gates opened
-
నంద్యాల: శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత
-
ముందే ఎత్తిన తుంగభద్ర గేట్లు
-
హిమాయత్ సాగర్‌కు భారీగా చేరుతున్న వరద నీరు
-
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీగా వరద, 10 గేట్లు ఎత్తివేత
-
ఎస్సారెస్పీకి పోటెత్తిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి మహారాష్ట్ర, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పోటెత్తింది. దీంతో 24 గేట్లను ఎత్తి నీటిని గోదావరి దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలోని విష్ణుపురి ప్రాజెక్ట్, నిర్మల్ జిల్లాలోని గడ్డెన్న వాగుల నుంచి వరద ఉధృతం కావడంతో సోమవారం అర్ధరాత్రి 12 గేట్లు ఎత్తిన అధికారులు.. మంగళ వారం మధ్యాహ్నానికి 24 గేట్లను ఎత్తి లక్ష క్యూసె క్కులు నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి నిలకడగా 87 వేల క్యూసెక్కుల వరద నీరు ఎస్సారెస్పీలోకి చేరుతోంది. విష్ణుపురి ప్రాజెక్ట్ నుంచి 40 వేల క్యూసెక్కులు వస్తుండగా, స్థానిక ఎగువ ప్రాంతాల నుంచి మిగతా వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (90 టీఎంసీల సామర్థ్యం) అడుగులు కాగా, మంగళవారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2,500 క్యూసె క్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 5 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం 152 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువకు నీటి విడుదలతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 36.15 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతోందని జెన్కో డీఈ శ్రీనివాస్ తెలిపారు. -
నాగార్జునసాగర్ 22 గేట్లు ఎత్తివేత
-
ముందే తెరుచుకున్న ‘సాగర్ గేట్లు’
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): ఎగువ నుంచి వస్తున్న ప్రవాహ జలాలతో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలానికి ప్రవాహం అధికంగా వస్తుండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 207.41 టీఎంసీలు నిల్వ ఉండగా.. డ్యామ్ నీటిమట్టం 883.50 అడుగులకు చేరుకుంది. ఆదివారం సాయంత్రానికి జూరాల, సుంకేసుల నుంచి 5,29,963 క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ఇప్పటికే సాగర్ నిండటంతో ఈ ఏడాది జలాశయం క్రస్ట్ గేట్లు ముందుగానే తెరుచుకున్నాయి. ఆదివారం అర్ధరాత్రికి సాగర్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదలనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రకాశం బ్యారేజీకి 3.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుందని అంచనా. దీంతో ప్రకాశం బ్యారేజీ దిగువ గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, ముంపు ప్రాంతాల్లో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. వాయనం సమర్పించి సాగర్ గేట్లు ఎత్తివేత నాగార్జున సాగర్ నిండటంతో డ్యామ్ 14 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఈ ఏడాది ముందుగానే తెరిచారు. సూపరింటెండింగ్ ఇంజనీర్ ధర్మనాయక్ కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయ పద్ధతిలో వాయనం సమర్పించి హారతి ఇచ్చారు. అనంతరం 14 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,06,462 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 1,86,175 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు డీఈ దాసరి రామకృష్ట, ఏఈఈ కె.నాగ నరసింహారావు ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి టెయిల్ పాండ్ ప్రాజెక్టుకు 31,290 క్యూసెక్కులు వస్తోందన్నారు. సాగర్ నుంచి మిగులు నీటిని వదలడంతో పులిచింతల ప్రాజెక్టుకు 4 లక్షల నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని పులిచింత ప్రాజెక్టు డీఈ రఘునాథరావు తెలిపారు. -
శ్రీశైలం జలశయానికి భారీగా వరద నీరు
-
శ్రీశైలం గేట్లు ఎత్తివేత.. సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, హైదరాబాద్: పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువ కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తివేశారు. అంతకుముందు అధికారులు సైరన్ మోగించారు. పరివాహాక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు. గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి ప్రస్తుతం 881.5 అడుగులకు నీరు చేరింది. ఎగువన ప్రవాహం నిలకడగా వస్తుండడంతో అధికారులు రెండు గేట్లు తెరచి దిగువకు నీరు వదిలారు. రెండు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2007 తర్వాత జూలైలో గేట్లు ఎత్తడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇన్ ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. గేట్లు ఎత్తడంతో సందర్శించేందుకు ప్రజలు తరలివస్తున్నారు. -
నాగార్జున సాగర్ 4 గేట్లు ఎత్తివేత
నల్గొండ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణా నదిపై నర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ వరద జలాలన్నీ నాగార్జున సాగర్‌కు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తో కలిసి ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. (నేడు సాగర్ గేట్లు ఎత్తివేత ) నాగార్జున సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ : 290.టీఎంసీలుగా ఉంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉంది. అయితే నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
మహోగ్రరూపం దాల్చిన కృష్ణ!
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ కనుమల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటం.. తుంగభద్ర ఉరకలెత్తుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. శ్రీశైలం జలాశయంలోకి పరవళ్లు తొక్కుతోంది. బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్.. హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న నీటిని పది గేట్లను ఎత్తి, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 4.35 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి నాగార్జునసాగర్‌లోకి 4.47 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి, ఎడమ కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.34 లక్షల క్యూసెక్కులను 18 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పులిచింతల ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతోంది. ఆ ప్రాజెక్టులోకి 3.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేస్తూ 4.18 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల వద్ద వరదను నియంత్రిస్తూ ప్రజలు ముంపు బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతోంది. బ్యారేజీలోకి 2.10 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1.88 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సము ద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకూ 589.937 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. సాగర్ జలాశయం నుంచి 18 గేట్ల ద్వారా దిగువకు విడుదలవుతున్న నీరు శ్రీశైలంలోకి మరింత పెరగనున్న వరద.. నదీ పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల ఆల్మట్టిలోకి కృష్ణా వరద ప్రవాహం పోటెత్తింది. ఆల్మట్టిలోకి 2.11 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో దిగువకు 2.50 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ నుంచి 3.71 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నా రు. ఉజ్జయినిలోకి బీమా వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. దాంతో మిగులుగా ఉ న్న 65 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నా రు. కృష్ణా, బీమా నదుల నుంచి జూరాలలోకి 3.65 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 3.84 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉత్తుంగ తరంగంలా.. నాలుగు రోజులుగా తుంగభద్ర పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో తుంగభద్ర ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర జలాశయంలోకి 1.44 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో 1.69 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. దాంతో తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరింది. మంత్రాలయం, కర్నూలు వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో తీర ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలంలోకి భారీగా వరద చేరుతోంది. బుధవారం ఎగువ నుంచి భారీ వరద దిగువకు విడుదల చేయగా.. గురువారం కూడా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. -
శ్రీశైలం జలాశయం మూడు క్రస్ట్ గేట్లు ఎత్తివేత
సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.8070 టీఎంసీలు ఉంది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం సమానంగా కొనసాగటంతో అధికారులు మూడు క్రస్ట్ గెట్లను తెరిచినట్టు మీడియాకు తెలిపారు. -
శ్రీశైలం నాలుగు గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మ వరద ఉధృతి కొనసాగుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వచ్చే ఇన్‌ఫ్లో 3,47,671 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో శనివారం ఉదయం శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు అధికారులు ఎత్తివేశారు. జలాశయం నుంచి 2,07,561 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వారం రోజుల పాటు ఇన్‌ఫ్లో ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.1 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగ.. ప్రస్తుతం నీటి నిల్వ 193.8 టీఎంసీలకు చేరింది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కూడా వరద నీరు పోటెత్తుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో 64,863 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 8,438 క్యూసెక్కులుగా ఉంది.. నాగార్జున సాగర్‌లో వాస్తవ నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 168 టీఎంసీలుగా ఉంది. -
సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
-
రామన్‌పాడ్ గేట్లు ఎత్తివేత
–గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీటివిడుదల వీపనగండ్ల: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఆదివారం కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెబ్బేటి రామచంద్రారెడ్డి, వీపనగండ్ల జెడ్పీటీసీ సభ్యులు మేడిపల్లి లోకారెడ్డిలు రామన్‌పాడ్ రిజర్వాయర్ వద్దనున్న హౌజ్ఫాల్ షట్టర్స్‌ను పూర్తిగా పైకి ఎత్తించారు. గత పది రోజులుగా గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి జూరాల పంపిణీ కాలువలకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో రైతులు వేసుకున్న పంటలకు సరిగా నీరు అందడం లేదు. దీన్ని దష్టిలో ఉంచుకుని నాయకులు మంత్రికి ఈ విషయాన్ని వివరించగా జూరాల డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ను వెంటనే హౌజ్ఫాల్ షట్టర్లను ఎత్తించాలని మంత్రి ఆదేశించడంతో మంత్రి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు రామన్‌పాడ్‌కు వెళ్లి గేట్లను ఎత్తించారు. ఆ తర్వాత గోపల్‌దిన్నె రిజర్వాయర్‌లో కూడా షట్టర్లను ఎత్తించారు. జూరాల పంటకాల్వలకు నీటి ప్రవాహం ఒకటి, రెండు రోజుల్లో పెరగవచ్చని ప్రజాప్రతినిధులు తెలిపారు. జూరాల నుంచి రామన్‌పాడ్‌కు రావాల్సిన నీటి శాతం తగ్గిపోవడం వల్లే కాలువలకు సరైన నీరు రావడం లేదని, రైతులు దీన్ని దష్టిలో ఉంచుకుని నీరు వథా కాకుండా చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కష్ణప్రసాద్యాదవ్, సర్పంచ్ బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ జి.రాముడు, స్వామిరెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.