నల్గొండ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో కృష్ణా నదిపై నర్మించిన ఆనకట్టలన్నీ నిండుకుండలా తలపిస్తున్నాయి. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఆ వరద జలాలన్నీ నాగార్జున సాగర్‌కు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ప్రస్తుతం సాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో సాగర్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తో కలిసి ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. (నేడు సాగర్ గేట్లు ఎత్తివేత )
నాగార్జున సాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585 అడుగుల నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 312.0405 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ : 290.టీఎంసీలుగా ఉంది. సాగర్‌కు ఇన్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులు ఉంది. అయితే నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment