Nimesh Shah
-
యాంఫీ చైర్మన్‌గా నిమేష్ షా
న్యూఢిల్లీ: అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో నిమేష్ షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌చైర్మన్‌గా ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్ సీఈఓ కైలాష్ కులకర్ణి కొనసాగుతున్నట్లు తెలిపింది. -
మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..
మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియవు. అందుకే అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి బాగున్నా.. బాగోలేకున్నా.. మన ఇన్వెస్ట్మెంట్లను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు ఏమంత ఆశాజనకంగా లేవు. మార్కెట్లు బాగోలేనప్పుడే అందులో పెట్టుబడుల్ని చేయాలి. అప్పుడే అసలు ధర వద్ద స్టాక్స్ లభిస్తాయి. ఎప్పుడూ షేర్ల విలువ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు జరగాలి. ఏడాది ప్రారంభంలో పోర్ట్‌ఫోలియోను ఒకసారి సరిచూసుకొని ఇన్వెస్ట్మెంట్లను రెగ్యులర్‌గా కొనసాగించటానికి ప్రయత్నించాలి. మంచి పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఒక కళ. అంచనాలకు అనుగుణంగా గతేడాది.. గతేడాది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంది. దేశ ఆర్థిక వృద్ధి మాత్రం మందగించింది. ఆర్బీఐ భావించినట్లుగానే వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ చర్య డెట్ (బాండ్ల) పోర్ట్‌ఫోలియోలకు బాగా అనుకూలించింది. మార్కెట్లు కూడా పర్వాలేదనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు మంచి పనితీరు కనబరచాయి. ఈ ఏడాది సంగతేంటి? ప్రస్తుత ఏడాదిలో చైనా ఆర్థిక మందగమనం, ముడి చమురు ధరల పతనం వంటి అంశాలు అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇన్వెస్టర్లు ప్రస్తుత ఈక్విటీ మార్కెట్ల పనితీరు (అస్థిర త)ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వడ్డీ రేట్లు అనువుగా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉపయుక్తమైనవి. ఇక ఆర్బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గేంచే అవకాశం ఉంది. ఈక్విటీ ధరలు తగ్గుతున్నాయ్.. ఈక్విటీ షేరుధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ విభాగంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వండి. అలాగే ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే హైబ్రిడ్ ఫండ్స్ ఉత్తమం. ప్రస్తుతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు వాటి షేరువారీ ఆర్జన (ఈపీఎస్)తో పోలిస్తే 20 రెట్లు ధరకు (పీఈ) ట్రేడ్ అవుతున్నాయి. అదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం 16 రెట్లకు ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల లార్జ్ క్యాప్ షేర్లు మంచి విలువకు లభిస్తున్నట్లు లెక్క. రంగాల వారీగా చూస్తే.. ఆటో, ఫైనాన్షియల్, ఐటీ రంగాలు ఆశాజనకంగా లేవు. ఫార్మా రంగ కంపెనీలు పర్వాలేదు. వాటి షేరు ధరలు ఒక స్థాయిలోనే ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ విభాగంలో మాత్రం అధిక విలువ ఉంది. స్టాక్స్ ధరలు అనుకూలం మార్కెట్ల పనితీరు దేశంలో వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్లు పెరిగితేనే మార్కెట్లు మంచి పని తీరును కనబరుస్తాయి. దీనికి సమయం పడుతుంది. కొందరు ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పడే వరకు వేచి ఉంటారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. ప్రస్తుత ధరలు పెట్టుబడులకు అనువుగా ఉన్నాయి. సిప్ ఇన్వెస్ట్మెంట్లను పెంచుకునేటప్పుడు హైబ్రిడ్ ఫండ్స్‌కు తగిన ప్రాధాన్యమివ్వండి. అసలు ధరలకు స్టాక్స్ అం దుబాటులో ఉన్నప్పుడు వాటితో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచుకోవాలి. అసెట్స్ పెరిగే కొద్ది వాటి ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. అసెట్స్‌ను పెంచుకోవడానికి ఈ ఏడాది అనుకూలం. - నిమేశ్ షా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో -
బ్యాలెన్స్ సరే... మరి రీబ్యాలెన్సో?
* పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అత్యవసరం * అలాగైతేనే పొందిన లాభాలు చేతికొస్తాయ్ ఇంటిని చూసి ఇల్లాలి గురించి చెప్పొచ్చంటారు. అలాగే పోర్టుఫోలియో చూసి కూడా సదరు ఇన్వెస్టర్ తెలివైన వాడా? కాదా అని చెప్పొచ్చు. పోర్ట్‌ఫోలియో ఎల్లప్పుడు డైవర్సిఫైడ్‌గా ఉండాలి. రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీతో పాటు తక్కువ రిస్క్ ఉండే డెట్ సాధనాల్లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఇలా చేస్తే మీ పోర్ట్‌ఫోలియో చాలా బలంగా ఉన్నట్లు అర్థం. ఒకదానిలో నష్టం వచ్చినా... ఇంకొక దానిలో లాభం వస్తే వచ్చిన నష్టం సమానం అవుతుంది. అప్పుడు రిస్క్ బ్యాలెన్స్ అవుతుంది. ఫోర్ట్‌ఫోలియోను డైవర్సిఫైడ్‌గా ఉంచుకోవడం ఎంత ముఖ్యమో... దాన్ని రీ బ్యాలెన్స్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇది ఎలాగో చూద్దాం.. పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ అంటే? పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్డ్గా ఎలా ఉంచుకుంటామో... అలాగే దాన్ని నిర్ణీత సమయాల్లో క్రమబద్ధంగా రీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. ఎందుకంటే ఒక వ్యక్తి పోర్ట్‌ఫోలియో, ఫండ్స్ విలువ ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా అసెట్స్ కేటాయింపులు కూడా మారుస్తూ ఉండాలి. దీన్నే ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్గా పేర్కొంటారు. సాధారణంగా ఇన్వెస్టర్లు మార్కెట్లు పెరుగుతున్నపుడు వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి, పతనమవుతున్నప్పుడు వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ రీ-బ్యాలెన్స్ విధానంలో మార్కెట్లు పడుతున్నప్పుడు అందులో ఇన్వెస్ట్‌చేసి... పెరుగుతున్నప్పుడు లాభాలు పొంది బయటకు వస్తారు. పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్ కొన్ని పెరగవచ్చు... అలాగే కొన్ని తగ్గొచ్చు. పెరిగిన స్టాక్స్ అలాగే పెరుగుతూ వె ళ్తాయని చెప్పలేం. అవి కూడా కొంత పెరిగిన తర్వాత తగ్గొచ్చు. ఇలా స్టాక్స్ పెరిగి మళ్లీ తగ్గితే మనకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్‌లకు కేటాయించిన ఇన్వెస్ట్మెంట్లను మార్చుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఈక్విటీ మార్కెట్ పతనమైంది. ఇలాంటి సమయాల్లో అందరి పోర్ట్‌ఫోలియోలో డెట్‌పై ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువగా, ఈక్విటీపై తక్కువగా ఉంటాయి. కానీ రీ బ్యాలెన్స్ విషయానికి వస్తే.. ఈక్విటీ పైనే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి. ఈక్విటీ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ తక్కువ ధరల వద్ద ఉంటాయి. అప్పుడు స్టాక్స్ కొంటే అవి వాటి అసలు ధర వద్ద మనకు లభిస్తాయి. అలాగే 2013లో మార్కెట్లు మందగమనంలో ఉన్నాయి. ఇలా స్టాక్ మార్కెట్ పతనమైనప్పుడు స్టాక్స్ కొనడం వల్ల ఈక్విటీ అసెట్స్‌ను బాగా పెంచుకోవచ్చు. ఈ విధంగా తక్కువ ధరల వద్ద కొన్న స్టాక్స్ తర్వాతి కాలంలో బాగా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మీ స్టాక్స్‌ను విక్రయించి లాభాలను పొందొచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సంస్థ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (సిప్) ఫోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ లక్ష్యంగా బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌ను అందిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు మారాలి... పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. అప్పుడు మీరు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాలను మార్చుకోవాలి. ఉదాహరణకు మీరు మీ మిగులు సంపదను ఈక్విటీపై 70 శాతం, డెట్ సాధనాలపై 30 శాతం ఇన్వెస్ట్ చేద్దాం అని అనుకున్నారు. కానీ అప్పుడు ఈక్విటీ మార్కెట్ బాగా ఊపుమీద ఉంది. అలాంటప్పుడు మీరు ఈక్విటీపై 70 శాతం ఇన్వెస్ట్‌మెంట్‌ను 80 శాతానికి పెంచుకోవచ్చు. డెట్ సాధనాలపై ఇన్వెస్ట్‌మెంట్‌ను 20 శాతానికి తగ్గించుకోవచ్చు. ఈక్విటీపై లాభాలను పొందిన తర్వాత తిరిగి మీ ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీపై 70 శాతంగా, డెట్‌పై 30 శాతంగా ఉంచుకోవచ్చు. ఇదే రీబ్యాలెన్స్ వ్యూహం. రీబ్యాలెన్స్ సులువే కానీ.. రీబ్యాలెన్స్ వ్యూహం సులభంగానే కనిపిస్తుంది. కానీ దీనికి క్రమశిక్షణ కావాలి. అనుకున్న వ్యూహాలను అమలు చేయడానికి సరైన సమయం కావాలి. ఈక్విటీ మార్కెట్ ఎప్పుడు పతనమౌతుందో తెలియదు. స్టాక్స్ ధరలు ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటాయో ట్రాక్ చేయడం కష్టం. ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఎంట్రీ ఇవ్వడం సులువైన పనికాదు. అలాగే ప్రాఫిట్స్ను బుక్ చేసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. - నిమేష్ షా సీఈఓ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్