
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నిమేష్ షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌చైర్మన్‌గా ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కైలాష్ కులకర్ణి కొనసాగుతున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment