రూ. 2000 నోట్ల మార్పిడి బంద్‌! | RBI will not exchange or deposit Rs 2000 notes on April 1 | Sakshi
Sakshi News home page

రూ. 2000 నోట్ల మార్పిడి బంద్‌!

Published Thu, Mar 28 2024 9:48 PM | Last Updated on Thu, Mar 28 2024 10:18 PM

RBI will not exchange or deposit Rs 2000 notes on April 1 - Sakshi

చలామణి నుంచి ఉపసంహరించిన రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక మూసివేత కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. 

రూ. 2000 నోట్ల మార్పిడి ఈ సదుపాయం ఏప్రిల్ 2న తిరిగి ప్రారంభమవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19 ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్‌బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి. 

ఆర్‌బీఐ గత ఏడాది అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 కరెన్సీ నోట్లలో 2024 మార్చి 1 నాటికి 97.62 శాతం బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. రూ. 2,000 నోట్ల ఉపసంహరణ ప్రకటించిన 2023 మే 19న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్ల నుంచి, 2024 ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement