సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్‌ | SC says from April 1, 2017 vehicles, which are not BS IV compliant, will not be sold in India | Sakshi
Sakshi News home page

సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్‌

Published Wed, Mar 29 2017 2:54 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM

సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్‌ - Sakshi

సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్‌

న్యూఢిల్లీ: దేశీయ ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా  బీఎస్‌-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య  ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే  ఎక్కువ ముఖ్యమని  సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది.  ఏప్రిల్‌ తరువాత బీఎస్‌-3  వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.2 లక్షల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఉందని సియామ్ డేటాలో తేలింది. వాహనాల కేటగిరీ ప్రకారం దీనిలో బీఎస్-3 కమర్షియల్ వెహికిల్స్ 96వేలు, టూ-వీలర్స్ 6 లక్షలు, త్రీ-వీలర్స్ 40వేలు ఉన్నాయి. తాజా సుప్రీం ఆదేశాలకు ఇవన్నీ  ప్రభావితం కానున్నాయి. 

 
సుప్రీం ఆదేశాలతో ఆటో కంపెనీలకు ఇది భారీ వెనకడుగు అని ఎనలిస్టులు  విశ్లేషిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో ఆటో కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి.  టాటా మోటార్స్‌,  అశోక్‌ లేలాండ్‌,  హీరో మోటార్‌ కార్పొ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు సుప్రీం ఆదేశాలపై సియామ్‌ మాజీ అధ్యక్షుడు శాండిల్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందన్నారు.  పొల్యూషన్‌ సమస్య దీనివల్ల తీరదని మండిపడ్డారు.  ఆటో పరిశ్రమ వల్ల కేవలం పొల్యుషన్ 2శాతం మాత్రమే అన్నారు. దీనిపై ఆటో పరిశ్రమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అమ్మకాలపై నిషేధం విధించడం వినియోగదారులకు తీరని నష్టమని  పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement