మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు.. | Nimesh Shah tells about Stocks Prices! | Sakshi
Sakshi News home page

మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..

Published Mon, Feb 22 2016 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..

మార్కెట్ అస్థిరతే పెట్టుబడికి అనువు..

మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియవు. అందుకే అవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. అవి బాగున్నా.. బాగోలేకున్నా.. మన ఇన్వెస్ట్‌మెంట్లను మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ఇప్పటి వరకు ఏమంత ఆశాజనకంగా లేవు. మార్కెట్లు బాగోలేనప్పుడే అందులో పెట్టుబడుల్ని చేయాలి. అప్పుడే అసలు ధర వద్ద స్టాక్స్ లభిస్తాయి. ఎప్పుడూ షేర్ల విలువ ఆధారంగా పెట్టుబడి కేటాయింపులు జరగాలి. ఏడాది ప్రారంభంలో పోర్ట్‌ఫోలియోను ఒకసారి సరిచూసుకొని ఇన్వెస్ట్‌మెంట్లను రెగ్యులర్‌గా కొనసాగించటానికి ప్రయత్నించాలి. మంచి పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఒక కళ.
 
అంచనాలకు అనుగుణంగా గతేడాది..
గతేడాది మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే  ఉంది. దేశ ఆర్థిక వృద్ధి మాత్రం మందగించింది. ఆర్‌బీఐ భావించినట్లుగానే వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ చర్య డెట్ (బాండ్ల) పోర్ట్‌ఫోలియోలకు బాగా అనుకూలించింది. మార్కెట్లు కూడా పర్వాలేదనిపించాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు మంచి పనితీరు కనబరచాయి.
 
ఈ ఏడాది సంగతేంటి?
ప్రస్తుత ఏడాదిలో చైనా ఆర్థిక మందగమనం, ముడి చమురు ధరల పతనం వంటి అంశాలు అంతర్జాతీయంగా ప్రభావాన్ని చూపనున్నాయి. ఏదేమైనప్పటికీ అంతర్జాతీయంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఇన్వెస్టర్లు ప్రస్తుత ఈక్విటీ మార్కెట్ల పనితీరు (అస్థిర త)ను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వడ్డీ రేట్లు అనువుగా ఉండటం, ద్రవ్యోల్బణం తక్కువ  స్థాయిలో ఉండటం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు ఉపయుక్తమైనవి. ఇక ఆర్‌బీఐ ఈ ఏడాది వడ్డీ రేట్లను మరో  50 బేసిస్ పాయింట్లు తగ్గేంచే అవకాశం ఉంది.
 
ఈక్విటీ ధరలు తగ్గుతున్నాయ్..
ఈక్విటీ షేరుధరలు తగ్గుతున్నాయి. ముఖ్యంగా లార్జ్ క్యాప్ విభాగంలో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది డైనమిక్ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అధిక ప్రాధాన్యమివ్వండి. అలాగే ఈక్విటీ ఫండ్స్‌తో పోలిస్తే మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకొని నిలబడే హైబ్రిడ్ ఫండ్స్ ఉత్తమం. ప్రస్తుతం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగాలు వాటి షేరువారీ ఆర్జన (ఈపీఎస్)తో పోలిస్తే 20 రెట్లు ధరకు (పీఈ) ట్రేడ్ అవుతున్నాయి.

అదే సమయంలో లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం 16 రెట్లకు ట్రేడ్ అవుతున్నాయి. అందువల్ల లార్జ్ క్యాప్ షేర్లు మంచి విలువకు లభిస్తున్నట్లు లెక్క. రంగాల వారీగా చూస్తే.. ఆటో, ఫైనాన్షియల్, ఐటీ రంగాలు ఆశాజనకంగా లేవు. ఫార్మా రంగ కంపెనీలు పర్వాలేదు. వాటి షేరు ధరలు ఒక స్థాయిలోనే ఉన్నాయి. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో మాత్రం అధిక విలువ ఉంది.
 
స్టాక్స్ ధరలు అనుకూలం
మార్కెట్ల పనితీరు దేశంలో వినియోగంపై ఆధారపడి ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్లు పెరిగితేనే మార్కెట్లు మంచి పని తీరును కనబరుస్తాయి. దీనికి సమయం పడుతుంది. కొందరు ఇన్వెస్టర్లు మార్కెట్లు మరింత పడే వరకు వేచి ఉంటారు. మార్కెట్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు.

ప్రస్తుత ధరలు పెట్టుబడులకు అనువుగా ఉన్నాయి. సిప్ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచుకునేటప్పుడు హైబ్రిడ్ ఫండ్స్‌కు తగిన ప్రాధాన్యమివ్వండి. అసలు ధరలకు స్టాక్స్ అం దుబాటులో ఉన్నప్పుడు వాటితో పోర్ట్‌ఫోలియోను మెరుగుపరచుకోవాలి. అసెట్స్ పెరిగే కొద్ది వాటి ప్రభావం దీర్ఘకాలంలో ఎక్కువగా ఉంటుంది. అసెట్స్‌ను పెంచుకోవడానికి ఈ ఏడాది అనుకూలం.

- నిమేశ్ షా
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్
మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement