జీఎస్టీ అమలుతో మ్యూచువల్ ఫండ్స్ ప్రియం
తగిన రక్షణ కావాలని యాంఫీ వినతి
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం జీఎస్టీలో మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు మినహారుుంపు ఉండాలని మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జీఎస్టీ కారణంగా వ్యయాలు పెరగడం, నిబంధనల పని భారం వల్ల మ్యూచువల్ ఫండ్‌స యూనిట్లు మరింత ఖరీదుగా మారతాయని భావిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీలో గూడ్‌స అనే నిర్వచనం నుంచి సెక్యూరిటీలను మినహారుుంచాలని... పన్ను మినహారుుంపు ఉన్న వాటిల్లో చేర్చాలని కోరింది. ఈ మేరకు పీడబ్ల్యూసీతో కలసి యాంఫీ జీఎస్టీ కమిషనర్ ఉపేంద్ర గుప్తాకు వినతిపత్రం అందజేసింది. ప్రస్తుతం ఉన్న వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ చట్టాల ప్రకారం సెక్యూరిటీల లావాదేవీలపై పన్ను లేదు.