సాక్షి, కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి మళ్లీ వరద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం ఆరోసారి జలాశయం మూడు రేడియల్ క్రస్ట్ గేట్లను సుమారు పది అడుగుల మేరకు తెరిచి నీటిని దిగువకు వదిలినట్టు అధికారులు తెలిపారు. జలాశయానికి సుమారు 1,17,627 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,52,557 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885. 00 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలకు గాను ప్రస్తుతం 215.8070 టీఎంసీలు ఉంది. దీంతో ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నీటి ప్రవాహం సమానంగా కొనసాగటంతో అధికారులు మూడు క్రస్ట్ గెట్లను తెరిచినట్టు మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment