మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్‌లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్.
సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్‌లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్‌లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్
మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌దే. దీంతో 350 సెగ్మెంట్‌లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది.
హార్లే డేవిడ్‌సన్
అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్‌సన్‌తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్‌సన్ ఇండియా మార్కెట్‌లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు.
పనులు మొదలయ్యాయి
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్‌లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్‌సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్‌లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్‌లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు.
ధరపై ఆసక్తి
ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్‌లో హీరో మోటర్ కార్ప్‌ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్‌సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment