
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్ చలసాని నియమితులయ్యారు. వరుసగా రెండు సార్లు సీఈవోగా వ్యవహరించిన ఎన్‌ఎస్ వెంకటేష్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. బ్యాంకింగ్, ట్రెజరీ విభాగంలో చలసానికి దాదాపు నాలుగు దశాబ్దాల అనుభవం ఉంది.
ఆయన ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐలో డిçప్యూటీ ఎండీగా వ్యవహరించడంతో పాటు ఆర్‌బీఐ, ఆర్థిక శాఖలు ఏర్పాటు చేసిన కమిటీల్లోనూ సభ్యుడిగా సేవలు అందించారు. దేశీ మ్యూచువల్ ఫండ్ వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా ఇటు పరిశ్రమ, అటు నియంత్రణ సంస్థతో కలిసి పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment