
సాక్షి, హైదరాబాద్: పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. అంతకుముందు అధికారులు సైరన్ మోగించారు. పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 881.5 అడుగులకు నీరు చేరింది.
ఎగువన ప్రవాహం నిలకడగా వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు తెరచి దిగువకు నీరు వదిలారు. రెండు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తడంతో సందర్శించేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment