bus hits
-
Hyderabad: పెళ్లి రోజే విషాదం.. భర్త, కొడుకుతో బైక్పై వెళ్తుండగా
సాక్షి, హైదరాబాద్: పెళ్లి రోజు భార్యభర్తలు తమ రెండేళ్ల కుమారుడితో నగరానికి వచ్చి సంతోషంగా గడిపి ద్విచక్ర వాహనంపై తిరిగి వె ళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ తెలిపిన మేరకు.. ఆర్సీపురం మండలం వెలిమెల గ్రామానికి చెందిన మందమోళ్ల ప్రభాకర్ (28), ప్రసన్న (25) దంపతులకు రెండేళ్ల కుమారుడు జశ్విత్ ఉన్నాడు. గురువారం పెళ్లి రోజు కావడంతో ద్విచక్ర వాహనంపై ముగ్గురూ ఫోరంమాల్కు వచ్చి సంతోషంగా గడిపారు. సాయంత్రం గ్రామానికి తిరిగి వెళ్తుండగా చందానగర్లోని కేప్రీ హోటల్ వద్ద కంటోన్మెంట్ డిపోకు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నపై బస్సు వెళ్లింది. ప్రభాకర్ కుడి చెయ్యిపై వెళ్లడంతో తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా ప్రభాకర్, జశ్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రభాకర్ ఓ ప్రైవేటు పాఠశాలలో గార్డెనింగ్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. చదవండి: Hyderabad: హైదరాబాద్లో మరో దారుణం -
మూడు కార్లు,బైక్ను ఢీ కొన్న బస్సు
-
భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం
అన్నానగర్: ప్రభుత్వ బస్సు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో భర్త కళ్లెదుటే భార్య మృతి చెందింది. ఈఘటన నాగర్కోవిల్లో గురువారం జరిగింది. వివరాలు.. కన్యాకుమారి జిల్లా కలియక్కావిలైకి చెందిన అశోకన్(51) కార్మికుడు. ఇతని భార్య వీజీ సహాయ(45). దంపతులు పేచ్చిపారై పల్లిముక్కు గ్రామంలో నివశిస్తున్నారు. వీరికి ఆకాష్ జోసఫ్ (13), అజయ్స్ జోసఫ్ (10) ఇద్దరు కుమారులున్నారు. గురువారం మధ్యాహ్నం నాగర్కోవిల్ ఒళుగినచేరి ప్రాంతంలోని బంధువుల ఇంటికి వెళ్లేందుకు అశోకన్, భార్య వీజీ సహాయ బైక్పై వెళుతున్నారు. పార్వతిపురం సమీపం కట్టయన్విలై విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వచ్చిన ప్రభుత్వ బస్సు బైకును ఢీకొంది. కిందపడిన వీజీ సహాయపై బస్సు చక్రం ఎక్కడంతో భర్త కళ్లెదుటే విషాదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వీజీ సహాయ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆచారిపళ్లం ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి బస్సు డ్రైవర్ రూబన్ (44)ను అరెస్టు చేశారు. -
ఆగి ఉన్న బస్సును ఢీ కొట్టిన మరో బస్సు
ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణమంటే ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతున్నాయి. తాజాగా... ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును... మరో ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఆ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్ఘటన నల్గొండ జిల్లా కోదాడలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు అయిల్ ట్యాంక్ లీక్ అవుతుండటంతో జాతీయ రహదారిపై పక్కన నిలిపి రిపేరు చేస్తున్నారు. అయితే వినాయక్ ట్రావెల్స్కు చెందిన మరో బస్సు విజయవాడ వైపు వస్తున్న క్రమంలో ఆగి ఉన్న కావేరి ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీ కొట్టింది. ఆ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.