డెబిట్ కార్డు ఛార్జీలు తగ్గబోతున్నాయ్!
డెబిట్ కార్డు ఛార్జీలు తగ్గబోతున్నాయ్!
Published Tue, Feb 7 2017 6:25 PM | Last Updated on Mon, Aug 20 2018 5:20 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం డిజిటల్ లావాదేవీల ప్రోత్సహకానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. డిజిటల్ పేమెంట్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి ఛార్జీలు గణనీయంగా తగ్గనున్నాయట. డెబిట్ కార్డు ఛార్జీలు తగ్గుతాయనే దానిపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తంచేశారు. రూ.2 వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే డెబిట్ కార్డు లావాదేవీలకు మార్జినల్ డిస్కౌంట్ ఛార్జీలను(ఎండీఆర్) రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయిస్తుందని జైట్లీ తెలిపారు. ఆర్బీఐ నిర్ణయించిన వెంటనే, అవి అమల్లోకి వస్తాయన్నారు.
''డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయి, ఛార్జీలు తగ్గుతాయి'' అని జైట్లీ నేడు ప్రశ్నోత్తర సమయంలో రాజ్యసభ సభ్యులకు జైట్లీ చెప్పారు. కొత్త టెక్నాలజీస్తో డిజిటల్ లావాదేవీలు మరింత చౌకగా లభ్యమవుతాయని, ఎక్కువమంది ప్రజలు డిజిటల్ వైపు మరలుతారని అంచనావేస్తున్నట్టు పేర్కొన్నారు. డిజిటల్ మనీనే వాడాలని తమ అధికారులకు కూడా ప్రభుత్వం సూచించిందని జైట్లీ తెలిపారు. పెద్ద నోట్ల నిర్ణయంపై స్పందించిన జైట్లీ, కొత్త కరెన్సీ నోట్లను ఆర్బీఐ ప్రింట్ చేయడం ముందస్తుగానే ప్రారంభించిందని, కానీ ఏటీఎం మిషన్లలోకి అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టిందన్నారు.
Advertisement
Advertisement