తూప్రాన్: సకాలంలో వేతనాలు చెల్లించకుంటే ఆత్మహత్యకు పాల్పడుతామంటూ మండలంలోని కాళ్లకల్ పారిశ్రామిక ప్రాంతంలోని టీఎం టైర్స్ పరిశ్రమకు చెందిన మగ్గురు కార్మికులు గురువారం బైలార్ గది గొట్టం ఎక్కి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కార్మికులకు నచ్చజేప్పి కిందకు దించారు. వివరాలు ఇలా ఉన్నాయి. టీఎం టైర్స్ పరిశ్రమ మూతపడి 18 నెలలు కావస్తోంది.
అప్పటి నుంచి నిత్యం కార్మికులు పరిశ్రమ వద్దకు వస్తూ హాజరు వేసుకుంటూ వెళ్తున్నారు. కాని ఇప్పటి వరకు పరిశ్రమ యాజమాన్యం ఉత్పత్తిని ప్రారంభించకపోగా వేతనాలు చెల్లించడంలేదు. బుధవారం పరిశ్రమ ఎదుట నిరసన తెలిపిన విషయం తెలిసిందే.
వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పరిశ్రమకు చెందిన అనిల్, సిద్దిరాంరెడ్డి, నాగిరెడ్డి అనే ముగ్గురు కార్మికులు పరిశ్రమకు చెందిన బైలర్ గది గొట్టం ఎక్కి పరిశ్రమ నిర్వహకుడు వచ్చి తమ సమస్యలు పరిష్కరించేంతవరకు కిందకు దిగమని అవసరమైతే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చారించారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడి సోమవారం లోగా సమస్యలు పరిష్కరిస్తామని అంగీకరించడంతో కార్మికులు కిందకు దిగివచ్చారు.
వేతనాలు చెల్లించాలని కార్మికుల ఆత్మహత్యాయత్నం
Published Fri, May 29 2015 1:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement