సాక్షి, కర్నూలు: పరీవాహక ప్రాంతంలో వర్షపాత విరామం వల్ల కృష్ణా నదిలో వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 45,560 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 17,692 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 2,500 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 21,305 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 15,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.గోదావరిలో వరద ప్రవాహం తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,38,735 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 2,25,435 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment