తూప్రాన్: ఆ పసిగుడ్డుకు 19 రోజులకే నూరే ళ్లు నిండాయి. బాబు పుట్టాడని సంబరపడిన ఆ కుటుంబంలో చివరకు శోకమే మిగిలింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం కొంతాన్‌పల్లికి చెం దిన సార మురళి, అంజలి దంపతులకు 19 రోజుల క్రితం బాబు పుట్టాడు. అస్వస్థతకు గురి కావడంతో సోమవారం బైక్‌పై తూప్రాన్‌లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరితోపాటు మురళి అన్న కూతురిని కూడా బైక్‌పై తోడుగా తీసుకెళ్లారు. అయితే, తూప్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై హల్దీవాగు సమీ పంలో కాఫీడే వద్ద బైక్ యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. దీంలో తల్లి ఒడిలోంచి పసికందు కిందపడి అక్కడికక్క డే మృతి చెందింది. ఇదే సమయంలో ఓ కారు కూడా ఆ బైక్‌లను ఢీకొట్టింది. దంప తులతోపాటు ఓ బాలిక, ప్రమాదానికి కార ణమైన బైక్‌పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి.
అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా..!
బాధిత కుటుంబసభ్యులు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ పసికందును నానమ్మ ఎత్తుకొని ‘‘అప్పుడే నూరేళ్లు నిండాయా బిడ్డా.. ఎన్నో దేవుళ్లకు మొక్కంగ మగపిల్లవాడిని ఇస్తే ఎంతో సంబరపడ్డాం.. నలుగురు అన్నదమ్ములు ఉన్న కుటుంబంలో అందరికీ ఆడపిల్లలే ఉండగా మగపిల్లాడిని ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ నీ దగ్గరికే తీసుకెళ్లావా’’అంటూ రోదించింది.
Comments
Please login to add a commentAdd a comment