–44 శాతం, ఐదేళ్లలో 18–21 శాతం చొప్పున వార్షిక కాంపౌండెడ్ వృద్ధితో రాబడులు అందించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూన్ చివరికి స్మాల్‌క్యాప్ ఫండ్స్ అన్నింటి నిర్వహణలోని ఆస్తులు మార్చి నుంచి చూస్తే 28 శాతం వృద్ధితో రూ.1.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఈ పథకాలు ఆటో, ఆటో విడిభాగాలు, క్యాపిటల్ గూడ్స, ఐటీ కంపెనీలకు పెట్టుబడుల పరంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి. ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో స్మాల్‌క్యాప్ విభాగానికి గరిష్టంగా 30 శాతం వరకే కేటాయించుకుని, 50 శాతం లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవడం మంచిదని అజీజ్ సూచించారు. -
మ్యూచువల్ ఫండ్స్‌లో తగ్గిన ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి విలువ
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి విలువ 2023 మార్చి నాటికి 3 శాతం తగ్గి రూ.68,321గా ఉంది. 2022 మార్చి నాటికి ఇది రూ.70,199గా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడించాయి. అదే సమయంలో ఒక్కో ఇనిస్టిట్యూషన్ ఖాతా సగటు పెట్టుబడి రూ.10.11 కోట్లుగా ఉంది. లిక్విడ్ ఫండ్స్‌తోపాటు ఇతర డెట్ ఆధారిత పథకాల్లో సగటు పెట్టుబడి ఎక్కువగా ఉంది. డెట్ ఆధారిత పథకాల్లో సగటు టికెట్ సైజు రూ.14.53 లక్షలుగా ఉంది. అదే ఈక్విటీ పథకాల్లో సగటున ఇది రూ.1.54 లక్షలుగా ఉంది. సాధారణంగా ఈక్విటీ పెట్టుబడులు ఎక్కువ కాలం పాటు ఉంటుంటాయి. 45 శాతం ఈక్విటీ పెట్టుబడులు రెండేళ్లకు పైగా కొనసాగుతున్నవి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ మొత్తం ఈక్విటీ పెట్టుబడుల్లో రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నవి 56.5 శాతంగా ఉన్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా ఇన్వెస్టర్ పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) క్రమంగా పెరుగుతూనే వస్తుండడం గమనించొచ్చు. ఇన్వెస్టర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల పట్ల పెరుగుతున్న అవగాహన, డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం ఇందుకు సానుకూలతలుగా చెప్పుకోవచ్చు. మొత్తం 42 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల పరిధిలో ఇన్వెస్టర్ ఫోలియోలు గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 1.62 కోట్లు కొత్తగా ప్రారంభమయ్యాయి. 2014 డిసెంబర్ నాటికి 4.03 కోట్లుగా ఉన్న ఫోలియోలు 2023 మార్చి నాటికి 14.57 కోట్లకు చేరాయి. ఒక ఇన్వెస్టర్‌కు ఒక పథకంలో పెట్టుబడికి గుర్తుగా కేటాయించే నంబర్‌ను ఫోలియోగా చెబుతారు. గత ఆర్థిక సంవత్సరంలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు 7 శాతం పెరిగి రూ.40.05 లక్షల కోట్లకు చేరాయి. -
యాంఫీ చైర్మన్‌గా బాలసుబ్రమణియన్ పునర్నియామకం
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ చైర్మన్‌గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ మరోసారి ఎన్నికయ్యారు. ఎడెల్వీస్ ఏఎంసీ ఎండీ, సీఈవో రాధిక గుప్తా వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. సెప్టెంబర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు యాంఫీ వెల్లడించింది. తదుపరి వార్షిక సమావేశం వరకూ ఇద్దరూ తమ తమ పదవుల్లో కొనసాగుతారు. బాలసుబ్రమణియన్ యాంఫీ ఫైనాన్షియల్ లిటరసీ కమిటీకి ఎక్స్–అఫీషియో చైర్మన్‌గా కూడా ఉంటారు. అటు ఆపరేషన్స్, రిస్క్‌ల కమిటీకి గుప్తా చీఫ్‌గా వ్యవహరిస్తారు. ఇక ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) కమిటీ చైర్మన్‌గా నిప్పన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్ చీఫ్ సందీప్ సిక్కా ఎన్నికయ్యారు. యాంఫీలో 43 ఏఎంసీలకు సభ్యత్వం ఉంది. -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్‌లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్‌పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
తొలి క్వార్టర్లో మ్యూచువల్ ఫండ్స్ ఏయూఎం రూ.25 లక్షల కోట్లు
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.25లక్షల కోట్లకు చేరుకున్నాయి. క్రితం త్రైమాసికంలో నమోదైన రూ.27 లక్షల కోట్లు ఏయూఎంతో పోలిస్తే ఇది 8శాతం తక్కువ. ఈ తొలి త్రైమాసికంలో ఈక్విటీలు, డెట్ మార్కెట్లలో అవుట్‌ఫ్లో ఒత్తిళ్లు పెరగడంతో ఆస్తుల నికర విలువ తగ్గినట్లు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సమాఖ్య యాంఫీ తెలిపింది. మ్యూచువల్ ఫండ్ల పరిశ్రమలోని 45 సంస్థల నిర్వహణలోని ఆస్తులు రూ.24.82లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ త్రైమాసికంలో నిఫ్టీ ఇండెక్స్ 24శాతం ర్యాలీ చేసినప్పటికీ... డెట్, ఈక్విటీ మార్కెట్లో అవుట్‌ఫ్లోలు పెరగడంతో ఫండింగ్ సంస్థలు ఒత్తిడికి లోనయ్యాయి. మ్యూచువల్ ఫండ్ ఫథకాల్లో నికర ఇన్‌ఫ్లో తగ్గడంతో త్రైమాసిక ప్రాతిపదికన ఇండస్ట్రీస్ 8శాతం క్షీణతను చవిచూసినట్లు సామ్కో సెక్యూరిటీస్ తెలిపింది. ప్రస్తుతం 45 ఫండ్ హౌస్‌లు ఉన్నాయి. ఇందులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్ లైఫ్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ టాప్-5 ఫండింగ్ సంస్థలుగా కొనసాగుతున్నాయి. ఇందులో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.64లక్షల కోట్ల ఏయూఎంతో అగ్రస్థానంలోనూ, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ రూ.3.56లక్షల కోట్లతో రెండో స్థానంలో, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.46లక్షల కోట్ల ఏయూఎంతోనూ మూడో స్థానంలో ఉన్నాయి. -
క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు తగ్గిన ఉపసంహరణల ఒత్తిడి
న్యూఢిల్లీ: క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌కు ఎట్టకేలకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిడి తగ్గింది. ఏప్రిల్ 27తో పోలిస్తే ఏప్రిల్ 30వ తేదీ నాటికి నికర పెట్టుబడుల ఉపసంహరణ మొత్తం 81 శాతం తగ్గిపోయినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ప్రకటించింది. యాంఫి వెల్లడించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఏప్రిల్ 24న క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న మొత్తం రూ.2,949 కోట్లుగా ఉంటే, ఏప్రిల్ 27 నాటికి రూ.4,294 కోట్లకు పెరిగిపోయింది. డెట్ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆర్బీఐ ఏప్రిల్ 27న రూ.50,000 కోట్లతో మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రత్యేక లిక్విడిటీ విండోను ప్రారంభించిన విషయం గమనార్హం. దీనివల్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం ఏర్పడిందో ఏమో కానీ... ఏప్రిల్ 28న రూ.1,847 కోట్లు, ఏప్రిల్ 29న రూ.1,251 కోట్లు, ఏప్రిల్ 30న రూ.794 కోట్లకు నికర పెట్టుబడుల ఉపసంహరణ తగ్గిపోయింది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి ఒక విభాగం. రిస్క్ అధికంగా ఉండే డెట్ పేపర్లలో అవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే, తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీలు జారీ చేసే డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిల్లో డిఫాల్ట్ రిస్క్ అధికంగా ఉంటుంది. కనుకనే ఆయా కంపెనీలు అధిక రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. -
యాంఫీ చైర్మన్‌గా నిమేష్ షా
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నిమేష్ షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌చైర్మన్‌గా ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కైలాష్ కులకర్ణి కొనసాగుతున్నట్లు తెలిపింది. -
జీఎస్టీ అమలుతో మ్యూచువల్ ఫండ్స్ ప్రియం
తగిన రక్షణ కావాలని యాంఫీ వినతి న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం జీఎస్టీలో మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మినహారుుంపు ఉండాలని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీఎస్టీ కారణంగా వ్యయాలు పెరగడం, నిబంధనల పని భారం వల్ల మ్యూచువల్ ఫండ్స యూనిట్లు మరింత ఖరీదుగా మారతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీలో గూడ్స అనే నిర్వచనం నుంచి సెక్యూరిటీలను మినహారుుంచాలని... పన్ను మినహారుుంపు ఉన్న వాటిల్లో చేర్చాలని కోరింది. ఈ మేరకు పీడబ్ల్యూసీతో కలసి యాంఫీ జీఎస్టీ కమిషనర్ ఉపేంద్ర గుప్తాకు వినతిపత్రం అందజేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ చట్టాల ప్రకారం సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను లేదు.