జూలై నెలలో నమోదు
క్రితం నెల కంటే 9 శాతం తక్కువ
కొత్త రికార్డులకు సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం.
ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది.
సిప్ పెట్టుబడుల జోరు
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి.
పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు.
విభాగాల వారీగా..
→ లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి.
→ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి.
→ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి.
→ స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి.
→ మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం.
→ వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
→ సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి.
→ ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి.
→ డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి.
ఎన్‌ఎఫ్‌వోల అండ..
జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.
– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్)
Comments
Please login to add a commentAdd a comment