
ముంబై: ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో గ్రూపు వ్యవస్థాపకుడు స్వర్గియ బ్రిజ్‌మోహన్ లాల్ ముంజల్ భార్య సంతోష్ ముంజల్(92) తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఆమె మరణించినట్లు ముంజల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1947లో బ్రిజ్‌మోహన్ లాల్‌తో ఆమె వివాహం జరిగింది. 1953లో హీరో సంస్థ స్థాపించిన నాటి నుంచి ఆమె బ్రిజ్‌మోహన్‌కు మద్దతుగా నిలిచారు.
ప్రస్తుతం ఆమె కుమారులు సుమన్ ముంజల్ రాక్‌మ్యాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా, పవన్ ముంజల్ హీరో మోటోకార్ప్ ఎండీ, సీఈఓగా, సునీల్ ముంజల్ హీరో ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు గీతా ఆనంద్ అనే కూతురు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment