BS IV
-
బీఎస్4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్
న్యూఢిల్లీ: బీఎస్4 ప్రమాణాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు బ్రేక్ పడింది. మార్చిలో లాక్డౌన్ విధించిన తర్వాత జరిగిన వాహన విక్రయాల అంశంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెడితే .. గత ఆదేశాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి బీఎస్4 ఇంధన ప్రమాణాలతో తయారైన వాహన విక్రయాలు నిల్చిపోవాలి. బీఎస్6 వాహన విక్రయాలు మాత్రమే జరగాలి.లాక్డౌన్ వల్ల బీఎస్4 వాహన విక్రయాల విషయంలో కాస్త సడలింపు దక్కింది. లాక్డౌన్ ఎత్తివేశాక 10 రోజుల పాటు వీటిని అమ్ముకునేందుకు న్యాయస్థానం అనుమతించింది. కానీ మార్చి 25 తర్వాత లాక్డౌన్ అమలు కాలంలో కూడా భారీ స్థాయిలో బీఎస్4 వాహనాల విక్రయాలు జరగడాన్ని సుప్రీం తీవ్రంగా పరిగణించింది. -
లాక్డౌన్ కష్టాలు : ఆటోమొబైల్ పరిశ్రమకు రిలీఫ్
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో బీఎస్4 అమ్మకాలకు ఈనెల 31వరకూ ఉన్న తుదిగడువును మరో 10 రోజులు పాటు సర్వోన్నత న్యాయస్ధానం పొడిగించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో డీలర్లకు వెసులుబాటు కల్పించేలా డెడ్‌లైన్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. లాక్డౌన్ ముగిసిన పదిరోజుల వరకూ బీఎస్4 వాహనాలను విక్రయించాలని, ఈ గడువులోపే వాహన రిజిస్ర్టేషన్లను పూర్తిచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏప్రిల్ 14న 21 రోజుల లాక్డౌన్ ముగియనుండటంతో డీలర్లు ఏప్రిల్ 24వరకూ తమ వద్ద ఉన్న బీఎస్ 4 వాహనాలను విక్రయించుకునే వెసులుబాటు కలిగింది. బీఎస్ 4 వాహన విక్రయాలకు ప్రభుత్వం విధించిన మార్చి 31 డెడ్‌లైన్‌ను సవాల్ చేస్తూ ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఎఫ్ఏడీఏ), సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆటో పరిశ్రమలో స్లోడౌన్, కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా షోరూంలలో 15,000 కార్లు, 12,000 వాణిజ్య వాహనాలు, 7 లక్షల ద్విచక్రవాహనాల అమ్మకాలు నిలిచిపోయాయయని ఎఫ్ఏడీఏ కోర్టుకు నివేదించింది. బీఎస్ 4 వాహన విక్రయాల డెడ్‌లైన్‌ను పొడిగించి పర్యావరణంపై భారం మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ వ్యాపారాలు, డీలర్ల పరిస్థితిని తాము అర్ధం చేసుకోగలమని, మార్చిలో కొద్దిరోజులు లాక్డౌన్ ప్రకటించిన క్రమంలో మీరు దాన్ని అవకాశంగా తీసుకోవాలని భావిస్తున్నారని వ్యాఖ్యానించింది. దేశ పర్యావరణ హితం కోసం మనం త్యాగాలు చేయకతప్పదని పేర్కొంది. ఇక పదిరోజుల పాటు డెడ్‌లైన్‌ను పొడిగించడంతో ఆటోమొబైల్ పరిశ్రమకు సర్వోన్నత న్యాయస్ధానం కొంతమేర ఊరట ఇచ్చింది. చదవండి : కరోనా వ్యాప్తి : సుప్రీం కీలక ఆదేశాలు -
బీఎస్–4.. రిజిస్ట్రేషన్ల జోరు
సాక్షి, అమరావతి: బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్‌కు డెడ్ లైన్ దగ్గరపడుతుండటంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపీ రవాణా శాఖ వాహన డీలర్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్లు చేయిస్తోంది. మొన్నటి వరకు రోజుకు సగటున 3–4 వేల వాహనాల రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఇప్పుడు 5 వేలకు పైగా జరుగుతున్నాయి. దీంతో రెండ్రోజులకే రిజిస్ట్రేషన్ సిరీస్ మారుతోంది. ఈ నెల రెండో వారం తరువాత ఈ రిజిస్ట్రేషన్ల సంఖ్య రోజుకు 10 వేల వరకు జరిగే అవకాశం ఉందని రవాణా శాఖ భావిస్తోంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు అన్ని రవాణా శాఖ కార్యాలయాల యూనిట్లలో చేశామని అధికారులు చెబుతున్నారు. నేరుగా బీఎస్–6కు.. ► వాహన రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ కాలుష్యం, రోడ్డు భద్రత, మెకానికల్ అంశాలకు సంబంధించి భారత్ స్టాండర్డ్స్ (బీఎస్) పేరిట నాణ్యత ప్రమాణాలను నిర్ణయించారు. ► వీటిని బీఎస్–1, 2, 3, 4, 5, 6 కేటగిరీలుగా విభజించారు. ప్రస్తుతం బీఎస్–4 వాహనాల నుంచి బీఎస్–5 కాకుండా నేరుగా బీఎస్–6కు వెళ్లారు. బీఎస్‌లో ప్రధానంగా కాలుష్యంపైనే అత్యున్నతంగా ప్రమాణాలను నిర్దేశించారు. బీఎస్–6 వాహనాలు 68 శాతం కాలుష్య రహితంగా రూపొందించారు. ► అన్ని కంపెనీలకు బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్లు డీలర్ల వద్దే జరగనుండటంతో వీటిపై రవాణా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏయే పేర్లతో వాహనాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ జరిగే వాహనదారులకు రెండో వాహనం ఉందా? అన్న అంశాలపై దృష్టి పెట్టారు. ► రెండో వాహనం ఉంటే రిజిస్ట్రేషన్ చార్జీలు రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు సహా బీఎస్–6 వాహనాలకే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ►ఈ నేపథ్యంలో బీఎస్–4 వాహనాలకు కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ధరలను తగ్గించారు. ►కొందరు డీలర్లు బీఎస్–4 వాహనాలను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించి ఏప్రిల్ తర్వాత ప్రీ ఓన్డ్ షోరూంలకు తరలించే ఆలోచన చేస్తున్నారని రవాణా అధికారులు చెబుతున్నారు. -
గడువు దాటిందా.. బండి గోవిందా!
ఆదిలాబాద్‌టౌన్: పర్యావరణ కాలుష్యం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. బీఎస్–4 వాహనాల ద్వారా వాతావరణ కాలుష్యం అధికంగా ఉండడంతో వాటి స్థానంలో బీఎస్–6 వాహనాలను వినియోగంలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 2016లోనే నిర్ణయం తీసుకుంది. అయితే ఈనెల 31లోగా బీఎస్–4 వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలను స్క్రాప్‌గా పరిగణిస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహన దారుల్లో గుబులు మొదలైంది. గడువు దగ్గర పడడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారత్ స్టేజ్–6 (బీఎస్–6) వాహనాలను మాత్రమే ఆర్టీఏ కార్యాలయంలో నమోదు చేస్తారు. బీఎస్–4 వాహనాలను అనుమతించరు. జిల్లాలో రిజిస్ట్రేషన్ కాని వాహనాలు 3,684కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు ఇచ్చింది. సంబంధిత ఆర్టీఏ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలు తుక్కు కిందికి వస్తాయని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ద్విచక్రవాహనాలు 3,369 ఉండగా కార్లు, ఇతర వాహనాలు 315 ఉన్నాయి. మొత్తంగా 3,684 రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలుఉన్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 2,348, ఇతర వాహనాలు 367, నిర్మల్ జిల్లాలో ద్విచక్ర వాహనాలు 5,144, ఇతర వాహనాలు 640 ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ద్విచక్రవాహనాలు 4,395, ఇతర వాహనాలు 528 ఉన్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు 16,106 ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే స్క్రాపే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో కొనుగోలు చేసిన కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కొంత మంది వాహన దారులు యథేచ్ఛగా తిప్పుతున్నారు. జిల్లాలో ద్విచక్ర, కార్లు, ఆటోలు, ఇతర వాహనాలు ఉన్నాయి. అయితే బీఎస్–4 వాహనాల ద్వారా కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రభుత్వం వీటి తయారీని నిలిపివేసింది. కొత్తగా బీఎస్–6 వాహనాలను తీసుకురానుంది. వీటి ద్వారా కాలుష్యం కొంత మేరకు తగ్గనుంది. రిజిస్ట్రేషన్ చేసుకోని వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మండలాల్లో రవాణా శాఖ అధికారులు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల గడిచిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు కూడా విధించనున్నారు. రిజిస్ట్రేషన్ విషయంలో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉంటే పరిష్కరించేందుకు సిబ్బందిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 99493 11051 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. బీఎస్–4 వాహనాలకు ఆఫర్లు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆయా షోరూంలలో ఉన్న బీఎస్–4 వాహనాల అమ్మకాల కోసం డీలర్లు వినియోగదారులకు ఆఫర్లను ప్రకటిస్తున్నారు. ఈనెల 31 వరకు గడువు ఉండడంతో సేల్స్ చేసేందుకు వాహన ధరల్లో రూ. 10 వేల నుంచి రూ. 20వేల వరకు తగ్గించి విక్రయాలు జరుపుతున్నారు. వినియోగదారులు ఆ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆర్టీఏ కార్యాలయంలో రోజుకు 50 నుంచి 60 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. వీటి రిజిస్ట్రేషన్ల కోసం మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది. ఆలోగా బీఎస్–4 వాహనాల రిజిస్ట్రేషన్ అవుతుందో లేదోననే ఆయోమయంలో కొందరు ఉన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే సీజ్ చేస్తాం రిజిస్ట్రేషన్ చేసుకోని బీఎస్–4 వాహనాలు ఆదిలాబాద్ జిల్లాలో 3,684 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ఈనెల 31 వరకు గడువు విధించింది. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తుక్కు కిందికి అమ్ముకోవాల్సి ఉంటుంది. అలాంటి వాహనాలను సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తాం. – పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్ -
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
-
సుప్రీం సంచలన ఆదేశాలు..ఆటో కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశీయ ఆటో మేజర్లకు సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా బీఎస్-3 వాహనాలపై నిషేధాన్ని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆటోమొబైల్ కంపెనీల వాణిజ్య ప్రయోజనాల కంటే ప్రజల ఆరోగ్యమే ఎక్కువ ముఖ్యమని సుప్రీం తేల్చి చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమలు కానున్నాయని తీర్పు చెప్పింది. ఏప్రిల్ తరువాత బీఎస్-3 వాహనాల రిజిస్ట్రేషన్లను, అమ్మకాలను నిలిపి వేయాలని పేర్కొంది. దీంతో రూ.12వేల కోట్ల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఒక్కసారిగా నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8.2 లక్షల బీఎస్-3 వాహనాల ఇన్వెంటరీ ఉందని సియామ్ డేటాలో తేలింది. వాహనాల కేటగిరీ ప్రకారం దీనిలో బీఎస్-3 కమర్షియల్ వెహికిల్స్ 96వేలు, టూ-వీలర్స్ 6 లక్షలు, త్రీ-వీలర్స్ 40వేలు ఉన్నాయి. తాజా సుప్రీం ఆదేశాలకు ఇవన్నీ ప్రభావితం కానున్నాయి. సుప్రీం ఆదేశాలతో ఆటో కంపెనీలకు ఇది భారీ వెనకడుగు అని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఆటో కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్పొ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు సుప్రీం ఆదేశాలపై సియామ్ మాజీ అధ్యక్షుడు శాండిల్య కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది దేశానికి తీరని నష్టాన్ని తెచ్చిపెడుతుందన్నారు. పొల్యూషన్ సమస్య దీనివల్ల తీరదని మండిపడ్డారు. ఆటో పరిశ్రమ వల్ల కేవలం పొల్యుషన్ 2శాతం మాత్రమే అన్నారు. దీనిపై ఆటో పరిశ్రమ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. అమ్మకాలపై నిషేధం విధించడం వినియోగదారులకు తీరని నష్టమని పేర్కొంది.