ఏప్రిల్ 1న బ్యాంకులు మూత
ఏప్రిల్ 1న బ్యాంకులు మూత
Published Wed, Mar 29 2017 5:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:25 AM
ముంబై : బ్యాంకు శాఖలను ఏప్రిల్ 1న తెరచి ఉంచాలని చేసిన ఆదేశాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వెనక్కి తీసుకుంది. బ్యాంకుల ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఏప్రిల్ 1న బ్యాంకు శాఖలు మూసివేయాలని ఆదేశిస్తూ ముందస్తు గైడ్ లైన్స్ ను సమీక్షించింది. ప్రభుత్వ బిజినెస్లతో డీల్స్ నిర్వహిస్తున్న బ్యాంకు శాఖలన్నీ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు అన్ని రోజుల్లో(శనివారం, ఆదివారం, అన్నిరకాల సెలవు దినాల్లో) తెరచి ఉంచాలని గతవారం ఆర్బీఐ ఆదేశాలు జారీచేసింది.
అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ మరో సర్క్యూలర్ బుధవారం వెలువరించింది. 2017 ఏప్రిల్ 1న బ్యాంకు శాఖలు తెరచి ఉంచాల్సినవసరం లేదని, ఒకవేళ తెరచి ఉంచితే ఆర్థిక సంవత్సర ముగింపుకు ఆటంకం కలుగుతుందని, ముఖ్యంగా విలీనమయ్యే బ్యాంకులపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ కారణంతో ఏప్రిల్ 1న బ్యాంకులు మూసివేయాలని ఆదేశించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును ఎస్బీఐ ఏప్రిల్ 1 నుంచే తనలో విలీనం చేసుకుంటుంది.
Advertisement