inflows
-
ఈక్విటీ ఫండ్స్ సానుకూలమా..?
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నవంబర్ నెలలో రూ.35,943 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అక్టోబర్ నెల పెట్టుబడులతో పోల్చి చూస్తే 14 శాతం తగ్గాయి. అయినప్పటికీ వరుసగా 45వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లో సానుకూల పెట్టుబడులు నమోదయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నవంబర్ నెల గణాంకాలను విడుదల చేసింది.స్థూల ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఎన్నికలు తదితర పరిణామాలతో ఈక్విటీ మార్కెట్లు గత రెండు నెలల కాలంలో ఎన్నో అస్థిరతలు ఎదుర్కోవడం తెలిసిందే. దీంతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించి ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ సీబీవో అఖిల్ చతుర్వేది తెలిపారు. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో నికరంగా రూ.60,295 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో పెట్టుబడుల రాక రూ.2.4 లక్షల కోట్లతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గడం గమనార్హం. ప్రధానంగా డెట్ ఫండ్స్ అక్టోబర్‌లో రూ.1.57 లక్షల కోట్లను ఆకర్షించగా, నవంబర్‌లో ఇవి కేవలం రూ.12,915 కోట్లకు పరిమితమయ్యాయి. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) అక్టోబర్ చివరికి ఉన్న రూ.67.25 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.68.08 లక్షల కోట్లకు పెరిగింది. లక్ష్యాలకు కట్టుబాటు..నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.25,000 కోట్లకు పైనే ఉండడం అన్నది దీర్ఘకాల లక్ష్యాలు, ప్రణాళిక పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న అంకిత భావానికి నిదర్శనమని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. సిప్ పెట్టుబడులను స్థిరంగా ఉండడం దీర్ఘకాలంలో ఫండ్స్ విలువను సమకూర్చుతాయన్న విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. విభాగాల వారీగా..లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,548 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్‌లో వచ్చిన రూ.3,452 కోట్లతో పోల్చితే 26 శాతం తగ్గాయి. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.7,658 కోట్లను రాబట్టాయి. అక్టోబర్‌లో ఇవే పథకాల్లోకి రూ.12,279 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.13,255 కోట్ల చొప్పున రావడం గమనార్హం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.5,084 కోట్లు వచ్చాయి. ఇక స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాల దూకుడు కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ నెలతో పోల్చితే నవంబర్‌లో స్మాల్ క్యాప్ ఫండ్స్ 9 శాతం అధికంగా రూ.4,112 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్ 4.3 శాతం అధికంగా రూ.4,883 కోట్ల చొప్పున ఆకర్షించాయి. రిస్క్ ఉన్నా కానీ ఇన్వెస్టర్లు అధిక రాబడులు కోరుకుంటున్నారనే దానికి ఈ గణాంకాలు నిదర్శనంగా నిలుస్తాయి.లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,680 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్ రూ.2,088 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.430 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ రూ.619 కోట్ల చొప్పున ఆకర్షించాయి. 18 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) నవంబర్ లో మార్కెట్లోకి వచ్చి రూ.4,052 కోట్లను సమీకరించాయి. అక్టోబర్‌లో 29ఎన్‌ఎఫ్‌వోలు రూ.6,078 కోట్లు సమీకరించడం గమనార్హం. డెట్ విభాగంలో 16 విభాగాలకు గాను 9 విభాగాల్లోకి పెట్టుబడులు రాగా, మిగిలినవి పెట్టుబడులు కోల్పోయాయి. ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి రూ.2,109 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.2,962 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.4,374 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.2,426 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.2,138 కోట్ల చొప్పున వచ్చాయి.డెట్‌లో లిక్విడ్ ఫండ్స్ రూ.1,779 కోట్లు, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.454 కోట్లు, మీడియం డ్యురేషన్ ఫండ్స్ రూ.201 కోట్ల చొప్పున కోల్పోయాయి. ఇదీ చదవండి: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలుసిప్ పెట్టుబడులు ఫ్లాట్సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో నవంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి రూ.25,320 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అక్టోబర్ సిప్ పెట్టుబడులు రూ.25,323 కోట్లతో పోల్చి చూస్తే ఫ్లాట్‌గా నమోదయ్యాయి. కొత్తగా 49.46 లక్షల సిప్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. అక్టోబర్‌లో ఇవి 63.70 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 10.12 కోట్ల నుంచి 10.23 కోట్లకు పెరిగాయి. -
‘సిప్’ సరికొత్త రికార్డు.. ఈ ఇన్వెస్ట్ మీరూ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ– సిప్) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం– సిప్‌లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు.. ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. పర్యాటకుల సందడి (ఫొటోలు)
-
ఈక్విటీ ఫండ్స్‌లోకి జోరుగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జనవరిలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ పథకాల్లోకి రెండేళ్ల గరిష్ట స్థాయిలో రూ.21,780 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్, థీమ్యాటిక్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. ఫోకస్డ్ ఫండ్స్ మినహా మిగిలిన అన్ని ఈక్విటీ విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. 2023 డిసెంబర్ నెలలో వచి్చన రూ.16,997 కోట్లతో పోల్చి చూసినప్పుడు 28 శాతం అధికంగా పెట్టుబడులు వచి్చనట్టు తెలుస్తోంది. చివరిగా 2022 మార్చి నెలలో రూ.28,443 కోట్లు ఈక్విటీ ఫండ్స్‌లోకి రాగా, ఇప్పటి వరకు అదే గరిష్ట రికార్డుగా కొనసాగింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు ఆదరణ కొనసాగుతోంది. సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి అయిన రూ.18,838 కోట్లకు చేరాయి. డిసెంబర్ నెలలో వచి్చన సిప్ పెట్టుబడులు రూ.17,610 కోట్లను అధిగమించాయి. జనవరి నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. కొత్తగా 51.84 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాలు జనవరి చివరికి 7.92 కోట్లకు పెరిగాయి. ‘‘జనవరిలో అస్థిరతలు ఉన్నప్పటికీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బలమైన పనితీరు చూపించాయి. మార్కెట్ ఆటుపోట్లలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు స్థిరమైన విశ్వాసాన్ని కొనసాగించడం, దీర్ఘకాలంలో సంపద సృష్టి దిశగా వారి నిబద్ధతను తెలియజేస్తోంది’’అని బ్రోకరేజీ సంస్థ ‘ప్రభుదాస్ లీలాధర్’ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ హెడ్ పంకజ్ శ్రేష్ట పేర్కొన్నారు. జనవరిలో మూడు కొత్త ఈక్విటీ పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) సంయుక్తంగా రూ.967 కోట్లను సమీకరించినట్టు మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అనలిస్ట్ మెలి్వన్ శాంటారియా తెలిపారు. విభాగాల వారీగా.. ► థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.4,805 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,257 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. డిసెంబర్ నెలతో పోల్చి చూసినప్పుడు స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.600 కోట్ల పెట్టుబడుల రాక తగ్గింది. ► మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,039 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,287 కోట్లు ఆకర్షించాయి. 19 నెలల తర్వాత ఇదే గరిష్ట స్థాయి. డిసెంబర్ నెలలో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.281 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ ఫండ్స్ రూ.76,469 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. డిసెంబర్ నెలలో ఇదే విభాగం రూ.75,560 కోట్ల పెట్టుబడులను కోల్పోవడం గమనార్హం. ► డెట్ విభాగంలో అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.49,468 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.10,651 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► గోల్డ్ ఈటీఎఫ్ పథకాలలో ఇన్వెస్టర్లు రూ.657 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. ► మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ జనవరి నెలలో రూ.1.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. గత డిసెంబర్లో రూ.40,685 కోట్ల పెట్టుబడులను కోల్పోవడంతో పోలిస్తే పరిస్థితి పూర్తిగా మారింది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ డిసెంబర్ చివరికి ఉన్న రూ.50.78 లక్షల కోట్ల నుంచి రూ.52.74 లక్షల కోట్లకు పెరిగింది. బంగారంలో హెడ్జింగ్.. ‘‘మిడ్‌క్యాప్ స్టాక్స్ 15 శాతం, స్మాల్‌క్యాప్ స్టాక్స్ 20 శాతం మేర ప్రీమియం వ్యాల్యూషన్లలో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో విలువల అంతరాన్ని గుర్తించారు. అందుకు తగ్గట్టు పెట్టుబడుల్లో మార్పులు చేసుకున్నారు’’అని ఫైయర్స్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇప్పటికీ అధికంగా ఉండడంతో బంగారం సురక్షిత సాధనంగా, ద్రవ్యోల్బణానికి మంచి హెడ్జింగ్ సాధనంగా కొనసాగుతుందని మెలి్వన్ శాంటారియా పేర్కొన్నారు. -
ప్రయివేట్ ఈక్విటీ పెట్టుబడుల నేలచూపు
ముంబై: దేశీయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు ఈ కేలండర్ ఏడాది(2023) మూడో త్రైమాసికంలో 65 శాతం క్షీణించాయి. 1.81 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2022) జులై–సెప్టెంబర్(క్యూ3)లో ఏకంగా 5.23 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ నమోదయ్యాయి. లండన్ స్టాక్ ఎక్స్చేంజీ గ్రూప్ బిజినెస్ సంస్థ రెఫినిటివ్ వివరాల ప్రకారం లావాదేవీలు సైతం భారీగా 50 శాతం నీరసించాయి. 465 నుంచి భారీగా తగ్గి 232కు పరిమితమయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్–జూన్(క్యూ2)లో నమోదైన 353తో పోలిస్తే డీల్స్ 34 శాతం వెనకడుగు వేయగా.. విలువ(2.79 బిలియన్ డాలర్లు) 35 శాతం క్షీణించింది. కాగా.. 2023 జనవరి–సెప్టెంబర్‌లో డీల్స్ 414 నుంచి 283కు తగ్గాయి. ఇంటర్నెట్ ఆధారిత కంపెనీలలో 2.8 బిలియన్ డాలర్లు, ఐటీ సంస్థలలో 1.48 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. -
బంగారం ఈటీఎఫ్‌ల జోరు
న్యూఢిల్లీ: అనిశ్చిత సమయాల్లో సురక్షిత పెట్టుబడి సాధనమైన గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్) మే నెలలో నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఇన్వెస్టర్లు ఏప్రిల్ నెలలో రూ.124 కోట్లను బంగారం ఈటీఎఫ్‌లలో నికరంగా పెట్టుబడి పెట్టగా, మే నెలలో 20 శాతం తక్కువగా, రూ.103 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దీనితో బంగారం ఈటీఎఫ్‌ల నిర్వహణలో మొత్తం ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ మే చివరికి రూ.23,128 కోట్లుగా ఉంది. ఏప్రిల్ చివరికి ఇది రూ.22,950 కోట్లు కావడం గమనార్హం. కాగా,అంతకుముందు నెల మార్చిలో (2023)లో గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి ఇన్వెస్టర్లు రూ.266 కోట్లను ఉపసంహరించుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) ఈ గణాంకాలు విడుదల చేసింది. మే నెలలో బంగారం ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గడం అన్నది లాభాల స్వీకరణ వల్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ బ్యాంకులు తదుపరి వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించి ఉండవచ్చని భావిస్తున్నారు. -
చిన్నబోయిన ఈక్విటీ ఫండ్స్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాలకు ఏప్రిల్‌లో ఆదరణ తగ్గింది. మార్చి నెలతో పోలిస్తే పెట్టుబడులు 68 శాతం తగ్గిపోయి రూ.6,480 కోట్లకు పరిమితమయ్యాయి. అయినా, ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా 26వ నెలలోనూ నమోదైంది. వచ్చిన కొద్ది పెట్టుబడుల్లోనూ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ పథకాలు ఎక్కువ మొత్తం ఆకర్షించాయి. ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గురువారం విడుదల చేసింది. మొత్తం మీద 42 సంస్థలతో కూడిన మ్యూచువల్ పండ్స్ పరిశ్రమ ఏప్రిల్ నెలలో రూ.1.21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ప్రధానంగా డెట్ విభాగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేసింది. అంతకుముందు మార్చి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు నికరంగా రూ.56,884 కోట్ల పెట్టుబడులను నష్టపోవడం గమనార్హం. కానీ, ఏప్రిల్‌లో రూ.1.06 లక్షల కోట్లను రాబట్టాయి. దీంతో మ్యచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ మార్చి చివరికి ఉన్న రూ.39.42 లక్షల కోట్ల నుంచి ఏప్రిల్ చివరికి రూ.41.62 లక్షల కోట్లకు ఎగిసింది. ► ఈక్విటీల్లో ఫోకస్డ్ మినహా అన్ని విభాగాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. స్మాల్ క్యాప్ పథకాల్లోకి రూ.2,182 కోట్లు, మిడ్‌క్యాప్ పథకాల్లోకి రూ.1,791 కోట్లు వచ్చాయి. ► మల్టీక్యాప్ ఫండ్స్ రూ.206 కోట్లు, లార్జ్‌క్యాప్ ఫండ్స్ రూ.52 కోట్లు, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.738 కోట్లు చొప్పున ఆకర్షించాయి. ► డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లోకి రూ.122 కోట్లు రాగా, సెక్టోరల్ (థీమ్యాటిక్) ఫండ్స్‌లోకి రూ. 614 కోట్లు, ఈఎల్ఎస్ఎస్ విభాగంలోకి రూ.61 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ.550 కోట్లు, వ్యాల్యూ ఫండ్స్‌లోకి రూ.291 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.131 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► డెట్ విభాగంలో లిక్విడ్ ఫండ్స్ అత్యధికంగా రూ.63,219 కోట్లను ఆకర్షించాయి. ► మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ.13,961 కోట్లు, అల్ట్రాషార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.10,663 కోట్ల చొప్పున వచ్చాయి. ► ఇక గోల్డ్ ఈటీఎఫ్‌లు సైతం రూ.125 కోట్లను ఆకర్షించాయి. ఇండెక్స్ ఫండ్స్‌లోకి రూ.147 కోట్లు, ఇతర ఈటీఎఫ్‌ల్లోకి రూ.6,790 కోట్ల చొప్పున వచ్చాయి. సిప్ ద్వారా రూ.13,728 కోట్లు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి ఏప్రిల్ నెలలో రూ.13,728 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతకుముందు నెలలో వచ్చిన మొత్తం రూ.14,276 కోట్లతో పోలిస్తే తగ్గాయి. ఏటా ఆర్థిక సంవత్సరం చివరి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి కాస్త అధిక మొత్తంలోనే పెట్టుబడులు వస్తుంటాయి. ఇన్వెస్టర్లు సిప్ ద్వారా ప్రస్తుత పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఈక్విటీ పథకాలకు అదనపు పెట్టుబడులను కేటాయించే విషయమై కాస్త వేచి చూసే ధోరణితో ఉన్నట్టు తెలుస్తోందని కోటక్ మహీంద్రా అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన మనీష్ మెహతా పేర్కొన్నారు. -
ఈక్విటీ పథకాల్లోకి రూ.15,498 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పటి మాదిరే జూన్ మాసంలోనూ ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని చూరగొన్నాయి. రూ.15,498 కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. ఈక్విటీ పథకాల్లోకి ఇలా నికరంగా పెట్టుబడుల రాక వరుసగా 16వ నెల (2021 ఫిబ్రవరి నుంచి) కావడం గమనార్హం. అయితే, ఈ ఏడాది మే నెలలో ఈక్విటీ పథకాలు రూ.18,529 కోట్లను ఆకర్షించాయి. దీంతో పోలిస్తే జూన్‌లో కాస్తంత తగ్గాయి. ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి జూన్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. దాదాపు అన్ని విభాగాలూ పెట్టుబడులను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.12,286 కోట్లుగా నమోదయ్యాయి. సిప్ ఖాతాల సంఖ్య 5.54 కోట్లకు పెరిగింది. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,512 కోట్ల పెట్టుబడులు రాగా, మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,130 కోట్లు వచ్చాయి. బంగారం ఈటీఎఫ్‌లు రూ.135 కోట్లు ఆకర్షించాయి. అలాగే, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు రూ.12,660 కోట్లు రాబట్టాయి. నూతన పథకాల ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ పెట్టుబడుల రాక బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. డెట్ విభాగం నుంచి జూన్ నెలలో రూ.92,247 కోట్లకు నికరంగా బయటకు వెళ్లాయి. అంతకుముందు మేలో డెట్ పథకాల నుంచి రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అన్నీ కలిపి చూస్తే జూన్ నెలలో ఫండ్స్ పరిశ్రమ నుంచి రూ.69,853 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. నిర్వహణ ఆస్తులు మే చివరికి రూ.37.37 లక్షల కోట్లుగా ఉంటే, జూన్ చివరికి రూ.36.98 లక్షల కోట్లకు తగ్గాయి. ప్రతికూలతలు ఉన్నా.. ‘‘విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) నుంచి విక్రయాల తీవ్రత పెట్టుబడుల రాకపై ఉంది. దీనికితోడు అంతర్జాతీయ మాంద్యం ఆందోళనలు కూడా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఎథీరియం ఇతర క్రిప్టో కాయిన్ల ధరలు పతనం అయ్యాయి. సంప్రదాయ ఉత్పత్తుల్లో రాబడులు తక్కువగా ఉన్నాయి. దీర్ఘకాల పెట్టుబడుల సాధపాల పట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహన పెట్టుబడుల రాక కొనసాగేందుకు సాయపడ్డాయి’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కవిత కృష్ణన్ తెలిపారు. మార్కెట్లో అస్థిరతలు అధికంగా ఉన్నా కానీ, ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చురుకైన పాత్ర పోషిస్తున్నట్టు ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. ఒక్క జూన్ మాసంలోనే ఎఫ్‌పీఐలు రూ.50వేల కోట్ల మేర ఈక్విటీల్లో అమ్మకాలు చేయడం గమనార్హం. ‘‘అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. వర్షాల ప్రారంభం మిశ్రమంగా ఉంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇవన్నీ చిన్న పొదుపుదారులను అవరోధం కాలేదు. వారు సిప్ ద్వారా తమ పెట్టుబడులు కొనసాగించారు’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. -
శ్రీశైలం జలశయానికి భారీగా వరద నీరు
-
శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. అంతకుముందు అధికారులు సైరన్ మోగించారు. పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 881.5 అడుగులకు నీరు చేరింది. ఎగువన ప్రవాహం నిలకడగా వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు తెరచి దిగువకు నీరు వదిలారు. రెండు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తడంతో సందర్శించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ఉధృతి
-
జూరాలకు పెరుగుతున్న వరద
-
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద
-
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత.. సందర్శకుల సందడి
-
నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో
-
నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో
కృష్ణమ్మ జల పరవళ్లు కొనసాగుతున్నాయి. బిరబిరా అంటూ శ్రీశైలం నుంచి సాగర్‌కు పరుగెడుతోంది. ఎగువనుంచి భారీగా వర ద రావడంతో శనివారం శ్రీశైలం జలాశయానికి నీటిరాక పెరగడంతో ఏడుగేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా మొత్తంగా 2,71,712 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు వస్తోంది. నాగార్జునసాగర్ : సాగర్ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి 2,71,712 క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేస్తుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ సాగర్ జలాశయానికి చేరుతోంది. దీంతో క్రమంగా జలాశయం నీటిమట్టం పెరుగుతోంది. శనివారం సాయంత్రం ఆరుగంటలకు సాగర్ జలాశయం నీటిమట్టం 540.30 అడుగులకు చేరింది. ఇది 188.9530 టీఎంసీలకు సమానం. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా 312.24 టీఎంసీల నీరు నిలువ ఉంటుంది. శ్రీశైలం జలాశయం గరిష్టస్థాయిలో నిండటంతో పైనుంచి వస్తున్న నీటిని రేడియల్ క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా దిగువకు వదులుతున్నారు. శనివారం 11 గంటలకు శ్రీశైలం జలాశయానికి నీటిరాక పెరగడంతో ఏడుగేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు 1,94,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇదే విధంగా వారం, పదిరోజుల పాటు నీరు వస్తే సాగర్ జలాశయం గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజులు మాత్రం ఈ ప్రవాహం ఉండే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో గల ప్రాజెక్టులు వర్షాకాలం ప్రారంభంలోనే పూర్తిస్థాయిలో నిండటంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు అత్యధికంగా వరదనీరు వచ్చి చేరుతుండగా ఆ నీటినంతా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. వారంరోజులు ఇన్‌ఫ్లో వస్తే నిండనున్న సాగర్ వారంరోజుల పాటు నిత్యం రెండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే సాగర్ జలాశయం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండాలంటే 124 టీఎంసీల నీరు రావాల్సి ఉంటుంది. ఒక టీఎంసీ 11,575 క్యూసెక్కుల నీటికి సమానం. ఏడురోజుల పాటు రెండు లక్షలు వస్తే 14,35,300 క్యూసెక్కుల నీరు వచ్చి చేరనుంది. -
ఈక్విటీల్లో తగ్గిన ఫండ్స్ పెట్టుబడులు
27 శాతం క్షీణతతో రూ.51,000 కోట్లకు పరిమితం న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో భారీ ఆటు పోట్ల నేపథ్యంలో 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టబడులు గణనీయంగా తగ్గాయి. 27 శాతం క్షీణతతో రూ.51,000 కోట్లకు పరిమితం అయ్యాయి. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఆ పరిస్థితి ఉండబోదన్న అభిప్రాయం వాటి నుంచి వినిపిస్తోంది. పరిశ్రమ పనితీరు మెరుగుపడుతుందని, నూతన ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న పెట్టుబడులతో వృద్ధి నెలకొంటుందన్న ఆశాభావం వ్యక్తమైంది. సెబీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం... మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు 2016–17లో స్టాక్ మార్కెట్లలో నికరంగా రూ.51,352 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. 2015–16లో వీరి పెట్టుబడులు రూ.70,130 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు 2014–15లో ఇవి రూ.41,000 కోట్లే. ఆరేళ్ల తర్వాత ఈక్విటీల్లో ఫండ్స్ నికరంగా పెట్టుబడులు పెట్టింది 2014–15లోనే. ఇక 2015–16తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ఈక్విటీ మార్కెట్లలో ఆటుపోట్లు ఎక్కువగా ఉండడం గమనించాల్సిన విషయం. అదే సమయంలో ఫండ్ మేనేజర్లు గత ఆర్థిక సంవత్సరంలో డెట్ మార్కెట్లో నికరంగా 3.14 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. పెరిగిన ఇన్వెస్టర్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడం గమనార్హం. ఇందుకు సూచికగా ఫోలియోల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైంది. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు, బ్యాలన్స్ విభాగాల్లో ఫోలియోల సంఖ్య 58 లక్షలు పెరిగి రూ.4.4 కోట్లకు వృద్ధి చెందింది. ఒక్కో ఇన్వెస్టర్‌కు ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు.