ఫోర్డ్‌ కార్ల ధరలకు రెక్కలు | Ford India plans to hike prices by up to 2% from April | Sakshi
Sakshi News home page

ఫోర్డ్‌ కార్ల ధరలకు రెక్కలు

Published Mon, Mar 27 2017 1:13 AM | Last Updated on Thu, Oct 4 2018 4:56 PM

ఫోర్డ్‌ కార్ల ధరలకు రెక్కలు - Sakshi

ఫోర్డ్‌ కార్ల ధరలకు రెక్కలు

న్యూఢిల్లీ: ఫోర్డ్‌ ఇండియా దేశంలో తాను విక్రయించే అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్‌ 1 నుంచి పెంచనుంది. ఈ పెంపు ఒకటి నుంచి రెండు శాతం వరకు ఉంటుందని, పెరిగిన ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఫిగో హచ్‌బ్యాక్‌ నుంచి మస్టంగ్‌సెడాన్‌ వరకు ఎన్నో మోడళ్లను కంపెనీ దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తమ కార్ల ధరలను మోడళ్లను బట్టి రూ.10,000 వరకు పెంచుతున్నట్టు హోండాకార్స్‌ ఇండియా సైతం ప్రకటించిన విషయం తెలిసిందే. వచ్చే నెల నుంచి తమ వాహనాల ధరలను రెండు శాతం పెంచుతున్నట్టు జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ సైతం ప్రకటించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement