Toopran
-
అధిక వడ్డీ..35 కోట్లు టోకరా
-
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
కోల్‌కతా: ఇటీవల కాలంలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. చదవు ఒత్తిడి, మానసిక సమస్యలు, ఇతరాత్ర కారణాలతో భవిష్యత్తును చేజేతులారా తుంచేసుకుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. మెదక్ జిల్లా తూప్రాన్‌కు చెందిన కే కిరణ్ చంద్ర అనే విద్యార్థి ఐఐటీ ఖగర్‌పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బహదూర్ శాస్త్రీ హాస్టల్లో ఉంటున్న చంద్ర మంగళవారం రాత్రి గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఇనిస్టిట్యూట్ యాజమాన్యం ఓప్రకటనలో వెల్లడించింది. కిరణ్ మృతితో సహచర విద్యార్థులు, ఐఐటీ అధ్యాపకులు, సిబ్బంది తీవ్ర దిగ్బ్రాంతికి గరైనట్లు తెలిపింది. అతడి ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. ‘మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో చంద్ర తన రూమ్మెట్స్తో కలిసి హాస్ట్‌లో గదిలో ఉన్నాడు. తర్వాత ఇద్దరు విద్యార్దులు పని మీద బయటకు వెళ్లారు. 8.30 గంటలకు ఇద్దరు తిరిగి వచ్చే సరికి గది లోపల నుంచి గడియ పెట్టినట్లు గుర్తించారు. బలవంతంగా తలుపు తీయడంతో గదిలో చంద్ర ఊరేసుకొని కనిపించాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా రాత్రి 11.30 అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు’ అని పేర్కొంది. చదవండి: Video: గాజా ఆసుపత్రిపై దాడికి ముందు, ఆ తర్వాత దృశ్యాలు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు. ప్రాజెక్టు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధిత విద్యార్థి తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలియగానే క్యాంపస్‌కు చేరుకున్నారు. కాగా గత కొంతకాలంగా ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థుల ఆత్మహత్యలతో తరుచూ వార్తల్లో నిలుస్తుంది. ఇదే విద్యాసంస్థలో ఏడాదిన్నరలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. కేంద్ర విద్యాశాఖ నివేదిక ప్రకారం 2014 నుంచి ఐఐటీల్లో 34 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 18 మంది ఓబీసీలు, షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. దేశంలో అకడమిక్ ఫెయిల్యూర్ కారణంగా ప్రతిరోజూ ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. 2014 నుంచి అక్టోబర్ 2022 మధ్య ఐఐటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి
సాక్షి, మెదక్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో మంగళవారం జరిగింది. తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలివి. పట్టణంలోని నర్సాపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మున్సిపల్ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌యాదవ్ తన ద్విచక్రవాహనంపై అటు వస్తున్నాడు. పోలీసులు అతని వాహనం ఆపి తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన మల్లేశ్‌యాదవ్ తన ఇంటికి వెళ్లి.. కాసేపటికి నర్సాపూర్ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చోటికి చేరుకున్నాడు. తన బైక్ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ ఆఫీజ్, హోంగార్డు ఇలియాస్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆఫీజ్ తలపై రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ స్టేట్మెంట్నే మార్చి మరీ..
వెల్దుర్తి(తూప్రాన్) : మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో పొదుపు సంఘాల సభ్యుల డబ్బుల చెల్లింపుల్లో వీవోఏలు నమ్మితే నట్టేట ముంచుడే అన్నచందంగా వ్యవహరిస్తున్నారు. మహిళా సంఘం సభ్యులు ప్రతినెలా బ్యాంకులో డిపాజిట్ చేసే డబ్బుల చెల్లింపులోనూ వీవోఏలు చేతివాటం ప్రదర్శించారు. ఈ నెల 20న విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలను గుర్తించి వీవోఏ–2 మాధవి నుంచి రూ.4,65,798 రికవరీకి ఆదేశించారు. విచారణ సమయంలో అధికారులు, మహిళలకు చిక్కకుండా గ్రామానికి చెందిన వీవోఏ–1 మానస ఏకంగా బ్యాంక్ స్టేట్మెంట్ రికార్డులను ఫోర్జరీ చేసినట్లు సుమిత్ర సంఘం సభ్యులు గుర్తించారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి పొదుపు సంఘం సభ్యులు రూ. 20 వేలు చొప్పున వీవోఏ మానసకు డబ్బులు అప్పగించగా బ్యాంకులో మాత్రం కేవలం రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసింది. సభ్యులకు అనుమానం రాకుండా బ్యాంక్ వోచర్లో ఇరవై వేలుగా మార్చి అక్షరాల్లోనూ రాసి రశీదులను అందజేసింది. విచారణలో బయట పడుతుందని.. విచారణ సమయంలో తక్కువ డబ్బులు డిపాజిట్ చేసిన విషయం బయట పడుతుందనే ఉద్దేశ్యంతో బ్యాంక్ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ను సైతం ఓ జిరాక్స్ సెంటర్లో మార్చి అటు అధికారులు, ఇటు పొదుపు సంఘాల సభ్యులను పక్కదారి పట్టించింది. మానస తీరుపై అనుమానం వచ్చిన సుమిత్ర సంఘం సభ్యులు శుక్రవారం బ్యాంక్‌లో స్టేట్మెంట్ తీసుకోగా అందులో రూ.10 వేల చొప్పున డిపాజిట్ చేసినట్లు గుర్తించారు. దీంతో గ్రామచావిడి వద్ద వీవోఏ మానసను కమ్యూనిటీ కో ఆర్డినేటర్ రజిత ఎదుటే నిలదీశారు. రుణాల మంజూరు విషయంలో జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమను మోసం చేసి డబ్బులు కాజేసిన విషయమై త్వరలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు పొదుపు సంఘాల సభ్యులు తెలిపారు. -
పెళ్లి వేడుక: కట్టించాల్సిన తాళి కొట్టేశాడు
తూప్రాన్: పెళ్లికి పురోహితుడిగా ఉండి వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టును దొంగగా మారి కొట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. అప్పటికి మంగళసూత్రం దొరక్క పసుపుతాడుతో పెళ్లి జరిపించేశారు. అంతా సద్దుమణిగాక పెళ్లి వీడియోలో ఈ పురోహితుడి ఘనకార్యం బయటపడింది. పడాలపల్లికి చెందిన మున్రాతి పెంటయ్య, సుశీల దంపతుల కుమారుడు జ్ఞానేందర్‌దాస్‌కు నర్సాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన వసంతతో ఈ నెల 16న తూప్రాన్‌లో గజ్వేల్‌కు చెందిన పురోహితుడు చరణ్‌శర్మ వివాహం జరిపించారు. అయితే పెళ్లి వేడుకలో వధువుకు కట్టించాల్సిన తాళిబొట్టు ముహూర్తం సమయానికి కనిపించకపోవడంతో పసుపుతాడుతో పెళ్లి కానిచ్చేశారు. రూ.1.50 లక్షల విలువ చేసే 3 తులాల బంగారు మంగళసూత్రం ఏమైందన్న విషయాన్ని తెలుసుకునేందుకు పెళ్లిలో రికార్డయిన వీడియోను కుటుంబ సభ్యులు చూశారు. అందులో పురోహితుడే మంగళసూత్రాన్ని తన జేబులో వేసుకుంటున్న దృశ్యాలు కన్పించాయి. దీంతో బాధితులు అతని ఇంటికి వెళ్లి నిలదీయగా ఓ జ్యువెలరీ దుకాణంలో తాకట్టు పెట్టినట్లు అంగీకరించాడు. చదవండి: పెళ్లిచేసుకుని మోసం చేస్తున్నాడు: లేడీ కానిస్టేబుల్ ఫిర్యాదు -
అరగంట వ్యవధిలో తండ్రీకొడుకు మృతి..
సాక్షి, తూప్రాన్: అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతున్న తండ్రి, కుమారుడు అరగంట వ్యవధిలో మృతిచెందిన సంఘటన తూప్రాన్ మున్సిసల్ పరిధిలోని పడాల్‌పల్లి గ్రాంమలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పడాల్‌పల్లి గ్రామాలనికి చెందిన కాసుకుంట యాదగిరి(60) గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటూ చిక్సిత్స పొందుతన్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మృతి చెందాడు. తన కుమారుడు కృష్ణ(37) కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో భాదపడుతున్నాడు. తూప్రాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత మూడు రోజులుగా చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 12.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రి మృతిచెందిన విషయం ఆప్పటికి కుమారునికి తెలియదు. అరగంట వ్యవధిలో తండ్రి, కుమారుడు మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆడుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చదవండి: శ్మశానాల్లో దుస్తులు దొంగిలించి.. మార్కెట్లో అమ్మకం.. -
19 రోజులకే నూరేళ్లు
తూప్రాన్: ఆ పసిగుడ్డుకు 19 రోజులకే నూరే ళ్లు నిండాయి. బాబు పుట్టాడని సంబరపడిన ఆ కుటుంబంలో చివరకు శోకమే మిగిలింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెం దిన సార మురళి, అంజలి దంపతులకు 19 రోజుల క్రితం బాబు పుట్టాడు. అస్వస్థతకు గురి కావడంతో సోమవారం బైక్‌పై తూప్రాన్‌లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరితోపాటు మురళి అన్న కూతురిని కూడా బైక్‌పై తోడుగా తీసుకెళ్లారు. అయితే, తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై హల్దీవాగు సమీ పంలో కాఫీడే వద్ద బైక్ యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంలో తల్లి ఒడిలోంచి పసికందు కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది. ఇదే సమయంలో ఓ కారు కూడా ఆ బైక్‌లను ఢీకొట్టింది. దంప తులతోపాటు ఓ బాలిక, ప్రమాదానికి కార ణమైన బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా..! బాధిత కుటుంబసభ్యులు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పసికందును నానమ్మ ఎత్తుకొని ‘‘అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా.. ఎన్నో దేవుళ్లకు మొక్కంగ మగపిల్లవాడిని ఇస్తే ఎంతో సంబరపడ్డాం.. నలుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో అందరికీ ఆడపిల్లలే ఉండగా మగపిల్లాడిని ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ నీ దగ్గరికే తీసుకెళ్లావా’’అంటూ రోదించింది. -
చిన్నారులను కాపాడి అన్న, చెల్లెలు మృతి
తూప్రాన్: విహారం విషాదాంతం అయింది. నీటిగుంత అన్న, చెల్లెలిని మింగేసింది. రెండు కుటుంబాలు ఆనందంగా ఉన్న తరుణంలో పెను విషాదం చోటు చేసుకుంది. మునిగిపోతున్న వారిని కాపాడి అన్న, చెల్లెలు విగత జీవులైన ఘటన సోమవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో జరిగింది. ఘనపూర్ గ్రామానికి చెందిన బిట్ల నర్సింహులు దేవుని మొక్కు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నరసింహస్వామి గుట్ట వద్దకు కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. తన ఇద్దరు చెల్లెళ్లయిన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన సునీత, నరేందర్ దంపతులు, కొంతాన్‌పల్లి గ్రామానికి చెందిన లలిత, వారి కుటుంబ సభ్యులను ఆహా్వనించాడు. దేవుని వద్ద మొక్కులు తీర్చుకొని భోజనాలు చేశారు. అనంతరం పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినోద్‌కుమార్ అనే బాలుడితో పాటు మరో బాలిక గుట్ట కింద ఉన్న నీటిగుంతలో పడిపోయారు. తోటి పిల్లలు కేకలు వేయడంతో పక్కనే ఉన్న లలిత కుమారుడు ప్రశాంత్(22) వెంటనే గుంతలో పడి ఉన్న ఇద్దరు చిన్నారులను పైకి లాగేసి ఒడ్డున పడేశాడు. కానీ తరువాత అతడు ఆ గుంతలో మునిగిపోయాడు. దీన్ని గమనించిన అతని చిన్నమ్మ కూతురు పావని (17) అన్నను కాపాడేందుకు గుంతలోకి దిగి మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో పావనిని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పావని మృతి చెందింది. అలాగే నీటి గుంతలో పడి మృతిచెందిన ప్రశాంత్ మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో రెండు కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ శ్యాంప్రకాశ్, తహసీల్దార్ శ్రీదేవి ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. -
మానని గాయానికి ఐదేళ్లు...
సాక్షి, తూప్రాన్: ఐదేళ్ల క్రితం తూప్రాన్ మండలంలోని మూసాయి పేట రైల్వే గేటు స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 16 మంది విద్యార్థులు మృతిచెందారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ సంఘటన ఇప్పటికీ కళ్లముందు మెదలుతూనే ఉంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు వారి జ్ఞాపకాలతోనే బతుకుతున్నారు. కొంత మంది తమ పిల్లల విగ్రహాలను వ్యవసాయ పొలాల్లో ప్రతిష్టించుకొని వారితో గడిపిన స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో సరిగ్గా ఐదేళ్లు. ఐదేళ్ల క్రితం రోజులాగే తెల్లారింది. ఏప్పటిలాగే ఆ చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్‌కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు.. అటుగా వస్తున్న నాందెడ్ ప్యాసింజర్ రైలు.. స్కూల్ బస్సును ఢీ కొట్టింది. కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తునాతునకలైంది. అందులోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ రైలు పట్టాల పక్కన ఎగిరిపడ్డారు. బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్‌తో పాటు 14 మంది చిన్నారులు సంఘటన స్థలంలో మృతిచెందారు. మరో 20 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మొత్తం 16మంది చిన్నారులు రైలు ప్రమాదంలో విగత జీవులయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జూలై 24న జరిగిన రైలు ప్రమాదం జరిగి నేటికి ఐదేళ్లవుతుంది. మృతులంతా తూప్రాన్ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు వారే. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది. బస్సులో ఉన్న ప్రతి విద్యార్థికీ ఇనుపచువ్వలు గుచ్చుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తపు మడుగును తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్‌లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్Œ బాక్స్‌ల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కనిపించాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఇప్పటికీ చిన్నారుల తల్లిదండ్రుల కళ్లల్లో నీటి సుడులు తిరుగుతూనే ఉన్నాయి.. మసాయిపేట రైలు ప్రమాదం జరిగి ఐదేళ్లు గడిచిన ఇంకా వారి మదిలోంచి చిన్నారుల జ్ఞాపకాలు చెదిరిపోలేదు. వారి మధుర జ్ఞాపకాలతోనే కాలం వెల్లదిస్తున్నారు. ఎదిగిన కొడుకును మరిచిపోలేక ఓ బాధిత కుంటుంబం కుమారుడి ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఇలా బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పో యి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదిస్తున్నారు. స్మృతివనం ఏర్పాటయ్యేనా..! వెల్దుర్తి మండలం మాసాయిపేట గ్రామ శివారులోని రైల్వే గేటు వద్ద జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందిన చిన్నారుల జ్ఞాపకార్థం అప్పటి రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలు మృతుల కుటుంబాలను పరమార్శించి ఓదార్చిన అనంతరం ప్రమాదం జరిగిన చోట మృతుల ఆత్మశాంతికి స్కృతివనం నిర్మిస్తామని హామీనిచ్చారు. కాని ఐదేళ్లు కావస్తున్న హామీ నెరవేరలేదు. ఇప్పటికైనా నాయకులు స్పందించి స్మృతివనం ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులు కోరుతున్నారు. -
కన్నకూతురినే కడతేర్చాడు
ములకలచెరువు: అభం శుభం తెలియని 14 ఏళ్ల బాలికను కన్న తండ్రే దారుణంగా హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముకలచెరువు మండలం భోరెడ్డిగారిపల్లెకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి తన కుమార్తె లక్ష్మీప్రసన్న(14)ను హైదరాబాద్ హాస్టల్లో చదివిస్తానని చెప్పి ఈ నెల 2న ఇంటినుంచి తీసుకెళ్లాడు. తెలంగాణలోని మొదక్ జిల్లా తుప్రాన్ అటవీ ప్రాంతంలో బాలికను హత్యచేసి మృతదేహాన్ని అక్కడే వదిలి వచ్చాడు. కుమార్తె అదృశ్యమైందని కుటుంబసభ్యులను నమ్మించి ఈ నెల 11న ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్ఐ ఈశ్వరయ్య అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎలా అదృశ్యమైందన్న విషయమై విచారిస్తున్న పోలీసులకు తండ్రి వ్యవహారశైలి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని విచారించగా అసలువిషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ములకలచెరువు పోలీసులు ఆదివారం నిందితుడ్ని వెంటబెట్టుకొని తుఫ్రాన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తుప్రాన్ పీఎస్‌లో హత్య కేసు నమోదు.. ఈ నెల 5న తుప్రాన్ అటవీ ప్రాంతంలో లక్ష్మిప్రసన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు గుర్తు తెలియని బాలిక హత్యకు గురైనట్లు కేసు నమోదుచేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న తుప్రాన్ పోలీసులు కన్న కూతురిని హత్య చేయడానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు తెలిసింది. కేసు విచారణలో ఉందని, హత్యకు గల కారణాలు త్వరలో వెల్లడిస్తామని ఎస్ఐ ఈశ్వరయ్య తెలిపారు. -
అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా
-
అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తా: కేసీఆర్
మెదక్ జిల్లా: తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది కంటి జబ్బుల బారిన పడుతున్నారని, వీరందరికి కంటి పరీక్షలు చాలా అవసరమని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో బుధవారం కంటి వెలుగు పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కంటి వెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే 40 లక్షల కళ్లద్దాలు తెప్పించామని, ప్రజలందరూ కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 825 టీంలు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాయని, కంటి పరీక్షల అనంతరం ఉచితంగా మందులు, కళ్లద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కంటి వెలుగు లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. మల్కాపూర్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవం
తూప్రాన్ : యువకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులకు సిద్దిపేట జిల్లా కోర్టు న్యాయమూర్తి బి.ప్రతిమ శుక్రవారం యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 6 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తూప్రాన్ ఎస్ఐ నాగార్జునగౌడ్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. 2015 మార్చి 24న కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన తుడుం స్వామి, క్యాస్థి ప్రశాంత్, నెమలిగారి నవీన్ అనే ముగ్గురు వ్యక్తులు అదే గ్రామానికి చెందిన కిరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ కిరణ్‌ను తూప్రాన్‌లోని పెద్ద చెరువు వద్దకు తీసుకువచ్చి హత్య చేసి దాంట్లో పడవేశారు. అప్పట్లో ముగ్గురు నిందితులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం కేసుకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాది కేసును వాదించగా న్యాయమూర్తి బి.ప్రతిమ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.6వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకీ తయారీ!
తుప్రాన్: ఓ యువకుడు తాను స్వయంగా తయారు చేసిన తుపాకీని పేల్చడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన మెదక్ జిల్లా తుప్రాన్ డివిజన్ కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా కోడూర్ గ్రామానికి చెందిన మరదన రమేశ్ (26) మనోహరాబాద్ మండలం రమాయిపల్లి సమీపంలోని ఓ స్టీల్ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఖాళీ సమయాల్లో యూట్యూబ్ చూసి నాటు తుపాకీని, మూడు తూటాలను తయారు చేశాడు. తుప్రాన్ గ్రామ పంచాయతీ వెనుకాల ఉన్న కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ ఓ తూటాను పేల్చాడు. దీంతో జనం ప్రాణ భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఎస్సై.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నాటు తుపాకీ, పేల్చిన రెండు తూటాలతో పాటు పేలని మరో తూటాను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
అశ్రునయనాలతో అంత్యక్రియలు..
జిన్నారం(పటాన్చెరు) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దమ్మగూడకు చెందిన నవతెలంగాణ పత్రిక విలేకరి గొర్ల లక్ష్మణ్(38), కుమార్తె విజయ(5), తల్లిదండ్రులు మల్లేశ్(65), గండెమ్మ(58) మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఆదివారం పెద్దమ్మగూడలో వారి అంత్యక్రియలు జరిగాయి. ప్రమాదం జరిగినప్పటి నుంచి అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు గ్రామం మూగబోయింది. అన్ని దారులు పెద్దమ్మగూడ వైపే.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్న మండల ప్రజలు పెద్దమ్మగూడకు భారీగా చేరుకున్నారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు ఎండను సైతం లెక్కచేయకుండా అక్కడే ఉన్నారు. మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు, స్థానికుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. చికిత్స పొందుతున్న ముగ్గురు.. ప్రమాదంలో గాయపడిన లక్ష్మణ్ భార్య పుష్పలత, కుమారుడు ఆకాశ్ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో, కుమార్తె నిహారిక గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న పుష్పలతను టీయూడబ్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. వెంకటరత్నాపూర్‌లో.. తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామానికి చెందిన సత్తమ్మ(65) ఆమె మనువడు శ్రీనివాస్(11) తూప్రాన్ పట్టణానికి చెందిన వారి సమీప బంధువు గుజ్జ సుశీల ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారి పెద్ద కుమారుడు నర్సింలు అతని చిన్న కుమారుడు ఓంకార్ ఆదివారం మృతి చెందారు. సత్తమ్మ పెద్ద కుమారుడి భార్య ధనమ్మ, కుమారుడు శ్రీకాంత్, చిన్నకుమారుడి భార్య లక్ష్మి, వారి కూతుళ్లు రేవతి, శ్రీవల్లిక ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు సమాచారం. వారితో పాటు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉన్న చిన్నకుమారుడు మహేశ్ తల్లి సత్తమ్మ, అన్న నర్సింలు, వారి ఇద్దరు కుమారులు శ్రీనివాస్, ఓంకార్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. అంత్యక్రియలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి సైతం ప్రజలు భారీగా తరలివచ్చారు. తూప్రాన్‌కు చెందిన వీరి బంధువు సుశీల అంత్యక్రియలు సైతం ఆదివారం నిర్వహించారు. నాయకుల పరామర్శ తూప్రాన్: దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ రిమ్మనగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని వెంకటరత్నాపూర్‌కు చెందిన సత్తమ్మ(65), ఆమె మనవడు శ్రీనివాస్(11) తూప్రాన్ పట్టణానికి చెందిన వారి సమీప బంధువు గుజ్జ సుశీల ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వారి పెద్ద కుమారుడు నర్సింలు అతని చిన్న కుమారుడు ఓంకార్ ఆదివారం మృతి చెందారు. ఆదివారం వీరి అంత్యక్రియలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఈ విషయం తెలుసుకున్న రోడ్లు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రాష్ట్రఫుడ్కమిటీ చైర్మన్లు తూముకుంట నర్సారెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, ఉమ్మడి మెదక్‌జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మురళీయాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి, మృతుల కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. వీరి వెంట మండలంలోని ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వెంకటరత్నాపూర్ కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి... రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాజీవ్‌రహదారి నిర్మాణంలో అవకతవకల కారణంగానే రోడ్డు ప్రమాదం సంభవించినట్లు ఆయన ఆరోపించారు. ఇందుకు కావాల్సిన నివేదికను సేకరించి ప్రభుత్వంపై కోర్టుకు వెల్లనున్నట్లు తెలిపారు. – బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి -
న్యూస్ రీడర్ మృతితో విషాదఛాయలు
తూప్రాన్: వీ 6 చానెల్లో న్యూస్‌రీడర్‌గా పనిచేసిన రాధిక ఆదివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన తెలుసుకున్న గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన వెంకన్నగారి మాణిక్యరెడ్డి, ఊర్మిల దంపతుల కుమార్తె రాధిక(36) వీ6 చానెల్ న్యూస్‌రీడర్‌గా పనిచేసింది. హైదరాబాద్‌లోని మూసాపేటలోని అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు టీవీల్లో చూసిన గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. తమ గ్రామ యువతి టీవీ లో వార్తలు చదవడం తమకెంతో గర్వంగా ఉండేదన్నారు. రాధిక కుటుంబ సభ్యులు పదిహేనేళ్లకు ముందు హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారన్నారు. గ్రామంలో వారికున్న ఐదెకరాల పొలాన్ని ఆమె తండ్రి మాణిక్యరెడ్డి ఇతరులకు కౌలుకు ఇచ్చినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతురాలు రాధిక 10వ తరగతి వరకు గ్రామ సమీపంలోని మంగళపర్తిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నట్లు తెలిపారు. తన తోటి విద్యార్థులు సైతం రాధిక మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాం తిని వ్యక్తం చేశారు. గ్రామంలో వారు ఉంటున్న ఇల్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని కూలిపోయింది. పదిహేనేళ్లుగా వారు గ్రామానికి రావడం లేదన్నారు. -
యథేచ్ఛగా పాల కల్తీ!
తూప్రాన్: ప్యాకెట్ పాలైనా.. గేదె పాలైనా.. విష రసాయనాలు, ఎముకల పొడిమయమై పోయాయి. పాలల్లో పోషక పదార్థాలు ఉంటాయని అందరికి తెలుసు. కానీ ప్రస్తుతం పాలల్లో వాటికి బదులుగా ప్రజలను రోగాల బారిన పడేసే విషం ఉంటోంది. ఇదేంటి అనుకుంటున్నారా..? ఇది నిజం.. జిల్లాలోని తూప్రాన్, కాళ్లకల్ మండల కేంద్రాలు పాల కల్తీకి అడ్డాగా మారాయి. పాల కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. దీంతో వ్యాపారులు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. డివిజన్ పరిధిలోని తూప్రాన్, కాళ్లకల్ గ్రామాలను అడ్డాగా ఏర్పాటు చేసుకొని వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు సమాచారం. పట్టణానికి చెందిన ఓ పాల వ్యాపారి ఈ మేరకు వివరాలు వెల్లడించారు. తూప్రాన్ డివిజన్లోని రైతుల వద్ద ఉన్న గేదెలు, ఆవులు సుమారు 5 వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 25 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ ఇక్కడ నిత్యం సుమారు 50 వేల లీటర్ల వ్యాపారం సాగుతున్నట్లు తెలుస్తోంది. తూప్రాన్‌కు చుట్టుపక్కల మండలాలైన శివ్వంపేట, Ðవెల్దుర్తి, వర్గల్, చేగుంట మండలాలు, కాళ్లకల్‌కు మేడ్చెల్ జిల్లాలోని పూడూరు, రావన్‌కోల్, సోమారం, ఘనపూర్, మేడ్చెల్, లింగాపూర్, డబీల్‌పుర తదితర గ్రామాల వ్యాపారులు అక్కడ సేకరించిన పాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. రహస్యంగా ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు.. జిల్లాలో సరఫరా అవుతున్న పాలల్లో దాదాపు 80 శాతం కల్తీ జరుగుతున్నట్లు పలువురు పాల వ్యాపారులు చెబుతున్నారు. ఒక లీటరు స్వచ్ఛమైన పాలను ఎనిమిది లీటర్ల కల్తీ పాలుగా మార్చుతున్నారు. దీని కోసం మొదట లీటరు పాలల్లో అత్యధికంగా నీళ్లు కలుపుతారు. ఆ తర్వాత ఇందులో యూరియా, ఎముకల పొడి, హైడ్రోజన్ ఫెరాక్సైడ్ వంటి రసాయనాలను తక్కువ మోతాదులో కలిపి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే కాక కొందరు రైతులు అధిక పాల ఉత్పత్తి కోసం పశువులకు మోతాదుకు మించి ఆక్సిటోసిన్ ఇంజక్షన్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఈ ఇంజక్షన్లు రంగారెడ్డి జిల్లా మేడ్చల్, బోయిన్‌పల్లిలోని జనరల్ వెటర్నరీ, పశువుల దాణా దుకాణాల్లో రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం. గతంలోనే ప్రభుత్వం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను నిషేధించింది. ఈ ఇంజక్షన్ వాడడం వల్ల దుష్ఫలితాలు కలుగుతాయని పశు సంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయినప్పటికీ అధిక పాల ఉత్పత్తి కోసం ఈ ఇంజక్షన్‌ను వాడుతున్నారు. ఇది ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు నిల్వ కోసం.. కల్తీ పాలను ఎక్కువ సేపు నిల్వ ఉంచడం కోసం హైడ్రోజన్ ఫెరాక్సైడ్, సోడియం బై కార్పొనేట్, క్యాల్షియం యాక్సైడ్, ఎముకల పొడి, ఇతర రసాయనాలు కలిపి కల్తీకి పాల్పడుతున్నారు. పాలు తెల్లగా ఉండేందుకు లీట రుకు రెండు గ్రాముల చొప్పున యూరియాను కలుపుతున్నట్లు సమాచారం. ఇవే కాకుండా సోయా, ఆముదం వాటి నుంచి వచ్చే నూనెలను కూడా కలుపుతున్నారు. అయితే అసలైన పాల వ్యాపారులు ఈ కల్తీ వ్యాపారుల వల్ల నష్టాలకు గురవుతున్నారు. లక్షల్లో పెట్టుబడులు పెట్టి గేదెలను పెంచుతున్న రైతులు, వ్యాపారులు కల్తీ పాల పోటీకి తట్టుకోలేక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. కల్తీ పాలతో వచ్చే వ్యాధులు.. కల్తీ పాల వల్ల చిన్న పిల్లలతోపాటు పెద్దవారు కూడా అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు, కడుపులో తిప్పడం, అల్సర్, గ్యాస్ట్రో, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కల్తీ పాలను నివారించాలని పలువురు కోరుతున్నారు. తూప్రాన్‌లో రెండేళ్ల క్రితం ఓ పాల వ్యాపారి కృత్రిమ పాలను తయారు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడి చేశారు. పాలల్లో కల్తీ గుట్టు రట్టు చేశారు. ఈ పాలల్లో యూరియా, నూనె, పౌడర్, తదితర రసాయనాలు గుర్తించి సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. అయితే కొన్నాళ్లపాటు జాగ్రత్త పడిన వ్యాపారులు తిరిగి జోరుగా పాల కల్తీకి పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు మార్కెట్లో స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు. పాలు అమ్మేవారు రోజూ నాణ్యమైనవి అమ్మడం లేదు. పలుచని పాలు అమ్ముతున్నారు. కనీసం పెరుగు కూడా తోడు కోవడం లేదు. కల్తీ పాలు అమ్ముతున్నారు. ఎక్కడ కొనాలో తెలియక నిత్యం సతమతమవుతున్నాం. నాణ్యమైన పాలు అమ్మే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. –మహ్మద్ అసీఫ్, కల్తీ పాలతో ఇబ్బందులు తప్పడం లేదు వ్యాపారులు కల్తీ పాలను అమ్మడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తూప్రాన్‌లో కృత్రిమ పాల తయారుదారుడిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అదే తరహాలో పాలల్లో కల్తీ చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. తనిఖీ అధికారులు పాలల్లో కల్తీని గుర్తించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. –చెలిమెల జయరాములు, తూప్రాన్ -
తూప్రాన్‌లో ర్యాలీ, రాస్తారోకో
తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని నాగులపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ పంచాయతీలను మసాయిపేటలో కలపరాదని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం రాస్తారోకో చేశారు. తమ గ్రామాలకు తూప్రాన్ మండలం అనుకూలంగా ఉందని, దూరంగా ఉన్న మసాయీపేటలో వాటిని కలపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్బంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం కార్యకర్తలు రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి ధర్నా చేశారు. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామాన్ని మగ్గల్‌పర్తి మండలంలో కలపవద్దని కోరుతూ పిల్లుట్ల గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సర్పంచ్, ఎంపీటీసీలను నిర్బంధించి నిరసన వ్యక్తంచేశారు. -
వేతనాలు చెల్లించాలని కార్మికుల ఆత్మహత్యాయత్నం
తూప్రాన్: సకాలంలో వేతనాలు చెల్లించకుంటే ఆత్మహత్యకు పాల్పడుతామంటూ మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలోని టీఎం టైర్స్ పరిశ్రమకు చెందిన మగ్గురు కార్మికులు గురువారం బైలార్ గది గొట్టం ఎక్కి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చజేప్పి కిందకు దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీఎం టైర్స్ పరిశ్రమ మూతపడి 18 నెలలు కావస్తోంది. అప్పటి నుంచి నిత్యం కార్మికులు పరిశ్రమ వద్దకు వస్తూ హాజరు వేసుకుంటూ వెళ్తున్నారు. కాని ఇప్పటి వరకు పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తిని ప్రారంభించకపోగా వేతనాలు చెల్లించడంలేదు. బుధవారం పరిశ్రమ ఎదుట నిరసన తెలిపిన విషయం తెలిసిందే. వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పరిశ్రమకు చెందిన అనిల్, సిద్దిరాంరెడ్డి, నాగిరెడ్డి అనే ముగ్గురు కార్మికులు పరిశ్రమకు చెందిన బైలర్ గది గొట్టం ఎక్కి పరిశ్రమ నిర్వహకుడు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంతవరకు కిందకు దిగమని అవసరమైతే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చారించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడి సోమవారం లోగా సమస్యలు పరిష్కరిస్తామని అంగీకరించడంతో కార్మికులు కిందకు దిగివచ్చారు. -
నేడు తూప్రాన్‌కు సీఎం కేసీఆర్
-
నేడు తూప్రాన్‌కు సీఎం కేసీఆర్
తూప్రాన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మరోసారి జిల్లాలో పర్యటించనున్నారు. తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గల పారిశ్రామిక వాడలోని బయో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో నూతనంగా నిర్మిస్తున్న ఇన్సూమేన్ ఫార్మా (వ్యాక్సిన్)కి కంపెనీకి భూమి పూజ చేయనున్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా హెలీకాఫ్టర్లో ముప్పిరెడ్డిపల్లికి చేరుకోనున్న నేపథ్యంలో బుధవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ సుమతి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీకాఫ్టర్ ల్యాండింగ్ కోసం పరిశ్రమ సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్‌ను వారు పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్న స్థలాన్ని కూడా పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమానికి సంబంధించిన వివరాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ సుమతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తగిన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసులను మోహరించినట్లు వెల్లడించారు. ‘గడా’ అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్ఐ సంతోష్‌కుమార్, తహసీల్దార్ స్వామి, ఎంపీడీఓ కరుణశీల, ఆర్అండ్బి అధికారులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎలక్షన్‌రెడ్డి తదితరులు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన వారిలో ఉన్నారు. రూ.500 కోట్లతో ఫార్మా కంపెనీ ఏర్పాటు ముప్పిరెడ్డిపల్లిలోని ఏపీఐఐసీ భూముల్లో 2007 సంవత్సరంలో శాంతా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పట్లో 40 ఎకరాల భూమిని కేటాయించారు. ఇప్పటికే ఇందులో పరిశ్రమ నెలకొల్పగా, అందులో మరో ఎనిమిది ఎకరాల స్థలంలో నూతన ప్లాంట్‌ను నిర్మిస్తున్నట్లు ఆ పరిశ్రమ ప్రతినిధి తెలిపారు. ఇందుకుగాను రూ.500 కోట్ల పెట్టుబడి అవసరమన్నారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని వివరించారు. -
వివాహితపై అత్యాచారం, హత్య
మృతురాలు గారెడ్డిపేట వాసి? తూప్రాన్ : వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మండలంలోని రామాయిపల్లి పంచాయతీ పాలాట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పాలాట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పలువురు పశువులను సోమవారం తోలుకెళ్లారు. అయితే అక్కడి పొదల్లో ఉన్న మహిళా మృత దేహాన్ని వారు గుర్తించారు. విషయాన్ని గ్రామస్తులకు చేరవేయ గా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ సంజయ్‌కుమార్, ఎస్ఐ సం తోష్కుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదే హాన్ని పరిశీలించారు. మహిళను పది రోజుల క్రితం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిందని, ఒంటిపై కేవ లం ఎర్రని జాకెట్ మాత్రమే ఉందన్నారు. మహిళను అటవీ ప్రాంతంలోకి తీసుకువచ్చి అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు క్లూస్‌టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అయితే మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో సంఘటనా స్థలంలోనే గజ్వేల్ ప్ర భుత్వాస్పత్రి వైద్యులను పిలిపించి పంచనామా నిర్వహించి ఖననం చేశారు. లింగారెడ్డిపేట వాసిగా అనుమానం..? మృతురాలు మండలంలోని లింగారెడ్డిపేటకు చెందిన వివాహితగా పోలీసులు అనుమానిస్తున్నారు. లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన సురారం యశోద (30)కు కౌడిపల్లి మండలం చందంపేటకు చెందిన శేఖర్‌తో వివాహం జరగ్గా వీరు ఇల్లరకం ఉన్నారు. కాగా కొన్నేళ్ల క్రితం శేఖర్ ఇల్లు వదలి వెళ్లిపోయాడు. అయితేవీరికి ఇద్దరు పిల్లలు కావడంతో కుటుంబ పోషణ కష్టం మాంతో దీంతో యశోద పట్టణంలోని ఓ దాదా హోటల్లో కూలీ పనిలో చేరింది. ఈ క్రమంలోనే డిసెంబరు 29న సోమవారం ఉదయం కాళ్లకల్‌లో డబ్బులు వచ్చేది ఉందని ఇంట్లో తల్లి నర్సమ్మతో చెప్పి యశోద బయటకు వచ్చింది. అదే రోజు రాత్రికి ఇంటికి చేరుకోలేదు. దాబా హోటల్లో తెలుసుకుంటే వారు కూడా పనికి రాలేదని తెలిపారన్నారు. దీంతో బంధువుల ఇంటికి వెళ్లిందని భావించింది. అయితే పాలాట సమీపంలోని అటవీ ప్రాంతంలోని మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న తల్లి నర్సమ్మ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి తన కుమార్తెదేనంటూ విలపించింది. కాగా.. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పష్టతకు రాలేకపోతున్నారు. -
తూప్రాన్ వద్ద రోడ్డు ప్రమాదం
-
లారీ, డీసీఎం ఢీ, ఇద్దరు మృతి
మెదక్ : మెదక్ జిల్లా తుప్రాన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి వున్న లారీని ఓ డీసీఎం వ్యాన్ వెనక నుంచి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మహిళల స్వావలంబనతోనే రాష్ట్రాభివృద్ధి
తూప్రాన్: మహిళలు స్వావలంబన దిశగా ముందుకు సాగినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ‘గడా’ అధికారి హన్మంతరావు పేర్కొన్నారు. తూప్రాన్ మండలంలోని 71 సమైక్య సంఘం మహిళా గ్రూపులకు ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల రుణా వితరణ కార్యక్రమంలో రూ.2.10 కోట్ల రుణాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి గడా అధికారి హన్మంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో మహిళలు భర్తలపై ఆధారపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారన్నారు. ప్రస్తతం మహిళలంతా గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నారన్నారు. దీంతో భార్యలపైనే భర్తలు ఆధారపడే విధంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణం కావడంలేదన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెటి ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.50 వేలు, భూమి లేని దళిత రైతులకు మూడెకరాల భూమిని కేటాయిస్తున్నారని వివరించారు. డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలకు 2013 డిసెంబరు నుంచి సెప్టెంబరు వరకు తీసుకున్న రుణాలకు చెల్లించిన వడ్డీలను వారి ఖాతాల్లోనే జమచేస్తామని చెప్పారు. స్త్రీనిధి ద్వారా చెల్లిస్తున్న లావాదేవీల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. త్వరలోనే జిల్లాలోని 6,800 మహిళా గ్రాపులకు రూ.204 కోట్ల రుణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ టీవీ రమణ మాట్లాడుతూ తమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామన్నారు. అంతకు ముందు మహిళలు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుమన భాస్కర్‌రెడ్డి, తహశీల్దార్ స్వామి, ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్, ఎంపీడీఓ కరుణలీల, స్థానిక సర్పంచ్ శివ్వమ్మ ఐకేపీ ఏపీఎం యాదగిరి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు. -
క్షమాపణ కోరిన కాకతీయ గ్రూప్ చైర్మన్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ఘటనపై కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారామిరెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఘటనలో తమ తప్పులేదని సాక్షితో అన్నారు. రైల్వే తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. స్కూల్ బస్సు పూర్తి కండీషన్లో ఉందని, స్కూల్‌ను నిబంధనల ప్రకారమే నడుపుతున్నామని చెప్పారు. అన్నీ స్కూళ్లకు పర్మిషన్లు ఉన్నాయని తెలిపారు. జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. చనిపోయిన విద్యార్థులు తన పిల్లలు లాంటివారని గద్గర స్వరంతో అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. -
ఆలస్యంగా స్పందించిన స్కూల్ యాజమాన్యం
మెదక్: తమ పాఠశాల బస్సును రైలు ఢీకొన్న దుర్ఘటనపై తుప్రాన్ కాకతీయ టెక్నో స్కూల్ యాజమాన్యం ఆలస్యంగా స్పందించింది. స్కూల్‌కు సంబంధించిన ఫోన్లన్నీ స్విచ్చాఫ్ చేసి ఉన్నాయి. కాకతీయ స్కూల్ గ్రూపునకు చెందిన 96662 22288 నంబరుకు ఫోన్ చేస్తే తమకు సంబంధం లేదని చెబుతున్నారు. తుప్రాన్ బ్రాంచ్‌ను తమ వెబ్సైట్లో ఫ్రాంచైజ్ స్కూల్‌గా కాకతీయ స్కూల్స్ గ్రూపు పేర్కొంది. మరోవైపు అజ్ఞాతంలోకి కాకతీయ గ్రూప్ చైర్మన్ సీతారాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ అయింది. ఈ వార్త ప్రసారం కాగానే ఆయన సాక్షి' టీవీకి ఫోన్ చేసి మాట్లాడారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద కాపలా లేని రైల్వే గేటు దాటుతుండగా కాకతీయ టెక్నో స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసిజర్ రైలు ఢీకొంది. ఈ దుర్ఘటనలో 18 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్, క్లీనర్ కూడా మృతి చెందారు. -
తెలంగాణకే హీరో ప్లాంటు !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సుమారు రూ. 1,250 కోట్ల పెట్టుబడితో మోటారు వాహనాల తయారీ సంస్థ హీరో తన యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు కంపెనీ ప్రాజెక్ట్ హెడ్ అతుల్ సిన్హా నేతృత్వంలోని ముగ్గురు ప్రతినిధుల బృందం బుధవారం వివిధ ప్రాంతాలను పరిశీలించింది. బాంబే హైవే, నాగపూర్ హైవేల్లో వివిధ స్థలాలను బృందం పరిశీలించినట్లు సమాచారం. వీరు మెదక్‌జిల్లా తూప్రాన్ వరకూ వెళ్లి స్థలాలను సందర్శించారు. గురువారం రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని జడ్చర్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి తిరిగి వెళ్లి, పది రోజుల్లో నిర్ణయం ప్రకటించే సూచనలు ఉన్నాయని ఈ వర్గాలు వివరించాయి. అంతా అనుకూలిస్తే ఆరు నెలలు లేదా ఏడాదిలోగా ప్లాంటు నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణకే ప్లాంటు వస్తుందనే నమ్మకాన్ని ఈ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
మాయగాళ్లు!
కల్వల మల్లికార్జున్‌రెడ్డి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నర్సాపూర్, తూప్రాన్ దారిలో దట్టమైన అటవీ ప్రాంతం. ఉన్నట్టుండి ఏడాది క్రితం చెట్టూ పుట్టా మాయమై మైదానంగా మారింది. కోట్లాది రూపాయల విలువ చేసే 45.33 ఎకరాల భూమి ‘ఇనాం’ పేరిట పట్టా భూమిగా మారిపోయింది. దీని కోసం అక్రమార్కులు ‘బైబిల్ ఫర్ రెవెన్యూ రికార్డు’గా పేర్కొనే ఖాస్రా పహణీని సైతం చెదలు పట్టించారు. నమ్మశక్యం కాని రీతిలో రికార్డుల్లో ఎక్కడా లేని ఓ సర్వే నంబరును కొత్తగా సృష్టించి సొమ్ము చేసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థానంలో ఉన్న ఓ రెవెన్యూ అధికారి సాయంతో ఈ తతంగం జరిగినట్లు సమాచారం. రెవెన్యూ పరిభాషలో సేత్వార్, ఖాస్రా పహణీ, గ్రామ నక్షా అత్యంత విలువైన పత్రాలు. ఈ రికార్డుల ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో మొత్తం 154 సర్వే నంబర్లలో 851.27 గుంటల భూమి ఉంది. సేత్వార్, నక్షా, ఖాస్రా పహణీ ప్రకారం నర్సాపూర్ మండలం హన్మంతాపూర్‌లో చిట్ట చివరి సర్వే నంబరు 154. ఆ తర్వాతి కాలంలో సర్వే నంబరు 155 పేరిట 45.33 ఎకరాల భూమిని కొందరు వ్యక్తులు పహణీల్లో నమోదు చేయించారు. 2006లో సదరు భూమిని ‘ఇనాం భూమి’గా గుర్తిస్తూ రెవెన్యూ అధికారులు ఓఆర్సీ (ఆక్యుపెంట్స్ రైట్స్ సర్టిఫికేట్) జారీ చేశారు. 1955 నాటి ఇనాం భూముల రద్దు చట్టం ప్రకారం ఓఆర్సీ ఇవ్వకూడదు. అయితే 1975లో జారీ చేసిన జీఓ 870 ప్రకారం ఖాస్రా పహణీలో మొదటి నుంచి ఇనాం భూమిగా నమోదై ఉంటే ఓఆర్సీ జారీ చేయొచ్చు. హన్మంతాపూర్ 155 సర్వే నంబరులోని 45.33 ఎకరాల భూమి విషయంలో మాత్రం అధికారులు ఈ నిబంధనలేవీ పాటించకుండానే ఓఆర్సీ ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి గతంలో మెదక్ ఆర్డీఓగా పనిచేసిన కాలంలో ఓఆర్సీ జారీ అయినట్లు సమాచారం. 2006లో ఓఆర్సీ పట్టా పొందిన కొందరు 2009లో ఇతరులకు విక్రయించగా ఇప్పటికే పలువురి చేతులు మారింది. సర్వే లేకుండానే కొత్త నంబరు నిజానికి ఖాస్రా పహణీలో కొత్తగా సర్వే నంబరును నమోదు చేయాలంటే గ్రామంలోని భూమినంతటినీ సర్వే సెటిల్మెంట్ విభాగం సర్వే చేసి కొత్త సర్వే నంబరు కేటాయిస్తుంది. సాధారణంగా రీ సర్వే సమయంలో గ్రామంలో భూ విస్తీర్ణం తగ్గడమో, పెరగడమో జరిగిన సందర్భంలో మాత్రమే సర్వే నంబర్లలో మార్పు చేస్తారు. గతంలో సర్వే చేసేందుకు వీలుకాని భూములను ‘బిలా దాఖలా’ (ఏ గ్రామ రికార్డుల్లోనూ లేని భూములు)గా గుర్తించారు. బిలా దాఖలా భూములున్న పక్షంలో వాటిని సర్వే సెటిల్మెంట్ విభాగం ద్వారా గుర్తించి కొత్త సర్వే నంబరు కేటాయిస్తారు. ఇటీవల జిన్నారం మండలంలో 110 ఎకరాల బిలా దాఖలా భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ కొత్త సర్వే నంబరు కేటాయించారు. అయితే హన్మంతాపూర్ 155 సర్వే నంబరు విషయం లో మాత్రం ఏ రకమైన సర్వే, రీ సర్వే లేకుం డానే రికార్డుల్లో కొత్త నంబరు చేర్చడంపై రెవె న్యూ వర్గాలే అశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఖాస్రా పహణీ, ప్రస్తుతమున్న గ్రామ నక్షాను పరిశీలిస్తే ఇప్పటికీ హన్మంతాపూర్‌లో కేవలం 154 సర్వే నంబర్లు మాత్రమే ఉన్నాయి. త్వరలో ప్రాథమిక నివేదిక గ్రామ నక్షాలో కొత్త నంబరు చేర్చడంపై అనుమానం వచ్చిన ఓ రెవెన్యూ అధికారి తీగలాగడంతో 155 సర్వే నంబరు గుట్టు బయట పడింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో హన్మంతాపూర్‌లో కొత్త సర్వే నంబరు గుట్టుగా పుట్టుకొచ్చిన వైనంపై విచారణ జరుపుతున్నారు. త్వరలో పూర్తి వివరాలతో జిల్లా ఉన్నతాధికారికి నివేదిక సమర్పించేందుకు నర్సాపూర్ రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది.