
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.72,900 ఉంది. 97.2 సీసీ ఇంజన్, పేటెంటెడ్ ఐ3ఎస్ టెక్నాలజీ, బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి డిజిటల్ మీటర్, కాల్, ఎస్‌ఎంఎస్ అలర్ట్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, ఇంటిగ్రేటెడ్ యూఎస్‌బీ చార్జర్, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, స్టాప్–స్టార్ట్ సిస్టమ్, ఎల్‌ఈడీ హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్, ప్రత్యేక గ్రాఫిక్స్‌తో ఇది రూపుదిద్దుకుంది. అయిదేళ్ల వారంటీ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment