సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సుమారు రూ. 1,250 కోట్ల పెట్టుబడితో మోటారు వాహనాల తయారీ సంస్థ హీరో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ అతుల్ సిన్హా నేతృత్వంలోని ముగ్గురు ప్రతినిధుల బృందం బుధవారం వివిధ ప్రాంతాలను పరిశీలించింది. బాంబే హైవే, నాగపూర్ హైవేల్లో వివిధ స్థలాలను బృందం పరిశీలించినట్లు సమాచారం. వీరు మెదక్‌జిల్లా తూప్రాన్ వరకూ వెళ్లి స్థలాలను సందర్శించారు.
గురువారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జడ్చర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లి, పది రోజుల్లో నిర్ణయం ప్రకటించే సూచనలు ఉన్నాయని ఈ వర్గాలు వివరించాయి. అంతా అనుకూలిస్తే ఆరు నెలలు లేదా ఏడాదిలోగా ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణకే ప్లాంటు వస్తుందనే నమ్మకాన్ని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
తెలంగాణకే హీరో ప్లాంటు !
Published Thu, Jul 3 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:42 AM
Advertisement
Advertisement