రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
సూర్యాపేట జిల్లాలో ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురు మృతి
మృతులందరూ వ్యవసాయ కూలీలే
సిద్దిపేట జిల్లాలో కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు దుర్మరణం
మునగాల, మోతె (కోదాడ)/నంగునూరు (సిద్దిపేట): సూ ర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయా రు. వివరాలిలా ఉన్నాయి.. సూర్యాపేట జిల్లా మోతె మండ ల కేంద్రం శివారులో ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పది మంది, రేపాల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళా వ్యవసాయ కూ లీలు మోతె మండలం హుస్సేనాబాద్‌లోని మిర్చి తోటలో కాయలు ఏరేందుకు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్య లో ఖమ్మం జిల్లా మధిర నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు మోతె శివారులో యూటర్న్ తీసుకునే క్రమంలో ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల నాగమ్మ(55), చెవుల నారాయణమ్మ(56), రేపాల గ్రామానికి చెందిన పోకల అనసూర్య (65) తీవ్ర గా యాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందారు.
విజయరాఘవపురానికి చెందిన రెమిడాల సౌభాగ్యమ్మ(75) సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. విజయరాఘవపురం గ్రామానికి చెందిన కందుల గురువయ్య (65) ను హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. రేపాల గ్రామానికి చెందిన సొంపంగు లక్ష్మి తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యు లు హైదరాబాద్‌కు తరలించారు.
విజయరాఘవపురం గ్రా మానికి చెందిన కత్తి విజయమ్మ, పాలపాటి మంగమ్మ సూ ర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ టో డ్రైవర్ పవన్‌తో పాటు మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. కోదాడ డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, మునగాల సీఐ డి.రామకృష్ణారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
సిద్దిపేట జిల్లాలో ముగ్గురు మృతి
కారు బైకును ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెంద గా మరో ఏడుగురికి గాయాలయ్యా యి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ వద్ద జరి గింది. కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన జక్కుల అనిల్, భార్య మమత, అతని బావమరిది బాబురాజు, భార్య కీర్తన, పిల్లలు చర ణ్, భానుప్రసాద్, వైష్ణవి, హన్విక, నాన్సి, ప్రణయ్‌తో కలసి హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల పెళ్లికి కారు లో వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను కారు ఢీకొ ట్టి రోడ్డు కిందకు ఈడ్చుకెళ్లింది. దీంతో పక్కనే ఉన్న కాల్వలో బైక్, కారు పడిపోయాయి.
ఈ ప్రమాదంలో బద్దిపడగకు చెందిన కట్ట రవి (55), నాగరాజుపల్లికి చెందిన ముక్కెర అయిలయ్య (58), జక్కుల మమత (28) అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా వారిలో బాబురాజు పరిస్థితి విషమంగా ఉండగా గాయాలపాలైన చిన్నారులను సిద్దిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు వచ్చి కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. సిద్దిపేట రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment