Debt Funds
-
పెన్షన్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు
పెన్షన్ సదుపాయంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ పథకాలు, డెట్ ఫండ్స్ విషయంలో పన్ను ప్రయోజనాలు కలి్పంచాలంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. బడ్జెట్‌కు ముందు తమ డిమాండ్లను ఆర్థిక మంత్రికి దృష్టికి తీసుకెళ్లింది. జాతీయ పింఛను పథకం(ఎన్పీఎస్)లో పెట్టుబడులకు సెక్షన్ 80సీసీడీ కింద కలి్పస్తున్న పన్ను మినహాయింపును పెన్షన్ ప్రయోజనంతో కూడిన మ్యూచువల్ ఫండ్స్ (మ్యూచువల్ ఫండ్స్ లింక్డ్ రిటైర్మెంట్ స్కీమ్స్)కు సైతం అమలు చేయాలని కోరింది. అలాగే, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మూడేళ్లు, అంతకుమించిన పెట్టుబడులను ఉపసంహరించుకున్నప్పుడు.. వచి్చన లాభంపై డిబెంచర్లకు మాదిరే ఫ్లాట్ 10% పన్నును, ద్రవ్యోల్బణం మినహాయింపు ప్రయోజనం లేకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈక్విటీల్లో 35% వరకు పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌కు గతేడాది విధించిన స్వల్పకాల మూలధన లాభాల పన్నును తిరిగి పరిశీలించాలని కోరింది. బాండ్లలో పెట్టుబడులకు ప్రోత్సాహం డెట్ ఫండ్స్ ద్వారా బాండ్లలో పెట్టుబడులకు రిటైల్ ఇన్వెస్టర్లను ప్రోత్సహించాలని కూడా ఆర్థిక మంత్రిని యాంఫి కోరింది. డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలకు మాదిరే పన్ను రేట్లు అమలు చేయాలని, ఇందుకు ఫైనాన్స్ యాక్ట్, 2023లోని సెక్షన్ 50ఏఏను సవరించాలని వినతిపత్రంలో పేర్కొంది. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తేయాలి.. స్టార్టప్‌లపై ఏంజెల్ ట్యాక్స్ ఎత్తివేయాలంటూ పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) కేంద్ర ఆర్థిక శాఖకు సూచించింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో లిస్ట్ కాని స్టార్టప్‌లు జారీ చేసే షేర్ల విలువ మదింపునకు గాను డీపీఐఐటీ గతేడాది సెప్టెంబర్‌లో కొత్త నిబంధనలు తీసుకొచి్చంది. పారదర్శక మార్కెట్ విలువ కంటే అధిక ధరపై షేర్లు జారీ చేసే స్టార్టప్‌లు ఈ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని తొలగిస్తే స్టార్టప్‌లను ప్రోత్సహించినట్టు అవుతుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఈ మార్పులపై ఓ లుక్కేయండి!
ఆదాయపన్ను పరంగా ఏప్రిల్ 1 నుంచి కొన్ని కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. కొన్ని పన్ను మిహాయింపులు తొలగిపోగా.. కొన్ని సాధనాలకు సంబంధించి పెట్టుబడి పరిమితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతంతో పోలిస్తే ఆదాయపన్ను కొత్త విధానం మరింత ఆకర్షణీయంగా మారింది. ప్రధానంగా పన్నుల వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, పారదర్శకతను పెంచే లక్ష్యాలతో కేంద్ర సర్కారు ఎప్పటికప్పుడు కొత్త ప్రతిపాదనలు, సవరణలు తీసుకొస్తోంది. కనుక ఆదాయపన్ను పరిధిలోని ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన మార్పులను వివరించే కథనమిది... నూతన పన్ను విధానం... నూతన పన్ను విధానం ఎంపిక చేసుకునే వారికి వార్షిక ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే రూపాయి పన్ను చెల్లించే పని లేకుండా పన్ను రాయితీని ప్రభుత్వం కల్పించింది. సెక్షన్ 87ఏ కింద గరిష్టంగా రూ.25,000 రాయితీని ప్రకటించింది. అంటే నికరంగా రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను భారం ఉండదు. తక్కువ ఆదాయం కలిగిన వారికి ఉపశమనం కల్పించడమే ఈ రాయితీ ఉద్దేశ్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022–23 ఆర్థి క సంవత్సరం నుంచే ఈ రాయితీ అమల్లోకి వచ్చింది. ఈ రాయితీ వల్ల ఎక్కువ మందికి ప్రయోజనం లభించనుంది. ఒకవేళ ఆదాయం రూ.7లక్షలకు పైన స్వల్పంగా ఉన్నప్పుడు భారీగా పన్ను చెల్లించాల్సి వస్తోంది. దీన్ని అర్థం చేసుకున్న కేంద్ర సర్కారు ఆర్థిక బిల్లు 2023లో కొన్ని సవరణలు చేసింది. ఉదాహరణకు రూ.7 లక్షలకు పైన మరో రూ.5 వేల ఆదాయం ఉంటే అప్పుడు నిబంధనల కింద రూ.26,500 పన్ను (సెస్సులతో) చెల్లించాల్సి ఉంది. దీని స్థానంలో.. రూ.7లక్షలకు పైన అదనంగా ఉన్న రూ.5వేలపైనే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అలాగే, నూతన పన్ను విధానంలోనూ రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కల్పించారు. దీంతో నికరంగా రూ.7.50 లక్షల వరకు పన్ను భారం పడదు. నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లలోనూ మార్పులు చేశారు. 60 ఏళ్లలోపు వారికి రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3–6 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ.6–9 లక్షల ఆదాయంపై 10 శాతం పన్ను పడుతుంది. రూ.9–12 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం, రూ.15 లక్షల ఆదాయంపై 30 శాతం పన్ను రేటు వర్తిస్తుంది. బీమాపైనా పన్ను జీవిత బీమా పాలసీలకు చెల్లించే ప్రీమియంపైనే కాదు, గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తంపైనా పన్ను ఉండదనేది అందరికీ తెలిసిన విషయం. కానీ, 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన మార్పుల ప్రకారం.. జీవిత బీమా పాలసీలకు చెల్లించే వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉంటే.. పాలసీదారు జీవించి ఉన్న సందర్భాల్లో గడువు తీరిన తర్వాత అందుకునే మొత్తం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే అధిక ప్రీమియం పాలసీల మెచ్యూరిటీపై ఇప్పటి వరకు ఉన్న సున్నా పన్ను ప్రయోజనాన్ని సర్కారు తొలగించింది. వార్షిక ప్రీమియం రూ.5 లక్షల వరకు ఉండే పాలసీల మెచ్యూరిటీపై ఇక ముందూ పన్ను మినహాయింపు ప్రయోజనం కొనసాగుతుంది. అలాగే, 2023 మార్చి 31వరకు కొనుగోలు చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకు మించి ఉన్నా, చివర్లో అందుకునే మొత్తంపై పన్ను ఉండదు. అలాగే, పాలసీదారు మరణించిన సందర్భంలో చెల్లించే పరిహారంపైనా పన్ను ఉండదు. యులిప్ ప్లాన్ల ప్రీమియం ఎంత ఉన్నా కానీ, పన్ను పరిధిలోకి రావు. డెట్ ఫండ్స్‌పై కూడా... డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను మూడేళ్లపాటు కొనసాగించినప్పుడు వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం కిందకు వస్తుంది. వచ్చిన లాభం నుంచి పెట్టుబడి పెట్టిన కాలంలో సగటు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి, మిగిలిన లాభంపైనే 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోయేది. ఇది గతంలో ఉన్న విధానం. కానీ, ఈ ప్రయోజనాన్ని తొలగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతైనా కానీయండి, వచ్చే లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఏ శ్లాబు రేటు పరిధిలో ఉంటే, ఆ మేరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది. అంటే ప్రస్తుతం డెట్ ఫండ్స్‌లో అమల్లో ఉన్న స్వల్పకాల మూలధన లాభాల పన్ను విధానమే ఇక మీదట అన్ని రకాల డెట్ ఫండ్స్ లాభాలకు అమలవుతుంది. మొత్తానికి డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనాన్ని తొలగించారు. తద్వారా డెట్ ఫండ్స్‌లో దీర్ఘకాల పెట్టుబడులను నిరుత్సాహపరిచినట్టయింది. దీంతో దీర్ఘకాల పెట్టుబడులు జీవిత బీమా, ఈక్విటీ సాధనాల వైపు వెళతాయన్నది నిపుణుల అంచనాగా ఉంది. 2023 ఏప్రిల్ 1 నుంచి చేసే తాజా డెట్ పెట్టుబడులకు నూతన పన్ను విధానం అమలవుతుంది. 2023 మార్చి 31 వరకు చేసిన పెట్టుబడులకు కొత్త నిబంధన వర్తించదు. రిటర్నుల దాఖలు ఆదాయపన్ను రిటర్నులను దాఖలు చేసే వారు తప్పకుండా గమనించాల్సిన మార్పు ఒకటి ఉంది. పాత, కొత్త పన్ను విధానాలు ఉన్నప్పటికీ, నూతన పన్ను విధానమే డిఫాల్ట్‌గా కనిపిస్తుంది. పాత పన్ను విధానంలోనే కొనసాగాలని అనుకునేవారు రిటర్నులు దాఖలు చేసే ముందే దానిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నూతన పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువ. కానీ, చాలా వరకు పన్ను మినహాయింపులు, పన్ను తగ్గింపు ప్రయోజనాల్లేవు. అన్ని రకాల మినహాయింపు ప్రయోజనాలను ఉపయోగించుకునే వారికి పాత విధానం అనుకూలం. కనుక ఎవరికి వారు తమ వార్షిక ఆదాయం, పెట్టుబడుల ఆధారంగా ఏ పన్ను విధానం అనుకూలం అనేది ఎంపిక చేసుకోవాలి. ఈ విషయంలో స్పష్టత రాకపోతే పన్ను నిపుణుల సాయం తీసుకోవాలి. ఎస్సీఎస్ఎస్ పదవీ విరమణ పొందిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చి పెట్టే పెట్టుబడి పథకాల్లో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ ఆదాయం చెల్లిస్తారు. 60 ఏళ్లు నిండిన వ్యక్తులు ఎవరైనా ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులు అయితే 55–60 ఏళ్ల మధ్యలో ఉన్నా పెట్టుబడికి అర్హులు. ఈ పథకంలో ఒక్కరు గరిష్టంగా రూ.15 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉండగా, ఏప్రిల్ 1 నుంచి దీన్ని రూ.30 లక్షలకు పెంచారు. నగదు ఉపసంహరణలపై టీడీఎస్ బ్యాంకు ఖాతా నుంచి భారీగా నగదు ఉపసంహరణలను నిరుత్సాహ పరిచేందుకు గాను కేంద్ర సర్కారు మూలం వద్ద పన్ను మినహాయింపు (టీడీఎస్‌ను) ప్రవేశపెట్టింది. ఒక ఆర్థి క సంవత్సరంలో ఒక బ్యాంక్ ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు రూ.కోటి మించితే టీడీఎస్ కింద బ్యాంకులు 2 శాతాన్ని మినహాయిస్తాయి. వ్యక్తులు, వ్యాపార సంస్థలకూ ఇది అమలవుతుంది. ఎల్‌టీఏ ప్రభుత్వ ఉద్యోగులు కాని వారు సెలవులను నగదుగా మార్చుకునే మొత్తంపై పన్ను ప్రయోజనానికి పరిమితి ఉంది. 2002 నుంచి ఈ పరిమితి రూ.3 లక్షలుగా ఉంటే, దాన్ని రూ.25 లక్షలకు పెంచారు. అంటే సెలవులను నగదుగా మార్చుకునే మొత్తం రూ.25 లక్షలు ఉన్నా కానీ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (పీవో ఎంఐఎస్) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పథకం. ఈ పథకంలోనూ ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకునేందుకు అనుమతి ఉంటే, దీన్ని రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ అకౌంట్ కింద రూ.9 లక్షల పరిమితిని రూ.15 లక్షలు చేశారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను భారం బడ్జెట్లో అధిక సంపద కలిగిన వ్యక్తులకు సర్‌చార్జీ భారాన్ని తగ్గించారు. వార్షికాదాయం రూ.5 కోట్లకు పైన ఉన్న వారికి సర్‌చార్జీ 37 శాతం నుంచి 25 శాతానికి దిగొచ్చింది. కాకపోతే నూతన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకునే వారికే దీన్ని పరిమితం చేశారు. ఎన్పీఎస్ నుంచి వైదొలగాలంటే.. ఏప్రిల్ 1 నుంచి ఎన్పీఎస్ పథకం నుంచి వైదొలిగే లేదా యాన్యుటీ ఎంపిక చేసుకునే వారికి కేవైసీ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. పథకం నుంచి వైదొలిగిన సభ్యులకు వేగంగా యాన్యుటీ చెల్లింపుల చేసేందుకే ఈ ఆదేశాలు అమల్లోకి తెచ్చారు. ఎన్పీఎస్ ఎగ్జిట్ లేదా విత్ డ్రాయల్ ఫారమ్, గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ, బ్యాంక్ అకౌంట్ రుజువు, ప్రాన్ (పెన్షన్ అకౌంట్) కార్డ్ కాపీని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ సిస్టమ్‌లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అనారోగ్యం, వైకల్యం తదితర సందర్భాల్లో ఎన్పీఎస్ నుంచి 25 శాతం ఉపసంహరణకు అనుమతి ఉంది. ఆ సందర్భాల్లోనూ వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ–గోల్డ్ భౌతిక బంగారాన్ని ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్ (ఈజీఆర్) రూపంలోకి మార్చుకుంటే ఎలాంటి మూలధన లాభాల పన్ను పడదు. ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ గేమింగ్ ద్వారా గెలుచుకునే మొత్తంపై 30 శాతం టీడీఎస్ అమలు కానుంది. ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ ఈపీఎఫ్ ఖాతాకు పాన్ లింక్ చేయకపోతే.. సభ్యులు ఉపసంహరించుకునే మొత్తంపై 20 శాతం టీడీఎస్ అమలు చేస్తారు. ఇంటి మూలధన లాభంలో మార్పులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 54, 54 ఎఫ్ కింద ఒక ఇంటిని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేయడం ద్వారా పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఈ సెక్షన్ల కింద తిరిగి పెట్టుబడి పెట్టే మూలధన లాభాలను రూ.10 కోట్లకు పరిమితం చేశారు. అంటే ఇంతకు మించి మూలధన లాభం ఉంటే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ మహిళలకు 2023 బడ్జెట్లో కొత్తగా ప్రకటించిన పథకం ఇది. 2025 మార్చి వరకు ఈ పథకం ఉంటుంది. ఒక్కరు రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై 7.5% వడ్డీ రేటు చెల్లిస్తారు. గరిష్టంగా రెండేళ్లు డిపాజిట్ చేసుకోవచ్చు. బంగారం విక్రయం ఇలా.. హాల్ మార్క్ ఆభరణాలు, బంగారం వస్తువులను ఏప్రిల్ 1 నుంచి 6 నంబర్ల ఆల్ఫాన్యూమరిక్ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్‌యూఐడీ)తోనే విక్రయించాల్సి ఉంటుంది. హాల్ మార్క్ జ్యుయలరీ పట్ల వినియోగదారుల్లో విశ్వాసాన్ని ఇది పెంచనుంది. హెచ్‌యూఐడీ లేకుండా విక్రయించడాన్ని బీఐఎస్ నిషేధించింది. -
వైవిధ్యమే పెట్టుబడులకు రక్ష
రిటైల్ ఇన్వెస్టర్లలో చాలా మందికి పరుగెత్తే కుందేలు అంటేనే ఇష్టం. తాబేలు వైపు చూసేది చాలా కొద్ది మందే. కానీ, అడవి అన్న తర్వాత అన్ని జంతువులకూ నీడనిచ్చిన మాదిరే.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లోనూ ఒకటికి మించిన సాధనాలకు చోటు కల్పించాలి. ఇక్కడ కుందేలు అంటే ఈక్విటీ మార్కెట్. తాబేలు అంటే డెట్, గోల్డ్ అని చెప్పుకోవచ్చు. దీర్ఘకాలంలో ఈక్విటీలలో వచ్చినంత రాబడి మరే సాధనంలోనూ ఉంటుందని చెప్పలేం. కానీ, అన్ని కాలాలకూ, పెట్టుబడులు అన్నింటికీ ఈక్విటీ ఒక్కటే వేదిక కాకూడదు. ఏదైనా సంక్షోభం ఎదురైతే.. వేరే సాధనంలోని పెట్టుబడులు కొంత రక్షణనిస్తాయి. ఇన్వెస్టర్లు తమ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీతోపాటు ఇతర సాధనాల మధ్య కూడా కొంత పెట్టుబడులను వైవిధ్యంగా చేసుకోవాలి. అప్పుడే పెట్టుబడుల ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ వివరాలన్నీ తెలియజేసే కథనమిది... ఈక్విటీ, డెట్ మార్కెట్లలో గతేడాది నుంచి అస్థిరతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఏడాది దాటిపోయింది. అన్ని దేశాలూ ద్రవ్యోల్బణ రిస్క్‌ను ఎదుర్కొంటున్నాయి. కంపెనీల మార్జిన్లపై దీని ప్రభావం గణనీయంగానే ఉంది. ద్రవ్యోల్బణాన్ని కిందకు దించేందుకు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు ఆయుధాన్ని నమ్ముకున్నాయి. మన దగ్గరా గతేడాది మే నుంచి రెపో రేటు 2.5 శాతం పెరిగింది. అమెరికా, యూరప్ మాంద్యం ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగాలకు కోతలు పడుతున్నాయి. ఒకవైపు ఈక్విటీ, డెట్ మార్కెట్లు ఆటుపోట్లు చూస్తుంటే.. మరోవైపు బంగారం, వెండి గడిచిన ఏడాది కాలంలో మంచి ర్యాలీని చూశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు మెరుగైన పెట్టుబడుల విధానమే అస్సెట్ అలోకేషన్. అంటే ఒకే విభాగం కాకుండా, ఒకటికి మించిన సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం. ఒక్కో విభాగం ఒక్కో రీతిలో పనితీరు చూపిస్తుంటుంది. కనుక అస్సెట్ అలోకేషన్‌తో దీర్ఘకాలంలో మంచి ప్రతిఫలాన్ని చూడొచ్చు. అంతేకాదు పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను (ఒక్క బాక్సులోనే అన్ని గుడ్లు పెట్టడం)ను తగ్గించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)కూడా పెట్టుబడుల వైవిధ్యానికి అందుబాటులో ఉన్న సాధనాలు. గత పదిహేనేళ్ల కాలంలో వివిధ సాధనాలు ఎలా పనిచేశాయి? వైవిధ్యం ఏ విధంగా నష్టాలను పరిమితం చేసి, మెరుగైన రాబడులు ఇచ్చిందన్నది అర్థం చేసుకోవాలంటే కొన్ని గణాంకాలను విశ్లేషించుకోవాల్సిందే. పనితీరు ఇలా.. 2006 నుంచి 2022 వరకు డేటాను పరిశీలిస్తే.. ఈక్విటీ, డెట్, గోల్డ్, వెండి ఎలా ర్యాలీ చేసిందీ తెలుస్తుంది. 2006లో ఈక్విటీ 41.9 శాతం, 2007లో 56.8 శాతం చొప్పున ర్యాలీ చేసింది. డెట్ ఆ రెండు సంవత్సరాల్లో ఒకే అంకె రాబడులను ఇచ్చింది. బంగారం స్వల్పంగా లాభాలను ఇచ్చింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2008లో ఈక్విటీ మార్కెట్ 51 శాతం పడిపోయింది. కానీ, బంగారం అదే ఏడాది 26.1 శాతం ర్యాలీ చేసింది. 2011లో యూరోజోన్ సంక్షోభం తలెత్తింది. దీంతో ఈక్విటీ మార్కెట్ 23.8 శాతం పడిపోయింది. కానీ, బంగారం 31.7 శాతం రాబడులను ఇచ్చింది. డెట్‌లో రాబడి 8 శాతంగా ఉంది. అంతెందుకు కరోనా సంవత్సరం 2020లోనూ ఈక్విటీ మార్కెట్ 50 శాతం వరకు పడిపోగా, అంతే వేగంగా రివకరీ అయి, ఆ ఏడాది నికరంగా 16%రాబడినిచ్చింది. అదే ఏడాది బంగారం 28% రాబడులను ఇచ్చింది. 2021లో బంగారం నికరంగా నష్టాలను మిగల్చితే.. ఈక్విటీలు రాబడులు మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడి గణాంకాలను పరిశీలిస్తే, అన్ని సాధనాలు ఒకే తీరులో కాకుండా.. భిన్న సమయాల్లో భిన్నమార్గంలో చలిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. అందుకనే పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ చోటు ఇవ్వాలని చెప్పేది. ఇక్కడ బంగారం రాబడికి ఎంసీఎక్స్, బాండ్ల పనితీరునకు క్రిసిల్ షార్ట్ టర్మ్ ఇండెక్స్ గణాంకాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. పెట్టుబడుల మిశ్రమం వైవిధ్యం కోసం ఈక్విటీలకు తోడుగా ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల (డెట్) వరకే పరిమితం కాకూడదు. ఈక్విటీ, డెట్‌కు తోడు బంగారం కూడా జోడించుకోవడం మెరుగైన విధానమని చెప్పుకోవచ్చు. కేవలం ఈక్విటీ, డెట్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోతో పోలిస్తే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలోనే మెరుగైన రాబడులు ఉన్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2002 నుంచి 2022 వరకు ఈ సాధనాల్లో మూడేళ్ల రోలింగ్ రాబడులను గమనించినట్టయితే.. 65:35 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో 67.2 శాతం సమయంలో 10 శాతానికి పైగా వార్షిక రాబడులను ఇచ్చింది. అదే 65:20:15 నిష్పత్తిలో ఈక్విటీ, డెట్, గోల్డ్ పోర్ట్‌ఫోలియో మాత్రం 71.7% కాలంలో 10 శాతానికి పైనే రాబడులను ఇచ్చింది. కానీ, గత 20 ఏళ్ల కాలంలో ఈక్విటీ, డెట్ పోర్ట్‌ఫోలియో వార్షిక రాబడి 14.3 శాతంగా ఉంటే, ఈక్విటీ, డెట్, గోల్డ్‌తో కూడిన పోర్ట్‌ఫోలియోలో రాబడి 15.4 శాతం చొప్పున ఉంది. ఈక్వటీ, డెట్‌కు బంగారాన్ని జోడించుకోవడం వల్ల ఒక శాతం అదనపు రాబడులు కనిపిస్తున్నాయి. మల్టీ అస్సెట్ పోర్ట్‌ఫోలియో రిస్క్‌ను అధిగమించి దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇచ్చాయి. మిశ్రమ పోర్ట్‌ఫోలియో వల్ల మూడేళ్లకు మించిన కాలంలో ప్రతికూల రాబడులకూ అవకాశం దాదాపుగా ఉండదు. గత ఐదేళ్లలో మల్టీ అస్సెట్ పథకాలు, అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. ఎంత చొప్పున.. అస్సెట్ అలోకేషన్ విషయంలో ఏ సాధనానికి ఎంత పెట్టుబడులు కేటాయించాలన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఇది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల కాలం, రాబడుల అంచనాల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అందరికీ ఒక్కటే ప్రామాణిక సూత్రం పనిచేయదు. యుక్త వయసులో ఉన్న వారు ఈక్విటీలకు ఎక్కువ కేటాయింపులు చేసుకోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళ్లాలి. అదే సమయంలో డెట్, గోల్డ్‌కు కేటాయింపులు పెంచుకుంటూ వెళ్లాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా కొంత మేర పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం నుంచి పెట్టుబడులకు రక్షణతోపాటు, మెరుగైన రాబడులను సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. 100 నుంచి ఇన్వెస్టర్ తన వయసును తీసివేయగా, మిగిలేంత ఈక్విటీలకు కేటాయించుకోవచ్చన్నది ఒక సూత్రం. ఉదాహరణకు 30 ఏళ్ల ఇన్వెస్టర్ 70 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలకు తప్పనిసరిగా మెజారిటీ పెట్టుబడులు కేటాయించుకోవడం అవసరం. దీర్ఘకాలంలో (7 ఏళ్లకు మించి) ఈక్విటీలు సగటున రెండంకెల రాబడులను ఇచ్చాయి. ఇక ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు (డెట్) స్థిరమైన రాబడులకు మార్గం అవుతుంది. వైవిధ్యంతోపాటు, నష్టాలకు అవకాశం ఉండదు. బంగారం అన్నది ద్రవ్యోల్బణానికి హెడ్జింగ్‌గా అనుకూలిస్తుంది. ఈక్విటీలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో అండగా నిలిచే సాధనం ఇది. బంగారం కేవలం హెడ్జింగ్ కోసమే కాకుండా, దీర్ఘకాలంలో డెట్‌కు మించి రాబడులను ఇవ్వగలదని గణాంకాలు చెబుతున్నాయి. 2006 నుంచి 2012 మధ్య కాలంలో రెండంకెల వార్షిక రాబడులను ఇచ్చింది. కానీ, ఆ తర్వాత 2013 నుంచి 2015 వరకు నష్టాలను ఎదుర్కొన్నది. ఇక వెండి అన్నది పారిశ్రామిక కమోడిటీ. ఎలక్ట్రానిక్స్, బ్యాటరీలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెళ్లలో దీని అవసరం ఉంటుంది. ఈ రంగాలు వృద్ధి చెందే కొద్దీ వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ బలమైన పనితీరు చూపిస్తున్న దశలో వెండికి డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ వెండిలోనూ ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి ఉంటే సిల్వర్ ఈటీఎఫ్‌లకు 5 శాతం లోపు కేటాయింపులను పరిశీలించొచ్చు. బంగారం కోసం సావరీన్ గోల్డ్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం మెరుగైన పెట్టుబడి సాధనం కాబోదు. నేరుగా ఇన్వెస్ట్ చేసుకునే ఆసక్తి లేకపోయినా లేదా అంత పరిజ్ఞానం లేకపోయినా నిరాశ పడక్కర్లేదు. మార్కెట్లో మెరుగైన మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడాన్ని పరిశీలించొచ్చు. మల్టీ అస్సెట్ పథకాలు చాలా వరకు ఈక్విటీ, డెట్, బంగారానికి 65:20:15 నిష్పత్తిలో పెట్టుబడులు కేటాయిస్తుంటాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ మల్టీ అస్సెట్ అలోకేషన్, హెచ్డీఎఫ్సీ మల్టీ అస్సెట్, ఎస్బీఐ మల్టీ అస్సెట్ తదితర పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఇంట్లో పెళ్లి కోసం.. తక్కువ రిస్క్‌తో ఈ మార్గంలో ఇన్వెస్ట్ చేయండి!
నేను నా సోదరి వివాహం కోసం ప్రతి నెలా రూ.45,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లలోనా? మన దేశంలో వివాహాలు సాధారణంగా చూస్తే తక్కువ ఖర్చుతో ముగిసేవి కావు. మీరు అనుకుంటున్నట్టు ప్రతి నెలా రూ.45,000 చొప్పున వచ్చే ఆరేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసినట్టయితే గణనీయమైన మొత్తమే సమకూరుతుంది. వివాహం లక్ష్యం విషయంలో రాజీపడలేం. అనుకున్న సమయానికి కావాల్సినంత చేతికి అందాల్సిందే. వాయిదా వేయడానికి ఉండదు. తక్కువ రిస్క్ కోరుకునే వారు అయితే మధ్యస్థ మార్గాన్ని అనుసరించాలి. అందుకుని 50 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల పెట్టుబడికి రిస్క్ ఉండదు. మిగిలిన 50 శాతాన్ని వృద్ధి కోసం ఈక్విటీలకు కేటాయించుకోవాలి. డెట్ విషయంలో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ లేదా టార్గెట్ మెచ్యూరిటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులకు లార్జ్‌క్యాప్ ఫండ్స్ లేదా లో కాస్ట్ ఇండెక్స్ ఫండ్స్ నుంచి ఎంపిక చేసుకోవాలి. ఒకవేళ ఈ పెట్టుబడి మీ పోర్ట్‌ఫోలియో పరంగా చూస్తే స్వల్ప మొత్తం అయి, అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే.. అప్పుడు కాస్త దూకుడుగా పెట్టుబడుల సాధనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆటుపోట్లను తట్టుకునేట్టు అయితే ఈక్విటీలకు 65 శాతం నుంచి 80 శాతాన్ని కేటాయించుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని డెట్ సాధనాలకు కేటాయించుకోవాలి. బంగారం కోసమే అయితే సార్వభౌమ బంగారం బాండ్లలో (ఎస్‌జీబీలు) కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బంగారం విలువ పెరుగుదలకు తోడు, పెట్టుబడి విలువపై ఏటా 2.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ బంగారంతో సోదరి పెళ్లి సమయంలో ఆభరణాలు చేయించొచ్చు. ‘‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ స్టాక్ స్ప్లిట్‌నకు గురవుతోంది. రూ.10 ముఖ విలువ నుంచి రూ.1కు తగ్గనుంది. ఇందుకు సంబంధించి రికార్డు తేదీ సెప్టెంబర్ 02, 2022’’ అంటూ నాకు మెస్సేజ్ వచ్చింది. అంటే దీనర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్‌గా దీనివల్ల నాకు ఏం జరగనుంది? దయచేసి వివరాలు తెలియజేయగలరు. సాధారణంగా ఫండ్ హౌస్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిక్విడిటీ (లభ్యత) పెంపునుకు వీలుగా స్టాక్ స్ప్లిట్ ప్రకటిస్తుంటాయి. దీనివల్ల సదరు ఈటీఎఫ్ యూనిట్ విలువ మరింత తగ్గి చిన్న ఇన్వెస్టర్లకు కూడా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది. నిబంధనల ప్రకారం ఈటీఎఫ్ యూనిట్లను స్టాక్ ఎక్స్ఛేంజ్లలో లిస్ట్ చేయడం తప్పనిసరి. ఒక ఇన్వెస్టర్‌గా ఇలాంటి నిర్ణయాల వల్ల పెట్టుబడులకు సంబంధించి జరిగే మార్పు ఏమీ ఉండదు. ఈటీఎఫ్ ముఖ విలువ తగ్గడం వల్ల యూనిట్ ఎన్ఏవీ కూడా తగ్గుతుంది. అదే సమయంలో యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఉదాహరణకు మీకు రూ.10 ముఖ విలువ కలిగిన 100 యూనిట్లు ఉన్నాయని అనుకుందాం. రూ.1 ముఖ విలువకు యూనిట్‌ను స్ప్లిట్ చేయడం వల్ల అప్పుడు మీ వద్దనున్న 100 యూనిట్లు కాస్తా 1,000 యూనిట్లకు పెరుగుతాయి. కొత్త యూనిట్లు రికార్డు తేదీ తర్వాత మీ ఖాతాకు జమ అవుతాయి. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
రిస్క్ తీసుకోవడం ఇష్టం లేదా, అయితే ఇందులో పెట్టుబడులే సురక్షితం!
రిస్క్ పెద్దగా ఉండొద్దని కోరుకునే వారికి షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలం. తక్కువ రిస్క్ తీసుకునే వారికి, స్వల్పకాలం కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకం భిన్నమైన పెట్టుబడుల విధానంతో, మంచి పనితీరు చూపిస్తోంది. రాబడులు షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోల్చి చూడొచ్చు. ఈ పథకంలో గడిచిన ఏడాది కాలంలో వచ్చిన రాబడి 4 శాతంగా ఉంది. అదే మూడేళ్లు అంతకుమించిన కాలాల్లో చూసినప్పుడు సగటు రాబడి 7 శాతానికి పైన ఉండడాన్ని గమనించాలి. మూడేళ్ల కాలంలో 7.42 శాతం, ఐదేళ్లలో 7.32 శాతం, ఏడేళ్లలో 7.65 శాతం, పదేళ్లలో 8.23 శాతం చొప్పున రాబడులను ఈ పథకం ఇన్వెస్టర్లకు అందించింది. 2010 జూన్ లో ఈ పథకం ఆరంభం కాగా, నాటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడి రేటు 8.31 శాతంగా ఉండడం గమనార్హం. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.14,634 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఎక్స్పెన్స్ రేషియో 0.74 శాతంగా ఉంది. మొత్తం సెక్యూరిటీలు 146 ఉన్నాయి. సగటు మెచ్యూరిటీ 2.76 సంవత్సరాలుగా ఉంది. అధిక నాణ్యతను సూచించే ఏఏఏ రేటెడ్ బాండ్లలో 50 శాతం పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వ సెక్యూరిటీల్లో 22.48 శాతం ఇన్వెస్ట్ చేసింది. కొంచెం రిస్క్ ఉంటే ఏఏ రేటెడ్ పత్రాల్లో 15.55 శాతం, ఇంకాస్త అధిక రిస్క్‌ను సూచించే ఏ1ప్లస్ పత్రాల్లో 5 శాతం చొప్పున (అధిక రాబడులు) ఇన్వెస్ట్ చేసింది. 7.22 శాతం మేర నగదు నిల్వలు కలిగి ఉంది. పెట్టుబడుల విధానం ఈ పథకానికి అనిల్ బంబోలి మేనేజర్‌గా పనిచేస్తున్నారు. రిస్క్ తక్కువగా ఉండే విధంగా పెట్టుబడులు పెట్టడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉంది. ఎక్కువ క్రెడిట్ రిస్క్ తీసుకోకుండా మంచి రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంటారు. డ్యురేషన్ బెట్స్ (కాలవ్యవధికి సంబంధించి సెక్యూరిటీలు)కాకుండా..మంచి విలువ తెచ్చిపెడతాయనుకున్న సెక్యూరిటీలను ఎంచుకుంటారు. లోతైన పరిశోధన తర్వాతే సెక్యూరిటీల ఎంపిక ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆయా డెట్ పత్రాలను ఇష్యూ చేస్తున్న కంపెనీ యాజమాన్యం, ఆర్థిక మూలాలు, వ్యాపార బలలాను విశ్లేషించిన తర్వాతే పెట్టుబడుల నిర్ణయం ఉంటుంది. ప్రధానంగా ఆయా కంపెనీలు తిరిగి చెల్లింపులు చేయగలుగుతాయా? అన్నది చూస్తారు. కంపెనీల నగదు ప్రవాహాలు (వ్యాపార ఆరోగ్యాన్ని సూచించేది), ఇతర రేషియోలను కూడా ఈ పథకం పరిశోధన బృందం విశ్లేషిస్తుంది. ఇందుకోసం ఈక్విటీ పథకాల పరిశోధన బృందం అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇవన్నీ చూసిన తర్వాతే కంపెనీల డెట్ పేపర్ల నాణ్యతపై నిర్ణయానికొస్తారు. భద్రత, ఆయా సెక్యూరిటీల్లో లిక్విడిటీ అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు. స్వల్పకాలం నుంచి మధ్యకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. -
డెట్ ఇష్యూల్లో రూ.5 లక్షల వరకు పెట్టుబడులకు యూపీఐ
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ ద్వారా డెట్ సెక్యూరిటీల పబ్లిక్ ఇష్యూల్లో ఇక మీదట రూ.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి రూ.2లక్షల వరకే ఉంది. మే 1 నుంచి ప్రారంభమయ్య డెట్ ఇష్యూలకు నూతన నిబంధన అమలు కానుంది. ఈ మేరకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రిటైల్ ఇన్వెస్టర్లు రూ.2లక్షల వరకు పెట్టుబడికి యూపీఐ ఆధారిత ‘బ్లాక్ ఫండ్స్’ ఆప్షన్‌తో డెట్ ఇష్యూల్లో పాల్గొనేందుకు అనుమతి ఉంది. అంటే ఆయా నిధులు బ్యాంకు ఖాతాల్లోనే ఉండి ఇష్యూ అలాట్మెంట్ ముగిసే వరకు బ్లాక్‌లో ఉంటాయి. సెక్యూరిటీలు కేటాయిస్తే ఆ మేరకు పెట్టుబడి మొత్తం డెబిట్ అవుతుంది. లేదంటే ఖాతాలోనే అన్‌బ్లాక్ అవుతాయి. పెట్టుబడులు సులభంగా మార్చేందుకు భాగస్వాములతో సంప్రదించిన మీదట ఈ పరిమితిని రూ.5లక్షలకు పెంచుతున్నట్టు సెబీ తెలిపింది. దీంతో బ్లాక్ ఫండ్స్ ఆప్షన్‌తో రూ.5లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చని పేర్కొంది. -
మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలేమిటి?
కరోనా మహమ్మారి తర్వాత తమ డబ్బును ఖర్చు చేయకుండా, మంచి రాబడి ఇచ్చే వాటిలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారు. అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలని తెగ ఆలోచిస్తుంటారు. ఈ మధ్య పెట్టుబడికి మ్యూచువల్ ఫండ్ ఒక మంచి ఎంపిక అని నిపుణులు ఎక్కువగా చెబుతున్నారు. ఇందులో రాబడి కూడా స్థిరంగా వస్తుంది. అలాగే, స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అంతేకాదు, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో పూర్తిగా తెలియని వారు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. అందుకే, పెట్టుబడి పెట్టే ముందు మ్యూచువల్ ఫండ్ గురుంచి తెలుసుకోవడం చాలా ముఖ్యం. పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే లాభాలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్ అంటే పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించి స్టాక్‌లు, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి మొదలైన వివిధ రకాల ఆస్తులలో పెట్టుబడి పెట్టే ఒక రకమైన పెట్టుబడి పథకం. ఫండ్ మేనేజర్లు అని పిలిచే ప్రొఫెషనల్ ఇన్వెస్ట్ మెంట్ మేనేజర్లు మ్యూచువల్ ఫండ్స్ నిర్వహిస్తారు. మీ తరుపున మార్కెట్ గురించి మంచి జ్ఞానం ఉన్న ఆర్ధిక నిపుణులు మనకు లాభాలను తెచ్చిపెట్టే ఫండ్‌లో మీ డబ్బును పెట్టుబడి పెడతారు. ఈ నిపుణులు పెట్టుబడిదారుల తరఫున సెక్యూరిటీలను కొనుగోలు చేసి విక్రయిస్తాడు. ఈ కంపెనీలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారుల నుండి కమీషన్లు తీసుకుంటాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం గురించి పెద్దగా తెలియని వారికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడికి మంచి ఎంపిక. మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఫైనాన్షియల్ సంస్థలు వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. స్కీమ్ రకం, ఫండ్ లక్ష్యాలు, పెట్టుబడి పెట్టిన ఆస్తులు మొదలైన వాటి ఆధారంగా వీటిని అనేక కేటగిరీలుగా వర్గీకరించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్: ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతుంటే దాన్ని ఈక్విటీ ఫండ్ అంటారు. వీటిపై మార్కెట్ రిస్క్‌తో పాటు రాబడి కూడా అధికంగా ఉంటుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్: ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్స్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. డెట్ ఫండ్స్ విషయంలో కంపెనీలు కార్పొరేట్, ప్రభుత్వ బాండ్లు వంటి రిస్క్ తక్కువగా ఉండే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ మ్యూచువల్ ఫండ్లలో రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే వీటిలో లాభాలు ఎక్కువగా ఉండవు. డెట్ ఫండ్స్‌లో ఫిక్స్డ్ రిటర్న్‌లతోపాటు డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వారు ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. కానీ తక్కువ సమయంలో సురక్షితమైన పెట్టుబడికి డెట్ ఫండ్స్ మంచి ఆప్షన్. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్: కొన్ని కంపెనీలు షేర్లలో కొంత మొత్తాన్ని, డెట్ సెక్యూరిటీలలో కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలాంటి పథకాలను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇతర మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫండ్ కంపెనీ పెట్టుబడి పెట్టే షేర్ల రకాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్‌లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ లేదా మల్టీ క్యాప్ రకాలు కూడా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ వల్ల కలిగే ప్రయోజనాలు మ్యూచువల్ ఫండ్ వల్ల ప్రయోజనం ఏమిటంటే, ఇక్కడ మీ పెట్టుబడిని ఫండ్ మేనేజర్ నిర్వహిస్తారు, అతను మార్కెట్ గురించి మంచి అవగాహన కలిగి ఉంటాడు. అటువంటి పరిస్థితిలో, అతను మీ డబ్బును ఆలోచనాత్మకంగా పెట్టుబడి పెడతాడు, అక్కడ రాబడి మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో, మీ పోర్ట్‌ఫోలియో మ్యూచువల్ ఫండ్ల ద్వారా వైవిధ్యభరితంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ, కేవలం ఒక వాటాకు బదులుగా, డబ్బును వేర్వేరు వాటాలలో లేదా ఆస్తి తరగతిలో ఉంచారు. ఒకదానిలో ప్రమాదం ఉంటే, అది మరొకదాని ద్వారా భర్తీ చేస్తూ ఉంటుంది. మీ డబ్బు డెట్ ఫండ్లలో కూడా పెట్టుబడి పెట్టబడింది, కాబట్టి మార్కెట్ అస్థిరత ఉన్నప్పటికీ, డబ్బు ఇప్పటికీ సురక్షితంగా ఉంది. మీరు పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తంపై పరిమితి లేనప్పటికీ, రూ. 500 కంటే తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ప్రారంభించవచ్చు. అయితే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడుల విషయంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు(ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం) మాత్రమే మీరు పన్ను ప్రయోజనాన్ని పొందుతారని గుర్తుంచుకోండి. మీరు పెట్టుబడి పెట్టిన మొత్తంలో గరిష్టంగా కమిషన్ 2.5%(సెబీ నిబంధనల ప్రకారం) వరకు తీసుకుంటాయి. -
మెజారిటీ ఇన్వెస్టర్ల ఆమోదం అవసరమే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాలను మూసివేయాలంటే అందుకు మెజారిటీ యూనిట్ హోల్డర్ల (ఆయా పథకాల్లో పెట్టుబడిదారులు) ఆమోదం అవసరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఫ్రాంక్లిన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ గతేడాది ఏప్రిల్‌లో ఆరు డెట్ పథకాలను మూసివేస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం విచారిస్తోంది. పథకాల మూసివేతకు కారణాలను తెలియజేస్తూ నోటీసును విడుదల చేసి.. మెజారిటీ యూనిట్ హోల్డర్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ ట్రస్టీలు నిబంధనలను ఉల్లంఘిస్తుంటే జోక్యం చేసుకునే అధికారాలు సెబీకి ఉన్నాయని స్పష్టం చేసింది. ఇన్వెస్టర్ల సమ్మతి లేకుండా డెట్ పథకాలను మూసివేయడం కుదరదంటూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ ట్రస్టీలు లేదా ఏఎంసీలు నిబంధనలకు కట్టుబడి లేకపోతే జోక్యం చేసుకుని ఆదేశాలు ఇచ్చే అధికారం సెబీకి ఉందని తేల్చి చెప్పింది. ఈ ఆదేశాలను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇదే అంశంపై దాఖలైన పలు ఇతర వ్యాజ్యాలపై సుప్రీం విచారణ చేపట్టింది. దీంతో జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నిబంధనలపై వివరణ ఇచ్చింది. యూనిట్ హోల్డర్ల అనుమతి అవసరం అంటూ సెబీ నిబంధనలు 18 (15)(సీ), 39(3)లను ధర్మాసనం ప్రస్తావించింది. నిబంధనల ఉల్లంఘన చోటుచేసుకున్నందున విచారణ, దర్యాప్తు చేసే అధికారం సెబీకి ఉంటుందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఇప్పటికే వాటాదారుల ఆమోదం పొందింది. ఆరు డెట్ పథకాల పరిధిలో రూ.25,000 కోట్ల నిధులకు గాను మెజారిటీ మొత్తాన్ని ఇన్వెస్టర్లకు చెల్లింపులు కూడా చేసింది. షిప్పింగ్ సబ్సిడీ స్కీముకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ: భారత్‌లో నమోదు చేయించుకునేలా షిప్పింగ్ కంపెనీలను ఆకర్షించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 72 గంటల్లోనే నమోదు ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన ఉత్పత్తుల దిగుమతికి సంబంధించి అంతర్జాతీయ టెండర్లలో పాల్గొనే దేశీ షిప్పింగ్ కంపెనీలకు రూ. 1,624 కోట్ల సబ్సిడీ కల్పించే స్కీమునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. అయిదేళ్ల పాటు ఇది వర్తిస్తుంది. -
డెట్ ఫండ్స్..తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి!
‘ఈక్విటీల్లో అధిక రిస్క్ ఉంటుంది’.. తరచుగా ఈ మాట వింటుంటాం. నిజానికి రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ మాటకొస్తే డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ ఉంటుంది. ఈక్విటీలను మించిన రిస్క్ డెట్ ఫండ్స్‌లోనూ ఉంటుందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాల మూసివేత ఉదంతాన్ని పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈక్విటీల్లో రిస్క్.. డెట్‌లో రిస్క్ లేదన్న అపోహలు వీడాలి. పెట్టుబడులకు ముందే ప్రతీ సాధనాన్ని అర్థంచేసుకునేందుకు ప్రయత్నిస్తే రిస్క్పాళ్లు తెలుస్తాయి. తెలుసుకోకుండా ఏదేనీ సాధనంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటే ఎన్నో ఆకాంక్షలతో చేసిన పెట్టుబడులను తిరిగి పొందడం ఆశగానే మిగిలిపోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిపుణుల ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కనుక.. పెట్టుబడులు సురక్షితం అనుకోవద్దు. వారు సైతం తప్పటడుగులు వేయొచ్చు. నియంత్రణ సంస్థలు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను అన్ని సందర్భాల్లోనూ కాపాడతాయనుకోలేము. ఇన్వెస్టర్లే తగిన ముందస్తు అధ్యయనం, జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే వారి పెట్టుబడులకు రక్షణ సాధ్యపడుతుంది. సెబీ ఇటీవలి ఆదేశాలను పరిశీలిస్తే.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం నుంచి ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన అనుభవాలు కొన్ని కనిపిస్తాయి. ఆ వివరాలే ఈవారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనంలో... 2018లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మ్యూచువల్ ఫండ్స్ విభాగాలకు (కేటగిరీలు) సంబంధించి పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలను 36 విభాగాలుగా వర్గీకరించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు తమకు అనువైన పథకాలను సులభంగా ఎంపిక చేసుకోవచ్చన్నది సెబీ ఉద్దేశం. పథకాల పెట్టుబడుల విధానం పేరులో ప్రతిఫలించేలా సెబీ నాడు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ వాస్తవంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పెట్టుబడులు వాటి పేరును ప్రతిఫలించడం లేదనే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీరు నిరూపించింది. అందుకే పేరును చూసి మోసపోవద్దు. ఆ పథకం పెట్టుబడుల విధానం ఆయా విభాగం పరిధికి అనుగుణంగా ఉన్నదీ, లేనిదీ ఇన్వెస్టర్లు విచారించుకోవాలి. లో డ్యూరేషన్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్, లాంగ్డ్యూరేషన్ ఫండ్స్ ఇలా ఎన్నో డెట్ విభాగాలున్నాయి. ఇవన్నీ కూడా తక్కువ రిస్క్ ఉండేవే. కానీ, అసలు రిస్క్ అన్నది ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకునే డెట్ పేపర్లపైనే ఆధారపడి ఉంటుంది. ఫండ్ నిర్వహణ సంస్థ తక్కువ రిస్క్ ఉండే డెట్ పేపర్లనే అన్ని కాలాల్లోనూ ఎంపిక చేసుకుంటుందని నమ్మడానికి లేదు. అధిక రాబడుల కోసం నాణ్యతలేమి డెట్ పేపర్లలోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అదే చేసింది. పరిమితికి మించి పెట్టుబడుల్లో రిస్క్ తీసుకుంది. సాధారణంగా ఏఏ అంతకంటే దిగువ రేటింగ్ పేపర్లలో క్రెడిట్ రిస్క్ ఉంటుంది. అంటే డిఫాల్ట్ రిస్క్ ఉంటుంది. అందుకే ఆయా డెట్ పేపర్లను జారీ చేసే సంస్థలు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లకు అధిక రాబడులను ఆఫర్ చేసే ఉద్దేశంతో 2019 డిసెంబర్ నాటికి ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ 84 శాతం పెట్టుబడులను తీసుకెళ్లి ఏఏ, అంతకంటే తక్కువ రేటింగ్ పేపర్లలో పెట్టేసింది. అలాగే, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ పథకం కింద పెట్టుబడుల్లోనూ 80 శాతాన్ని అధిక రిస్క్ ఉండే పేపర్లలో ఇన్వెస్ట్ చేసింది. కానీ ఈ పథకాల పేర్లలో క్రెడిట్ రిస్క్ లేదన్నది గమనించాలి. ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్ 86 శాతం పెట్టుబడులను ఏఏ అంతకు దిగువ పేపర్లలో ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. క్రెడిట్ రిస్క్ అని పేరులోనే ఉంది కనుక ఇలా ఇన్వెస్ట్ చేయడంలో అర్థం ఉంది. కానీ, లో డ్యూరేషన్, షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ప్లాన్ విషయంలోనూ అదే విధంగా పెట్టుబడుల విధానాన్ని పాటించి తప్పు చేసింది. ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్ సైతం అదే తోవలో నడిచాయి. సెబీ కేటగిరీ నిబంధనలను ఏ మాత్రం పాటించలేదన్న విషయం ఇక్కడ తేటతెల్లమవుతోంది. అందుకే ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకునే ముందు కేవలం పేరు, విభాగానికే పరిమితం కావద్దు. వాటి పోర్ట్‌ఫోలియోను పూర్తిగా చూసి, నిబంధనల మేరకే ఉందని నిర్ధారించుకున్న తర్వా తే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పటికే మీరు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఆయా పథకాలను ఒక్కసారి సమగ్రంగా పరిశీలించుకోండి. తెలియకపోతే నిపుణుల సాయం పొందడానికి వెనుకాడొద్దు. రాబడులే గీటురాయి కావద్దు.. పెట్టుబడికి రాబడి ఒక్కటే ప్రామాణికంగా భావించడం సరికాదు. రాబడితోపాటు పెట్టుబడికి రక్షణ కూడా అంతే ముఖ్యం. కానీ, చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు అధిక రాబడులను ఇచ్చే పథకాలనే ఎక్కువగా ఎంపిక చేసుకుంటుంటారు. అంత రాబడులను ఆయా పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ సంస్థ అర్ధంతరంగా మూసేసిన డెట్ పథకాలు కూడా రాబడులతో ఇన్వెస్టర్లను ఆకర్షించినవి కావడం గమనార్హం. అనలిస్టులు, ఫైనాన్షియల్ అడ్వైజర్లు సైతం ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ అంత రాబడులను ఎలా ఇవ్వగలుగుతోందన్న సంశయాన్ని ఎదుర్కొన్న వారే. ఆ రాబడుల వెనుకనున్న అసలు రూపం ఆలస్యంగానే బయటకు వచ్చింది. అధిక రాబడులను ఇచ్చే ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఇన్వెస్టర్లకు సూచించిన ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా డెట్ పథకాలు రాబడులను ఎలా ఇస్తాయన్నది తెలియకపోతే వాటికి ఇన్వెస్టర్లు దూరంగా ఉండడమే మంచిదని నిపుణుల సూచన. పోటీ పథకాలతో పోలిస్తే అధిక రాబడులను ఇవ్వాలన్న లక్ష్యాన్ని ఫ్రాంక్లిన్ ఇండియా అనుసరించింది. అందుకోసం అసాధారణ విధానాలను ఎంచుకుంది. పెట్టుబడుల్లో సింహ భాగాన్ని ‘బీస్పోక్ బాండ్స్’.. అంటే ప్రైవేటుగా జారీ చేసే బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. 2020 మార్చి నాటికి ఆరు డెట్ పథకాలకు సంబంధించి 56 శాతం నుంచి 77 శాతం పెట్టుబడులను ఫ్రాంక్లిన్ ఇండియా సంస్థ ఇటువంటి బాండ్లలోనే పెట్టింది. ప్రైవేటుగా జారీ చేసిన బాండ్లలో 70 శాతం పెట్టుబడులు ఈ సంస్థవే ఉన్నాయి. బీస్పోక్ బాండ్లలో సింహ భాగం పెట్టుబడులు ఈ ఒక్క సంస్థే పెట్టడంతో అధిక వడ్డీ రేటును డిమాండ్ చేసి పొందగలిగింది. కానీ, ఆయా బాండ్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నవి కావు. అంటే లిక్విడిటీ తగినంత లేనివి. బాండ్లను జారీ చేసిన సంస్థ సమస్యల్లో పడిపోవడంతో ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను వెంటనే వెనక్కి తీసుకోలేని పరిస్థితి ఎదురైంది. పైగా ఆయా బాండ్ల నుంచి కాల వ్యవధి తీరిన తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసేసుకోకుండా.. వాటిల్లోనే కొనసాగుతూ వడ్డీ రేట్లను సవరించుకుంటూ ముందుకు వెళ్లింది. దీనివల్ల వడ్డీ రేట్ల పరంగా ఎక్కువ ప్రతిఫలాన్ని రాబట్టే ప్రయత్నం చేసింది. ఇక్కడే మరో తప్పిదం కూడా జరిగింది. ఆయా బాండ్లలోనే కొనసాగే విధానం వల్ల.. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించే విధానాలను ఆశ్రయించింది. అంటే స్వల్పకాలం కోసం తీసుకున్న పెట్టుబడులను దీర్ఘకాల బాండ్లలో ఇన్వెస్ట్ చేసింది. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఉదాహరణకు లో డ్యురేషన్ ఫండ్స్ అన్నవి 6 నెలల నుంచి 12 నెలలకు మించని కాల వ్యవధితో కూడిన డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే 12 నెలలకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవు. కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ లో డ్యూరేషన్ ఫండ్స్ పెట్టుబడులను బీస్పోక్ బాండ్లలోనే గడువు తీరినా కొనసాగిస్తూ వెళ్లింది. కేవలం అధిక రాబడుల కోసమే ఇలా చేసింది. వడ్డీ రేట్లను సవరించిన తేదీలనే పెట్టుబడుల కాల వ్యవధిగా చూపించింది. ఇలాంటి విధానాలతో అధిక రాబడులను ఇవ్వొచ్చేమో కానీ.. ఇన్వెస్టర్ల పెట్టుబడులను అధిక రిస్క్‌లో పెట్టినట్టే అవుతుంది. సెబీ నిబంధనల ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పోర్ట్‌ఫోలియో వివరాలను నెలవారీగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కానీ, ఈ పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్ పథకం కలిగి ఉన్న బాండ్ల వివరాలే ఉంటాయి. అంతకుమించి వివరాలు తెలియవు. దీంతో ఇక్కడే రిస్క్ ఏర్పడుతుంది. మన బాండ్ మార్కెట్ ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. దీంతో చాలా బాండ్లు ప్రైవేటుగా అనధికారిక ఒప్పందాల మేరకు జారీ అవుతుంటాయి. అందుకే డెట్ ఫండ్స్ విషయానికొస్తే మీరు చూసేది వేరు.. పొందేది వేరన్నది గ్రహించాలి. పోర్ట్‌ఫోలియోలో డెట్ పేపర్లు, వాటి కాల వ్యవధి వివరాలు ఉంటాయి. వాటిని సమగ్రంగా పరిశీలించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. నియంత్రణపరమైన లోపాలు మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన నియంత్రణల మధ్య నడుస్తుంటాయని, మంచి రాబడులను ఇస్తాయని అందరికీ తెలిసిన విషయం. అంటే నూరు శాతం రిస్క్ లేనివని భావించొద్దు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్, డీహెచ్ఎఫ్ఎల్ సంస్థలు దివాలా తీసిన తర్వాత డెట్ ఫండ్స్ విషయంలో సెబీ నిబంధనలను కఠినతరం చేసిన మాట వాస్తవమే. సెబీ అన్ని చర్యలు తీసుకున్నాకానీ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ రూపంలో మరోసారి లోపాలు బయటపడ్డాయి. అందుకే నియంత్రణ సంస్థలు, నిబంధనలపై భారం వేసి ఇన్వెస్టర్లు నిశ్చింతగా కూర్చుంటామంటే కుదరదు. ఎందుకంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ మూసివేయడానికి ముందే.. ఆ సంస్థ సీనియర్ ఉద్యోగులు ఆయా పథకాల్లో తమకున్న పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్వెస్టర్లను పూర్తిగా వంచించడమే అవుతుంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కఠినమైన ఇన్సైడర్ నిబంధనలను సెబీ అమలు చేస్తోంది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల స్థాయిలో నిఘా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఇవే నిబంధనలు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లకు వర్తించవు. దీంతోఫండ్స్ సంస్థల్లో పనిచేసేవారు, వారి సన్నిహితులు ఆంత రంగిక సమాచారం ఆధారంగా యూనిట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడే అవకాశం లేకపోలేదు. ఇన్వెస్టర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా ఫ్రాంక్లిన్ వ్యవహరించింది. దీంతో సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనల్లో లోపాలకు వెంటనే చెక్ పెట్టకపోతే.. ఇతర సంస్థల్లోనూ ఈ తరహా లోపాలకు ఆస్కారం లేకపోలేదు. అందుకే ఇన్వెస్టర్లు కాస్త అవగాహనతో వ్యవహరించడం ముఖ్యం. స్టార్‌ను చూస్తేనే సరిపోదు.. స్టార్ ఫండ్ మేనేజర్.. మంచి రాబడుల చరిత్ర అన్నవి మ్యూచువల్ ఫండ్స్ పథకం ఎంపిక విషయంలో ఇన్వెస్టర్లు చూసే అంశాలు. కానీ, ఇవి మాత్రమే చాలవని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉదంతం సూచిస్తోంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ డెట్ పథకాలను పర్యవేక్షించిన ఫండ్‌మేనేజర్ సంతోష్ కామత్‌కు మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఆయన పనితీరును చూసి రిస్క్‌కు భయపడే ఇన్వెస్టర్లకు ఫ్రాంక్లిన్ డెట్ పథకాలను ఆర్థిక సలహాదారులు సూచించే వారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డెట్ పేపర్ల నాణ్యతలో, లిక్విడిటీ విషయంలో కామత్ రాజీపడ్డారు. అదే సంక్షోభానికి దారితీసింది. అందుకే స్టార్ రేటింగ్‌లకే పరిమితం కాకుండా కాస్త లోతుగా చూసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. సుప్రీం జోక్యం వరకూ.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్.. ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యురేషన్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్‌టర్మ్ ఇన్కమ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ అపార్చునిటీస్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ అక్రూయల్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్‌రిస్క్ ఫండ్లను 2020 ఏప్రిల్‌లో నిలిపివేసింది. ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు అభ్యర్థనలు వస్తుండగా.. వాటికి చెల్లింపులు చేసే స్థాయిలో లిక్విడిటీ లేకపోవడం (అంటే పెట్టుబడులను విక్రయించాలనుకుంటే కొనేవారు లేక)తో ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆసియా పసిఫిక్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ వివేక్ కుద్వా ఈ పథకాలను మూసివేయడానికి ముందే తన వ్యక్తిగత హోదాలో ఇన్వెస్ట్ చేసిన రూ.32 కోట్లను వెనక్కి తీసేసుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్. అందుకే డెట్ ఫండ్స్ పథకాలకు సంబంధించి ఉండే గరిష్ట రిస్క్ స్థాయిలను ఇన్వెస్టర్లకు తెలియజేయాలంటూ సెబీ ఇటీవలే నిబంధనలను తీసుకొచ్చింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ మూసేసిన ఆరు డెట్ పథకాల ఇన్వెస్టర్లకు జూన్ 15 నాటికి రూ.17,777 కోట్లు వెనక్కి రావడం కొంత ఊరట. 2020 ఏప్రిల్ 23 నాటికి ఆయా పథకాల్లోని మొత్తం పెట్టుబడుల్లో ఇది 71%. సుప్రీంకోర్టు జోక్యంతో ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లిక్విడేటర్‌గా రంగంలో దిగడంవల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు వారికి చేరడానికి మార్గం సుగమం అయ్యింది. -
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా..?
ఇటీవలి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ చేసిన నిర్వాకం చూసి డెట్ ఫండ్స్ ఇన్వెస్టర్లు ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ సంస్థ ఆరు డెట్ మ్యూచువల్ ఫండ్స్ (క్రెడిట్‌రిస్క్) పథకాలను ఉన్నట్టుండి మూసేసింది. అప్పటికే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అవసరాలకు పెట్టుబడులను తిరిగి తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిని అయోమయానికి, భయానికి గురి చేసింది. కొందరు అయితే ఇతర డెట్ ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులకు భయంతో తీసేసుకునే ఆలోచన చేస్తున్నారు. కానీ, మరే మ్యూచువల్ ఫండ్స్ సంస్థ (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ/ఏఎంసీ) కూడా ఇప్పటి వరకు ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనుక ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఆందోళన చెందాల్సిన పని లేదు. కాకపోతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు, కేవలం రాబడుల రేటు ఒక్కటి కాకుండా.. తమ స్కీమ్‌లకు సంబంధించిన రిస్క్ విషయాలను పూర్తిగా తెలుసుకోవడం ఎంతో అవసరం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ సంస్థ మూసి వేసిన ఆరు పథకాలు కూడా క్రెడిట్ రిస్క్ విభాగంలోనివే. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.25,856 కోట్లుగా ఏప్రిల్ 22 నాటికి ఉన్నాయి. కానీ, ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం.. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో మరో ఏడు డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పథకాల నిర్వహణలోని ఆస్తులు ఏప్రిల్ 22 నాటికి రూ.17,800 కోట్లుగా ఉండడం గమనార్హం. అంతేకాదు ఈ సంస్థ నిర్వహణలో 15 ఈక్విటీ పథకాలు, వాటి పరిధిలో రూ.36,663 కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ చర్యను ఫండ్స్ అంతటికీ ఆపాదించి ఒకే విధంగా చూడడం సరికాదు. అసలేం జరిగింది..? కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను స్తంభింపజేసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూవిచూస్తున్నాయి. దీంతో డెట్ మార్కెట్లో ఉన్న పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు పెరిగారు. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోకి తాజా పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ముఖ్యంగా క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లో అయితే లిక్విడిటీ మరింత తక్కువ స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థ ఆరు డెట్ పథకాల్లో ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న రిడెంప్షన్ (పెట్టుబడుల ఉపసంహరణ) ఒత్తిళ్లను తట్టుకోలేక వాటిని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు చిక్కుకుపోయాయే కానీ, అవి పూర్తిగా రాకుండా పోయినట్టు కాదు. డెట్ మార్కెట్లో లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఈ పథకాల వద్ద ఉన్న డెట్ పేపర్లను ఫ్రాంక్లిన్ సంస్థ విక్రయించి ఇన్వెస్టర్లకు సొమ్ములు చెల్లిస్తుంది. లేదా ఆయా డెట్ పేపర్ల గడువు తీరిపోయిన తర్వాత ఎంత మొత్తం వస్తుందన్న ఆధారంగా ఇన్వెస్టర్లకు చెల్లింపులు ఆధారపడి ఉంటాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్‌లోనే సమస్య అంతా.. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఎన్నో రకాల పథకాలు ఉంటాయి. వీటిల్లో క్రెడిట్ రిస్క్ ఫండ్స్ కూడా ఒకటి. తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న కార్పొరేట్ రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు ఇవ్వడం ఈ పథకాల పనితీరు విధానం. కనుకనే ఈ ఫండ్స్‌లో రాబడులు అధికంగా ఉండడంతోపాటు పెట్టుబడులకు రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుందని అర్థం చేసుకోవాలి. సెబీ నిర్దేశించిన నిబంధనల ప్రకారం క్రెడిట్ రిస్క్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఏఏప్లస్ అంతకంటే తక్కువ క్రెడిట్ రేటింగ్ ఉన్న పత్రాల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, డీహెచ్ఎఫ్ఎల్ సంక్షోభం, అడాగ్ గ్రూపు కంపెనీలు, వొడాఫోన్ ఐడియా ఈ కంపెనీల రుణ పత్రాలు తక్కువ నాణ్యత విభాగంలోనివే కావడం గమనార్హం. ఆర్థిక పరిస్థితులు బలంగా లేకపోవడం వల్ల ఆయా కంపెనీలు ఎక్కువ రేటుపై డెట్ పేపర్ల ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ చేస్తుంటాయి. కంపెనీల ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే అవి చెల్లింపుల్లో విఫలం కావచ్చు. దాంతో వాటికి రుణాలు ఇచ్చిన, డెట్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్స్‌కు దెబ్బలు తగిలినట్టే. దాంతో ఇన్వెస్టర్ల రాబడులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. కేవలం రాబడుల కాంక్షతోనే వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది. అందుకే ఇన్వెస్ట్ చేసే ముందుగానే తమ రిస్క్ సామర్థ్యం, ఇన్వెస్ట్ చేస్తున్న పథకంలో ఉండే రిస్క్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఎస్టీపీ విషయంలో జాగ్రత్త.. ఈక్విటీల్లో ఒకే విడత ఇన్వెస్ట్ చేయడం నచ్చని వారు, క్రమానుగతంగా (సిప్) ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు సాధారణంగా డెట్ ఫండ్స్‌లో లంప్సమ్(ఒకే మొత్తం)గా ఇన్వెస్ట్ చేస్తుంటారు. తర్వాత ఆయా డెట్ ఫండ్స్ నుంచి సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ/క్రమానుగతంగా బదిలీ చేయడం) ద్వారా ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని తాము ఎంపిక చేసుకున్న ఈక్విటీ పథకాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటారు. మరి ఫ్రాంక్లిన్ ఉదంతం చూసిన తర్వాత.. ఇన్వెస్టర్లు ఎస్టీపీ కోసం ఎంచుకునే డెట్ ఫండ్స్ అధిక నాణ్యత, రిస్క్ తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. డెట్ ఫండ్స్ సురక్షితమేనా..? ద్రవ్యోల్బణంపై 1.5 శాతానికి మించి రాబడులను డెట్ ఫండ్స్ నుంచి ఆశించకూడదన్నది నిపుణుల సూచన. రిస్క్ భరించలేని వారు ఏఏఏ రేటింగ్ (అధిక నాణ్యత) పేపర్లలో ఇన్వెస్ట్ చేసే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం కావాలి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ బాండ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, గిల్ట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. ఎస్టీపీ కోసం ఇవి మంచి ఆప్షనే అవుతాయి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా పథకాల పోర్ట్‌ఫోలియోల్లోని డెట్ పేపర్ల రేటింగ్లను చూసి నిర్ణయం తీసుకోవాలి. డెట్ ఫండ్స్‌ను అమ్మేసుకోవాలా..? ఫ్రాంక్లిన్ చర్యను చూసి ఇతర డెట్ ఫండ్స్‌ను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎగ్జిట్ చార్జీలు, పన్నులు చెల్లించాల్సి రావచ్చు. డెట్ ఫండ్స్‌లో లాభాలపై, స్వల్పకాల, దీర్ఘకాల లాభాల పన్ను వర్తిస్తుంది. ‘‘అన్ని బాండ్ ఫండ్స్ కూడా రాబడుల కోసం అధిక క్రెడిట్ రిస్క్ తీసుకుంటాయని అనుకోవద్దు. చక్కని నిర్వహణతో కూడిన ఫండ్స్ ఉత్తమ క్రెడిట్ రేటింగ్ బాండ్లలోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి’’ అని ఇన్వెస్టికా రీసెర్చ్ మేనేజర్ సయాలీ ఖండ్కే తెలిపారు. వీటిల్లో రిస్క్ తక్కువ డెట్ ఫండ్స్ గురించి అంతగా అవగాహన లేని వారు, ఎక్కువ రిస్క్ వద్దనుకుంటే, కొంచెం భద్రత పాళ్లు ఎక్కువగా ఉంటే ఈ డెట్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. కాకపోతే వీటిల్లో రాబడులు తక్కువగా ఉంటాయి. ఓవర్‌నైట్ ఫండ్స్..: డెట్ ఫండ్ విభాగంలో సురక్షితం. ఒక రోజు వ్యవధితో కూడిన ఓవర్‌నైట్ రివర్స్ రెపో, ఇతర డెట్, మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక రోజు నుంచి నెల కోసం అనుకూలం. రాబడి 5% వరకూ ఉంటుంది. లిక్విడ్ ఫండ్స్..: 91 రోజుల కాల వ్యవధి మించని ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపోలు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్‌లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెడుతుంటాయి. రాబడులు 6 శాతం వరకు ఉంటాయి. బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ డెట్ ఫండ్స్..: ఈ పథకాలు బ్యాంకులు, ప్రభుత్వరంగ సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. డిఫాల్ట్ రిస్క్ చాలా తక్కువ. మూడేళ్ల కాలానికి అనుకూలం. వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో మార్కెట్ టు మార్కెట్ నష్టాలు ఈ ఫండ్స్‌కు ఉంటాయి. రాబడులు దీర్ఘకాలంలో 8 శాతం వరకు ఉంటాయి. ఇతర డెట్ ఫండ్స్ రకాలు ఈ పథకాలన్నింటిలోనూ రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆయా పథకాల్లోని పోర్ట్‌ఫోలియోపై రిస్క్ ఆధారపడి ఉంటుంది. అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మూడు నుంచి ఆరు నెలల్లోపు గడువుతీరే డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్‌తో పోలిస్తే అధిక రాబడులను ఇస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కంటే వీటిల్లో రిస్క్ ఎక్కువ. ఎంచుకునే పథకాలను బట్టి రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ ఇవి 1–3 ఏళ్ల కాల వ్యవధి కలిగిన కంపెనీల బాండ్లు, బ్యాంకుల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ దీర్ఘకాలంలో మెచ్యూరిటీ అయ్యే గవర్నమెంట్ సెక్యూరిటీలు, బాండ్లు, డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తా యి. ఏడేళ్లకు పైగా వీటి కాల వ్యవధి ఉంటుంది. కార్పొరేట్ బాండ్ ఫండ్స్ 80% పెట్టుబడులను అధిక క్రెడిట్ రేటింగ్ ఉన్న కంపెనీల బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాగని ఈ విభాగంలోని అన్ని పథకాల్లోనూ రిస్క్ ఒకే మాదిరిగా ఉంటుందనుకోవద్దు.పోర్ట్‌ఫోలియోలోని పేపర్లను చూసిన తర్వాతే అవగాహనకు రావాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ వడ్డీ రేట్లలో మార్పులను పెట్టుబడి అవకాశాలుగా మలుచుకుని అధిక రాబడులను ఇచ్చే విధంగా డైనమిక్ బాండ్ ఫండ్స్ పనిచేస్తుంటాయి. వివిధ కాల వ్యవధులతో ఉన్న సెక్యూరిటీలను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉంటాయి. వీటిల్లో అధిక రిస్క్ ఉంటుంది. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు (ఎఫ్ఎంపీ) ఇవి క్లోజ్ ఎండెడ్ డెట్‌ఫండ్స్. ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. సాధారణంగా మూడేళ్లకు పైబడిన కాల వ్యవధితో ఉంటుంటాయి. అధిక రాబడులను ఆఫర్ చేస్తాయి. రిస్క్ ఉంటుంది. గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ ప్రధానంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. దీంతో పెట్టుబడులు, వడ్డీ చెల్లింపులకు ఎటువంటి రిస్క్ ఉండదు. వడ్డీ రేట్లు తరచుగా మార్పులకు గురవుతుంటే ఆ ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటుంది. అధిక రాబడులు, ప్రతికూల రాబడుల రిస్క్ కూడా ఉంటుంది. ఈక్విటీల్లోనే కాదు డెట్‌లోనూ రిస్క్ ఈక్విటీలతో పోలిస్తే డెట్ విభాగంలో రిస్క్ తక్కువ. కాకపోతే డెట్ పెట్టుబడులపై క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్ల రిస్క్ ఎప్పుడూ ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఫండ్ మేనేజర్ తక్కువ క్రెడిట్ రేటింగ్ బాండ్లలో (చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉండే కంపెనీల పేపర్లు) ఇన్వెస్ట్ చేస్తుంటే ఆయా పథకాల్లో రిస్క్ ఈక్విటీల స్థాయిల్లోనే ఉంటుందని అర్థం చేసుకోవాలి. వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా బాండ్ల ధరలు పడిపోతే నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈక్విటీలనే కాకుండా, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కూడా ఆర్థిక నిపుణులు, సలహాదారులను సంప్రదించి, తమ రిస్క్, పెట్టుబడుల సామర్థ్యాలకు అనుగుణంగా మెరుగైన ప్రణాళికను రూపొందించుకోవడం సూచనీయం. -
‘ఫ్రాంక్లిన్ టెంపుల్టన్’ షాక్
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ, అకస్మాత్తుగా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. దీంతో శుక్రవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించడం, ప్రభుత్వం నుంచి ప్యాకేజీ మరింత ఆలస్యమవుతుండటం, గిలీడ్ ఔషధం కరోనా చికిత్సలో సత్ఫలితాలనివ్వడం లేదన్న వార్తలు, కరోనా వైరస్ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించిన ప్రభావమే ఉండనున్నదన్న ఆందోళన, గత రెండు సెషన్లలో సెన్సెక్స్, నిఫ్టీలు చెరో 4 శాతం మేర లాభపడటంతో కొన్ని షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం....ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 536 పాయింట్లు క్షీణించి 31,327 పాయింట్ల వద్ద, నిఫ్టీ 160 పాయింట్లు నష్టపోయి 9,154 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ 3 శాతం మేర లాభపడటంతో నష్టాలకు కళ్లెం పడింది. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్ల మేర నష్టపోయాయి. సెంటిమెంట్‌పై ‘టెంపుల్టన్’ దెబ్బ.... ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ సంస్థ ఆరు డెట్ స్కీమ్‌లను మూసేయడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. కరోనా వైరస్ కల్లోలానికి, లాక్‌డౌన్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించే సూచనలు కనిపించకపోవడంతో ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు 1–2%, యూరప్ మార్కెట్లు ఇదే రేంజ్ నష్టపోయాయి. ఫార్మా షేర్ల పరుగులు.... ఫార్మా షేర్ల పరుగులు కొనసాగుతున్నాయి. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి వివిధ కంపెనీలకు ఆమోదాలు లభించడం, ఇటీవలే వెల్లడైన అలెంబిక్ ఫార్మా ఫలితాలు ఆరోగ్యకరంగా ఉండటం, దీనికి ప్రధాన కారణాలు. అలెంబిక్ ఫార్మా, సన్ ఫార్మా, లారస్ ల్యాబ్స్(ఈ మూడు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి) అల్కెమ్ ల్యాబ్స్, అజంతా ఫార్మా, లుపిన్, ఇప్కా ల్యాబ్స్, జుబిలంట్ లైఫ్ సైన్సెస్, ఎఫ్డీసీ తదితర షేర్లు 2–8 శాతం రేంజ్లో పెరిగాయి. ► ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఆరు డెట్ ఫండ్స్‌ను మూసేయడంతో ఆర్థిక, బ్యాంక్, మ్యూచువల్ ఫండ్ రంగ షేర్లు క్షీణించాయి. నిప్పన్ ఇండియా షేర్ 18 శాతం నష్టంతో రూ.216కు, హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ 6 శాతం నష్టంతో రూ.2,425కు, శ్రీరామ్ ఏఎమ్‌సీ 3 శాతం పతనమై రూ.71కు పడిపోయాయి. ► బజాజ్ ఫైనాన్స్ షేర్ 9 శాతం నష్టంతో రూ.1,976 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా రూ.2 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. -
ఫండ్ ఇన్వెస్టర్లకు షాక్!
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి .. మాంద్యానికి దారితీస్తుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడుతుండటంతో ఈక్విటీ, డెట్ మార్కెట్లు కకావికలం అవుతున్నాయి. తాజాగా దీని ధాటికి మ్యూచువల్ ఫండ్ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా ఆరు డెట్ ఫండ్స్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి.. ఇన్వెస్టర్లకు షాకిచ్చింది. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 25,000 కోట్ల దాకా ఉంటుంది. కరోనా మహమ్మారి ధాటికి ఒక ఫండ్ హౌస్ తమ స్కీములను ఈ విధంగా మూసివేయడం ఇదే ప్రథమం. ఇన్వెస్టర్ల నుంచి రిడెంప్షన్ (యూనిట్లను విక్రయించి, పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం) ఒత్తిళ్లు పెరిగిపోవడం, బాండ్ మార్కెట్లలో తగినంత లిక్విడిటీ లేకపోవడం వంటి అంశాల కారణంగా.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తెలిపింది. కనిష్ట స్థాయిలకు పడిపోయిన రేట్లకు హోల్డింగ్స్ అమ్మేయడం లేదా పెట్టుబడులపై మరిన్ని రుణాలు తెచ్చి తీర్చడం తప్ప మరో మార్గం లేకుండా పోయిందని సంస్థ భారత విభాగం ఎండీ సంజయ్ సాప్రే చెప్పారు. ఏదీ కుదిరే పరిస్థితి లేకపోవడంతో ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పనిసరై ఆయా స్కీములను మూసివేయాల్సి వచ్చిందని వివరించారు. మూసివేతతో ఇన్వెస్టర్లపరమైన లావాదేవీలేమీ జరగకపోయినప్పటికీ .. యాజమాన్యం దృష్టికోణంలో ఇవి కొనసాగుతాయని సాప్రే చెప్పారు. మెరుగైన రేట్లకు విక్రయించి, ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. ‘ఇటు మార్కెట్లు, అటు ఎకానమీ ఏ దిశ తీసుకుంటాయన్నదానిపై స్పష్టత కొరవడటంతో ఇన్వెస్టర్లకు మరిం త హాని జరిగే అవకాశముందని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం‘ అని ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ సంతోష్ కామత్ తెలిపారు. సుమారు 26 ఏళ్ల రీసెర్చ్ అనుభవం, 19ఏళ్లకు పైగా పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మె ంట్ అనుభవం కామత్‌కి ఉంది. ట్రిపుల్ ఎ కన్నా తక్కువ రేటింగ్ ఉండే బాండ్ల పెట్టుబడుల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. సెబీతో సంప్రదించాకే: ‘ఆరు ఫండ్ల మూసివేత నిర్ణయం ఆదరాబాదరాగా తీసుకున్నది కాదు. దీనిపై నియంత్రణ సంస్థ సెబీతో విస్తృతంగా చర్చలు జరిపాం. ప్రస్తుత పరిస్థితుల్లో మేం తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలే ఉన్నాయని సెబీ కూడా భావించింది‘‡అని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు క్రమానుగతంగా, ’అందరికీ సమానంగా’ చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాలను సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమని కుద్వా వివరించారు. ఇది టెంపుల్టన్కి మాత్రమే పరిమితం: యాంఫి 6 స్కీమ్‌ల మూసివేత అంశం కేవలం ఆయా స్కీమ్లకే పరిమితమైన దని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫి పేర్కొంది. ఇతర మ్యూచువల్ ఫండ్స్‌పై దీని ప్రభావమేమీ ఉండబోదని కాన్ఫరెన్స్ కాల్లో యాంఫి చైర్మన్ నీలేశ్ షా చెప్పారు. డెట్ స్కీముల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు సురక్షితంగానే ఉన్నాయని భరోసానిచ్చారు. రూ.22.26 లక్షల కోట్లు ఈ మార్చి 31నాటికి మ్యూచువల్ ఫండ్స్ వద్ద సగటు నిర్వహణ నిధులు రూ.2.13 లక్షల కోట్లు మార్చి నెలలో ఫండ్స్(ఈక్విటీ, డెట్) నుంచి ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్న పెట్టుబడుల విలువ సెబీ, కేంద్రం జోక్యం చేసుకోవాలి: బ్రోకింగ్ సంస్థలు టెంపుల్టన్ ఆరు డెట్ స్కీముల మూసివేతతో ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొందని బ్రోకింగ్ సంస్థల సమాఖ్య ఏఎన్ఎంఐ పేర్కొంది. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను, కష్టార్జితాన్ని పరిరక్షించేందు కు ఆర్థిక శాఖ, సెబీ తక్ష ణం జోక్యం చేసుకుని.. పరిస్థితి చక్కదిద్దాలని కోరింది. స మస్య మూలాల గుర్తింపునకు నిపుణుల కమిటీ వేయాలని పేర్కొంది. ఏం జరిగిందంటే.... కరోనా వైరస్ ధాటికి భారత్ సహా పలు ప్రపంచ దేశాల ఈక్విటీ, బాండ్ మార్కెట్లు కుప్పకూలాయి. పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. అయితే, కొనేవాళ్లు కరువవడంతో .. రేట్లు గణనీయంగా పడిపోయాయి. పైపెచ్చు తక్కువ స్థాయి రేటింగ్ ఉన్న స్క్రిప్స్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. బలహీన క్రెడిట్ రేటింగ్స్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు రుణాలివ్వడం దాదాపు నిలిపివేశాయి. దీంతో తక్కువ రేటింగ్ ఉన్న కంపెనీల డెట్ స్క్రిప్‌లకు డిమాండ్ భారీగా పడిపోయింది. రిస్కులు ఎక్కువున్న మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం కన్నా మిగులు నిధులను తక్కువ రాబడులు వచ్చినా రిజర్వ్ బ్యాంక్ దగ్గర సురక్షితంగా ఉంచుకునేందుకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లపై నమ్మకం సన్నగిల్లి ఈక్విటీలతో పాటు డెట్ మార్కెట్లకు దూరంగా ఉంటుండటంతో కొనుగోళ్లు తగ్గిపోయాయి. కరోనా వైరస్‌పరమైన మాంద్యం భయాలతో టెంపుల్టన్ మూసివేసిన ఆరు స్కీముల్లో ఇన్వెస్ట్ చేసిన వారు అయినకాడికి అమ్ముకునేందుకు మొగ్గుచూపారు. అయితే, మార్కెట్లో అమ్ముదామన్నా కొనేవారు కరువవడంతో మరో దారి లేక ఈ స్కీములను టెంపుల్టన్ మూసివేయాల్సి వచ్చింది. మిగతా డెట్ ఫండ్స్ మాటేంటి .. ఆరు స్కీమ్‌లు మూసివేసినంత మాత్రాన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పూర్తిగా మూతబడినట్లు కాదు. దాదాపు పాతికేళ్లకుపైగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న టెంపుల్టన్ మరో ఏడు డెట్ ఫండ్స్‌ను కూడా నిర్వహిస్తోంది. ఏప్రిల్ 22 నాటికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 17,800 కోట్లుగా ఉంది. ఇవి కాకుండా టెంపుల్టన్ దాదాపు రూ. 36,663 కోట్ల విలువ చేసే 15 ఈక్విటీ ఫండ్స్‌ను, సుమారు రూ. 3,143 కోట్ల విలువ చేసే 11 హైబ్రిడ్ కేటగిరీ స్కీమ్‌లను (ఈక్విటీలు, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్) నిర్వహిస్తోంది (విలువలు మార్చి 31 నాటికి). ఈ ఫండ్సన్నీ యథాప్రకారం కొనసాగుతాయని, ఇన్వెస్టర్లు ఆందోళన చెందరాదని సంస్థ పేర్కొంది. ఇప్పుడేంటి పరిస్థితి... స్కీములను మూసివేసినా ఇన్వెస్టర్లు ఇప్పటికిప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి కుదరదు. స్కీము వాస్తవ గడువు పూర్తయ్యేదాకా వేచి ఉండాల్సిందే. ఉదాహరణకు ఫ్రాంక్లిన్ ఇండియా లో డ్యూరేషన్ ఫండ్ సంగతి తీసుకుంటే.. సగటు గడువు బట్టి చూసినప్పుడు.. ఇన్వెస్టర్ల సొమ్ము వెనక్కి రావడానికి ఏడాది పైన 73 రోజులు పట్టొచ్చని మార్కెట్ వర్గాలు తెలిపాయి. అలాగే ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఫండ్ సగటు కాలావధి బట్టి చూస్తే ఇన్వెస్టర్లు మూడేళ్ల పైన 80 రోజులు దాకా వేచి చూడాల్సి రానుంది. ఈ స్కీములు మూతబడ్డాయి కాబట్టి వీటిల్లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) పద్ధతిలో పెట్టుబడులు పెడుతున్న వారి వాయిదాలు ఆటోమేటిక్‌గా ఆగిపోతాయి. కానీ సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ (ఎస్టీపీ) కింద వీటిల్లో డబ్బు పెట్టిన వారికి మాత్రం చిక్కులు తప్పవు. సాధారణంగా చేతిలో భారీ మొత్తం సొమ్ము ఉన్నప్పుడు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టకుండా.. ఇలాంటి డెట్ సాధనాల్లో ఉంచుతారు. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాపై ఇచ్చే వడ్డీ రేటు కన్నా వీటిలో కాస్త ఎక్కువ రాబడి వస్తుందనే ఆలోచన ఇందుకు కారణం. ఇక, ఈ డెట్ సాధనాల నుంచి కొంత మొత్తాన్ని విడతలవారీగా (నెలకోసారి, వారాని కోసారి లాగా) ఈక్విటీల్లోకి ఇన్వెస్టర్లు మళ్లిస్తుంటారు. ప్రస్తుతం మూతబడిన టెంపుల్టన్ స్కీముల్లో ఇలా ఎస్టీపీ కింద భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేసినవారికి కాస్త ఇబ్బంది తప్పదనేది విశ్లేషకుల మాట. -
రిటైరైన వాళ్లు ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
ప్రశ్న: నాకు ఇటీవలనే కొంత మొత్తంలో బోనస్ వచ్చింది. ప్రస్తుతం ఈ డబ్బులను ఖర్చు చేయకుండా మూడేళ్ల తర్వాత వాడుకుందామనుకుంటున్నాను. మూడేళ్ల కాలానికైతే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఏ తరహా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది ? –శ్రావణి, విజయవాడ డెట్ ఫండ్స్ గత ఏడాది మిశ్రమ ఫలితాలనిచ్చాయి. డెట్ ఫండ్స్‌కు కూడా రిస్క్ ఉంటుందని గుర్తించాలి. అయితే గతంలో ఎప్పుడు ఆ రిస్క్ డెట్ ఫండ్స్‌పై ప్రభావం చూపలేదు. కానీ 2019లో మాత్రం డెట్ ఫండ్స్ ఆశించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. అందుకని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. షార్ట్–డ్యురేషన్ డెట్ ఫండ్స్‌లో మినహా మరే ఇతర డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రయోగాలు చేయకండి. 1 లేదా 2 శాతం అదనపు రాబడుల కోసం ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి విషయంలో అసలుకే ఎసరు రావచ్చు. ఏతావాతా మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేయడానికి షార్ట్–డ్యురేషన్ డెట్ ఫండ్స్‌నే పరిగణనలోకి తీసుకోండి. ప్రశ్న: నేను ప్రతినెలా కొంత మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం నాకు ఇదే మొదటిసారి. స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాలు, దీర్ఘకాలిక ఆరి్థక లక్ష్యాలు సాధించడం కోసం ఏ తరహా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలో సూచించండి. –దీపక్, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేసే మీ లాంటి వాళ్లు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేయదల్చుకుంటేనే ఈ ఫండ్స్‌లో మదుపు చేయాలి. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీరు మంచి రాబడులు పొందగలుగుతారు. ఈ ఫండ్స్ తమ మొత్తం నిధులు 65 శాతం ఈక్విటీలోనూ. 35 శాతం డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. స్టాక్ మార్కెట్ పతనసమయంలో మీ పెట్టుబడి దెబ్బతినకుండా ఈ డెట్ విభాగం రక్షణనిస్తుంది. మార్కెట్ బాగా పెరుగుతున్నప్పుడు ఈక్విటీ విభాగం మంచి రాబడులనిస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, ముందే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకండి. మార్కెట్ గమనాన్ని బట్టి ఈక్విటీ ఫండ్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. ఆరంభంలోనే ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కోకుండా ఉండాలంటే, ఈక్విటీ ఫండ్స్ కంటే హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవడమే మంచిది. ఎస్బీఐ ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్, మిరా అసెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్లను పరిశీలించవచ్చు. ఇక స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాల కోసం షార్ట్–డ్యురేషన్ ఫండ్‌ను ఎంచుకోండి. మరే ఇతర ఫండ్స్ వద్దు. స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయకండి. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవద్దు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే, మార్కెట్ పతన బాటలో ఉన్నప్పుడు మీకు యావరేజంగ్ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ప్రతి ఏడాది మీ సిప్మొత్తాలను కనీసం 10 శాతం మేర పెంచే ప్రయత్నాలు చేయండి. ఏడాదికి ఒక్కసారైనా, మీ ఫండ్స్ పనితీరును సమీక్షించండి. ప్రశ్న: నేను ఇటీవలనే రిటైరయ్యాను. రిటైరైన వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా ? –బాబూమియా, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమే కాకుండా అత్యంత ముఖ్యమైనది కూడా. మ్యూచువల్ ఫండ్స్ ఆస్తి కాదు. ఈక్విటీల్లోనూ, స్థిరాదాయ సాధనాల్లోనూ ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక సాధనం. మీరు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఈ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఉంటాయి. ఫలితంగా మీరు డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాకుండా ఈ ఫండ్‌ను ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న ఫండ్ మేనేజర్ నిర్వహిస్తాడు కాబట్టి, మంచి రాబడులే వచ్చే అవకాశాలుంటాయి. ఎక్కడెక్కడి నుంచో, ఎంతెంతో సమాచారం సేకరించి, శోధించి ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయాలో, ఏ కంపెనీని విస్మరించాలో... ఇలాంటి ఎలాంటి తలనొప్పులు మీకు లేకుండా ఫండ్ మేనేజర్లు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక స్థిరాదాయం వచ్చే ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్స్‌ను తీసుకుంటే, వీటికి పన్ను ప్రయోజనాలు, లిక్విడిటీ అధికంగా ఉంటాయి. సాధారణంగా వ్యక్తులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టలేరు. కానీ ఓవర్‌నైట్, లిక్విడ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. అందుకని రిటైరైన వాళ్లైనా, ఇప్పుడు సంపాదనలో ఉన్న వాళైనా, ఎవరైనా సరే, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మిస్ చేసుకోకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన, సమంజసమైన ఇన్వెస్ట్మెంట్ సాధనం. -- (ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) -
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్‌డ్రాయల్స్ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ? – అనురాధ, హైదరాబాద్ మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశారు. దీంట్లో కొంత భాగాన్ని విక్రయించారనుకుందాం. మీరు యూనిట్లు కొనుగోలు చేసిన తేదీ, యూనిట్లను విక్రయించిన తేదీలను పరిగణనలోకి తీసుకొని మీకు వచ్చిన లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలా ? స్వల్ప కాలిక మూలధన లాభాలా అనే విషయాన్ని నిర్దారిస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్(ఎఫ్‌ఐఎఫ్‌ఓ) సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తారు. మొదటగా కొనుగోలు చేసిన దాన్ని మొదటగా రిడీమ్ చేసినట్లుగా భావిస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఈక్విటీ ఫండ్‌లో రూ.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఈ ఫండ్‌లో కొన్నేళ్లుగా ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దీంట్లోంచి రూ. లక్ష మేర యూనిట్లను విక్రయించాలనుకున్నారనుకుందాం. వెయ్యి యూనిట్లను విక్రయించి రూ. లక్ష రిడీమ్ చేశారనుకుందాం. అన్నింటి కంటే ముందుగా కొన్న యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ముందు కొన్న యూనిట్లను ముందుగా రిడీమ్(విక్రయించినట్లుగా) చేసినట్లుగా భావిస్తారు. మీరు విక్రయించిన యూనిట్లలో ఏడాది క్రితం కొన్నవి కొన్ని, ఏడాది లోపల కొన్నవి కొన్ని ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి రావచ్చు. ప్ర: నేను మరో ఐదేళ్లలో రిటైర్ కాబోతున్నాను. రిటైర్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాను. రిటైరైన తర్వాత మొదటి ఐదేళ్ల ఖర్చుల నిమిత్తం ఈ రిటైర్మెంట్ నిధి నుంచి కొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమేనా ? ఇప్పుడు నేను ఏం చేయాలి ? –ఈశ్వర్, విశాఖపట్టణం ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్ పట్ల మీకే కాదు చాలా మందికి సంశయాలు ఏర్పడ్డ విషయం వాస్తవమే. అయితే ఈ భయాల నుంచి వీలైనంత త్వరగా బైటకు రండి. అలా చేయకపోతే, మీరు డెట్ ఫండ్స్ అందించే మంచి ప్రయోజనాలు మిస్ చేసుకున్నవారవుతారు. కొత్తగా వచ్చిన సైడ్–పాకెటింగ్ రూల్స్(మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఏవైనా కంపెనీలు చెల్లింపుల్లో విఫలమైనా, ఆ తర్వాత రికవరీ చేసుకొని, ఆ రికవరీని ఇన్వెస్టర్లకు అందించడం(ఈ ఇన్వెస్టర్లు యూనిట్లను విక్రయించినా సరే, భవిష్యత్తులో వారికి ఆ మొత్తాన్ని అందించే వెసులుబాటు ఈ సైడ్ పాకెటింగ్ రూల్స్‌లో ఉన్నాయి) కారణంగా జరగరానిది ఏదైనా జరిగినా, మీ డబ్బులు పూర్తిగా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ పట్ల మీకు ఇప్పుడు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక విభిన్నమైన వ్యూహాన్ని సూచిస్తున్నాను. మీరు రిటైరైన తర్వాత మూడున్నరేళ్లకు కావలసిన మొత్తం ఖర్చులు ఎంతో లెక్కేయ్యండి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ లింక్డ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయండి. బాండ్ల ఫండ్ల కన్నా ఈ ఖాతాలో రెండు నుంచి రెండున్నర శాతం తక్కువ రాబడులు వస్తాయి. అయితే మీరు ఈ సొమ్ములను ఎప్పుడు అవసరమైతే, అప్పుడు సులభంగా తీసుకోవచ్చు. ఆ తర్వాతి నాలుగేళ్ల కాలానికి అవసరమైన సొమ్ములను మంచి క్వాలిటీ ఉన్న డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక మిగిలిన మొత్తాన్ని ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కలిపి రూ. కోటి దాటాయి. ఈ మొత్తాన్ని సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో రిడీమ్ చేసుకుందామనుకుంటున్నాను. ఎంత కాలంలో నేను ఈ డబ్బులను వెనక్కి తీసుకోవాలి ? ఈ విషయంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. –రాజేశ్, విజయవాడ ఏదైనా ఆర్థిక లక్ష్యం(ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నత చదువులు, తదితరాలు) కోసం మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్లయితే, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఉపసంహరణ ప్రణాళిక (విత్‌డ్రాయల్ ప్లాన్)ఉండాలి. అలా కాకుండా కోటి రూపాయల నిధి ఏర్పాటు చేసుకోవడమే మీ లక్ష్యమైతే, మీ అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రాయల్ ప్లాన్ ఉండాలి. ఈ డబ్బులు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే 30–50 శాతం మొత్తాన్ని ఫిక్స్డ్–ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తన్నా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా కొనుగోలు నిమిత్తమో, లేదా వినియోగం నిమిత్తమే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి. దానికి తగ్గట్లుగా మీ ఉపసంహరణ ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మీ పాప/ బాబు ఉన్నత విద్యావసరాలకు రూ.50 లక్షలు అవసరమవుతాయనుకుందాం. మొదటి ఏడాది రూ.12.5 లక్షలు అవసరమనుకోండి. ఈ సొమ్ములు అవసరమయ్యే ఒక ఏడాదికి ముందే రూ.50 లక్షల మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన రూ.50 లక్షల మొత్తాన్ని 12–18 నెలల కాలంలో సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)రూపంలో బదిలీ చేయండి. దీంతో మీ కోటి రూపాÆయలకు మార్కెట్ రిస్క్ ఉండదు. ఒకవేళ ఇప్పట్లో మీకు ఈ డబ్బులు అవసరం లేని పక్షంలో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మరిన్ని రాబడులు వస్తాయి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎఫ్డీ.. డెట్ ఫండ్.. ఏది బెటర్?
నేను కొంత మొత్తాన్ని డెట్ ఫండ్‌లో నాలుగేళ్ల పాటు ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. 8 శాతానికి పైగా రాబడినిచ్చే డెట్ ఫండ్స్ ఉన్నాయా? బ్యాంక్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమైనా పన్ను ప్రయోజనాలు ఉంటాయా? –ప్రియ, హైదరాబాద్ డెట్ ఫండ్స్‌లో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ 8 శాతానికి పైగా రాబడినిచ్చే అవకాశాలున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడులు ఖచ్చితంగా ఇంత వస్తాయనే గ్యారంటీ ఏమీ లేదు. అదే మీరు ఏదైనా బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఏడాది తర్వాత ఇంత మొత్తం, రెండేళ్ల తర్వాత ఇంత మొత్తం ఇలా మీకు గ్యారంటీగా ఎంత రాబడులు వస్తాయో ముందే తెలుస్తుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్‌లో అలా గ్యారంటీగా రాబడులు రావు. కాకుంటే చాలా డెట్ ఫండ్స్ గతంలో 8 శాతానికి పైగా రాబడులు ఇచ్చాయి. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ స్థాయి రాబడులు రావచ్చనే అంచనాలు ఉంటాయి. ఇక ఫిక్స్డ్ డిపాజిట్లతో పోల్చితే డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు అదనంగా పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. మీరు కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకుందాం. దీనిపై వచ్చే వడ్డీపై మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీని మీ ఆదాయానికి కలపి పన్ను లెక్కిస్తారు. మీరు 30 శాతం పన్ను శ్లాబులో ఉంటే, ఆ శ్లాబ్ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మూడేళ్లలోపు ఎప్పుడైనా ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, వచ్చే లాభాలను మీ ఆదాయానికి కలిపి పన్ను లెక్కిస్తారు. మీరు యూనిట్లను విక్రయించినప్పుడు మాత్రమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి. ప్రతీ ఏడాది వచ్చే వడ్డీని పరిగణనలోకి తీసుకొని పన్ను లెక్కిస్తారు. మూడేళ్ల తర్వాతనే డెట్ మ్యూచువల్ ఫండ్ యూనిట్లను విక్రయించారనుకుందాం. అప్పుడు వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. అప్పుడు మీరు ఇండేక్సేషన్ ప్రయోజనాలు కూడా పొందవచ్చు. వచ్చిన లాభాల నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసివేసి 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. ఊళ్లో పొలం అమ్మగా నా వాటా కింద రూ.8 లక్షలు వచ్చాయి. దీంట్లో మూడు లక్షలు మా అమ్మ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వడ్డీకి ఆమెకు అందే ఏర్పాటు చేశాను. మిగిలిన రూ.5 లక్షలను ఒక ఆర్బిటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్ నుంచి సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్(ఎస్టీపీ) విధానంలో ఏదైనా ఇండెక్స్ ఫండ్‌లోకి బదిలీ చేయాలనేది నా ఆలోచన. మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సరైన నిర్ణయమేనా?– సురేందర్, విశాఖపట్టణం మార్కెట్ ఒడిదుడుకులమయంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి, ఎస్టీపీ ద్వారా ఇండెక్స్ ఫండ్స్‌లోకి బదిలీ చేయాలన్న మీ వ్యూహం మంచిదే. కానీ ఆర్బిట్రేజ్ ఫండ్‌కు బదులుగా మీరు లిక్విడ్ ఫండ్‌ను ఎంచుకోండి. ఈ రెండు ఫండ్స్‌కు తేడా పెద్దగా ఏమీ ఉండదు. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు లభించినప్పటికీ, ఈ ఫండ్స్ చాలా తక్కువ రాబడులను ఇస్తున్నాయి. అలా కాకుండా లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మీకు కొంచెం ఎక్కువ రాబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు తగిన సూచనలివ్వండి. –కార్తికేయ, ఈ మెయిల్ ద్వారా మీరు ఈక్విటీ, ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేసే ముందు మొదటగా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. మీ ఆరు నెలల అవసరాలకు సరిపడే మొత్తంతో ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి. ఈ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో ఉంచడమో లేదా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడమో చేయండి. అత్యవసర నిధి తయారైన తర్వాత నెలకు కొంత మొత్తాన్ని ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడంతో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి. అది కూడా ఆన్లైన్లోనే తీసుకోండి. చిన్న వయస్సులో టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే, మీకు ఎక్కువ బీమా కవరేజ్, తక్కువ ప్రీమియమ్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ విషయానికొస్తే... సమీప భవిష్యత్తులో అవసరం పడని డబ్బులనే మీరు ఈ ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముందుగా హైబ్రిడ్ ఫండ్స్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆరంభించండి. ఈ హైబ్రిడ్ ఫండ్స్ తమ కార్పస్‌లో మూడింట రెండొంతులు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల మార్కెట్ పడిపోయినప్పుడు ఒకింత రక్షణ హైబ్రిడ్ ఫండ్స్‌కు లభిస్తుంది. మార్కెట్ పతనమవుతున్నప్పుడు కూడా క్రమశిక్షణగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించడం మరచిపోవద్దు. మీరు ఒకవేళ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే, హైబ్రిడ్ ఫండ్‌కు బదులుగా ఏడాదికి రూ.1.5 లక్షల వరకూ ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్) ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్‌కు లాక్–ఇన్–పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. పైగా మీకు ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మూడేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, హైబ్రిడ్ ఫండ్స్ కంటే కూడా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ మంచి రాబడులను ఇస్తాయి. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఏడాది మారింది... మరి మీరు?
గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే ఉంటాయన్నది ఎక్కువ మంది నిపుణుల అభిప్రాయం. ప్రతికూలతలను అధిగమించి, పెట్టుబడి అవకాశాలను అందుకోవాలంటే అందుకు ప్రతి ఒక్కరూ పాటించతగిన ఆర్థిక విధానాలు కొన్ని ఉన్నాయి. అవేంటన్నది నిపుణుల మాటల్లోనే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఈ ఏడాది ఎన్నికలు ఉన్నందున మార్కెట్లలో అస్థిరతలు కొనసాగేందుకు అధిక అవకాశాలున్నాయి. ఈ అస్థిరతలను అధిగమించేందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఉపయోగపడుతుంది. ఎన్నికల వరకు స్టాక్స్ ధరలు పరిమిత పరిధిలోనే కదలాడే అవకాశం ఉంది. ఫలితాలు వెలువడ్డాక దిశను ఎటువైపు అయినా మార్చుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడమే సరైన మార్గం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఎన్ఏవీ ధరలు పెరగడం వల్ల తక్కువ ఫండ్స్ యూనిట్లు, మార్కెట్లు కరెక్షన్ బాట పడితే ఎన్ఏవీ ధరల పతనంతో ఎక్కువ యూనిట్లు సొంతం చేసుకోవచ్చు. మార్కెట్లు కొంతమేర కరెక్షన్కు గురైన ఈ సమయంలో సిప్‌ను ఆపకూడదు. దీనివల్ల తక్కువ ధరలకు ఎన్ఏవీలను కొనుగోలు చేసుకునే అవకాశం కోల్పోతారు. ముఖ్యంగా 12–18 నెలల క్రితం సిప్ ఆరంభించిన వారు కచ్చితంగా ఈ సమయంలో ఆపకుండా కొనసాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఏడాది, ఏడాదిన్నర క్రితం మార్కెట్ల వ్యాల్యూషన్లు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. కనుక గరిష్ట ధరల్లో పెట్టుబడి పెట్టిన వారు, ఇప్పుడు తక్కువ ధరకే కొనే అవకాశాన్ని కోల్పోకూడదు. లార్జ్‌క్యాప్‌నకు ప్రత్యామ్నాయాలు చాలా వరకు ప్రధాన లార్జ్‌క్యాప్ ఫండ్స్ గతేడాది మెరుగైన పనితీరు చూపించలేకపోయాయి. ఈ ఏడాది కూడా వీటి పనితీరు అంత బాగుండకపోవచ్చనే అంచనా ఉంది. అధిక రాబడులు కోరుకునే వారు అధిక రిస్క్ తీసుకోవాల్సి ఉంటుందని మరిచిపోవద్దు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ టాప్ 100, రిలయన్స్ లార్జ్‌క్యాప్, యూటీఐ మాస్టర్‌షేర్ పథకాలన్నీ గతేడాది ఒక శాతం నుంచి రెండున్నర శాతం నష్టాలను మిగిల్చాయి. ఇదే కాలంలో నిఫ్టీ– 50 సూచీ 3 శాతం రాబడులను ఇచ్చింది. కనుక లార్జ్‌క్యాప్ ఫండ్స్‌కు బదులు ఈ సమయంలో మల్టీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మల్టీక్యాప్ ఫండ్స్ భిన్న మార్కెట్ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయని వారు సూచిస్తున్నారు. దీంతో అధిక రాబడులిచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే రిస్క్ కాస్త తక్కువగానే ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే... మల్టీక్యాప్ ఫండ్స్ అయినప్పటికీ క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్) ద్వారా కనీసం ఐదేళ్లు ఆపైన ఇన్వెస్ట్ చేయడం ద్వారానే మెరుగైన రాబడులను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. పన్ను భారం తగ్గించుకోవచ్చు ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును కేంద్ర ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టడం తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత కూడా ఈక్విటీల్లోకి, మ్యూచువల్ ఫండ్స్‌లోకి రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఆగలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. సిప్ ద్వారా 2018లో వచ్చిన పెట్టుబడుల్లో 20 శాతం వృద్ధి నెలకొంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.లక్షకు మించి దీర్ఘకాల మూలధన లాభం పొందితే దానిపై 10 శాతం పన్ను చెల్లించాలి. అయితే, ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చే లాభాల్లో ఇది స్వల్ప మొత్తమేనని ఇన్వెస్టర్లు అర్థం చేసుకున్నట్టున్నారు. నిజానికి 10 శాతం పన్ను రాబడులను పెద్దగా ప్రభావం చేసేది కాదని నిపుణుల అభిప్రాయం కూడా. నెలకు సిప్ ద్వారా రూ.5,000– 10,000 మొత్తం ఇన్వెస్ట్ చేసే వారిపై ఇప్పటికిప్పుడు ఈ పన్ను ప్రభావం కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ స్వల్ప మొత్తంపై ఏడాదిలో వచ్చే లాభాలు పన్ను పడే స్థాయిలో ఉండవు. అదే రూ.30,000– 50,000 మధ్య ఇన్వెస్ట్ చేసే వారయితే వార్షికంగా 12 శాతం రాబడులు వచ్చాయనుకుంటే రెండేళ్ల తర్వాత మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తారు. రెండేళ్లలో వారు పొందే లాభం రూ.లక్ష దాటుతుంది. ఆ మొత్తాన్ని ఒకే ఆర్థిక సంవత్సరంలో తీసుకుంటేనే పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఈ పన్ను కూడా చెల్లించకుండా మార్గం ఉంది. ఏడాది దాటాక ప్రతీ నెలా అంతే మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటూ తిరిగి అదే ఫండ్ లేదా మరో ఫండ్ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. దీంతో పన్ను వర్తించేంత లాభాలు రాకముందే తిరిగి ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు 2018 ఏప్రిల్ నెలలో ఓ ఫండ్‌లో ఎన్ఏవీ రూ.25 వద్ద రూ.25,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. 1,000 యూనిట్లు వచ్చి ఉంటాయి. 2019 ఏప్రిల్ నెలతో ఏడాది పూర్తవుతుంది. ఆ మరుసటి నెలలోనే వెయ్యి యూనిట్లను రెడీమ్ చేసుకుని తిరిగి ఇన్వెస్ట్ చేయాలి. ఇలా ప్రతీ సిప్‌కు ఏడాది పూర్తయిన వెంటనే తిరిగి ఇన్వెస్ట్ చేస్తుంటే సరి. మల్టీ ఇయర్ హెల్త్ ప్లాన్ వైద్య బీమాకు ఏటా ప్రీమియం చెల్లించాలి. లేదంటే కవరేజీ ఆగిపోతుంది. దీనికి బదులు ఒకేసారి రెండేళ్లకు ప్లాన్ తీసుకుని ప్రీమియం చెల్లించడం వల్ల తగ్గింపుతోపాటు... ఏడాదికే ప్రీమియం చెల్లించాల్సిన ఇబ్బందీ తప్పుతుంది. న్యూఇండియా అష్యూరెన్స్ కంపెనీ 2017లో వృద్ధుల వైద్య బీమా ప్రీమియంను ఒకేసారి రెట్టింపునకు పైగా పెంచింది. కనుక ఒకేసారి ఎక్కువ సంవత్సరాలకు పాలసీ తీసుకోవడం వల్ల తగ్గింపు ఒక్కటే కాదు, ప్రీమియం పెరిగే భారం కూడా కొంత వరకు తప్పించుకున్నట్టు అవుతుంది. ఎన్పీఎస్ కూడా చూడొచ్చు.. జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) విశ్రాంత జీవనం కోసం ప్రణాళికలు వేసుకునే వారికి అనువైన సాధనాల్లో ఒకటి. ఇందులో చార్జీలు ఇతర సాధనాలతో పోలిస్తే తక్కువ. ఈక్విటీ, డెట్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 60 ఏళ్లు వచ్చాక ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంలో 20 శాతంపై పన్ను ఉండేది. ఇది నచ్చక చాలా మంది దీనికి దూరంగా ఉండిపోయారు. అయితే, ఎన్పీఎస్ పథకం నుంచి రిటైర్మెంట్ వయసులో ఉపసంహరించుకునే 60 శాతం మొత్తంపైనా పన్నును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. మిగిలిన 40 శాతాన్ని యాన్యుటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలని తెలిసిందే. ఇక ఈక్విటీల్లో యాక్టివ్ చాయిస్ కింద 75 శాతం వరకు ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తూ ఎన్పీఎస్ నిర్వహణను చూసే పీఎఫ్ఆర్డీఏ గతేడాది అక్టోబర్‌లో మరో నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు వచ్చే వరకూ కూడా ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతించింది. గత ఐదేళ్ల కాలంలో చూసుకుంటే వార్షికంగా రెండంకెల రాబడులు ఎన్‌పీఎస్‌లో ఉన్నాయి. ఈక్విటీలకు 50 శాతం వరకు కేటాయించుకునే వారికి 11.31 శాతం చొప్పున వార్షిక రాబడులు, పూర్తిగా డెట్‌కే పరిమితమైన వారికి వార్షికంగా 10.55 శాతం చొప్పున పెట్టుబడుల వృద్ధి ఉంది. ఇక పన్ను ప్రయోజనాలు అదనం. బేసిక్ వేతనంలో 10 శాతాన్ని సెక్షన్ 80సీసీడీ(2) కింద ఉద్యోగి తరఫున కంపెనీ ఎన్పీఎస్కు జమ చేస్తే పన్ను ఉండదు. అలాగే, సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద ఎన్‌పీఎస్‌లో అదనంగా మరో రూ.50,000 పెట్టుబడిపైనా పన్ను ఉండదు. కనుక దీన్ని తప్పకుండా పరిశీలించాల్సిన పథకంగా ఫైనాన్షియల్ అడ్వైజర్ల సూచన. విదేశీ ఫండ్స్‌లో కూడా... అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్ఏవీల ధరలు కొంత కాలం క్రితం వరకూ బాగా పెరిగాయి. తాజాగా అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో వాటి ఎన్ఏవీలు తగ్గుముఖం పట్టాయి. అంతమాత్రాన అమెరికా ఫండ్స్‌లో పెట్టుబడులు ఆపేయాల్సిన అవసరం లేదన్నది నిపుణుల విశ్లేషణ. అమెరికన్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఎన్నో అంశాలను అధ్యయనం చేశాకే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటుంటాయి. బలమైన బ్రాండ్, మార్కెట్ వ్యాల్యూ, బలమైన నగదు ప్రవాహాలు వంటి అంశాలను చూస్తాయి. పైగా డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణత కూడా పెట్టుబడుల విలువ పెరిగేందుకు దోహదపడుతుంది. కనుక తమ పిల్లలను విదేశీ విద్యకు పంపించాలనుకునే వారు ఈ తరహా ఫండ్స్‌లో ముందునుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రుణాన్ని బదలాయించుకుంటే...? రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయించే విషయంలో బ్యాంకులు వాటి అంతర్గత బెంచ్ మార్క్ రేటుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో పారదర్శకత తక్కువగా ఉంటోంది. దీనికి బదులు రెపో రేటు, 91, 182 రోజుల ట్రెజరీ బిల్లు ఈల్డ్ రేటు లేదా ఏదైనా ఇతర బెంచ్ మార్క్ మార్కెట్ రేటుకు అనుగుణంగా వడ్డీ రేట్లను అనుసరించాలని ఆర్బీఐ ఇటీవలే ఆదేశించింది. గృహ, ఆటోమొబైల్, వ్యక్తిగత రుణాలకూ ఇది అమలుకానుంది. బ్యాంకుల మధ్య పోటీ పెరిగి కస్టమర్లకు తక్కువ రేట్లకే రుణం లభించే పరిస్థితులకు ఇది దారితీస్తుంది. కనుక అధిక వడ్డీ రేటుకు రుణం తీసుకున్న వారు దాన్ని తక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు బదలాయించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. రుణం తొలి నాళ్లలో ఈఎంఐలో ఎక్కువ మొత్తం వడ్డీకే వెళుతుంది. కనుక మొదట్లోనే రుణాన్ని బదలాయించుకోవడం వల్ల ప్రయోజనం ఎక్కువ. పెద్దల పేరు మీద పెట్టుబడి 60 ఏళ్లు దాటిన వారు వార్షికంగా పొందే రూ.50వేల వడ్డీ ఆదాయానికి పన్నును మినహాయిస్తూ కేంద్రం గతేడాది నిర్ణయం తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. 60 ఏళ్ల లోపు వయసులో ఉన్న వారు ఏటా వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక తమ తల్లిదండ్రులకు పన్ను వర్తించేంత ఆదాయం లేకపోతే, వారికి గిఫ్ట్‌గా ఇచ్చి, వారి పేరిట డిపాజిట్ చేయడం మంచి ఆలోచన. ఇది చట్టబద్ధం కూడా. పైగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అర శాతం వరకు అధిక వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. భార్యా, పిల్లలకు గిఫ్ట్ ఇచ్చి వారి పేరిట ఇన్వెస్ట్ చేసినా, అది గిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆదాయం కిందే చట్టం పరిగణిస్తుంది. తల్లిదండ్రులకు గిఫ్ట్ ఇస్తే మోసపూరిత లావాదేవీగా చట్టం పరిగణించదని ట్యాక్స్‌స్పానర్ సంస్థ సహ వ్యవస్థాపకుడు సుధీర్కౌశిక్ తెలిపారు. షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్ ప్రస్తుతం వడ్డీ రేట్ల పరంగా ఆటుపోట్లు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. కనుక ఈ సమయంలో దీర్ఘకాల డెట్ ఫండ్స్ కంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ అనుకూలమని నిపుణులు పేర్కొంటున్నారు. దీర్ఘకాల ఫండ్స్, దీర్ఘకాలంలో గడువు తీరే బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఇంక్రిమెంటల్ రిస్క్ తీసుకున్నా గానీ దీర్ఘకాల డెట్ ఫండ్స్ తగినంత రాబడులను ఆఫర్ చేయడం లేదని, వీటికి బదులు మూడేళ్ల లోపు గడువు తీరే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చని ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఐవో ధావల్ దలాల్ సూచించారు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్ (రుణ చరిత్ర) ఉన్న కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చని కెనరా రొబెకో మ్యూచువల్ ఫండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగం హెడ్ అవనీష్ జెయిన్ సూచన. 2–5 ఏళ్ల కాలానికి ఇవి మంచి రాబడులను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపారు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లు డెట్ ఫండ్స్‌లో వడ్డీ రేట్ల రిస్క్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు ఆ ప్రయోజనం నష్టపోతారు. ఈ రకమైన రిస్క్ వద్దనుకునేవారు ఎఫ్ఎంపీలను పరిశీలించొచ్చు. ఇవి డెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేసి గడువు తీరే వరకు కొనసాగుతాయి. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు అనుగుణంగానే రాబడులు ఉంటాయి. -
ఎఫ్డీలకు సెలవ్..!
• ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు ఎన్నో • వడ్డీ రేట్లూ తగ్గినంత కాలం డెట్ ఫండ్స్ ఆకర్షణీయమే • పోస్టాఫీసు పథకాల్లోనూ మెరుగైన రాబడులు • ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో రాబడులు, పన్ను ఆదా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇతర స్థిరాదాయ పథకాలపైనా వడ్డీ రేట్లు ఆశాజనకంగా లేవు. ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఒక శాతానికి మించి రాబడులను ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మంచి రాబ డుల కోసం ఇన్వెస్టర్లు ఈ ప్రత్యామ్నాయాల వైపు చూడొచ్చు. డెట్ మ్యూచువల్ ఫండ్స్ ⇔ డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లలో రాబడులకు హామీ ఉండదు కానీ, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లకు మించి రాబడులను ఇస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. డెట్ ఫండ్స్‌లోనూ రిస్క్ కాల వ్యవధులను బట్టి... లిక్విడ్, అల్ట్రా షార్ట్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇన్కమ్, డైనమిక్ బాండ్ ఫండ్స్ ఇలా భిన్న రకాలు ఉన్నాయి. ⇔ నెలకోసం అయితే లిక్విడ్ఫండ్ అనువుగా ఉంటుంది. ⇔ నెల నుంచి మూడు నెలల వరకు పెట్టుబడి పెట్టేట్టు అయితే అల్ట్రా షార్ట్ టర్మ్ ఎంచుకోవచ్చు. ⇔ కనీసం ఓ ఏడాది పాటు పెట్టుబడి కదిలించను అని అనుకుంటే మాత్రం షార్ట్ టర్మ్ ఫండ్ లో పెట్టుబడి పెట్టవచ్చు. ⇔ పెట్టుబడుల కాల వ్యవధి మూడేళ్లు అయినా çపర్వాలేదనుకుంటే ఇన్కమ్ ఫండ్ అనువైనది. ⇔ మొదటి మూడు ఫండ్లలో రిస్క్ ఉండదు. ఇన్కమ్ ఫండ్, మూడేళ్లకు మించి పెట్టుబడి కోసం ఎంచుకునే ఫండ్లలో రిస్క్ ఉంటుందని తెలుసుకోవాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ స్థిరమైన రాబడులకు డైనమిక్ బాండ్స్ లో అవకాశం ఉంటుంది. భిన్న రకాల కాల వ్యవధులు, వడ్డీ రేట్లతో కూడిన పథకాల్లో మదుపు ద్వారా స్థిరమైన, మోస్తరు రాబడులను అందిస్తాయి. అక్రూయెల్ డెట్ ఫండ్స్ పెట్టుబడిలో కొంత భాగం అక్రూయెల్ డెట్ ఫండ్స్ కు కేటాయించుకోవడం కూడా సమంజసమే. వీటిలో పెట్టుబడులు కాలాన్ని బట్టి కాకుండా వడ్డీ రేట్ల ప్రాధాన్యం ఆధారంగానే ఉంటాయి. దీంతో రిస్క్ దాదాపుగా ఉండదు. ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ (ఎఫ్ఎంపీ) ఈ పథకాలు బ్యాంకు ఎఫ్‌డీల కంటే అర శాతం నుంచి ఒక శాతం ఎక్కువ రాబడులను ఇస్తాయి. గడువు తీరే వరకు వీటిలో పెట్టుబడులను కొనసాగించడం వల్ల వడ్డీ రేట్ల పరంగా ఆటు పోట్లు లేకుండా చూసుకోవచ్చు. పోస్టాఫీసు పథకాలు పోస్టాపీసు పథకాల వడ్డీ రేట్లు ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉన్నాయి. పీపీఎఫ్‌పై రాబడులకు పన్ను ప్రయోజనాలు, సీనియర్ సిటిజన్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజనపై కూడా వడ్డీ రేట్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) కంపెనీలు జారీ చేసే ఎన్సీడీలు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లనే ఆఫర్ చేస్తున్నాయి. కంపెనీ ఆర్థిక సామర్థ్యం, వ్యాపారం వృద్ధిలో ఉందా, బ్యాలన్స్ షీటు తదితర వివరాలు పరిశీలించే ఇన్వెస్ట్చేయాలి. లేదంటే అసలుకే ముప్పు ఏర్పడుతుంది. ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ అధిక పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఇవి చక్కగా నప్పుతాయి. 10 నుంచి 20 ఏళ్ల కాలంలో అధిక రాబడులను అందుకోవచ్చు. -
ఏంటా లాభాలు..
డిపాజిట్లు, డెట్ ఫండ్స్‌తో పోలిస్తే ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఆకర్షణీయమైన పన్ను ప్రయోజనాలున్నాయని చెప్పొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తంలో 65 శాతం కంటే అధికంగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. దీంతో ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఏడాదిలోగా వైదొలిగితే 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభ పన్ను, ఆ పన్నుపై 3 శాతం సర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదే బ్యాంకు డిపాజిట్లలో వచ్చే వడ్డీ ఆదాయంపై మీ శ్లాబును బట్టి పన్ను భారం ఏర్పడుతుంది. అలాగే ఏడాదికి వడ్డీ రూ.10,000 దాటితే టీడీఎస్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికి వస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తింపు పరిమితిని ఏడాది నుంచి మూడేళ్లకు పెంచారు. దీంతో డెట్ ఫండ్స్ పన్ను ప్రయోజన ఆకర్షణను కోల్పోయాయి. -
మహిళకు ఆర్థిక సాధికారత అవసరం..
నేటి మహిళకు ఆర్థిక స్వతంత్రం, సాధికారిత అవసరం. ఆధునిక కాలంలో భవిష్యత్ ఆర్థిక భద్రత వైపు వారు దృష్టి సారించాలి. మొదటిజీతం అందిన రోజు నుంచే దీనికి శ్రీకారం చుట్టాలి. మహిళలు చాలా మందిలో అద్భుత ప్రతిభా పాటవాలు ఉన్నాయి. అయితే ఆయా అంశాలను వారు తమ సొంత వ్యక్తిగత ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవడంలేదు. ఈ పరిస్థితి మారాలి. మొదటి మదుపు సిప్‌లో...! తమ కాళ్లపై తాము నిలబడుతూ, ఆర్థిక భరోసా పొందే క్రమంలో మహిళ మొదటిగా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే క్రమానుగత పెట్టుబడుల ప్రణాళికలపై (సిప్) దృష్టి పెడితే బాగుంటుంది. దీర్ఘకాలంలో మదుపు ప్రయోజనాన్ని భారీగా అందించడానికి దోహదపడే పథకాలివి. కొద్ది మొత్తాల్లో మదుపు దీర్ఘకాలంలో మంచి ఆర్థిక లబ్ధిని సిప్ స్కీమ్‌లు చేకూర్చుతాయి. మార్కెట్ భారీ ఒడిదుడుకుల ప్రభావం అంత భారీగా సిప్‌లపై ఉండదు. లక్ష్యాలు అవసరం ఆర్థిక భద్రత భరోసా పొందే క్రమంలో మహిళ తొలుత తన ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరం. అది బిడ్డ చదువు విషయంలో భవిష్యత్ వ్యయానికి సంబంధించినది కావచ్చు. లేదా హాలిడే ట్రిప్‌కు ఉద్దేశించినది కావచ్చు. ఆయా అంశాలను, వ్యయాలను మదింపుచేసుకుని, అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోడానికి ముందునుంచే ఆలోచించాలి. విద్య వంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను ఉద్దేశించనదైతే ఈక్విటీ ఫండ్స్‌లో మదుపు బెస్ట్. ఇప్పటి నుంచీ రెండేళ్లలో ఏదైనా విహారయాత్రకు ప్రణాళిక వేసుకుంటే... స్వల్పకాలిక డెట్ ఫండ్స్ తగిన ప్రయోజనాన్ని చేకూర్చే వీలుంది. ఇలా ఎన్ని లక్ష్యాలున్నా.... సంపదలో కొంత మొత్తాలను వేర్వేరుగా ఆయా లక్ష్యాలకు కేటాయించడం సముచితం. సలహాలూ తీసుకోవాలి... ఆర్థిక ప్రణాళికలకు సంబంధించి చక్కటి ప్రయోజనాలు పొందడానికి నిపుణుల సలహాలూ కీలకమే. సంపాదన మొత్తం, లక్ష్యాలు, జీవిత భద్రత, ఆర్థికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇత్యాధి అంశాలన్నింటినీ ఒక పేపర్‌మీద ఉంచుకుని తగిన భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకోవాలి. ప్రణాళికల రూపకల్పన విషయంలో అవసరమైతే నిపుణుల సలహాలనూ మహిళలు తీసుకోవాలి. మదుపు అంశాల విషయంలో నిపుణుల సలహాలు కీలకం. -
పోర్ట్‌ఫోలియో ఒకటే.. రేటింగ్‌లు వేరు?
నేను గత ఏడాది సెప్టెంబర్‌లో మోర్గాన్ స్టాన్లీ మ్యూచువల్ ఫండ్‌లో గ్రోత్, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లలో ఇన్వెస్ట్ చేశాను. ఈ ఏడాది జూన్ 27న ఇది హెచ్డీఎఫ్సీ లిక్విడ్ ఫండ్‌లో విలీనమైంది. విలీనమయ్యే రోజున గ్రోత్ ప్లాన్‌లో రూ.25,000, డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో రూ.4,500 చొప్పున లాభాల్లో ఉన్నాను. నేను ఈ ఫండ్స్‌లోనే కొనసాగుతున్నాను. ఈ ఫండ్స్ విలీనం కారణంగా నేనేమైనా సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాలా? నా ఇన్వెస్ట్మెంట్ డేట్‌ను విలీనమైన తేదీనుంచి పరిగణిస్తారని అనుకుంటున్నాను. నేను ఆర్జించిన ఈ రూ. 25,000, రూ. 4,500పై నా పన్ను బాధ్యత ఎలా ఉంటుంది? - పావని, వైజాగ్ ఫండ్ల విలీనమంటే ఒక ఫండ్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మరొక ఫండ్‌లోకి బదిలీ చేయడం. దీనిని ఒక ఫండ్ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని, మరొక ఫండ్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌చేయడంగా భావిస్తారు. అంటే ఒక ఫండ్ యూనిట్స్‌ను అమ్మేసి, మరొక ఫండ్ యూనిట్స్‌ను కొనుగోలు చేయడంగా చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోళ్లు, అమ్మకాలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాల్సి ఉంటుంది. ఫండ్స్ విలీనమైతే ఈ విషయాన్ని ఫండ్ హౌజ్‌లే చూసుకుంటాయి. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాల, స్వల్పకాల మూలధన లాభాల పన్నులు మాత్రం ఇన్వెస్టరే చెల్లించాల్సి ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్లను మించి మీరు కొనసాగిస్తే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20%(ఇండెక్సేషన్ తర్వాత) చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మూడేళ్ల కంటే తక్కువ కాలమే మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే స్వల్పకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. డెట్‌ఫండ్స్‌లో మీరు స్వల్పకాల మూల ధన లాభాలు గడిస్తే ఆ మొత్తాన్ని మీ ఆదాయానికి కలిపి మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను లెక్కిస్తారు. ఇక మీ విషయానికొస్తే, ఇన్వెస్ట్మెంట్స్ కాలం ఏడాది కంటే తక్కువే ఉన్నందున మీరు గ్రోత్ ప్లాన్‌లో ఆర్జిం చిన రూ.25,000పై, డివిడెండ్ రీ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆర్జించిన రూ.4,500లపై స్వల్పకాల మూలధనలాభాల పన్ను చెల్లించాలి. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) చెల్లించాల్సిన పనిలేదు. నేను ఈ ఏడాది జూన్‌లో హెచ్డీఎఫ్సీ మిడ్-క్యాప్, హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్‌లో సిప్ విధానంలో 12 నెలల పాటు ఇన్వెస్ట్ చేశాను. వచ్చే ఏడాది జూన్‌లో వీటిని నేను ఎన్‌క్యాష్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది డిసెంబర్లో ఎన్‌క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాను. అలా చేసుకోవచ్చా? అలాచేస్తే నాకు జూన్, 2015 నాటి ఎన్ఏవీ వర్తిస్తుందా? డిసెంబర్, 2015 నాటి ఎన్ఏవీ వర్తిస్తుందా? - శ్రీనివాస్, సూర్యాపేట మీరు ఏ రోజున మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటారో, ఏ రోజున ఉన్న ఎన్ఏవీనే మీ ఇన్వెస్ట్మెంట్స్ తుది విలువగా పరిగణిస్తారు. మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను 2015 జూన్ 1న ఉపసంహరించుకుంటే, ఆ రోజు ఎన్ఏవీ, 2015 డిసెంబర్ 1న ఉపసంహరించుకుంటే ఆ రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్వల్పకాలం కాకుండా దీర్ఘకాలం కొనసాగిస్తే మంచిది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను దీర్ఘకాలం కొనసాగిస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అందుకని మీకు సొమ్ము అత్యంత అవసరం అయితేనే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కితీసుకోండి. లేదంటే మరికొంత కాలం కనీసం మూడు సంవత్సరాల పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తే, మరిన్ని ప్రయోజనాలు పొందగలరు. ఒకే రకం మ్యూచువల్ ఫండ్ల రేటింగ్‌లు రెగ్యులర్ ప్లాన్‌కు ఒక రకంగా, డెరైక్ట్ ప్లాన్‌కు మరొకరకంగా ఉంటున్నాయి. ఉదాహరణకు ఎస్బీఐ మ్యాగ్నమ్ గిల్ట్-లాంగ్‌టర్మ్, యూటీఐ గిల్ట్ అడ్వాండేజ్-లాంగ్‌టర్మ్ ఈ ఫండ్స్ రెగ్యులర్ ప్లాన్ల రేటింగ్‌లు, డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్‌లు విభిన్నంగా ఉన్నాయి. ఈ రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్ల పోర్ట్‌ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, రేటింగ్‌లు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? - పర్వేజ్, హైదరాబాద్ ఒకే మ్యూచువల్ ఫండ్ల రెగ్యులర్, డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్‌లు భిన్నంగా ఉండడం సహజమే. వాటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ, వాటి రేటింగ్‌ల్లో తేడాలు ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్స్ వ్యయాలు తక్కువగా ఉంటాయి. ఫండ్ల పనితీరుపై వ్యయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపుతాయి. అందుకని రెగ్యులర్ ప్లాన్ల రేటింగ్స్‌తో పోల్చితే డెరైక్ట్ ప్లాన్ల రేటింగ్స్ వాటితో సమానంగా కానీ, ఒక్కోక్కప్పుడు వాటి కంటే ఉత్తమంగా గానీ ఉంటాయి. -
ఇంటర్నేషనల్ ఫండ్స్‌పై పన్నులు ఎలా ఉంటాయి?
నేను మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ ఏడాది బడ్జెట్లో ఈ తరహా ఫండ్స్‌కు సంబంధించి పన్ను విధి విధానాలు మారాయని మిత్రులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్ కొనసాగించమంటారా? వద్దంటారా? లేకుంటే ఈ ఫండ్ నుంచి పూర్తిగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకొని వేరే ఫండ్‌కు మళ్లించమంటారా? - లోకేశ్, జగిత్యాల మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది అంతర్జాతీయ ఫండ్. ఈ తరహా అంతర్జాతీయ ఫండ్స్‌కు సంబంధించి పన్ను నియమనిబంధనల్లో మార్పు, చేర్పులు చేస్తూ బడ్జెట్లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి ఫండ్స్‌ను ఇప్పుడు డెట్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ ఫండ్ నుంచి మీరు మూడేళ్ల తర్వాత మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సిన పనిలేదు. అలా కాకుండా మూడేళ్లలోపు మీరు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకుంటే మీరు పొందే లాభాలపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను ప్రతిపాదనల దృష్ట్యా ఇలాంటి ఫండ్స్‌కు ఆదరణ తగ్గుతోంది. అయినప్పటికీ, మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ షేర్స్ నాస్డాక్ ఈటీఎఫ్ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ కిందనే పరిగణించవచ్చు. అమెరికాలో ఉండి, అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీల్లోనే ఈ ఈటీఎఫ్ ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ ఫండ్ నుంచి బాగానే ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో కనీసం మూడేళ్లు ఇన్వెస్ట్ చేస్తేనే ప్రయోజనాలు పొందగలం. ఈ దృష్ట్యా చూస్తే పన్ను నిబంధనల ప్రభావం ఉండదు. నిరభ్యతరంగా ఈ ఫండ్‌లో మీ పెట్టుబడులను కొనసాగించండి. నా మిత్రుడు ఇటీవల ఒక యులిప్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు యులిప్స్ల సరళి మారిందని, ఇన్వెస్ట్ చేయమని నాకు కూడా సలహా ఇచ్చాడు. ఒక వేళ చేస్తే ఎంత కాలం వరకూ ఇన్వెస్ట్ చేయాలి? - పవన్, గుంటూరు మీ మిత్రుడు చెప్పింది కొంతవరకూ నిజమే. 2010 సెప్టెంబర్ తర్వాత వచ్చిన యులిప్‌లు అంతకు ముందటి యులిప్‌లతో పోల్చితే కొంచెం నయమే. కానీ అవి ఇన్వెస్ట్‌మెంట్‌కు తగ్గ ఫండ్స్ కావని చెప్పవచ్చు. వీటి ట్రాక్ రికార్డ్‌ను అంచనా వేయడం కష్టం. అంతేకాకుండా యులిప్‌లో లాకిన్ పీరియడ్ 5 సంవత్సరాలుగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ అంత పారదర్శకంగా యులిప్‌లు పనిచేయవు. బీమా, ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండిటిని వేర్వేరుగా చూడాలని మేం ఎప్పుడూ చెబుతుంటాం. యూలిప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు బదులుగా ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ముందుగా ఏదైనా మంచి రేటింగ్ ఉన్న బ్యాలెన్స్డ్ ఫండ్‌ను ఎంచుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాలెన్స్డ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్లను పరిశీలించవచ్చు. ఆ తర్వాత మీరు భరించగలిగే రిస్క్‌ను బట్టి, మీ ఆర్థిక లక్ష్యాలను బట్టి ఇతర మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. నేనొక టర్మ్ ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నాను. కానీ మార్కెట్లో చాలా టర్మ్ ప్లాన్లు ఉన్నాయి. అయితే వివిధ సంస్థల టర్మ్ ప్లాన్ల కవరేజ్ ఒకే విధంగా ఉన్నా, ప్రీమియమ్‌ల్లో మాత్రం చాలా మార్పులు ఉన్నాయి. 70-80 శాతం వరకూ తేడాలున్నాయి. ఇలా ఎందుకు ఉంటోంది ? నేను రిలయన్స్, అవైవా, ఏఎక్స్ఏ, ఎస్బీఐ లైఫ్‌లను షార్ట్‌లిస్ట్ చేశాను. తగిన సలహా ఇవ్వండి? - సుజాత, విజయనగరం టర్మ్ ప్లాన్స్‌కు ఒకే ఒక లక్ష్యం ఉంటుంది. బీమా చేసిన వ్యక్తి మరణిస్తే బీమా చేసిన మొత్తాన్ని చెల్లించడం. ఇక వివిధ కంపెనీలు వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని ప్రీమియమ్‌లను నిర్ణయిస్తుంటాయి. అందుకనే ఒక్కో సంస్థకు 70-80% వరకూ తేడా ఉండడం సాధారణమే. గతంలో బీమా కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌లు, వసూలు చేసే ప్రీమియం.. ఈ రెండు అంశాల ఆధారంగా టర్మ్ ప్లాన్లు తీసుకోవాలి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే, దిగువ సంస్థల టర్మ్ ప్లాన్లను పరిశీలించవచ్చు. భారతీ ఏఎక్స్ఏ లైఫ్ ఈప్రొటెక్ట్, అవైవా ఐ-లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఈ-షీల్డ్-లెవెల్ కవర్.. ఇవన్నీ ఆన్లైన్ టర్మ్ పాలసీలు. మీ వయస్సును బట్టి మీరు చెల్లించే ప్రీమియం, మీ బడ్జెట్, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన టర్మ్ప్లాన్ను ఎంచుకోండి. -
పెన్షన్ ఫండ్స్ ఉన్నాయా..?
నాకు ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. 7 శాతం వరకూ వడ్డీ వస్తుంది. వివిధ పథకాల్లో పొదుపు చేయగా మిగిలిన సొమ్ములను లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. డెట్ ఫండ్స్‌కు సంబంధించి పన్నుల్లో మార్పుచేర్పులు జరిగిన నేపథ్యంలో నేను ఇలా చేయడం సరైనదైనా? తగిన సూచనలివ్వండి? - గోపాల్, వరంగల్ మిగులు నిధులను లిక్వ్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదే. ఎప్పుడైనా వాటి నుంచి మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. అంతేకాకుండా రాబడులు కూడా బాగానే వస్తాయి. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కంటే అధికంగానే వస్తాయి. లిక్విడ్ ఫండ్స్‌లో మొదటి ఐదేళ్లలో ఏడాదికి 8 శాతం చొప్పున రాబడులు వస్తాయి. 91 రోజుల మెచ్యూరిటీకి మించిన ఏ ఇన్వెస్ట్మెంట్ సాధనంలో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులు పెట్టవు. అందుకనే ఇతర డెట్ ఫండ్స్‌పై వడ్డీరేట్ల హెచ్చుతగ్గుల ప్రభావం ఉన్నట్లుగా లిక్విడ్ ఫండ్స్‌పై ఉండదు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో స్థిరమైన రాబడులు వస్తాయి. కానీ కొన్ని ఇబ్బందులుంటాయి. ఉదాహరణకు యెస్ బ్యాంక్ రూ.1 లక్షకు మించిన బ్యాలెన్స్ ఉన్న సేవింగ్స్ అకౌంట్‌కు 7శాతం వడ్డీని ఇస్తోంది. రూ. లక్ష కంటే తక్కువగా ఉంటే 6 శాతం వడ్డీరేటునే ఇస్తోంది. ఈ బడ్జెట్లో లిక్విడ్ ఫండ్స్‌కు సంబంధించి పన్ను విషయాల్లో కొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేసే వారికే ఈ మార్పులు వర్తిస్తాయి. ఏడాది లోపు ఇన్వెస్ట్‌మెంట్స్‌పై షార్ట్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంది. వ్యక్తుల ఆదాయపు పన్న స్లాబ్‌ననుసరించి ఈ పన్ను ఉంటుంది. అందుకని మూడేళ్లలోపు మీరు మీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే, మీరు మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి 10-30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నేను, మావారు హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ నుంచి చెరొక కోటి రూపాయలకు టర్మ్ బీమా పాలసీలు తీసుకున్నాం. ఇది సరైన టెర్మ్ బీమా ప్లానేనా? ఈ ప్లాన్‌లోనే కొనసాగమంటారా? ఇన్వెస్ట్ చేయడానికి ఉత్తమమైన పెన్షన్ మ్యూచువల్ ఫండ్స్‌ను సూచించండి? యాన్యుటీ ఆధారిత ప్లాన్లను ఎంచుకోవడం కరెక్టేనా? - మల్లిక, హైదరాబాద్ హెచ్డీఎఫ్సీ క్లిక్2ప్రొటెక్ట్ అనేది ఉత్తమమైన ఆన్లైన్ టర్మ్ బీమా పాలసీల్లో ఒకటి. సరైన మొత్తానికి టర్మ్ బీమా పాలసీని తీసుకోవడం సరైన నిర్ణయం. మీరు రిటైరయ్యేవరకూ, లేదా మీ కుటుంబంలో మీ వారసులు సంపాదన పరులయ్యేంత వరకూ ఈ ప్లాన్‌లో కొనసాగండి. రిటైర్మెంట్ ఫండ్స్‌గా పేరున్న రెండు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఉన్నాయి. అయితే రిటైరైన తర్వాత ఇవి రెగ్యులర్ పింఛన్‌ను ఆఫర్ చేయడం లేదు. ప్రస్తుతానికైతే మార్కెట్లో స్పెషలైజ్డ్ పెన్షన్ ఫండ్ ఏదీ అందుబాటులో లేదు. ఇలాంటి ఫండ్స్ గురించి బడ్జెట్లో ప్రస్తావించారు. అయితే మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఈ పెన్షన్ ఫండ్స్‌పై కసరత్తు చేస్తున్నాయి. త్వరలో అందుబాటులోకి రావచ్చు. పెన్షన్ ఫండ్స్‌కు ప్రత్యామ్నాయంగా యూనిట్ లింక్డ్ పెన్షన్ ప్లాన్(యూఎల్‌పీపీ), ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్స్‌ను పరిశీలించవచ్చని కొందరు చెబుతుంటారు. కానీ ఇది సరికాదు. యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఖరీదైనవే కాకుండా ఇవి ఇచ్చే రిటర్న్‌లు తక్కువగా ఉంటాయి. ఇక ఎండోమెంట్ పెన్షన్ ప్లాన్ల వ్యయాలు, ఖర్చులు మీ రాబడులను తినేస్తాయి. రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడానికి ఉత్తమమైన వ్యూహం ఒకటుంది. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే ఈ వ్యూహం. రిటైర్మెంట్ దగ్గరకు వచ్చినప్పుడు బీమా కంపెనీల నుంచి ఇమ్మిడియేట్ యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. నా వయస్సు 42 సంవత్సరాలు. రానున్న పదేళ్లలో నేను రూ.75 లక్షల వరకూ ఇన్వెస్ట్ చేయగలను. ఒక ప్రైవేట్ బ్యాంక్ 9 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. కొంతమంది మిత్రులేమో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమంటున్నారు. తగిన సూచనలివ్వండి? - ప్రహ్లాదరావు, విజయవాడ మీరు పొదుపు చేయాలనుకుంటున్న మొత్తంలో సగభాగాన్ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అయితే స్వల్పకాలానికే ఎఫ్డీ తీసుకోండి. మిగిలిన మొత్తాన్ని ఏదైనా బ్యాలెన్స్డ్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయండి. ఇలా ఒక ఆర్నెల్ల నుంచి ఏడాది పాటు చేయండి. ఇలాచేయడం వల్ల సిప్ ఎలా పని చేస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు, ఎఫ్‌డీల రాబడులు, మ్యూచువల్ ఫండ్స్ పనితీరు తదితర అంశాలపై మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ తర్వాత ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక బ్యాలెన్స్డ్ ఫండ్స్ విషయానికొస్తే, ఇవి సురక్షితమైనవి, వృద్ధికి అవకాశం కలవి. ఎఫ్డీలపై వచ్చే రాబడులతో పోల్చితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. -
డెట్‌ఫండ్స్ కన్నా ఎఫ్డీలు మిన్న
అన్ని రేట్లూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో .. ఇటీవలి పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించలేదు. మరోవైపు, మార్కెట్ ఆధారిత డెట్ ఫండ్స్‌పై మాత్రం కొత్త నిబంధనలు విధించింది. దీంతో ఇప్పటిదాకా ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఆకర్షణీయంగా కనిపించిన డెట్ ఫండ్స్ వన్నె తగ్గింది. చాలా మంది ఎఫ్‌డీలవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే ఎఫ్‌డీలే సురక్షితం అన్న భావన నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రత్యేక కథనం. ఇన్వెస్టరు ప్రధాన లక్ష్యం.. తాను పెట్టిన పెట్టుబడి సురక్షితంగా ఉండటం, రాబడులు రావడం, పెట్టిన పెట్టుబడి వృద్ధి చెందడం. ప్రస్తుతం ఎన్ని కొత్త సాధనాలు వస్తున్నప్పటికీ.. ఏ ఇన్వెస్టరైనా ప్రధానంగా వాటిలో ముందుగా చూసేది ఈ మూడు అంశాలే. అందుకే మనలో చాలా మంది తమ కష్టార్జితాన్ని బ్యాంకు డిపాట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం ఈ కోవకి చెందిన సాధనాల్లో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ చర్చనీయాంశంగా మారాయి. రిస్కు అంటే అస్సలు ఇష్టపడని వారు ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలో అర్థంగాక సతమతమవుతున్నారు. రిస్కు తీసుకునే సామర్థ్యం, రాబడి అంచనాలు, కాలవ్యవధి లాంటి అంశాలను బట్టి ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలా లేక ఫండ్స్‌ని ఎంచుకోవాలా అన్నది వ్యక్తిగతమైన అభిప్రాయాలపై ఆధారపడి ఉండే విషయం. అయినప్పటికీ .. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎఫ్డీలలో ఇన్వెస్ట్ చేయడం ఎందుకు మంచిదన్నది తెలియజెప్పేందుకు ఈ ప్రయత్నం. స్వల్పకాలికం.. దీర్ఘకాలికం.. దీర్ఘకాలికంగా మంచి రాబడులు ఇస్తాయని మ్యూచువల్ ఫండ్స్‌కి పేరున్నప్పటికీ.. స్వల్ప కాలిక వ్యవధి విషయంలో వీటికి అంతగా మార్కులు పడవు. ఎందుకంటే ఫండ్స్ అనేవి.. మార్కెట్స్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. ఫలితంగా స్వల్పకాలిక వ్యవధిలో ఒకవేళ మార్కెట్ల పరిస్థితి గానీ బాగా లేకుంటే రాబడి సంగతి అటుంచి కొన్ని సార్లు పెట్టిన పెట్టుబడిలో సింహభాగం రాకుండా పోయే అవకాశాలూ ఉన్నాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయం తీసుకుంటే.. స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనా రాబడి గ్యారంటీగా ఉంటుంది. వీటిపై వడ్డీ రేట్లు ఆయా కాల వ్యవధికి సంబంధించి స్థిరంగా ఉండటమే ఇందుకు కారణం. ఎఫ్‌డీల్లో ‘నష్టం’ అన్న పదం వినిపించదు. ఇన్వెస్టరుకు అన్ని రకాల ప్రయోజనం చేకూర్చే సాధనం ఇది. పెట్టుబడులపై స్థిరమైన రాబడులు.. బ్యాంకు డిపాజిట్ల కింద ఇన్వెస్ట్ చేసేటప్పుడే నిర్దిష్ట శాతం మేర రాబడులు ఉంటాయని ఇన్వెస్టరుకు బ్యాంకు ముందుగానే చెబుతోంది. ఉదాహరణకు మీరు అయిదేళ్ల కాల వ్యవధి కోసం 9 శాతం వార్షిక వడ్డీ రేటు లెక్కన రూ. 50,000 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం కాలవ్యవధిలో మీకు అదే వడ్డీ రేటు కొనసాగుతుంది. అంతే తప్ప తగ్గదు. అదే, డెట్ మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. కచ్చితమైన రాబడి రేటు ఉండదు. ఎందుకంటే.. ఇవి పూర్తిగా మార్కెట్‌పైనా, ఫండ్ పనితీరుపైనా ఆధారపడి ఉంటాయి. మనీ మార్కెట్లో తీవ్ర హెచ్చుతగ్గులు .. సదరు ఫండ్ ఎన్‌ఏవీలపై ప్రభావం చూపుతాయి. దీంతో రాబడులు మారిపోతుంటాయి. కనుక చెప్పొచ్చేదేమిటంటే.. మార్కెట్లు ఎలా ఉన్నా కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై ముందుగా అనుకున్న రాబడి మాత్రం కచ్చితంగా చేతికొస్తుందన్న గ్యారంటీ ఉంటుంది. లిక్విడిటీ.. ఫిక్స్డ్ డిపాజిట్లకు కాస్త దీర్ఘకాలిక లాకిన్ వ్యవధి ఉన్నప్పటికీ... అవసరమైతే స్వల్ప పెనాల్టీతో (సుమారు 1 శాతం) ముందస్తు విత్‌డ్రాయల్స్‌కు చాలా మటుకు బ్యాంకులు అనుమతిస్తాయి. ఇలాంటప్పుడు ఎన్నాళ్ల పాటు డబ్బును ఇన్వెస్ట్ చేశారన్న దానిపై వడ్డీ రేటును లెక్క గట్టి ఇస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ స్వల్ప వ్యవధిలో ఎన్ని యూనిట్లయినా రిడీమ్ చేసుకోవచ్చు. ఆ రోజున సదరు ఫండ్ ఎన్ఏవీని బట్టి ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయల్‌పై రాబడి ఆధారపడి ఉంటుంది. అయితే, ఫండ్స్‌లో ఏడాది వ్యవధికన్నా ముందుగానే విత్‌డ్రా చేసుకుంటే 1 శాతం మేర ఎగ్జిట్ లోడు పడుతుంది. రిస్కు తక్కువ.. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై రాబడనేది.. మార్కెట్ హెచ్చుతగ్గుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకోసారి పెట్టిన దానికన్నా కూడా తక్కువ మొత్తం చేతికొచ్చే అవకాశాలూ ఉంటాయి. మరోవైపు ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో అలాంటి రిస్కులు ఉండవు. ఇన్వెస్ట్ చేసిన వారు ఉద్యోగి అయినా... రిటైరయిన వ్యక్తయినా సరే.. స్థిరంగా, రెగ్యులర్‌గా ఆదాయం అందిస్తాయి. ఇన్వెస్ట్ చేసినందుకు ఖర్చులూ ఉండవు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేస్తే.. దానికి సంబంధించి అదనపు ఖర్చులేమీ ఉండవు. అదే ఫండ్ విషయానికొస్తే రాబడులు ఎలా ఉన్నా సరే.. మ్యూచువల్ ఫండ్ నిర్వహణ వ్యయాల కింద కనీస చార్జీలను ఇన్వెస్టరే భరించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే.. మీకు రాబడి వచ్చినా రాకున్నా.. లేదా అసలు మొత్తానికే ఎసరు వచ్చినా.. మీరు మాత్రం ఫండ్ నిర్వహణ ఫీజులను భరించాల్సిందే. కాని బ్యాంకు డిపాజిట్లలో ఎటువంటి ఫీజులు ఉండవు. ఫండ్స్‌తో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో ఇన్వెస్టరుకు అదనపు వ్యయాలంటూ ఉండవు. ఎఫ్డీ అనేది కచ్చితమైన రాబడులు అందించాల్సిందే. ఏదైతేనేం.. సగటు ఇన్వెస్టరు కష్టార్జితంపై రాబడులు అందించే సురక్షిత సాధనం ఫిక్స్డ్ డిపాజిట్. స్వల్పకాలికమైనా.. దీర్ఘకాలికమైనా ఇందులో పెట్టుబడికి భద్రత ఉంటుంది. అలాగే, ఇన్వెస్టరు, వారి కుటుంబానికి ఆర్థికపర మైన భరోసా కూడా లభిస్తుంది. -
బాలల భవితకు ఇపుడే ప్లాన్ చేద్దాం
బాలల బంగారు భవితకు బాటలు వేయాల్సింది తల్లిదండ్రులే. పిల్లల ఆరోగ్య సంరక్షణకు, ఉన్నత విద్యకు, వివాహాలకు ప్రణాళికాబద్ధంగా పొదుపు చేయాలి. సమాజంలో ఎక్కువ మందికి ఉండేది స్థిరాదాయమే కాబట్టి, కుటుంబ బడ్జెట్లో పిల్లల భవిష్యత్తు అవసరాలకు తగిన ఏర్పాట్లుండాలి. పిల్లల ఉన్నత విద్యకు డబ్బు ఆటంకం కాకూడదని అందరూ కోరుకుంటారు. చదువుకయ్యే వ్యయం ఏటేటా పెరిగిపోతున్న విషయాన్ని పెద్దలు దృష్టిలో ఉంచుకోవాలి. బాలలకు తగిన ఎన్నో బీమా పథకాలిపుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో సరైన వాటిని ఎంచుకుంటే వారి భవిష్యత్తు ఒడిదుడుకుల్లేకుండా సాగిపోతుంది. అలాంటి వాటిని ఎంపిక చేయడానికి నాలుగు సులువైన సూత్రాలివి... బాలల భవిష్యత్తుకు తగిన ప్లాన్ రూపొందించి, సాధ్యమైనంత ముందుగానే పెట్టుబడులు ప్రారంభించాలి. పిల్లలకు 18 ఏళ్లు నిండిన వెంటనే మెచ్యూరిటీ బెనిఫిట్లను అందించే పథకాలను అనేక బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. అలాగే, 18 ఏళ్లు నిండిన తర్వాత నిర్ణీత కాలాల్లో చెల్లింపులు చేసే ప్లాన్లూ ఉన్నాయి. కనుక, మీ లక్ష్యాలను నిర్దేశించుకుని, మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను సంప్రదించి దీర్ఘకాలిక పెట్టుబడులకు శ్రీకారం చుట్టండి. బాలలకు సంబంధించిన అనేక ప్లాన్లలో ప్రీమియం మాఫీ కూడా ఉంటుంది. దురదృష్టవశాత్తూ పేరెంట్ మరణిస్తే ఆ తర్వాతి నుంచి ప్రీమియం కట్టాల్సిన అవసరం ఉండదు. పాలసీ మెచ్యూరిటీ అయ్యే వరకు బీమా కంపెనీలే ఆ భారాన్ని భరిస్తాయి. ప్రీమియం మాఫీ ఒక ఆప్షన్‌గా ఉండవచ్చు లేదా ప్రధాన ప్లాన్‌లో ఒక అంశంగా ఉండవచ్చు. తగినంత రిస్కు కవరేజీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉండే ప్లాన్‌ను ఎంచుకోవడం మంచిది. అంటే, మీ ప్లాన్‌లో గ్రోత్, డెబిట్ ఫండ్లు, రిస్కు కవరేజీ సమతులంగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లపై లాభాలను పదిలంగా ఉంచే సిస్టమ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ కలిగిన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. వార్షిక ప్రీమియంకు కనీసం 20 రెట్లుండే రిస్క్ కవర్‌ను తీసుకోవాలి. ఎందుకంటే, పిల్లల తరఫున బీమా చేయించిన వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి గణనీయమైన మొత్తం అందుతుంది. పాలసీ బ్రోచర్‌ను క్షుణ్ణంగా చదవాలి. పాలసీకి అయ్యే ఖర్చును ఆకళింపు చేసుకోవాలి. ఏ ప్రొడక్టుకు ఎంత వ్యయం అవుతుందో బ్రోచర్లో విపులంగా ఉంటుంది. వివిధ కంపెనీలు అందిస్తున్న ప్రొడక్టులను, వాటి చార్జీలనూ విశ్లేషించాలి. బీమా కంపెనీ ప్రతిష్టను, వారందించే సేవలను పరిశీలించాలి. ప్లాన్లలోని ఫ్లెక్సిబిలిటీని తెలుసుకోవాలి. ఏమైనా అనుమానాలుంటే ఇన్సూరెన్స్ ఏజెంటును అడిగి తెలుసుకోవాలి. -
బీమాతో ఇన్వెస్ట్ చేద్దాం..
స్టాక్ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లు 18 శాతానికిపైగా రాబడిని అందించాయి. ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రానున్న కాలంలో కూడా ఇదే విధమైన రాబడులను ఆశించవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో యులిప్స్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తూ ఐఆర్డీఏ నిబంధనలు మార్చడంతో తిరిగి వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ గత జ్ఞాపకాలు మాత్రం ఇంకా నీడలా అలాగే వెంటాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు గమనించాల్సిన అంశాలపై ఈ వారం ప్రాఫిట్ ముఖ్య కథనం. జీవిత బీమా రక్షణతో పాటు, ఇన్వెస్ట్మెంట్స్, పన్ను ప్రయోజనాలను కలిగి ఉండటం యూనిట్ ఆధారిత బీమా పథకాల (యులిప్స్) ప్రత్యేకత. అందుకే గతంలో వీటిని బాగా ఆదరించారు. కానీ తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ మిస్సెల్లింగ్కి తోడు స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో చాలామంది వీటిల్లో ఇరుక్కుపోయారు. దీంతో యులిప్స్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఐఆర్డీఏ రంగంలోకి దిగి యులిప్స్ నిబంధనలను మార్చి పారదర్శకంగా తీసుకురావడంతో ఇప్పుడవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇప్పటికే యులిప్స్‌ను విడుదల చేయగా మరికొన్ని బీమా కంపెనీలు విడుదల చేసే యోచనలో ఉన్నాయి. ఐదేళ్ల లాకిన్ యులిప్స్ పథకాల ద్వారా సేకరించిన మొత్తాన్ని బీమా కంపెనీలు స్టాక్ మార్కెట్లు, డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పాలసీదారులకు లాభనష్టాలను అందిస్తాయి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది రిస్క్‌తో కూడుకున్నది కావడం, ఒడిదుడుకులుండటంతో వీటిని దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా పరిగణిస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే యులిప్స్ లాకిన్ పీరియడ్‌ను మూడేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. ఇప్పుడు యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కనీసం ఐదేళ్ల వరకు వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీంతో నష్టభయం బాగా తగ్గింది. తగ్గిన సరెండర్ చార్జీలు కాలపరిమితి కంటే ముందుగానే సరెండర్ చేస్తే పెనాల్టీలు భారీగా ఉండేవి. ఇప్పుడు ఇలా మధ్యలో మానేసిన వారికోసం డిస్కంటిన్యుయేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేయడంతో సరెండర్ చార్జీలు బాగా తగ్గాయి. దీంతో అత్యవసర సమయాల్లో పాలసీని కాలపరిమితి కంటే ముందుగానే రద్దు చేసుకుంటే అధిక పెనాల్టీలు చెల్లించే బాధ తప్పింది. గరిష్టంగా రూ.6,000 మించి సరెండర్ వేల్యూ విధించకూడదు. కమీషన్లు తగ్గాయి గతంలో యులిప్స్ పథకాలను విక్రయిస్తే ఏజెంట్లకు మొదటి సంవత్సరం 30 నుంచి 40 శాతం వరకు కమీషన్లు వచ్చేవి. ఇప్పుడు గరిష్టంగా 15 శాతం మించి ఇవ్వడానికి వీలు లేదు. అలాగే రెండో ఏడాది 7.5%, మూడో ఏడాది నుంచి 5 శాతం మించి కమీషన్లు ఇవ్వడానికి లేదు. కమీషన్లు తగ్గడంతో ఆ మేరకు రాబడి పెరిగింది. ఇదే కాకుండా ఇతర ఫండ్ నిర్వహణ చార్జీలను కూడా బాగా తగ్గించడంతో పాటు వీటిల్లో పారదర్శకత తెచ్చారు. కట్టకపోయినా రద్దు కాదు.. సాధారణంగా బీమా పథకాల్లో ప్రీమియంలు చెల్లించకపోతే పాలసీ రద్దు అవుతుంది. దీంతో బీమా పథకం అందించే ప్రయోజనాలన్నీ రద్దు అవుతాయి. కానీ ఇప్పుడు యులిప్స్‌లో అటువంటి ఇబ్బంది లేదు. ఒక వేళ ప్రీమియం కట్టడం ఆపేస్తే అప్పటి దాకా ఉన్న ఫండ్ విలువను డిస్కంటిన్యూడ్ ఫండ్‌కి బదలాయిస్తారు. పాలసీ కాలపరిమితి తీరే వరకు లేదా తిరిగి ప్రీమియంలు చెల్లింపులు మొదలు పెట్టేవరకు ఈ పాలసీ అకౌంట్ వేల్యూ కొనసాగుతూనే ఉంటుంది. ఇలా బదలాయించిన డిస్కంటిన్యూడ్ ఫండ్‌లో ఉన్న విలువపై సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వడ్డీని తప్పనిసరిగా ఇవ్వాలని ఐఆర్డీఏ ఆదేశించింది. అంటే ప్రస్తుత రేటు ప్రకారం ఈ డిస్కంటిన్యూడ్ ఫండ్‌పై 4 శాతం గ్యారంటీ రాబడి వస్తుందన్నమాట. పోర్ట్‌ఫోలియో బ్యాలెన్స్ యులిప్స్‌లో ఉన్న ప్రధానమైన ఆకర్షణ ఏమిటంటే... మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను రక్షించుకోవడానికి ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి మారవచ్చు. కొన్ని బీమా కంపెనీలైతే ఇలా ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కి ఎన్నిసార్లైనా ఉచితంగా మారే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. వయసు, రిస్క్ సామర్థ్యం, ఆర్థిక లక్ష్యం, మార్కెట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా డెట్, ఈక్విటీ పథకాల్లోకి మన పెట్టుబడులను మార్చుకోవచ్చు. ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది తెలియకపోతే కొన్ని బీమా కంపెనీలు వయసు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఒక ఫండ్‌ను ఎంపిక చేస్తాయి. -సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం పెరుగుతున్నాయనైతే వద్దు.. ఇప్పుడున్న ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో అత్యంత పారదర్శకత కలిగినవి యులిప్స్ అని చెప్పవచ్చు. చార్జీలు తక్కువగా ఉండటంతో దీర్ఘకాలిక దృష్టితో యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయన్న దృష్టిలో పెట్టుబడి పెట్టకూడదు. ఈక్విటీల్లో ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి వీటికి సిద్ధపడి, దీర్ఘకాలం వేచి చూడగలిగేవారే ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ప్రస్తుతానికి మార్కెట్లు పెరుగుతున్నా గత భయాలు ఇంకా వెంటాడుతుండటంతో కొత్తగా ఎటువంటి డిమాండ్ కనిపించడం లేదు. - డాక్టర్ పి. నందగోపాల్, ఎండి, సీఈవో ఇండియా ఫస్ట్ లైఫ్ బీమా, ఇన్వెస్ట్మెంట్ కలపొద్దు జీవిత బీమా రక్షణ, పెట్టుబడి అనేవి రెండు విభిన్నమైనవి. ఎప్పుడూ ఈ రెండింటినీ కలిపి చూడొద్దు. దీర్ఘకాలిక లక్ష్యానికయితే యులిప్స్ కంటే... ఒక టర్మ్ ప్లాన్ తీసుకొని మిగిలిన మొత్తం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయమని సూచిస్తాను. ఒకవేళ పన్ను ప్రయోజనాలు కావాలంటే ఎటువంటి రిస్క్ లేకుండా 8-9 శాతం రాబడిని అందించే సాధనాలు ఎలాగూ ఉన్నాయి. అయినా సరే యులిప్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామంటే మాత్రం నాలుగైదేళ్ళ దృష్టితో కాకుండా కనీసం 10 ఏళ్లు వేచి ఉండగలిగితేనే ఇన్వెస్ట్ చేయండి. - మాధవి రెడ్డి, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కంపెనీ పేరు యులిప్స్ పథకాలు ఐసీఐసీఐ ప్రు లైఫ్ గ్యారంటీ వెల్త్ ప్రొటెక్టర్, ఎలైట్ లైఫ్ హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రొ గ్రోత్, ఇన్వెస్ట్ వైజ్ మాక్స్ లైఫ్ ఫాస్ట్ ట్రాక్ సూపర్, ఫర్ ఎవర్ యంగర్ పెన్షన్, శిక్షా ప్లస్ సూపర్ ఇండియా ఫస్ట్ స్మార్ట్ సేవ్ ప్లాన్ గుర్తుంచుకోవాల్సినవి... 4 యులిప్స్ ఎటువంటి గ్యారంటీ రాబడులను అందించవు. 4 ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ సాధనం. 4 కనీసం 10 ఏళ్లు వేచి చూసేవారికే అనువైనవి. 4 మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్స్‌లో పెట్టుబడులు మార్చుకోవచ్చు. 4 చెల్లించే ప్రీమియంపై సెక్షన్ 80సీ ప్రకారం లక్ష వరకు పన్ను మినహాయింపు. 4 రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు.