Woman Killed, Husband Child Injured After Bus Hits Bike At Chanda Nagar - Sakshi
Sakshi News home page

Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్‌పై వెళ్తుండగా

Jun 10 2022 10:53 AM | Updated on Jun 10 2022 1:03 PM

Woman Killed Husband Child Injured After Bus Hits Bike At Chanda nagar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెళ్లి రోజు భార్యభర్తలు  తమ రెండేళ్ల కుమారుడితో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వె ళ్తుండగా ఆర్‌టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్‌ తెలిపిన మేరకు.. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మందమోళ్ల ప్రభాకర్‌ (28), ప్రసన్న (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జశ్విత్‌ ఉన్నాడు. గురువారం  పెళ్లి రోజు కావడంతో  ద్విచక్ర వాహనంపై ముగ్గురూ ఫోరంమాల్‌కు వచ్చి సంతోషంగా  గడిపారు.  

సాయంత్రం  గ్రామానికి  తిరిగి వెళ్తుండగా చందానగర్‌లోని కేప్రీ హోటల్‌ వద్ద కంటోన్మెంట్‌ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై బస్సు వెళ్లింది. ప్రభాకర్‌ కుడి చెయ్యిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్, జశ్విత్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్‌  ఓ ప్రైవేటు పాఠశాలలో గార్డెనింగ్‌ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.   
చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement