![Hero MotoCorp Philippines Partnership Terrafirma Motors corp - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/28/Heromoto.jpg.webp?itok=YWpN7PAJ)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ ఫిలిప్పైన్స్‌లో ఎంట్రీ ఇస్తోంది. వాహనాల అసెంబ్లింగ్, పంపిణీ కోసం టెరాఫిర్మా మోటార్స్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లగూనా నగరంలోని తయారీ ప్లాంటులో ప్రత్యేకంగా 29,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అసెంబ్లింగ్ కేంద్రాన్ని టెరాఫిర్మా నెలకొల్పనుంది.
2023-24 ఆర్థిక సంవత్సరం రెండవ భాగంలో ఈ యూనిట్లో కార్యకలాపాలు మొద లు కానున్నాయి. 43 దేశాల్లో విస్తరించిన హీరో మోటాకార్ప్‌నకు భారత్‌లో ఆరు, కొలంబియా, బంగ్లాదేశ్‌లో ఒక్కొక్క తయారీ కేంద్రం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment