మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మూలధన లాభాలపై పన్నులు ఎలా ఉంటాయో కొంత వరకూ అవగాహన ఉంది. అయితే పాక్షికంగా విత్‌డ్రాయల్స్ విషయంలో పన్నులు ఎలా ఉంటాయి ? – అనురాధ, హైదరాబాద్
మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసి కొన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లు కొనుగోలు చేశారు. దీంట్లో కొంత భాగాన్ని విక్రయించారనుకుందాం. మీరు యూనిట్లు కొనుగోలు చేసిన తేదీ, యూనిట్లను విక్రయించిన తేదీలను పరిగణనలోకి తీసుకొని మీకు వచ్చిన లాభాలు దీర్ఘకాలిక మూలధన లాభాలా ? స్వల్ప కాలిక మూలధన లాభాలా అనే విషయాన్ని నిర్దారిస్తారు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్(ఎఫ్‌ఐఎఫ్‌ఓ) సూత్రాన్ని ఇక్కడ అన్వయిస్తారు. మొదటగా కొనుగోలు చేసిన దాన్ని మొదటగా రిడీమ్ చేసినట్లుగా భావిస్తారు. ఉదాహరణకు మీరు ఒక ఈక్విటీ ఫండ్‌లో రూ.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేశారనుకుందాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్)విధానంలో ఈ ఫండ్‌లో కొన్నేళ్లుగా ఇన్వెస్ట్ చేశారనుకుందాం. దీంట్లోంచి రూ. లక్ష మేర యూనిట్లను విక్రయించాలనుకున్నారనుకుందాం. వెయ్యి యూనిట్లను విక్రయించి రూ. లక్ష రిడీమ్ చేశారనుకుందాం. అన్నింటి కంటే ముందుగా కొన్న యూనిట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో ముందు కొన్న యూనిట్లను ముందుగా రిడీమ్(విక్రయించినట్లుగా) చేసినట్లుగా భావిస్తారు. మీరు విక్రయించిన యూనిట్లలో ఏడాది క్రితం కొన్నవి కొన్ని, ఏడాది లోపల కొన్నవి కొన్ని ఉండొచ్చు. ఇలాంటి సందర్భంలో మీరు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి రావచ్చు.
ప్ర: నేను మరో ఐదేళ్లలో రిటైర్ కాబోతున్నాను. రిటైర్మెంట్ అవసరాల కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నాను. రిటైరైన తర్వాత మొదటి ఐదేళ్ల ఖర్చుల నిమిత్తం ఈ రిటైర్మెంట్ నిధి నుంచి కొంత మొత్తాన్ని డెట్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమేనా ? ఇప్పుడు నేను ఏం చేయాలి ? –ఈశ్వర్, విశాఖపట్టణం
ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఎపిసోడ్ నేపథ్యంలో డెట్ ఫండ్స్ పట్ల మీకే కాదు చాలా మందికి సంశయాలు ఏర్పడ్డ విషయం వాస్తవమే. అయితే ఈ భయాల నుంచి వీలైనంత త్వరగా బైటకు రండి. అలా చేయకపోతే, మీరు డెట్ ఫండ్స్ అందించే మంచి ప్రయోజనాలు మిస్ చేసుకున్నవారవుతారు. కొత్తగా వచ్చిన సైడ్–పాకెటింగ్ రూల్స్(మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన ఏవైనా కంపెనీలు చెల్లింపుల్లో విఫలమైనా, ఆ తర్వాత రికవరీ చేసుకొని, ఆ రికవరీని ఇన్వెస్టర్లకు అందించడం(ఈ ఇన్వెస్టర్లు యూనిట్లను విక్రయించినా సరే, భవిష్యత్తులో వారికి ఆ మొత్తాన్ని అందించే వెసులుబాటు ఈ సైడ్ పాకెటింగ్ రూల్స్‌లో ఉన్నాయి) కారణంగా జరగరానిది ఏదైనా జరిగినా, మీ డబ్బులు పూర్తిగా రికవరీ అయ్యే అవకాశాలున్నాయి. డెట్ ఫండ్స్ పట్ల మీకు ఇప్పుడు సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక విభిన్నమైన వ్యూహాన్ని సూచిస్తున్నాను. మీరు రిటైరైన తర్వాత మూడున్నరేళ్లకు కావలసిన మొత్తం ఖర్చులు ఎంతో లెక్కేయ్యండి. ఈ మొత్తాన్ని సేవింగ్స్ లింక్డ్ డిపాజిట్ ఖాతాలో డిపాజిట్ చేయండి. బాండ్ల ఫండ్ల కన్నా ఈ ఖాతాలో రెండు నుంచి రెండున్నర శాతం తక్కువ రాబడులు వస్తాయి. అయితే మీరు ఈ సొమ్ములను ఎప్పుడు అవసరమైతే, అప్పుడు సులభంగా తీసుకోవచ్చు. ఆ తర్వాతి నాలుగేళ్ల కాలానికి అవసరమైన సొమ్ములను మంచి క్వాలిటీ ఉన్న డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఇక మిగిలిన మొత్తాన్ని ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.
ప్ర: నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ కలిపి రూ. కోటి దాటాయి. ఈ మొత్తాన్ని సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో రిడీమ్ చేసుకుందామనుకుంటున్నాను. ఎంత కాలంలో నేను ఈ డబ్బులను వెనక్కి తీసుకోవాలి ? ఈ విషయంలో ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వండి. –రాజేశ్, విజయవాడ
ఏదైనా ఆర్థిక లక్ష్యం(ఇల్లు కొనుగోలు చేయడం, పిల్లల ఉన్నత చదువులు, తదితరాలు) కోసం మీరు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్లయితే, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఉపసంహరణ ప్రణాళిక (విత్‌డ్రాయల్ ప్లాన్)ఉండాలి. అలా కాకుండా కోటి రూపాయల నిధి ఏర్పాటు చేసుకోవడమే మీ లక్ష్యమైతే, మీ అవసరాలకు అనుగుణంగా విత్‌డ్రాయల్ ప్లాన్ ఉండాలి. ఈ డబ్బులు మీకు తక్షణం అవసరం లేని పక్షంలో ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్–ఇన్‌కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. లేదంటే 30–50 శాతం మొత్తాన్ని ఫిక్స్‌డ్–ఇన్‌కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన మొత్తన్నా ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా కొనుగోలు నిమిత్తమో, లేదా వినియోగం నిమిత్తమే ఈ డబ్బులు ఇన్వెస్ట్ చేశారనుకోండి. దానికి తగ్గట్లుగా మీ ఉపసంహరణ ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు మీ పాప/ బాబు ఉన్నత విద్యావసరాలకు రూ.50 లక్షలు అవసరమవుతాయనుకుందాం. మొదటి ఏడాది రూ.12.5 లక్షలు అవసరమనుకోండి. ఈ సొమ్ములు అవసరమయ్యే ఒక ఏడాదికి ముందే రూ.50 లక్షల మొత్తాన్ని ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మిగిలిన రూ.50 లక్షల మొత్తాన్ని 12–18 నెలల కాలంలో సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)రూపంలో బదిలీ చేయండి. దీంతో మీ కోటి రూపాÆయలకు మార్కెట్ రిస్క్ ఉండదు. ఒకవేళ ఇప్పట్లో మీకు ఈ డబ్బులు అవసరం లేని పక్షంలో ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. మరిన్ని రాబడులు వస్తాయి.
ధీరేంద్ర కుమార్
సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్
డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా?
Published Mon, Apr 1 2019 12:58 AM | Last Updated on Mon, Apr 1 2019 12:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment