April 1
-
రూ. 2000 నోట్ల మార్పిడి బంద్!
చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక మూసివేత కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. రూ. 2000 నోట్ల మార్పిడి ఈ సదుపాయం ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ గత ఏడాది అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్ల నుంచి, 2024 ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి..
దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ డెబిట్ కార్డ్‌ల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లపై వార్షిక నిర్వహణ ఛార్జీలను రూ. 75 పెంచింది. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. పెరిగిన చార్జీలు ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు అనేక రకాల డెబిట్ కార్డ్‌లను అందిస్తుంది. వాటికి తదనుగుణంగా వార్షిక నిర్వహణ రుసుమును వసూలు చేస్తుంది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం, దాని క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌లకు వర్తించే ప్రస్తుత వార్షిక నిర్వహణ ఛార్జీలు రూ. 125 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 నుండి రూ. 200 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్‌ల నిర్వహణ రుసుములు రూ. 175 ప్లస్ జీఎస్టీ ఉండగా ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇక ప్లాటినం డెబిట్ కార్డ్ వార్షిక నిర్వహణ రుసుము ఏప్రిల్ 1 తర్వాత రూ. 250 ప్లస్ జీఎస్టీ నుండి రూ. 325 ప్లస్ జీఎస్టీకి పెరుగుతుంది. -
2024–25 ఐటీఆర్‌ల నోటిఫై
న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2024–25 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించి దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలు.. ఐటీఆర్ 2, 3, 5ను నోటిఫై చేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సీబీడీటీ ప్రకటించింది. పన్ను చెల్లింపుదారులు సులభంగా రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా రిటర్నుల పత్రాల్లో మార్పులు చేశారు. రూ.50 లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు
భారతదేశంలో ప్రతి ఏటా యూనివర్సిటీల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే చదివిన అందరికి ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగ సమస్య తారా స్థాయికి చేరుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అది ఇప్పుడు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 01 నుంచి (ఏప్రిల్) నిరుద్యోగ యువతకు రూ. 2,500 నిరుద్యోగ భృతి ఆంచించనున్నారు. దీని కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించింది. ఇది మాత్రమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, హౌస్‌గార్డులు, గ్రామ కొత్వార్‌లు, ఇతర ఉద్యోగుల జీతాలు కూడా పెంచనున్నట్లు గతంలో సీఎం భూపేశ్ భఘేల్ తెలిపారు, ఇది కూడా అమలయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హతలు: నిరుద్యోగ భృతి తీసుకోవడానికి తప్పకుండా ఛత్తీస్గడ్ నివాసితులై ఉండాలి. అంతే కాకుండా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న యువకులు దీనికి అర్హులు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. నిరుద్యోగ యువత ఛత్తీస్‌గడ్‌లోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గైడెన్స్ సెంటర్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకుని ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెండేళ్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిరుద్యోగ భృతికి అర్హత పొందుతారు. (ఇదీ చదవండి: ప్రత్యర్థులు గుండెల్లో గుబులు.. బీఎండబ్ల్యూ నుంచి మరో కారు లాంచ్) నిరుద్యోగ భృతి ఎలా అందుతుంది? నిరుద్యోగ యువతకు పైన చెప్పిన అన్ని అర్హతలు, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నప్పుడే నెలకు రూ. 2,500 లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి జమ అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడానికి నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు సంబంధింత అధికారులు చెబుతున్నారు. -
టాటామోటార్స్: వాణిజ్య వాహనాల ధరలు 5 శాతం పెంపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాటా మోటార్స్ అన్ని రకాల వాణిజ్య వాహనాల ధరలను మోడల్, వేరియంట్‌నుబట్టి 5 శాతం వరకు పెంచింది. కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. వచ్చే నెల నుంచి అమలులోకి వస్తున్న బీఎస్–6 రెండవ దశ కర్బన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను సిద్ధం చేసిన నేపథ్యంలో ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ ప్రకటించింది. ఇది కూడా చదవండి కిమ్స్‌లో వాటాను విక్రయించిన పోలార్ క్యాపిటల్ న్యూఢిల్లీ: వైద్య సేవల్లో ఉన్న కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (కిమ్స్) 1.38 శాతం వాటాలను పోలార్ క్యాపిటల్ ఫండ్స్ ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. వీటి విలువ రూ.143.7 కోట్లు. డిసెంబర్ త్రైమాసికంలో కిమ్స్‌లో పోలార్‌కు 1.87 శాతం వాటాలు ఉన్నాయి. -
‘హీరో’ లవర్స్‌కు షాక్: ఏప్రిల్ 1 నుంచి షురూ!
సాక్షి, ముంబై: ప్రముఖ టూ వీలర్ మేకర్ హీరో మోటో తన కస్టమర్లకు షాకిచ్చింది. ఏప్రిల్ నుంచి అన్ని వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై వచ్చే నెల నుండి 2 శాతం వరకు ధరలు పెరగనున్నాయి. ఈ పెరుగుదల మోడల్స్ , మార్కెట్లను బట్టి మారుతూ ఉంటుందని హీరో మోటోకార్ప్ ప్రకటించింది. (ఓలా ఎలక్ట్రిక్ దూకుడు: రూ. 2,475 కోట్ల సమీకరణ !) OBD-2 నిబంధనలకు అనుగుణంగా మారడం, ఉద్గార ప్రమాణాల అమలుతో ఉత్పత్తి వ్యయం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కంపెనీలు సైతం కొత్త ఉద్గార ప్రమాణాల అమలుకోసం తమ తమ వాహనాల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. (ఇది నమ్మక ద్రోహమే..తక్షణమే రాజీనామా చెయ్యండి! జుకర్‌బర్గ్ ఆగ్రహం) హీరో మోటోకార్ప్ తాజా లాంచ్‌లు: హీరో మోటోకార్ప్ ఇటీవల భారతదేశంలో రూ. 68,599 (ఎక్స్-షోరూమ్) వద్ద సరికొత్త జూమ్ 110ని విడుదల చేసింది. అలాగే రూ. 83,368, ఎక్స్-షోరూమ్ ధరతో సూపర్ స్ప్లెండర్ కొత్త హైటెక్ XTEC వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. కాగా ఇలీవలి కాలంలో హీరో కంపెనీ ధరల పెంపు ఇదిరెండోసారి. అటు టాటా మోటార్స్ సైతం తాజాగా తన కమర్షియల్ వాహన ధరలను 5 శాతం మేర పెంచింది. -
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి పీఎఫ్ కొత్త రూల్స్
ఏప్రిల్ 1 నుంచి సంవత్సరానికి రూ.2.5 లక్షలకుపైగా జమ అయ్యే ప్రావిడెంట్ ఫండ్ నగదుపై పన్ను విధించబడుతుంది. దీనికి సంబందించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో ప్రకటించారు. 2.5 లక్షల వరకు డిపాజిట్ అయ్యే నగదుపై ఎలాంటి పన్ను విధించరని ఆర్థిక మంత్రి అన్నారు. ఫైనాన్స్ బిల్లు 2021లో ప్రభుత్వం ఈ నిబంధనకు సవరణను ప్రవేశపెట్టింది. సాధారణంగా, ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అంతే మొత్తంలో కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం.. ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టం, సూపర్ న్యూ నేషన్ ఫండ్‌కు సంవత్సరానికి రూ.7,50,000 కంటే ఎక్కువ మొత్తంలో యజమాని సహకారం కింద పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుపై మాత్రమే ప్రభావం పడనుంది. సంవత్సరానికి రూ.20.83 లక్షలకు పైగా సంపాదించే వారిపై పన్ను విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈపిఎఫ్ సహకారంపై అతని లేదా ఆమె ఆసక్తిని ఆకర్షిస్తారు. సుమారు 93 శాతం మంది రూ.2.5 లక్షల పరిమితికి లోబడి ఉన్నారు. ఇందులో జమ అయ్యే నగదుపై వడ్డీ లభిస్తుంది. దీని వల్ల పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు మీ చేతికి అందుతుంది. తద్వారా, పదవి విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చు. చదవండి: కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్! మళ్లీ పెరిగిన బంగారం ధరలు! -
ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!
కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి. వాహనాలు వ్యాపారాలు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్‌లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా భారతదేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హీరో స్కూటర్లు, బైక్‌ల ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది. టీవీ 2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. గత ఎనిమిది నెలలుగా టీవీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్ పరిశ్రమను పిఎల్ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం టీవీ ఉత్పత్తిలో వాడే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధర పెరగడమే. నేటి నుంచి టీవీ ధరలు యూనిట్‌కు కనీసం 2000-3000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఏసీ & రిఫ్రిజిరేటర్ ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉంది. తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర పెరుగుతుంది. ప్రతి ఎయిర్ కండీషనర్ ధర రూ.1500 నుంచి 2000 రూపాయలకు పెరగవచ్చు. కేవలం ఒక నెలలోనే ఓపెన్-సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. తత్పలితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల ధరలు పెరగనున్నాయి. విమాన ప్రయాణం దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ విమానయాన రక్షణ రుసుమును రూ.160 నుంచి రూ.200కు పెంచనున్నారు. అలాగే, అంతర్జాతీయ విమానాల రుసుము 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. దీనికి సంబంధించి డీజీసీఎ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: 17 రూపాయిలతో 116 కిలోమీటర్ల ప్రయాణం భారీగా పెరిగిన బంగారం ధరలు -
ఏప్రిల్ ఫూలదండ.. మార్చి 32..!
‘ఏప్రిల్ ఫూల్’ ‘ఏప్రిల్ కూల్’ గా మారాలంటే ఇవ్వాళే ఒక మొక్క నాటండి. చెబ్బాష్! మీరు ఈ రోజు ‘ఫూల్’ అయ్యారా? అయితే కచ్చితంగా గర్వపడండి. ఎందుకంటే మహారచయిత షేక్స్పియర్ ఇలా అన్నారు: ‘ఫూల్ తనను తాను మేధావి అనుకుంటాడు. మేధావి తనను తాను ఫూల్ అనుకుంటాడు’ ఏప్రిల్ ‘ఫుల్లు’ డే! ఏప్రిల్ ‘ఫుల్లు డే’ అనుకొని బార్లు కిటకిటలాడుతున్నాయి. ఎవరైనా చెప్పండి... ఈరోజు ‘ఏప్రిల్ ఫూల్ డే’ అని. మీకు తెలుసా? అలనాడు దుర్యోధనుడు మయసభలో ‘ఏప్రిల్ 1’ నే ఫూల్ అయ్యాడు. దేవదాసు తెలివి ‘ఎవరో నన్ను ఫూల్ చేయడం ఏమిటి పారూ...నన్ను నేనే చేసుకుంటాను’ అని దేవదాసు ఇలా చేశాడు... ఖాళీ బాటిల్ ఎత్తి ఖాళీ గ్లాసులో పోశాడు. తాగుతున్నట్లు నటిస్తూ ‘అబ్బా! ఈరోజు ఫుల్లు అయిపోయాను’ అన్నాడు. తమిళనాడు ఎన్నికల వాక్దానం మా పార్టీని గెలిపిస్తే ‘ఏప్రిల్ ఫూల్ డే’ మాత్రమే కాదు ‘మే ఫూల్ డే’ ‘జూన్ ఫూల్ డేలు’ కూడా ప్రత్యేకంగా మన రాష్ట్రానికి తెస్తామని హామీ ఇస్తున్నాం. ఎవరికి ‘చెప్పు’కోవాలి! ఆనంద్ ఈరోజు చెరువులో గాలం వేశాడు. కొద్దిసేపటి తరువాత చాలా బరువుగా ఏదో తాకింది. ‘పే...ద్ద చేప పడిందోచ్’ అని గాలం లాగాడు. రెండు పాత చెప్పులు వచ్చాయి. వాటి మీద ‘ఏప్రిల్ ఫూల్’ అనే స్టిక్కర్లు అంటించి ఉన్నాయి. ఈ రోజు అయితే బెస్ట్... ఎవరికైనా లవ్‌ప్రపోజ్ చేయడానికి ఈరోజు అయితే బెస్ట్. పాస్ అయితే సంతోషం. ఫెయిల్ అయితే ‘నిన్ను ఫూల్ చేయడానికి అలా అన్నానంతే. నాకు అంత సీన్ లేదని నీకు తెలి యదా!’ అని మెల్లగా జారుకోవచ్చు. ఒకరినొకరు... అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్, ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్‌ను ‘ఫూల్’ చేయాలనుకున్నాడు. కిమ్‌కు ఫోన్ చేసి ‘హాలో నేను అమెరికా నుంచి కిమ్‌ను మాట్లాడుతున్నాను. బాగున్నారా’ అన్నాడు. కిమ్ ఏమన్నా తక్కువ తిన్నాడా? ఫోన్ పెట్టేసి వెంటనే ట్రంప్‌కు ఫోన్ చేసి ‘నేను కొరియా నుంచి ట్రంప్‌ను మాట్లాడుతున్నాను బాగున్నారా’ అని అడిగాడు. మార్చి 32 కరోనా కారణంగా ఈరోజు ‘ఏప్రిల్ఫుల్ డే’ను రద్దు చేయడమైనది. ఈరోజును ‘మార్చి 32’గా మాత్రమే పరిగణించాలని మనవి. -
కొత్త వేతన కార్మిక చట్టాలకు కేంద్రం బ్రేక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక(లేబర్ కోడ్స్) చట్టాల అమలును తాత్కాలికంగా వాయిదా వేసింది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడమే ఈ వాయిదాకు కారణం. దీనితో ఈ నాలుగు లేబర్ కోడ్లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావు. అంటే ఉద్యోగుల టేక్-హోమ్ పే, కంపెనీల ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పు ఉండదు. కార్మికుల వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక భద్రత, ఆక్యుపేషనల్ భద్రత, ఆరోగ్య, పని నిబంధనలకు సంబంధించి కేంద్రం ఇప్పటికే నోటిఫై చేసింది. అయితే, ఈ కొత్త నాలుగు కార్మిక చట్టాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని గతంలోనే కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది. ఈ కొత్త వేతనాల కోడ్ అమల్లోకి వస్తే ఉద్యోగుల ప్రాథమిక వేతనం, ప్రావిడెంట్ ఫండ్ లెక్కించే విధానంలో గణనీయమైన మార్పులు వచ్చేవి. రాజ్యాంగ ప్రకారం కార్మికుల అంశం అనేది ఉమ్మడి జాబితాలో ఉంది. దీంతో అటు కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా నిబంధనలను నోటిఫై చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు ఇంకా కొత్త లేబర్ కోడ్స్‌కు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో దీనికి కేంద్రం తాత్కాలిక వాయిదా వేసింది. ఈ రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి పలు కంపెనీలు బేసిక్‌ను తక్కువగా చూపి అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తం ఇచ్చేవి. కొత్త వేతనాల కోడ్ ప్రకారం.. ఉద్యోగి స్థూల వేతనం 50 శాతం, అలవెన్సులు 50 శాతం చొప్పున ఉండాలి. ఒకవేళ ఏప్రిల్ 1 నుంచి కొత్త లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చి ఉంటే.. ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ, యాజమాన్యాల ప్రావిడెంట్ ఫండ్ వాటా పెరిగేది. లేబర్ కోడ్ల అమలు వాయిదా పడటం వల్ల మరికొన్ని రోజుల పాటు పాత విధానంలోనే శాలరీని అందుకోవాల్సి ఉంటుంది. చదవండి: భారత్‌లో బైట్‌డ్యాన్స్‌కు మరో షాక్! వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా? -
ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు చోటు చేసుకుంటుంటాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. ఈసారి కార్లు, బైక్‌లు, టీవీలు, ఏసీల ధరల రూపంలో సామాన్యులపై ఒకటో తారీఖు నుంచి భారం పడే అవకాశం ఉంది. ఇలాంటివి చాలానే ఉన్నాయి.. అవేంటంటే.. ఈ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు చెల్లవు ఆంధ్రా బ్యాంకు, దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్ ఈ ఏడు బ్యాంకుల్లో ఖాతాలున్నాయా? అయితే ఇప్పుడు ఆ బ్యాంకుల పాస్‌బుక్, చెక్‌బుక్‌లు వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి చెల్లవు. ఎందుకంటే ఈ ఏడు బ్యాంకులు వేర్వేరు బ్యాంకుల్లో విలీనమయ్యాయి. ఇతర బ్యాంకుల్లో విలీనమైన కస్టమర్లు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించి మారిన ఎంఐసిఆర్ కోడ్, ఐఎఫ్ఎస్సి కోడ్, పాస్‌బుక్, చెక్‌బుక్ మొదలైనవి పొందాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలో ఎక్కువ జమ చేస్తున్నారా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2021లో ప్రావిడెంట్ ఫండ్‌పై కీలక ప్రకటన చేశారు. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైన జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై ఇక నుంచి పన్ను పడనున్నట్లు వెల్లడించారు. రూ.2.5 లక్షల లోపు వరకు గల డిపాజిట్ మొత్తంపై వచ్చే వడ్డీ మొత్తానికి ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది. అలాగే ఇదే మొత్తానికి సమానమైన మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదును జమ చేసే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. బ్యాంకు డిపాజిట్లపై రెట్టింపు టీడీఎస్ ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. అంటే ఆదాయ పన్ను శ్లాబులో లేనివారు కూడా ఐటీఆర్ దాఖలు చేయకపోతే రెట్టింపు టీడీఎస్‌ను కట్టాల్సి వస్తుంది. ఐటీ రిటర్నుల దాఖలును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. కార్లు, బైక్‌లు, ఏసీలు ధరలు పెంపు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కార్ల, బైక్‌లు, ఏసీలు ధరలు పెరగనున్నాయి. అంతర్జాతీయంగా సరఫరా కొరత కారణంగా కమొడిటీ, లోహ ధరలు పెరగడంతో కార్లు, బైక్‌ల సంస్థలు రేట్లు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. తయారీ వ్యయాలు పెరగడంతో ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలు ఆ మేరకు పెరగనున్నాయి. ఏసీ ధరలు రూ.1500-2000 వరకు పెరగవచ్చు. విమానం చార్జీల మోత ఏప్రిల్ నుంచి విమాన ప్రయాణికులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. భారత విమానాశ్రయాల్లో ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్) పెరగనుంది. ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే టికెట్లపై ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. దేశీయ ప్రయాణికులపై రూ.200 చొప్పున, అంతర్జాతీయ ప్రయాణికులపై 12 డాలర్ల చొప్పున ధర పెరగనుంది. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్ పాస్‌పోర్టులున్నవారు తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు నుంచి మినయింపు ఇచ్చారు. కంపెనీలు క్రిప్టోకరెన్సీ లెక్క చెప్పాల్సిందే కంపెనీలు ఏప్రిల్ 1 నుంచి తమ వద్ద ఉండే క్రిప్టోకరెన్సీ వివరాలను తప్పనిసరిగా ఆర్థిక ఖాతాల్లో వెల్లడించాల్సి ఉంటుంది. కంపెనీకి చెందిన ఆర్థిక అంశాలు వాటాదార్లకు తెలియాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిబంధనను తీసుకొచ్చింది. ఆర్థిక ఫలితాలను ప్రకటించే తేదీ నాటికి ఎంత మేర క్రిప్టోకరెన్సీ ఉందన్నదో చెప్పాలి. అంతే కాదు.. వాటిపై వచ్చిన లాభం, నష్టాలనూ వెల్లడించాలి. ఈ కరెన్సీల్లో ట్రేడింగ్/పెట్టుబడులకు ఇతరుల నుంచి తీసుకునే డిపాజిట్లు, అడ్వాన్సులనూ ఆయా కంపెనీలు చెప్పాల్సి ఉంటుంది. చదవండి: మరిన్ని పట్టణాలకు అమెజాన్ ప్యాంట్రీ లోన్ తీసుకునేవారికి ఎస్బీఐ తీపికబురు -
బ్యాంకింగ్ రంగం అంత బాగోకపోవచ్చు!
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్ ఏప్రిల్ 1వ తేదీ నుంచీ ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరం అంత బాగుండక పోవచ్చని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం-ఫిచ్ అంచనా వేస్తోంది. క్తొత వ్యాపారాలు, ఆదాయ వృద్ధి, రుణ నాణ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని తాజా అంచనాకు వచ్చినట్లు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటనలో ముఖ్యాంశాలు చూస్తే.. కోవిడ్-19 నేపథ్యంలో ఎకానమీలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, చిన్న వ్యాపారాలకు జరిగిన నష్టాలు, నిరుద్యోగం, ప్రైవేటు వినియోగంలో తగ్గుదల వంటి అంశాలు ఇంకా పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్స్‌లో ప్రతిబింబించడంలేదు. ఆయా అంశాల ప్రతికూలతలు, రుణ నాణ్యతలో లోపాలు 2022 మార్చి నాటికి ముగిసే బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. భారత్ బ్యాంకులు ఫైనాన్షియల్ పరిస్థితులు, సవాళ్లపై అప్పటి వరకూ ఒక స్పష్టత వచ్చే అవకాశం లేదు. నిర్వహణా పరంగా తీసుకున్న కొన్ని చర్యల వల్ల మాత్రమే 2020 డిసెంబర్ వరకూ జరిగిన తొమ్మిది నెలల్లో బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లలో కొంత మెరుగుదల కనిపించింది తప్ప, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంతకు ముందుకన్నా రుణ బలహీన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రుణ వృద్ధి రేటు కూడా అంతంత మాత్రంగానే ఉంది. బ్యాంకింగ్‌కు భారీగా మూలధనం అందించే విషయంలో కూడా ప్రభుత్వానికి పరిమితులు ఉన్నాయి. సమస్య తీవ్రతలో ఇది మరో కోణం. రుణ నాణ్యత సరిగాలేకపోవడం, ఆర్థిక రికవరీలో అస్పష్టత వంటి అంశాలు బ్యాంకింగ్ రంగం అవుట్‌లుక్‌ను బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగానికి 5.5 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.40,150 కోట్లు) మూలధనంగా అందించాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ, ఫిచ్ ‘అంచనా మూలధనం అవసరం’కన్నా ఇది చాలా తక్కువ. వివిధ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌కు 15 బిలియన్ డాలర్ల నుంచి 58 బిలియన్ డాలర్ల వరకూ అవసరమవుతాయి. నియంత్రణా పరంగా ఇచ్చిన వెసులుబాటును వెనక్కు తీసుకుంటే, ఇది బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్లపై అలాగే మూలధనంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గణాంకాలను లోతుగా విశ్లేషిస్తే, ఒత్తిడి తీవ్రతను గుర్తించవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ వృద్ధి రేటు 11శాతంగా నమోదుకావచ్చు. అయితే పలు రంగాలు సామర్థ్యానికి దిగువనే కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉంది. రిటైల్ కస్టమర్లో ఒత్తిడి కొనసాగుతోంది. ప్రైవేటు వినియోగం తగ్గుదల, పట్టణ యుటిలిటీ బిల్లుల చెల్లింపుల్లో వైఫల్యాలు, సామాజిక భద్రతా పథకాల నుంచి ఉపసంహరణల వంటి అంశాలు దీనిని సూచిస్తున్నాయి. లఘు, మధ్య తరహా పరిశ్రమలకు 2021- 22 ఆర్థిక సంవత్సరం కూడా ఒక పరీక్షా కాలంగా నిలవనుంది. మొండిబకాయిల తీవ్రత... కోవిడ్-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్ఎస్ఆర్) ఇటీవలే పేర్కొంది. ఎన్పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్ నాటికి 13.5 శాతానికి చేరుతుందని నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్పీఏ భారం 7.5 శాతం. అప్పటి నుంచీ చూస్తే, కనీసమయినా ఎన్పీఏలు 600 బేసిస్ పాయింట్లు (6 శాతం) అయినా పెరుగుతుందన్నమాట. నివేదిక ప్రకారం, ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) మొండి బకాయిలు 2021 సెప్టెంబర్ నాటికి కనీస స్థాయిలో చూసినా 9.7 శాతం - 16.2 శాతాల శ్రేణిలో ఉండే వీలుంది. ప్రైవేటు బ్యాంకింగ్ విషయంలో ఈ శ్రేణి 4.6 శాతం-7.9 శాతం శ్రేణిలో ఉండవచ్చు. ఫారిన్ బ్యాంకుల విషయంలో ఈ శ్రేణి 2.5 శాతం - 5.4 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. ఇక తీవ్ర స్థాయిల్లో పీఎస్బీ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకుల విషయంలో ఎన్పీఏలు వరుసగా 17.6 శాతం, 8.8 శాతం, 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉంది. రుణ నాణ్యత పటిష్టతపై ఇప్పుడే చెప్పలేం: క్రిసిల్ ఇదిలావుండగా, బ్యాంకింగ్ రుణ నాణ్యత పటిష్టత గురించి ఇప్పుడే ఏమీ నిర్థారణకు రాలేమని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ అనుబంధ విభాగం క్రిసిల్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన క్రెడిట్ రేషియోను 0.54 నుంచి 1 స్థాయికి చేర్చింది. -
ఇక ఆ వాహనాలకు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి
న్యూఢిల్లీ: అన్ని కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలలో ఫ్రంట్ ప్యాసింజర్ కు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 5న ఈ ఉత్తర్వులను కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. “వాహనం ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది ఒక ముఖ్యమైన రక్షణ చర్యగా పేర్కొంది. రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ సూచనల ఆధారంగా ఈ నిబంధనలు తీసుకురావడం జరిగినట్లు" కేంద్రం పేర్కొంది. 2021 ఏప్రిల్ 1న నుంచి కొనుగోలు చేసే ప్రతి కొత్త వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది. ఇక ఇప్పటికే కొన్న వాహనాలకు ఆ వాహనదారులు ఆగస్టు 31లోపు తప్పనిసరిగా ఎయిర్ బ్యాగ్స్ అమర్చుకోవాల్సి ఉంటుంది. గతంలో డిసెంబర్ 29, 2020న ఈ నిబంధనలు తీసుకొచ్చిన ప్రభుత్వం ప్రతి వాహనంలోనూ ముందు సీట్ల కోసం డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించింది. కొత్త వాహనాలకు ఏప్రిల్ 1, పాత వాహనాలకు జూన్ 1లోపు ఎయిర్ బ్యాగ్స్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. డ్రైవర్ సీట్ లో ఎయిర్ బ్యాగ్ తప్పనిసరిగా ఉండాలని 2019 నుంచే నిబంధన ఉండగా.. ప్రస్తుతం డ్రైవర్ పక్క సీటుకు కూడా దీన్ని కొనసాగించారు. ఈ నిబంధన అన్ని ఎం1 కేటగిరి వాహనాలకు వర్తిస్తుంది. ఎనిమిది సీట్ల కంటే తక్కువ సైజున్న ప్యాసెంజర్ వెహికిల్స్ అన్నీ ఈ కేటగిరిలోకి చేరతాయి. ఇటీవలి ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోని రోడ్ ప్రమాద బాధితుల్లో 10 శాతం మంది భారతదేశం నుంచి ఉన్నారు. డ్రైవర్ పక్క సీటుకు కూడా ఎయిర్‌బ్యాగ్ ఉండటం వల్ల ప్రమాదం వల్ల కలిగే తీవ్రతను కొంచెం తగ్గించవచ్చు. దీనివల్ల డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణీకులకు అదనపు రక్షణ లభిస్తుంది. కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా నాలుగు చక్రాల వాహన ధరలు రూ.5,000 నుంచి 8,000 పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రమాదంలో ఎయిర్‌బ్యాగ్ వ్యక్తి ప్రాణాలను కాపాడే ఆస్కారం ఎక్కువ కాబట్టి ఇది అంత పెద్ద ధర కాకపోవచ్చు. చదవండి: ఆరు నెలలు నీటి అడుగున ఐఫోన్ 11, అయినా కూడా.. రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
రేపటినుంచి ‘టోల్’ బాదుడు!
సాక్షి, న్యూఢిల్లీ:జాతీయ రహదారులపై ప్రయాణించే వాహన చోదకులకు ఇక మరో టోల్ బాదుడు తప్పదు. మార్చి31 అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్న కొత్త టోల్‌చార్జీలు నేపథ్యంలో జాతీయ రహదారులపై డ్రైవింగ్ మరింత భారం కానుంది. జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) టోల్ రేట్లును 5నుంచి 7శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మెజారీటి టోల్ ప్లాజాలపై అన్ని రకాల వాహనాలపై టోల్ చార్జీలు 5శాతం పెరగనున్నాయి. మంత్లీ ప్లాన్‌లో (నెలకు 50 ట్రిప్పులు) ధరలను కూడా నేషనల్ హైవే అథారిటీ పెంచింది. ఫలితంగా నిత్యావసర ధరలు కూడా ఈ మేరకు భగ్గుమనడం ఖాయం. జాతీయ రహదారిపై టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేసిన తర్వాత ఏటా ఏప్రిల్ నెలలో చార్జీలను పెంచుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పెంచిన టోల్ చార్జీ అమలు కానుంది. నేషనల్ హైవే 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ మొహమ్మద్ సఫీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మొత్తం 372 టోల్ ప్లాజాలున్నాయని చెప్పారు. టోల్‌రేట్లు కూర్పు ప్రతి ఆర్థికసంవత్సరం ప్రారంభం కావడానికి ముందే జరుగుతుందని వివరించారు. ముఖ్యంగా టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా రేట్లు సవరణ ఉంటుందనీ, అయితే ఆయా ప్రాంతాలనుబట్టి రేట్లు మారతాయన్నారు. మరోవైపు ఇప్పటికే జాతీయ రహదారులపై టోల్‌చార్జీలు అధికంగా ఉన్నా,మళ్లీ రేట్లు పెంచడం అసమంజసమనే ఆందోళన సర్వత్రా వ్యకమవుతోంది. ఈ పెంపుపై ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఒకవైపు ఇ-వే బిల్లు, పెరిగిన డీజిల్ ధరలకు తోడు టోల్ చార్జీలపెంపు కారణంగా, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయని పేర్కొన్నాయి. -
సహజవాయువు ధర పెంపు: వంటగ్యాస్ మంటలేనా?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరోసారి సహజవాయువు ధరను పెంచేసింది. చమురు మంత్రిత్వ శాఖలోని పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సహజ వాయువు ధర 6శాతం పెరిగింది. దీంతో సహజవాయువు ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. ఈ చర్య మూలంగా సీఎన్జీ, పీఎన్జీ పైప్డ్ వంటగ్యాస్ ధరలు భారీగా పెరగనున్నాయని విశ్లేషకుల అంచనా. తాజా పెంపుతో మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్(ఎంఎంబీటీయూ) ధర 3.06 డాలర్లు చొప్పున పెరగనుంది. ధరలు పెంచకముందు ఇది 2.89 డాలర్లుగా ఉంది. సవరించిన ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఆరు నెలల పాటు అక్టోబర్ దాకా ఈ ధరలు అమల్లో ఉంటాయి. అధిక లోతు, అధిక వేడి, అధిక పీడనం ఉన్న ప్రాంతాల నుంచి వెలికితీసే గ్యాస్ ధరను 9 శాతం అంటే ఎంఎంబీటీయూకు 6.78 డాలర్ల చొప్పున పెంచింది. దేశీయ గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ధర కూడా 3శాతం పెరగనుంది. అలాగే సీఎన్జీ, వంటగ్యాస్ లు ధరలు 50-55 పైసలు , స్టాండర్డ్ క్యూబిక్ మీటర్‌కు 35-40 పైసలు పెరగనున్నట్టు అంచనా. మరోవైపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో సహజ వాయువును ఉత్పత్తి చేస్తున్న ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్లాంటి సంస్థలకు భారీగా లబ్ధి చేకూరనుంది. కాగా అమెరికా, రష్యా , కెనడా వంటి గ్యాస్ మిగులు దేశాలలోని సగటు రేట్లు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి సహజ వాయువు ధరల సమీక్ష ఉంటుంది. -
ఏప్రిల్ 1నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు
బెల్లంపల్లి : తెలంగాణ రాష్ట్ర ద్వితీయ మహాసభలు ఏప్రిల్ 1నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుండా మల్లేష్, జిల్లా కార్యదర్శి కె.శంకర్ తెలిపారు. ఆదివారం పట్టణ సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాసభల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ అలుపెరుగని పోరాటాలు చేస్తోందని తెలిపారు. రాష్ట్ర మహాసభల ప్రారంభాన్ని పురష్కరించుకుని ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎగ్జిబిషన్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున సభకు తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరా రు. మహాసభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శులు కె. నారాయణ, అతుల్‌కుమార్ అంజన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చిప్ప నర్సయ్య, డి.సత్యనారాయణ, ఎం.వెంకటస్వామి, మల్లయ్య, చంద్రమాణిక్యం పాల్గొన్నారు. -
టూ వీలర్స్‌పై భారీ డిస్కౌంట్స్
⇔ ఈ అవకాశం ఈ ఒక్క రోజే ⇔ మార్చి 31 తర్వాత బీఎస్ – 3 వాహనాలు బంద్ l ⇔ సుప్రీంకోర్టు తీర్పుతో తగ్గింపు ఆఫర్లు ప్రకటించిన హోండా, హీరో, బజాజ్, సుజుకి l ⇔ ద్విచక్ర వాహనం రూ.22,000 వరకు చౌక న్యూఢిల్లీ: స్కూటర్, బైక్ ఏదైనా ద్విచక్ర వాహనాన్ని కొనాలన్న ఆలోచన ఉంటే ఆ ముహూర్తమేదో ఈ రోజే పెట్టేసుకోండి. ఎందుకంటే సుప్రీం కోర్టు తీర్పు ఫలితంగా... వాహన తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. బీఎస్ – 3 కాలుష్య ప్రమాణాలతో ఉన్న వాటిని ఏప్రిల్ 1 నుంచి విక్రయించడం, రిజిస్ట్రేషన్ కుదరదని అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఇచ్చిన తీర్పుతో ఆ వాహన నిల్వలను క్లియర్ చేసుకోవడంపై వాహన తయారీ సంస్థలు దృష్టి సారించాయి. ద్విచక్ర వాహనాలపై రూ.22వేల రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం, అదీ శుక్రవారం ఒక్కరోజే అందుబాటులో ఉంటుంది. స్టాక్స్ మిగిలి ఉన్నంత వరకు లేదా మార్చి 31 వరకే ఆ ఆఫర్లు అమల్లో ఉంటాయని కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య వాహన కంపెనీలు సైతం బీఎస్–3 యూనిట్లపై కొంత మేర తగ్గింపును అందిస్తున్నట్టు తెలియవచ్చింది. మార్చి 31న కొనుగోలు చేసినట్టు ఇన్వాయిస్, ఇతర ధ్రువీకరణలతో ఆ తేదీ తర్వాత కూడా రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అనుమతి ఉంది. డీలర్ల తగ్గింపు మరికొంత... వాస్తవానికి మార్చి 31తో తమ దగ్గర మిగిలిపోయే వాహనాల విషయమై కంపెనీల నుంచి డీలర్లకు సమాచారం లేదు. ఈ నేపథ్యంలో తమ దగ్గరున్న వాహన స్టాక్‌ను క్లియర్ చేసుకునేందుకు... కంపెనీలు అందించే డిస్కౌంట్‌కు అదనంగా తాము సైతం కొంత తగ్గింపును అందించేందుకు డీలర్లు ముందుకు వస్తున్నారు. అయితే, బజాజ్ మాత్రం మిగిలిపోయిన ప్రతీ ఒక్క వాహనాన్ని వెనక్కి తీసుకుంటామని తమ డీలర్లకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. 6.71 లక్షల వాహనాలు బీఎస్ – 3 ప్రమాణాలతో ఉన్న అన్ని రకాల వాహనాలు దేశంలో 8 లక్షలకు పైన ఉంటాయని అంచనా. వీటిలో కేవలం ద్విచక్ర వాహనాలే 6.71 లక్షలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు దరిమిలా ఆఖరి రోజైన మార్చి 31లోపు వీలైనన్నింటినీ విక్రయించుకోవాలన్న ఉద్దేశంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లను ప్రకటించినట్టు పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఒక్క హీరో మోటో కార్ప్ కంపెనీ పరిధిలోనే 2 లక్షల వాహనాలున్నాయని అంచనా. టాటా మోటార్స్ కంపెనీకి బీఎస్ –3 యూనిట్లు 30,000 వరకు ఉన్నాయి. అన్ని రకాల కార్లను కంపెనీలు బీఎస్–4 ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నాయి. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, ట్రక్కులు, బస్సులే బీఎస్ –3 ప్రమాణాలకు అనుగుణంగా ప్రస్తుతం విక్రయమవుతున్నాయి. ఊహించని రాయితీలు: డీలర్లు ద్విచక్ర వాహన పరిశ్రమలో ఎప్పుడూ వినని తగ్గింపు ధరలుగా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ (ఎఫ్ఏడీఏ) మాజీ ప్రెసిడెంట్, అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ నికుంజ్ సంఘి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఏ విధంగా అనుసరించనున్నారు అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ... గడువులోపు సాధ్యమైనన్ని వాహనాలను విక్రయించడంపైనే తమ శక్తిని కేంద్రీకరించామని చెప్పారు. కొనుగోలుకు అవకాశం ఉన్న కస్టమర్లకు కాల్స్ చేసి మరీ ఆఫర్ల గురించి తెలియజేస్తున్నట్టు తెలిపారు. బీఎస్ –3 వాహనాల నిల్వలను విక్రయించుకునేందుకు కోర్టు మరింత సమయం ఇస్తుందని ఆశించామని, కానీ అది జరగనందున ఉన్న వాటిని అమ్ముకోవడంపై దృష్టి పెట్టామన్నారు. గడువు తర్వాత మిగిలి ఉన్న వాహనాల విషయమై తయారీదారులతో మాట్లాడాల్సి ఉందన్నారు. తగ్గింపు ఎందుకు...? మిగిలి ఉన్న వాహనాలను కంపెనీలు ఏప్రిల్ 1 తర్వాత విక్రయించడానికి వీల్లేదు. వాటిని విదేశీ మార్కెట్లలో అమ్ముకోవడం ఒక్కటే వాటి ముందున్న మార్గం. విదేశాలకు ఎగుమతి చేయడం కొంత ఖర్చుతో కూడుకున్నది. అదే సమయంలో స్థానిక మార్కెట్లో ఉన్నంత విక్రయాలు విదేశీ మార్కెట్లలో ఉండకపోవచ్చు. ఆ స్టాక్‌ను వదిలించుకునేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఇదంతా కంపెనీలపై భారాన్ని పెంచేవే. అదేదో ఇక్కడే కొంత డిస్కౌంట్ ఇవ్వడం వల్ల వాహన నిల్వలను తగ్గించుకోవచ్చని కంపెనీలు భావించి ఉండొచ్చు. వాణిజ్య వాహనాలపై తగ్గింపు ఎంత..? బీఎస్ –3 ప్రమాణాలతో ఉన్న వాణిజ్య వాహనాల నిల్వలు తక్కువే ఉండడంతో వీటిపై భారీ ఆఫర్లకు కంపెనీలు ముందుకు రానట్టు తెలుస్తోంది. అయినప్పటికీ ట్రక్కులు, బస్సులపై 4 నుంచి 12 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు సమాచారం. తిరిగి కస్టమర్∙మీదే భారం? బీఎస్–3 ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులతో ముందుకు వచ్చిన సంస్థలు ఆ భారాన్ని గడువు తర్వాత తిరిగి కస్టమర్ల మీదే రుద్దనున్నాయా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తగ్గింపుల వల్ల ఎదురయ్యే నష్టాన్ని అవి తర్వాత బీఎస్ –4 మోడళ్లపై కొద్ది మేర రేట్లను పెంచడం ద్వారా భర్తీ చేసుకునే అవకాశం లేకపోలేదన్నది పరిశీలకుల అభిప్రాయం. వాహనాలు ఇట్టే అమ్ముడవుతాయి.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బీఎస్–3 ద్విచక్ర వాహనాలపై కనీవినీ ఎరుగని రీతిలో భారీ డిస్కౌంట్లు ఇస్తుండటంతో అమ్మకాలు బాగా పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఒక్కో డీలర్ వద్ద 200–300 దాకా వాహనాలు ఉన్నట్టు తెలియవచ్చింది. భారీ డిస్కౌంట్ల కారణంగా ఇవన్నీ ఒక్కరోజులో అమ్ముడయిపోతాయని శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్‌రెడ్డి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. డిస్కౌంట్లతో అమ్మకాలకు బూస్ట్ ఉంటుందని విశ్వసిస్తున్నట్టు లక్ష్మి గ్రూప్ డైరెక్టర్ కంభంపాటి జైరామ్ చెప్పారు. అయితే వాహనాలు మిగిలిపోతే ఎలా అన్నదే తమ ముందున్న ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కంపెనీల నుంచి ఇంత వరకు ఎటువంటి హామీ రాలేదని చెప్పారాయన. మేం మరింత తగ్గించాం బజాజ్ ఇస్తున్న డిస్కౌంట్‌కు తోడు తాము అదనంగా తగ్గింపు ఆఫర్ ఇస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్ ప్రకటించింది. సీటీ–100పైన రూ.8 వేలు, ప్లాటినా, డిస్కవర్–125, వీ–15 పైన రూ.10 వేలు, అవెంజర్, పల్సర్ మోడళ్లపై రూ.12,000, ఆర్ఎస్–200పై రూ.17,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలియజేసింది. హైదరాబాద్‌లో హోండా డీలర్లు రూ.60,000 వరకు ధర గల బైక్‌లపై రూ.20,000 వరకు, స్కూటర్లపై రూ.13,500 దాకా తగ్గింపును ఇస్తున్నారు. హీరో మోటో షోరూంలు రూ.12,500 దాకా డిస్కౌంట్ ఆఫర్ చేశాయి. మహీంద్రా టూవీలర్స్ రూ.25,000 దాకా ధర తగ్గించింది. హోండా: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తొలుత బీఎస్ – 3 వాహనాలపై ఫ్లాట్ రూ.10,000 తగ్గింపును ఆఫర్ చేసింది. అంతలోనే ఏమనుకుందో ఏమో రూ.22,000కు క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్టు తెలిపింది. యాక్టివా 3జి (రూ.50,290), డ్రీమ్ యుగ (రూ.51,741), సీబీ షైన్ (రూ.55,799 – రూ.61,283), సీడీ 110డీఎక్స్ (రూ.47,202 – రూ.47,494). మోడళ్లపై తగ్గింపు లభిస్తుంది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు. హీరో: హీరో మోటోకార్ప్ రూ.12,500 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. స్కూటర్లపై రూ.12,500, ప్రీమియం బైక్‌లపై రూ.7,500, ప్రారంభ స్థాయి మోడళ్లపై రూ.5,000 తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న వాటిలో డ్యూయెట్ (రూ.49,480), మాస్ట్రో ఎడ్జ్ (రూ.51,030), గ్లామర్ (రూ.59,755), స్లె్పండర్ 125 (రూ.55,575) మోడళ్లు ఉన్నాయి. సుజుకి: లెట్స్, గిక్సర్ మోడళ్లపై సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తగ్గింపు ధరలను ప్రకటించింది. లెట్స్ ధరలు రూ.47,272 నుంచి రూ.53,766 మధ్య ఉన్నాయి. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ధరలు ఇవి. వీటిపై రూ.4,000 తగ్గింపుతోపాటు ఉచితంగా హెల్మెట్‌ను అందిస్తోంది. గిక్సర్ ధరలు రూ.77,452 – రూ.90,421 మధ్య ఉన్నాయి. వీటిపై రూ.5,000 తగ్గింపు ఇస్తోంది. ఎక్సే్ఛంజ్ బెనిఫిట్ కింద మరో రూ.2,000 తగ్గింపును సైతం పొందే అవకాశం ఉంది. బజాజ్: డిస్కౌంట్‌తోపాటు ఉచిత వాహన బీమాను కూడా ఆఫర్ చేస్తోంది. ప్లాటినా, సీటీ 100 నుంచి పల్సర్ ఆర్ఎస్200 మోడల్ వరకు రూ.3,000 నుంచి రూ.12,000 వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ‘‘విక్రయం కాని బీఎస్ –3 వాహనాలు ఏవైనా మిగిలి ఉంటే వాటిని ఎగుమతి చేసే అవకాశం ఉంది. మేము అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తున్నాం’’ అని బజాజ్ఆటో ప్రెసిడెంట్ ఎస్.రవికుమార్ తెలిపారు. పరిశీలిస్తున్నాం: ఎంఅండ్ఎం సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి పలు అంశాలను పరిశీలిస్తున్నామని మహీæంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ‘‘బీఎస్ –3 వాహన నిల్వలను గడువులోపు సాధ్యమైన మేర విక్రయించే ప్రయత్నంలో ఉన్నాం. కోర్టు ఆదేశాలతో పడే ఈ ఏక కాల భారాన్ని పరిమితం చేసుకునేందుకు మా వైపు నుంచి ప్రతీ ప్రయత్నం చేస్తాం’’ అని కంపెనీ తెలిపింది. తగ్గింపు వివరాలను మాత్రం వెల్లడించలేదు. మా నుంచి తగ్గింపు లేదు: అశోక్ లేలాండ్ వాణిజ్య వాహనాల అగ్రగామి కంపెనీ అశోక్‌లేలాండ్ మాత్రం తమ వాహనాలపై ఎటువంటి తగ్గింపు లేదని స్పష్టం చేసింది. ‘‘మా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ధరలపై ఎటువంటి తగ్గింపులను ఇవ్వడం లేదు’’ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే, పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన అశోక్‌లేలాండ్ డీలర్ మాత్రం సాధారణ డిస్కౌంట్ 4 – 5 శాతానికి అదనంగా తాము ఒకటి నుంచి రెండు శాతం వరకు తగ్గింపును బీఎస్–3 వాహనాలపై ఇస్తున్నట్టు తెలిపారు. -
ఏప్రిల్ 1న బ్యాంకులు మూత
ముంబై : బ్యాంకు శాఖలను ఏప్రిల్ 1న తెరచి ఉంచాలని చేసిన ఆదేశాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంది. బ్యాంకుల ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 1న బ్యాంకు శాఖలు మూసివేయాలని ఆదేశిస్తూ ముందస్తు గైడ్ లైన్స్ ను సమీక్షించింది. ప్రభుత్వ బిజినెస్‌లతో డీల్స్ నిర్వహిస్తున్న బ్యాంకు శాఖలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు అన్ని రోజుల్లో(శనివారం, ఆదివారం, అన్నిరకాల సెలవు దినాల్లో) తెరచి ఉంచాలని గతవారం ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది. అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ మరో సర్క్యూలర్ బుధవారం వెలువరించింది. 2017 ఏప్రిల్ 1న బ్యాంకు శాఖలు తెరచి ఉంచాల్సినవసరం లేదని, ఒకవేళ తెరచి ఉంచితే ఆర్థిక సంవత్సర ముగింపుకు ఆటంకం కలుగుతుందని, ముఖ్యంగా విలీనమయ్యే బ్యాంకులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ కారణంతో ఏప్రిల్ 1న బ్యాంకులు మూసివేయాలని ఆదేశించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐ ఏప్రిల్ 1 నుంచే తనలో విలీనం చేసుకుంటుంది. -
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
-
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశీయ ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా బీఎస్-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యమని సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది. ఏప్రిల్ తరువాత బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.2 లక్షల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఉందని సియామ్ డేటాలో తేలింది. వాహనాల కేటగిరీ ప్రకారం దీనిలో బీఎస్-3 కమర్షియల్ వెహికిల్స్ 96వేలు, టూ-వీలర్స్ 6 లక్షలు, త్రీ-వీలర్స్ 40వేలు ఉన్నాయి. తాజా సుప్రీం ఆదేశాలకు ఇవన్నీ ప్రభావితం కానున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఆటో కంపెనీలకు ఇది భారీ వెనకడుగు అని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఆటో కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్పొ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు సుప్రీం ఆదేశాలపై సియామ్ మాజీ అధ్యక్షుడు శాండిల్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందన్నారు. పొల్యూషన్ సమస్య దీనివల్ల తీరదని మండిపడ్డారు. ఆటో పరిశ్రమ వల్ల కేవలం పొల్యుషన్ 2శాతం మాత్రమే అన్నారు. దీనిపై ఆటో పరిశ్రమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అమ్మకాలపై నిషేధం విధించడం వినియోగదారులకు తీరని నష్టమని పేర్కొంది. -
ఫోర్డ్ కార్ల ధరలకు రెక్కలు
న్యూఢిల్లీ: ఫోర్డ్ ఇండియా దేశంలో తాను విక్రయించే అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ 1 నుంచి పెంచనుంది. ఈ పెంపు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుందని, పెరిగిన ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫిగో హచ్‌బ్యాక్ నుంచి మస్టంగ్‌సెడాన్ వరకు ఎన్నో మోడళ్లను కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తమ కార్ల ధరలను మోడళ్లను బట్టి రూ.10,000 వరకు పెంచుతున్నట్టు హోండాకార్స్ ఇండియా సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం పెంచుతున్నట్టు జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సైతం ప్రకటించింది. -
సాధారణ బీమా ప్రీమియం ప్రియం
ఏప్రిల్ 1నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: మోటారు సైకిళ్లు, కార్లు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం ధరలు ఏప్రిల్ 1 నుంచి భారం కానున్నాయి. ఏజెంట్లకు చెల్లించే కమిషన్లలో సవరణలు చేసేందుకు, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతించింది. దీంతో పాలసీ ప్రీమియంలను బీమా కంపెనీలు సవరించనున్నాయి. అయితే, దీని కారణంగా ప్రీమియంల పెంపు 5 శాతం మించకుండా ఐఆర్డీఏఐ పరిమితి విధించింది. థర్డ్ పార్టీ కవరేజీ రేట్ల పెంపునకు ఇది అదనం. ఏప్రిల్ 1 నుంచి వాహన బీమా థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్లను 50 శాతం పెంచేందుకు ఐఆర్డీఏఐ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ రెండు రకాల పెంపులతో వినియోగదారులపై భారం పడనుంది. 1 నుంచి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె కోల్‌కతా: వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంతో పాటు ఇతర చార్జీల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని అఖిల భారత రవాణా వాహనాల యాజమానుల సమాఖ్య(ఏఐసీజీవీఓఏ) కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఏఐసీజీవీఓఏ కార్యవర్గ సభ్యుడు సుభాష్ చంద్ర ఆదివారం మీడియాకు తెలిపారు. థర్డ్ పార్టీ ప్రీమియం 50 శాతం పెంపుతో పాటు ఇతర చార్జీల పెరుగుదల లారీలకు గుదిబండగా మారిందన్నారు. పాలు, ఇతర అత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని రంగాలకు సమ్మె వర్తిస్తుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించినట్లు సుభాష్ తెలిపారు. -
బ్యాంకులకు ఆర్బీఐ కీలక ఆదేశాలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అదేశాలు జారీ చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 దాకా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. దీంతో అన్ని ఏజెన్సీ బ్యాంకులు ఈ రోజుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులు ఎనిమిది రోజులూ తెరిచే ఉంచాలని ఆదేశించింది. కొన్ని ఎంపిక చేసిన ఆర్బిఐ కార్యాలయాలు కూడా పనిచేయనున్నాయి. పన్నుల వసూళ్లు సహా, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు విధులను సులభతరం చేసేందుకుగాను ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఏజెన్సీ బ్యాంకులు, వారి శాఖలను మార్చ 25-ఏప్రిల్ 1 వ తేదీ మధ్య తెరిచి ఉంచాలని ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2017 దాకా (శనివారం, ఆదివారం మరియు అన్ని సెలవులు సహా) పనిచేయాలని ఆర్బీఐ జారీ చేసిన ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రిజర్వ్‌బ్యాంక్ ఆధ్వర్యంలోని సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తెరిచే ఉంటాయని తెలిపింది. -
రైలు మిస్సైందా?.. ఏ రైలైనా ఎక్కొచ్చు
అదనపు రుసుములు, రీఫండ్ లేవు న్యూఢిల్లీ: మెయిల్, ఎక్స్‌ప్రెస్ లాంటి సాధారణ రైళ్లలో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఏప్రిల్ 1 నుంచి రాజధాని, శతాబ్ది రైళ్లలో ప్రయాణించే అవకాశం పొందొచ్చు. రైల్వే శాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ఈ పథకం ప్రకారం... నిరీక్షణ జాబితాలో ఉన్న ప్రయాణికులకు అదే మార్గం గుండా వెళ్తున్న తరువాతి ప్రత్యామ్నాయ రైళ్లలో బెర్తులు ఇస్తారు. అయితే రెండింటి చార్జీల మధ్య తేడాలుంటే ప్రయాణికుడి నుంచి ఎలాంటి రుసుములు తీసుకోరు, రీఫండ్ చేయరు. ‘వికల్ప్’గా పిలిచే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే టికెట్ బుక్‌చేసుకునే సమయంలోనే ప్రయాణికుడు ఈ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ప్రత్యామ్నాయ రైలులో సీటు ఖరారైన తరువాత అతని మొబైల్‌కు సందేశం వస్తుంది. ప్రధాన మార్గాల్లో ప్రీమియం రైళ్లు రాజధాని, శతాబ్ది, దురంతో, సువిధ లాంటి వాటిలో ఖాళీగా మిగులుతున్న బెర్తులను నింపడమే లక్ష్యంగా ఈ పథకాన్ని చేపడుతున్నారు. ఈ పథకం ప్రయాణికుల అనుకూల చర్య అని, నిరీక్షణ జాబితాలో ఉన్న వారికి సీటు ఖరారుచేయడంతో పాటు, అందుబాటులో ఉన్న బెర్తులను సద్వినియోగం చేసుకోవాలనే జంట లక్ష్యాలు దీంతో నెరవేరతాయని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. పలు కారణాలతో టికెట్ల రద్దు వల్ల రైల్వే శాఖ ఏటా రీఫండ్ రూపంలో రూ.7500 కోట్లు కోల్పోతోంది. ఫ్లెక్సీ–ఫేర్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత ప్రీమియం రైళ్లలో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటున్నాయి. అదే సమయంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిమాండ్ ఎక్కువ ఉండటంతో చాలా మందికి బెర్తులు దొరకడం లేదు. ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ, ఢిల్లీ–ముంబై లాంటి మార్గాల్లో నవంబర్ 1 నుంచి ఈ విధానాన్ని అమలుచేస్తున్నారు. లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30 న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్(వెజ్)–రూ.50, నాన్‌వెజ్ లంచ్, డిన్నర్–రూ.55,ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు. జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదుచేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. -
త్వరలో కొత్త మద్యం పాలసీ