ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ | SBI: Five associate banks to merge with SBI from 1st April | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ

Published Fri, Feb 24 2017 1:05 AM | Last Updated on Tue, Sep 5 2017 4:26 AM

ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ

ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన కార్యక్రమం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌(ఎస్‌బీటీ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఆస్తులను ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐకి బదలాయిస్తామని నియంత్రణ సంస్థలకు ఎస్‌బీఐ సమాచారం అందించింది. విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీల మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఎస్‌బీఐ ఉద్యోగులుగా మారనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement