రామన్‌పాడ్ గేట్లు ఎత్తివేత
Published Sun, Aug 21 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
–గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీటివిడుదల
వీపనగండ్ల: రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు ఆదివారం కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెబ్బేటి రామచంద్రారెడ్డి, వీపనగండ్ల జెడ్పీటీసీ సభ్యులు మేడిపల్లి లోకారెడ్డిలు రామన్‌పాడ్ రిజర్వాయర్ వద్దనున్న హౌజ్‌ఫాల్ షట్టర్స్‌ను పూర్తిగా పైకి ఎత్తించారు. గత పది రోజులుగా గోపల్‌దిన్నె రిజర్వాయర్ నుంచి జూరాల పంపిణీ కాలువలకు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో రైతులు వేసుకున్న పంటలకు సరిగా నీరు అందడం లేదు. దీన్ని దష్టిలో ఉంచుకుని నాయకులు మంత్రికి ఈ విషయాన్ని వివరించగా జూరాల డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్‌ను వెంటనే హౌజ్‌ఫాల్ షట్టర్లను ఎత్తించాలని మంత్రి ఆదేశించడంతో మంత్రి ఆదేశానుసారం ప్రజాప్రతినిధులు రామన్‌పాడ్‌కు వెళ్లి గేట్లను ఎత్తించారు. ఆ తర్వాత గోపల్‌దిన్నె రిజర్వాయర్‌లో కూడా షట్టర్లను ఎత్తించారు. జూరాల పంటకాల్వలకు నీటి ప్రవాహం ఒకటి, రెండు రోజుల్లో పెరగవచ్చని ప్రజాప్రతినిధులు తెలిపారు.
జూరాల నుంచి రామన్‌పాడ్‌కు రావాల్సిన నీటి శాతం తగ్గిపోవడం వల్లే కాలువలకు సరైన నీరు రావడం లేదని, రైతులు దీన్ని దష్టిలో ఉంచుకుని నీరు వథా కాకుండా చూసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కష్ణప్రసాద్‌యాదవ్, సర్పంచ్ బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ జి.రాముడు, స్వామిరెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement