
కొత్త ఆర్థిక సంవత్సరం రానే వచ్చేసింది. నేటి నుంచి పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇవే కాకుండా పలు వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి. దీని వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడనుంది. నేటి నుంచి ధరలు పెరిగేవాటిలో టీవీ, ఏసీ, ఫ్రిజ్, కారు, బైక్ వంటివి ఉన్నాయి. అలాగే విమాన ప్రయాణ ఖర్చు కూడా పెరగనుంది. ఎలక్ట్రానిక్ ప్రొడక్టులు తయారు చేసే కంపెనీలు, వాహన కంపెనీలు ముడి పదార్థాల ధరల పెరగడం చేత ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నాయి.
వాహనాలు
వ్యాపారాలు వాహన ధరలను పెంచడంతో కార్లు, బైక్‌లు 2021 ఏప్రిల్ 1 నుంచి ఖరీదైనవిగా మారనున్నాయి. ధరలను పెంచుతున్నట్లు ఇప్పటికే మారుతి, నిస్సాన్ సంస్థలు ప్రకటించాయి. మొట్టమొదటి సారిగా భారతదేశంలో తన కార్లన్నింటినీ ధరలు పెంచుతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే, ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా తమ ద్విచక్ర వాహనాల ధరలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా హీరో స్కూటర్లు, బైక్‌ల ధరలు రూ.2,500 వరకు పెరిగే అవకాశం ఉంది.
టీవీ
2021 ఏప్రిల్ 1 నుంచి టెలివిజన్ ధరలు పెరగనున్నాయి. గత ఎనిమిది నెలలుగా టీవీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. టీవీ తయారుదారులు టెలివిజన్ పరిశ్రమను పిఎల్‌ఐ ప్రణాళికల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ ఆకస్మిక పెరుగుదలకు ప్రధాన కారణం టీవీ ఉత్పత్తిలో వాడే ఓపెన్-సెల్ ప్యానెల్స్ ధర పెరగడమే. నేటి నుంచి టీవీ ధరలు యూనిట్‌కు కనీసం 2000-3000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది.
ఏసీ & రిఫ్రిజిరేటర్
ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ కూడా ధర పెరిగే జాబితాలో ఉంది. తయారీ ఖర్చులు పెరగడం వల్ల ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్ ధర పెరుగుతుంది. ప్రతి ఎయిర్ కండీషనర్ ధర రూ.1500 నుంచి 2000 రూపాయలకు పెరగవచ్చు. కేవలం ఒక నెలలోనే ఓపెన్-సెల్ ప్యానెల్లు ప్రపంచ మార్కెట్లో ధర 35 శాతం పెరిగాయి. తత్పలితంగా ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, కూలర్ల ధరలు పెరగనున్నాయి.
విమాన ప్రయాణం
దేశీయ విమానాల కనీస ఛార్జీలు 5 శాతం పెరుగుతాయి కాబట్టి విమానంలో ఇక ప్రయాణించడం కూడా ఖరీదైనదిగా మారనుంది. ఏప్రిల్ 1 నుంచి దేశీయ విమానయాన రక్షణ రుసుమును రూ.160 నుంచి రూ.200కు పెంచనున్నారు. అలాగే, అంతర్జాతీయ విమానాల రుసుము 5.2 డాలర్ల నుంచి 12 డాలర్లకు పెరగనుంది. దీనికి సంబంధించి డీజీసీఎ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.
చదవండి: