Hero MotorCorp
-
హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం..పెరుగుతున్న వాహనాల ధరలు
ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరోమోటో కార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన మోటర్ సైకిళ్లు, స్కూటర్ల ఎక్స్ - షోరూం ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు అక్టోబర్ 30 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, ఎంత శాతం మేర పెరుగుతుందనే అంశంపై పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెహికల్స్‌కు మార్కెట్లో ఉన్న డిమాండ్, మోడల్స్ ఆధారంగా ఒక శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం. పెరిగిపోతున్న ధరలు, కాంపిటీషన్, ద్రవ్యోల్బణం కారణంగా వాహనాల ధరల్ని పెరుగుదలకు కారణమని హీరో మోటో కార్ప్ తన రెగ్యులేటరీ ఫైలింగ్ తెలిపింది. పెరిగే ఎక్స్ షోరూం ధర ఎంతంటే? ఇంతకుముందు, కొత్తగా ప్రారంభించిన ఫ్లాగ్షిప్ కరిజ్మా ఎక్స్ఎంఆర్ ప్రమోషనల్ ఆఫర్ ముగిసినందున అక్టోబర్ 1 నుండి ఎక్స్ షోరూం ధరను రూ.7,000కు (ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1,79,900) పెంచుతున్నట్లు ప్రకటించింది. హీరో కరిజ్మా ఎక్స్ ఎంఆర్ ప్రస్తుత బుకింగ్ విండో రూ.1,72,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇది నేటితో ముగియనుంది. ఇకపై పెంచిన ధరలతో సేల్స్ నిర్వహిస్తామని హీరో కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పెరుగుతున్న ఎగుమతులు కాగా, హీరో మోటోకార్ప్ ఆగస్టు నెలలో మొత్తం వాహనాల అమ్మకాలు 6 శాతం పెరిగి 4,88,717 యూనిట్లుగా నమోదయ్యాయి. డొమెస్టిక్ సేల్స్ 4,50,740 యునిట్లుగా ఉండగా 2022 ఇదే ఆగస్టు నెలతో పోలిస్తే దేశీయ విక్రయాలు 5 శాతం వృద్ధితో 4,72,947 యూనిట్లుగా ఉన్నాయి. అయితే ఎగుమతులు గత ఏడాది ఇదే కాలంలో 11,868 యూనిట్ల నుంచి 15,770 యూనిట్లకు పెరిగడం విశేషం. చదవండి👉 హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మారుతీ గ్రాండ్ విటారా కార్లు! -
షాకిచ్చిన హీరో మోటార్స్! ధరల పెంచుతూ నిర్ణయం
ఇండియా నంబర్ వన్ టూవీలర్ బ్రాండ్ హీరో మోటార్స్ తన అభిమానులకు షాక్ ఇచ్చింది. హీరో నుంచి వస్తున్న టూవీలర్ల ధరలను పెంచుతున్నట్టు నిర్ణయించింది. ఒక్కో బైకు/స్కూటర్/మోటర్ సైకిల్‌పై సగటున రూ.3000 వంతున ధరలు పెంచక తప్పడం లేదని గురువారం ప్రకటించింది. పెరిగిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్, ముడి విభాగాల ధరలు పెరిగిపోవడం వల్ల తమ టూవీలర్ల ధరలు పెంచక తప్పలేదంటూ హీరో ప్రకటించింది. హీరో మోటర్స్‌కి సంబంధించి పదుల సంఖ్యలో ద్వి చక్ర వాహనాలు మార్కెట్లో ఉన్నాయి. ఏ మోడల్‌పై ఎంత ధర పెంచిందనే విషయాలపై హీరో స్పష్టత ఇవ్వలేదు. మరికొద్ది రోజుల్లో మోడళ్ల వారీగా ధరల పెంపుకు సంబంధించి క్లారిటీ రానుంది. మార్కెట్ లీడర్ హీరో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల .. రాబోయే రోజుల్లో ఇతర కంపెనీలు ఇదే మార్గం అవలంభించే అవకాశం ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ బైక్ మంటలు, లెక్కలు తేలాల్సిందే: కంపెనీలకు నోటీసులు -
భారీగా పెరిగిన హీరో మోటోకార్ప్ బైక్ ధరలు...! కొత్త ధరలు ఇవే...!
భారత టూవీలర్ రంగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్ప్లెండర్ బైక్ ధరలను పెంచుతూ హీరో మోటోకార్ప్ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్ 20 నుంచి అమలుల్లోకి వచ్చాయి. భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్ప్లెండర్ బైక్ ధరలను హీరో మోటోకార్ప్ సవరించింది. పెరుగుతున్న ముడి సరుకుల ధరలను దృష్టిలో ఉంచుకొని బైక్‌ల ధరలను పెంచినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. స్ప్లెండర్ బైక్ ధరలు సుమారు వెయ్యి నుంచి రెండు వేల వరకు హీరో మోటోకార్ప్ పెంచింది. అంతేకాకుండా మాస్ట్రో ఎడ్జ్, డెస్టినీ 125 , ప్లెజర్ ప్లస్ స్కూటీ ధరలు కూడా పెరిగాయి. చదవండి: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! హీరో మోటోకార్ప్ బైక్‌ల కొత్త ధరలు క్రమసంఖ్య మోడల్ కొత్త ధర(రూ.) పాత ధర(రూ.) 1. స్ప్లెండర్ ఐస్మార్ట్ డ్రమ్/అల్లాయ్ 69,650 68,650 2. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్ 67,160 66,050 3. స్ప్లెండర్ ప్లస్ సెల్ఫ్/డ్రమ్/అల్లాయ్/i3S 68,360 67,210 4. స్ప్లెండర్ ప్లస్ బ్లాక్ అండ్ అసెంట్ సెల్ఫ్ / డ్రమ్ / అల్లాయ్ 68,860 67,260 5. సూపర్ స్ప్లెండర్ డ్రమ్/అల్లాయ్ 73,900 72,600 6. సూపర్ స్ప్లెండర్ డిస్క్/అల్లాయ్ 77,600 75,900 7. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డ్రమ్ 73,450 72,250 8. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ 77,900 76,500 9. మాస్ట్రో ఎడ్జ్ 125 అల్లాయ్ డిస్క్ ప్రిస్మాటిక్ కనెక్ట్ 81,900 79,750 10. డెస్టినీ 125 స్టీల్ డ్రమ్ 70,400 69,500 11. డెస్టినీ 125 100 మిలియన్ ఎడిషన్ 75,500 74,750 12. డెస్టినీ 125 అల్లాయ్ డ్రమ్ VX ప్లాటినం 75,900 74,700 13. మాస్ట్రో ఎడ్జ్ 110 అల్లాయ్ డ్రమ్ VX 65,900 64,250 14. ప్లెజర్ ప్లస్ స్టీల్ డ్రమ్ LX 61,900 60,500 15. ప్లెజర్ ప్లస్ అల్లాయ్ డ్రమ్ VX 64,200 62,850 16. ప్లెజర్ ప్లస్ ప్లాటినం అల్లాయ్ డ్రమ్ ZX 66,400 64,950 చదవండి: Stangest Thing I Have Ever Worked On: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల -
హీరో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫస్ట్ లుక్ !
ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో జోరు తగ్గడం లేదు. వరుసగా ఒక్కొ కంపెనీ తమ మోడళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైతం తన ఈవీ మోడల్‌కి సంబంధించిన వివరాలను చూచాయగా వెల్లడించింది. హోరీ మోటార్ కార్పో పదో వార్షికోత్సం సందర్భంగా ఆ సంస్థ అధినేత పవన్ ముంజాల్ హీరో అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చారు తమ సంస్థ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ని అభిమానులకు చూపించారు. పదో వార్షికోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన లైవ్ స్ట్రీమ్‌లో సప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఈవీ స్కూటర్ని పరిచయం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పవన్ ముంజాల్. స్థబ్ధుగా ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఓలా రాకతో అలజడి మొదలైంది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించి రికార్డు సృష్టించింది. పైగా ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ ఓలా స్కూటర్‌కి సంబంధించి ఒక్కో ఫీచర్‌ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ మార్కెట్లో ఆసక్తి పెంచారు. దీంతో మిగిలిన కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. తమ సంస్థ నుంచి రాబోతున్న వాహనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించక తప్పని పరిస్థితి ఎదురైంది. దీంతో భవీష్ మార్కెటింగ్ టెక్నిక్‌నే ఫాలో అయారు. పవన్ ముంజాల్. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకుండా కేవలం స్కూటర్ కనిపించేలా వీడియోను బయటకు వదిలారు. హీరో పదో వార్షికోత్సం ఈవెంట్లో లభించిన ఫోటో వివరాల ప్రకారం హీరో స్కూటర్లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుక వైపు మోనో సస్పెన్షన్లు ఉపయోగించారు. ఫ్రంట్‌వీల్ డయా 12 ఇంచులు ఉండగా రియర్ వీల్ డయా 10 ఇంచులుగా ఉంది. మిగిలిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోల్చితే హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ సైజ్‌లో పెద్దదిగా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్, బ్యాకప్ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ రెండు సమస్యలపై ఫోకస్ చేస్తూ.. తమ స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామంటూ హీరో గతంలో ప్రకటించింది. ఈ మేరకు బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీకి సంబంధించి తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. -
హీరో గ్లామర్‌లో కొత్తగా ఈ ఫెసిలిటీ కూడా
ముంబై: లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోహోండా గ్లామర్ 125 సీసీ బైక్‌లో మరొ అధునాత ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జోడించింది. మార్కెట్లో గ్లామర్‌కి పోటీగా ఉన్న ఇతర మోడళ్లకు సవాల్ విసిరింది. బ్లూటూత్ ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉన్న 125 సీసీ సెగ్మెంట్లో హీరో గ్లామర్ది ప్రత్యేక స్థానం. మైలేజీ, మెయింటనెన్స్, స్టైలింగ్ విషయంలో బ్యాలెన్స్ చేస్తూ మార్కెట్లోకి వచ్చిన తక్కువ కాలంలోనో ఎక్కువ అమ్మకాలు సాధించింది. డిజిటల్ డిస్ప్లేతో ఆదిలోనే ఆకట్టుకుంది. కాగా తాజాగా గ్లామర్ బైక్‌కి బ్లూటూత్ ఫీచర్‌ని యాడ్ చేసింది హీరో మోటర్ కార్ప్. టీజర్ రిలీజ్ రైడింగ్‌లో ఉన్నప్పుడు మోబైల్‌కి వచ్చే కాల్స్ వివరాలు చూసుకునేందుకు వీలుగా బ్లూటూత్ ఫీచర్‌ని హీరో మోటర్ కార్ప్ జత చేసింది. దీనికి తగ్గట్టుగా మీటర్ కన్సోల్‌లో డిజిటల్ డిస్ప్లే సైజుని కూడా పెంచింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను హీరో మోటర్ కార్ప్ లాంఛ్ చేసింది. మరిన్ని హంగులు బ్లూ టూత్ ఫీచర్‌తో పాటు గ్లామర్ 125 సీసీలో ఎల్ఈడీ ల్యాంప్‌ను మరింత ఆకర్షణీయంగా హీరో మోటర్ కార్ప్ మార్చింది. హెచ్ ఆకారంలోకి హెడ్‌ల్యాంప్‌ని డిజైన్ చేసింది. అదే విధంగా స్పీడో మీటర్ కన్సోల్‌ని ప్తూర్తిగా డిజిటల్‌గా మార్చింది. ప్రస్తుతం మార్కెట్లో హీరోహోండా గ్లామర్ 125 సీసీ ధర రూ.78,900 (ఢిల్లీ, ఎక్స్‌షోరూమ్)గా ఉంది. అప్‌గ్రేడ్ చేసిన గ్లామర్ 125 సీసీని ఈ ఆగస్టులోనే మార్కెట్లో రిలీజ్ కానుంది. Always stay connected. Get ready for a revolutionary ride... Coming Soon. pic.twitter.com/Tmy2DbSFDe — Hero MotoCorp (@HeroMotoCorp) July 25, 2021 -
హీరో కొత్త వ్యూహం, రాయల్ ఎన్ఫీల్డ్కు టఫ్ ఫైట్!
మిడిల్ వెయిట్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్ రారాజుగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీగా సరికొత్త వ్యూహంతో రంగంలోకి దిగుతోంది హీరో మోటర్ కార్ప్. దీని కోసం విదేశీ కంపెనీలతో జట్టు కట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ని మరిపించేలా కొత్త బైక్‌ను డిజైన్ చేసే పనిలో తలామునకలై ఉన్నారు హీరో టీం మెంబర్స్. సాక్షి, వెబ్‌డెస్క్: ఇండియాలో బైక్ మార్కెట్లో హీరోదే అగ్ర స్థానం. హీరో గ్రూపు నుంచి వచ్చిన స్ల్పెండర్, ప్యాషన్ బైకులదే మార్కెట్లో హవా. అయితే దేశంలో నంబర్ వన్ మోటార్ బైక్ బ్రాండ్‌గా ఉన్నప్పటికీ హీరో బలమంతా ఎంట్రీ లెవల్, 100 సీసీ నుంచి 120 సీసీ బైకుల వరకే ఉంటోంది. అంతకు మించి స్పోర్ట్స్, మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో హీరోకు పట్టు చిక్కడం లేదు. దశాబ్ధాల తరబడి ప్రయత్నాలు చేస్తోన్నా నిలదొక్కుకోలేక పోతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మరోవైపు రీలాంచ్‌లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇరగదీస్తోంది. 350 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, థండర్ బర్డ్ మోడళ్ల అమ్మకాలు జోరు మీదున్నాయి. 350 సీసీ మిడిల్ వెయిట్ విభాగంలో 90 శాతం మార్కెట్ రాయల్ ఎన్ఫీల్డ్దే. దీంతో 350 సెగ్మెంట్లో వాటా కోసం హీరో కొత్త ప్రయత్నాలు చేస్తోంది. హార్లే డేవిడ్సన్ అమెరికాకు చెందిన ప్రీమియం బైకుల తయారీ కంపెనీ హర్లే డేవిడ్సన్తో జట్టు కట్టింది హీరో మోటర్ కార్ప్. గతంలో హర్లే డేవిడ్సన్ ఇండియా మార్కెట్లోకి వచ్చినా గట్టిగా నిలదొక్కుకోలేక పోయింది. దేశంలో అక్కడక్కడ తప్ప పెద్దగా అమ్మకాలు లేవు. పనులు మొదలయ్యాయి రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి పోటీగా మిడిల్‌వెయిట్ విభాగంలో 350 సీసీ ఇంజన్ సామర్థ్యంతో కొత్త బైకును మార్కెట్లోకి తెచ్చేందుకు హార్లే డేవిడ్సన్, హీరో కంపెనీలు చేతులు కలిపాయి. ‘ 350 సెగ్మెంట్లో బైకు తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే బైకు ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందో ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని హీరో మోటర్ కార్ప్ ఫైనాన్షియల్ ఛీఫ్ ఆఫీసర్ నిరంజన్ గుప్తా ‘మనీ కంట్రోల్’కి వెల్లడించారు. ధరపై ఆసక్తి ఎంట్రీలెవల్ బైక్ మార్కెట్లో హీరో మోటర్ కార్ప్ది అగ్రస్థానమైతే, ప్రీమియం బైకులు మాత్రమే తయారు చేయడం హార్లే డేవిడ్సన్ ప్రత్యేకత. మరీ ఈ రెండు కంపెనీల కలయికలో వస్తోన్న మిడిల్ వెయిట్ సెగ్మెంట్ బైక్ ధర ఎంత ఉండవచ్చనేది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. -
ఆటోమొబైల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
సాక్షి, చిత్తూరు: తిరుపతి, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలను కలుపుతూ ఆటోమొబైల్ హబ్‌ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామమని చెప్పారు. చిత్తూరులోని శ్రీసిటీ సమీపంలో శుక్రవారం హీరో మోటార్‌కార్ప్ చిత్తూరు ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మన రాష్ట్రం దేశంలోనే రెండోస్థానంలో ఉందన్నారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుౖవైన ప్రాంతమన్నారు. దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ హీరో ప్లాంటు లేదని తెలిపారు. చిత్తూరు ప్లాంటు నిర్మాణం కోసం రూ.1,600 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నామని హీరో మోటార్‌కార్ప్ సీఎండీ పవన్‌ముంజాల్ చెప్పారు. -
చిత్తూరుకు హీరో మోటార్స్
చిత్తూరులో టూవీలర్ ఉత్పత్తి ప్లాంటుకు సంబంధించిన ప్రణాళికను హీరో మోటార్ కార్పొరేషన్ లిమిటెడ్ విడుదల చేసింది. హీరో మోటార్ కు ఆంధ్రప్రదేశ్ కు ఎంవోయూ కుదిరిన దాదాపు ఏడాదిన్నర తర్వాత హీరో మోటార్ ఈ ప్రణాళిక వివరాలను వెల్లడించింది. రూ.800 కోట్ల పెట్టుబడులతో ఏడాదికి 5 లక్షల యూనిట్స్ ఉత్పత్తి చేసేలా డిసెంబర్ 2018 వరకు తొలిదశను పూర్తి చేయనుందని రాష్ట్ర పరిశ్రమల కార్యదర్శి ఎమ్ గిరిజా శంకర్ తెలిపారు. దీనికి మరో 5 లక్షల యూనిట్లను కలుపుతూ 2020లో రెండో దశను పూర్తి చేస్తామన్నారు. హీరో మోటార్స్ చిత్తూరులో నెలకొల్పే ఈ ప్లాంట్ తో మొదటిదశలో దాదాపు 1500 మందికి ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా మరో 3500 మందికి ఉపాధి కల్పిస్తారు. చిత్తూరు జిల్లా మదనపాలెంలో టూవీలర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో హీరో సంస్థ 2014 సెప్టెంబర్ లో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత నెలకొల్పే అతి పెద్ద ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. రోబోటిక్స్ మోహరింపు, కటింగ్ ఎడ్జ్ తయారీ సాంకేతిక, గ్రీన్ బిల్డింగ్ సాంకేతిక వంటి ఆధునికతతో తూర్పు,దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద తయారీ హబ్ గా ఈ ప్లాంటు ఉండబోతుందని కంపెనీ వెల్లడించింది. రూ.1600 కోట్లతో సహాయక విభాగాల యూనిట్ ను కూడా నెలకొల్పి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హీరో మోటార్స్ ప్రభుత్వానికి తెలిపింది. ప్లాంటుకు 25-30 కిలోమీటర్ల దూరంలో సహాయక విభాగాల కోసం మరో 200 ఎకరాల స్థలాన్ని కంపెనీకి ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ సహాయక విభాగాల ప్లాంటు మొదటిదశను రూ.400 కోట్లతో 2019 డిసెంబర్ వరకు పూర్తి చేయగా, మిగతా రెండు దశలను రూ.600 కోట్లతో 2021,2024 వరకు పూర్తి చేస్తామని హీరో మోటార్స్ పేర్కొంది. -
తెలంగాణకే హీరో ప్లాంటు !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సుమారు రూ. 1,250 కోట్ల పెట్టుబడితో మోటారు వాహనాల తయారీ సంస్థ హీరో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ అతుల్ సిన్హా నేతృత్వంలోని ముగ్గురు ప్రతినిధుల బృందం బుధవారం వివిధ ప్రాంతాలను పరిశీలించింది. బాంబే హైవే, నాగపూర్ హైవేల్లో వివిధ స్థలాలను బృందం పరిశీలించినట్లు సమాచారం. వీరు మెదక్‌జిల్లా తూప్రాన్ వరకూ వెళ్లి స్థలాలను సందర్శించారు. గురువారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జడ్చర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లి, పది రోజుల్లో నిర్ణయం ప్రకటించే సూచనలు ఉన్నాయని ఈ వర్గాలు వివరించాయి. అంతా అనుకూలిస్తే ఆరు నెలలు లేదా ఏడాదిలోగా ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణకే ప్లాంటు వస్తుందనే నమ్మకాన్ని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.