Lloyds Banking Group CEO
-
‘లాయిడ్స్’ సీఈవోగా శిరీష ఓరుగంటి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూకే సంస్థ లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్‌లోని లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈవో, ఎండీగా శిరీష ఓరుగంటిని నియమించింది. స్థాపన, దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాన్ని ఆమె పర్యవేక్షిస్తారని కంపెనీ తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఆమె జేసీపెన్నీ ఎండీగా, కంపెనీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో కీలక విధులను నిర్వర్తించారు. ఐటీ ఆర్కిటెక్చర్, డేటా ఇంజనీరింగ్, ఫిన్‌టెక్ ఆవిష్కరణలలో విస్తృత అనుభవాన్ని తీసుకు వస్తారని లాయిడ్స్ ఆశాభావం వ్యక్తం చేసింది. -
నావల్ల బ్యాంక్‌కు అప్రతిష్ట.. క్షమించండి
బ్రిటన్‌లో పెద్ద బ్యాంక్ అయిన లియోడ్స్ బ్యాంకింగ్ గ్రూపు (ఎల్వైజీ) సీఈవో ఆంటోనియా హోర్టా-ఒసొరియా.. 75వేల మంది ఉద్యోగులకు క్షమాపణలు చెప్పారు. ఓ మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపణలు రావడమే దీనికి కారణం. ఇటీవల సింగపూర్‌కు బిజినెస్ టూర్‌కు వెళ్లినపుడు హోర్టా-ఒసొరియా ఓ మహిళతో గడిపినట్టు ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఫొటోలు కూడా మీడియాలో ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన స్పందిస్తూ బ్యాంక్‌కు అప్రతిష్ట వచ్చినందుకు క్షమించాలని కోరుతూ బ్యాంక్ సిబ్బందికి లేఖ పంపారు. 'వ్యక్తిగత జీవితం ప్రైవేట్ విషయం. అయితే నా వల్ల ప్రతికూల ప్రచారం వచ్చింది. గ్రూపు పేరుప్రతిష్టలకు మచ్చతెచ్చింది' అని హోర్టా-ఒసొరియా చెప్పారు. లియోడ్స్ బ్యాంకింగ్ గ్రూపు (ఎల్వైజీ) సీఈవో పదవి నుంచి వైదొలగబోనని ఉద్యోగులకు, వినియోగదారులకు స్పష్టం చేశారు. 2011లో ఆయన ఈ బ్యాంకు సీఈవోగా నియమితులయ్యారు.