తూప్రాన్‌లో ర్యాలీ, రాస్తారోకో | rally in toopran at medak district | Sakshi

తూప్రాన్‌లో ర్యాలీ, రాస్తారోకో

Published Tue, Oct 4 2016 3:08 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో ర్యాలీ నిర్వహించారు.

తూప్రాన్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని నాగులపల్లి, ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ పంచాయతీలను మసాయిపేటలో కలపరాదని డిమాండ్ చేస్తూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు మంగళవారం రాస్తారోకో చేశారు. తమ గ్రామాలకు తూప్రాన్ మండలం అనుకూలంగా ఉందని, దూరంగా ఉన్న మసాయీపేటలో వాటిని కలపాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాస్తారోకో సందర్బంగా ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం కార్యకర్తలు రామాయంపేట తహశీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించి ధర్నా చేశారు. శివంపేట మండలం పిల్లుట్ల గ్రామాన్ని మగ్గల్‌పర్తి మండలంలో కలపవద్దని కోరుతూ పిల్లుట్ల గ్రామస్తులు గ్రామసభను బహిష్కరించారు. సర్పంచ్, ఎంపీటీసీలను నిర్బంధించి నిరసన వ్యక్తంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement