ఎన్‌పీఎస్ మాదిరే కల్పించాలి
బడ్జెట్‌పై ఆర్థిక మంత్రికి ‘యాంఫి’ వినతి
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్‌పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది.
బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం
డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది.
స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి..
స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment