బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక అదేశాలు జారీ చేసింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 దాకా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించింది. దీంతో అన్ని ఏజెన్సీ బ్యాంకులు ఈ రోజుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనున్నాయి. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, కొన్ని ప్రయివేటు బ్యాంకులు ఎనిమిది రోజులూ తెరిచే ఉంచాలని ఆదేశించింది. కొన్ని ఎంపిక చేసిన ఆర్బిఐ కార్యాలయాలు కూడా పనిచేయనున్నాయి.
పన్నుల వసూళ్లు సహా, ప్రభుత్వ రసీదులు, చెల్లింపు విధులను సులభతరం చేసేందుకుగాను ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఏజెన్సీ బ్యాంకులు, వారి శాఖలను మార్చ 25-ఏప్రిల్ 1 వ తేదీ మధ్య తెరిచి ఉంచాలని ఆదేశించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1, 2017 దాకా (శనివారం, ఆదివారం మరియు అన్ని సెలవులు సహా) పనిచేయాలని ఆర్‌బీఐ జారీ చేసిన ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. అలాగే రిజర్వ్‌బ్యాంక్ ఆధ్వర్యంలోని సంబంధిత అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా తెరిచే ఉంటాయని తెలిపింది.