Sirisha Voruganti appointed MD & CEO of Lloyds Banking Group's Technology Centre in India - Sakshi
Sakshi News home page

‘లాయిడ్స్‌’ సీఈవోగా శిరీష ఓరుగంటి 

Jul 6 2023 7:51 AM | Updated on Jul 6 2023 8:41 AM

Sirisha Voruganti appointed MD CEO Lloyds Banking Group Technology Centre India - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫైనాన్షియల్‌ సర్వీసుల్లో ఉన్న యూకే సంస్థ లాయిడ్స్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ హైదరాబాద్‌లోని లాయిడ్స్‌ టెక్నాలజీ సెంటర్‌ సీఈవో, ఎండీగా శిరీష ఓరుగంటిని నియమించింది. స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షిస్తారని కంపెనీ తాజాగా ప్రకటించింది.

ఇప్పటివరకు ఆమె జేసీపెన్నీ ఎండీగా, కంపెనీ బోర్డ్‌ మెంబర్‌గా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక విధులను నిర్వర్తించారు. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఫిన్‌టెక్‌ ఆవిష్కరణలలో విస్తృత అనుభవాన్ని తీసుకు వస్తారని లాయిడ్స్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement