
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: ఇండియాలో గురువారం రికార్డు స్థాయిలో 98.2 లక్షల డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.71,634 కోట్ల మొత్తం లావాదేవీలు జరిగినట్లు జైట్లీ ట్వీట్ చేశారు. ఒక్క రోజులో ఇన్ని లక్షల లావాదేవీలు జరగడం రికార్డు అని ట్విటర్‌లో తెలిపారు. పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం (పిఎఫ్ఎస్ఎంఎస్) ఈ చెల్లింపులను ట్రాక్ చేస్తుందని, వినియోగదారుల అంగీకారం ద్వారానే ఈ చెల్లింపులు పెరుగుతున్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment